2, ఫిబ్రవరి 2021, మంగళవారం

వాతం నొప్పి నివారణకు ఆహారం నియమాలు అవగాహనా కోసం ఈ లింక్స్ లో చూడాలి

కీళ్ల వాతం ఎందుకు సంభవిస్తుంది?అవగాహనా కోసం నవీన్  సూచనలు


         
  : మన రోగ నిరోధక వ్యవస్థ సాధారణంగా ఇన్ఫెక్షన్ల మీద దాడిచేసి, మనకు వాటి నుంచి రక్షణ కల్పిస్తుంది. ఈ రోగ నిరోధక వ్యవస్థలో అసమతుల్యత ఏర్పడటం వల్ల మన తెల్ల రక్తకణాలు మన శరీరంపై డాడి చేసి, వివిధ అవయవాలపై దుష్ప్రభావాలు కలిగిస్తాయి. వీటినే ఆటో ఇమ్యూన్‌ వ్యాధులు అంటారు. అలాంటి వాటిలో కీళ్లవాతం ప్రధానమైనది. ఈ ఆటో ఇమ్యూన్‌ వ్యాధులు రావడానికి జన్యుపరమైన లోపాలు, హార్మోన్ల అసమతుల్యత, పర్యావరణంలో ఏర్పడే మార్పులే కారణం కావచ్చని కర్నూలు మెడికవర్‌ ఆసుపత్రుల కన్సల్టెంట్‌ రుమటాలజిస్టు డాక్టర్‌ సృజన తెలిపారు. ప్రపంచ ఆర్థరైటిస్‌ డే సందర్భంగా కీళ్లవాతం (ఆర్థరైటిస్‌) గురించి ప్రజాశక్తితో ముఖాముఖి .....
కీళ్ల వాతం ఎవరికి వస్తుంది?
             డాక్టర్‌ 
: మధ్యవయసులో.. అంటే 30-60 ఏళ్ల మహిళలకు ఇది ఎక్కువగా వస్తుంది. చిన్నపిల్లలకు వద్ధాప్యంలో వస్తే దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
కారణాలు ఏమిటి?
           డాక్టర్‌:
 కీళ్ల నొప్పులకు అనేక కారణాలుంటాయి. వాతం నొప్పులు, అరుగదల నొప్పులు, పోషకాహార లోపం వల్ల వచ్చే నొప్పులు, ఒత్తిడి వల్ల వచ్చే నొప్పులు. వీటిలో కీళ్ల వాతం వల్ల కలిగే నొప్పులను తొలిదశలో గుర్తించడం చాలా అవసరం. కీళ్ల వాతం లక్షణాలు ఉన్నా 40శాతం మందికి రక్తపరీక్షల్లో అంతా సాధారణంగానే కనిపిస్తుంది. వీళ్లను సెరోనెగెటివ్‌ ఆర్థరైటిస్‌ అని గుర్తించి వైద్యం చేస్తారు.
లక్షణాలు ఎలా ఉంటాయి?
        డాక్టర్‌:
 కీళ్ల దగ్గర నొప్పులు, వాపులు రావడం, కీళ్లపై ఉన్న చర్మం ఎర్రగా కందడం, కీళ్ల నొప్పులు రాత్రివేళల్లో అధికంగా ఉండటం, ఉదయం సమయంలో కీలు బిగుతుగా ఉండి నొప్పి ఎక్కువ కావడం కీళ్లవాతం లక్షణాలు. వీళ్లకు చల్లటి వాతావరణంలో నొప్పుల తీవ్రత అధికంగా ఉంటుంది.
కీళ్ల నొప్పులలో రకాలు ఏమిటి?
             డాక్టర్‌ :
 రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌: చేతులు, కాళ్లకు ఉండే కణుపుల వద్ద నొప్పి, వాపు వస్తుంది.
గౌట్‌: కాలి బొటనవేలు, మడమ (చీలమండ) దగ్గర నొప్పి, వాపు వస్తుంది.
యాంకిలోజింగ్‌ స్పాండిలైటిస్‌: తొంటి , వెన్నెముక దగ్గర నొప్పి రావడం, బిగుసుకుపోవడం.
సోరియాటిక్‌ ఆర్థరైటిస్‌: సోరియాసిస్‌ అనే చర్మవ్యాధి ఉన్నవారిలో వచ్చే కీళ్లవాతం.
లూపస్‌: కీళ్లనొప్పులతో పాటు ముఖం మీద సీతాకోక చిలుక ఆకారంలో మచ్చలు రావడం, నోటిపూత, జుట్టు రాలిపోవడం వంటివుంటాయి.
నిర్ధారించుకోవడం ఎలా?
         డాక్టర్‌:
 కీళ్లవాతం తీరును బట్టి, వాటితో వచ్చే ఇతర లక్షణాలను బట్టి కొన్ని రకాల రక్తపరీక్షలు, ఎక్స్‌ రే ద్వారా వ్యాధిని నిర్ధారించవచ్చు, వ్యాధి తీవ్రతను కూడా అంచనా వేయచ్చు.
కీళ్లవాతం నిరోధం ఎలా?
          డాక్టర్‌ : 
ఊబకాయాన్ని అదుపులో ఉంచుకోవాలి, విటమిన్‌-డి లోపాన్ని సరిచూసుకోవాలి, పీసీఓడీ సమస్యలను పరిష్కరించాలి, చిన్నవయసులో గర్భసంచి, అండాశయం ఆపరేషన్లు చేయించుకోకూడదు, దంతసమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
కీళ్లవాతం నియంత్రించకపోతే వచ్చే దుష్ప్రభావాలు
        డాక్టర్‌ :
 జ్వరం, విపరీతమైన నీరసం, రక్తహీనత, బరువు తగ్గడం, చర్మంపై లోతైన పుండ్లు పడటం, నరాలు చచ్చుబడటం, కంటిచూపు తగ్గడం, ఊపిరితిత్తులు పాడవ్వడం (ఐఎల్డీ), కీళ్లవాతాన్ని నియంత్రించకపోతే చివరిదశలో దీని ప్రభావం బీపీ, షుగర్‌ మాదిరిగా గుండె, మెదడుకు సంబంధించిన రక్తనాళాలపై పడుతుంది.
ఆహార నియమాలు
         డాక్టర్‌ :
 కీళ్లవాతంతో బాధపడేవారు మంచి పోషకవిలువలతో కూడిన సమతుల్యమైన ్షహారం తీసుకోవడం అవసరం. కీళ్లవాతం ఉన్నవారు నిత్యం ఆహారంలో పప్పుదినుసులు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పొట్టుతీయని తణధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. ఆలివ్‌ ఆయిల్‌ వాడుకోవడం ఉత్తమం. పాలు, పెరుగు, గుడ్లు క్రమం తప్పక తీసుకోవాలి. ఒమెగా 3 ఫాటీ యాసిడ్స్‌ ఉన్న ఆహారం తీసుకుంటే కీళ్లవాతం నొప్పులు అదుపులో ఉంటాయి. ఒమెగా 3 ఫాటీ యాసిడ్స్‌ అధికంగా ఉండే ఆహార పదార్థాలు: చేపలు, బాదం, సోయాబీన్స్‌
తినకూడనివి: ఎర్రమాంసం (బీఫ్‌), తీపి పదార్థాలు, చక్కెర, జంక్‌ ఫుడ్స్‌, నూనె పదార్థాలు (వేపుళ్లు), పాకేజ్డ్‌ ఫుడ్స్‌ నివారించాలి. గౌట్‌ అనే కీళ్లవాతంతో బాధపడేవారు అన్నిరకాల మాంసకత్తులకు దూరంగా ఉండాలి.
         తీసుకోవాల్సిన ఇతర జాగ్రత్తలు: మద్యపానం, ధూమపానం చేయకూడదు, 6-8 గంటల నిద్ర తప్పనిసరిగా ఉండాలి, యోగ, ధ్యానంతో ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి. ఊబకాయం, రక్తపోటు, మధుమేహం, కొలెస్టరాల్‌ ను అదుపులో ఉంచుకోవాలి.రోజూ కనీసం 30-40 నిమిషాలు వ్యాయామం చేయాలి. ఇన్ఫెక్షన్లు రాకుండా మందులు, ముందు జాగ్రత్తగా టీకాలు తీసుకోవాలి.
కీళ్ల నొప్పుల వ్యాధికి వాడాల్సిన మందులు ఏవీ?
             డాక్టర్‌ :
 చాలామందికి కీళ్లవాతానికి వాడే మందుల వల్ల అనేక రకమైన దుష్ప్రభావాలు ఉంటాయని భయపడి, అసలు మందులు వాడక అంగవైకల్యం తెచ్చుకుంటారు. నిజానికి ఈ రకమైన మందులు తగిన మోతాదులో, నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో వాడితే రోగనిరోధక వ్యవస్థలో వచ్చే మార్పులను నియంత్రించి, సహజమైన జీవితాన్ని గడపవచ్చు. వైద్యరంగంలో జరిగే సాంకేతిక అభివద్ధి వలన గతంతో పోలిస్తే ఇప్పుడు అద్భుతమైన పనితీరు కలిగిన మందులు బయోలాజిక్స్‌ అందుబాటులోకి వచ్చాయి. వీటి వాడకంతో ఇంతకుముందు మహమ్మారిగా ఉన్న కీళ్లవాతాన్ని ఇప్పుడు అతి సులభంగా నియంత్రణలోకి తెచ్


 వాతరోగులు పాటించవలసిన ఆహారనియమాలు  -


 తినవలసిన ఆహారాలు  -


       పాతబియ్యపు అన్నం , గోధుమరొట్టె , గోధుమనూక జావ , మేకమాంసం , పొట్టేలు మాంసం , కందిపప్పు మరియు కట్టు , బీరకాయ , పొట్లకాయ , లేత వంకాయ , లేత మునగకాయ , వెల్లుల్లి , ఉల్లిపాయ , కొయ్యతోటకూర , గలిజేరు కూర , మునగాకు కూర , చిర్రికూర , కసివిందాకు కూర , నల్లేరు , ద్రాక్షపండు , ఖర్జూరపు పండు , మజ్జిగ , ఆవునెయ్యి , పటికబెల్లం , పాతబెల్లం , తేనె అదేవిధముగా శరీరానికి మర్దన చేయించుకోవలెను .


  తినకూడని ఆహారపదార్థాలు  -


       కొత్తబియ్యపు అన్నం , చద్ది అన్నం , జొన్నన్నం , మొక్కజొన్నలు , అలసందలు , శెనగలు , పెసలు , మినుములు , బచ్చలికూర , చుక్కకూర , పెరుగు , పెరుగు మీద మీగడ , సామలు , పిండివంటలు , అతినూనె , కల్లు, కలి , కోడిమామాసం , కోడిగుడ్డు , ఏటినీరు , వెదురు మొలకలు , నేరేడుపండు , కాకరకాయ , మామిడిపండ్లు , మామిడికాయలు , చేపలు , పులిహార , చింతపండు , చల్లటి నీరు , టీ , కాఫీ , నూనెవేపుళ్ళు , పాతపచ్చళ్లు , తిన్నది అరగక ముందే మరలా భుజించటం , మైథునం , చన్నీటిస్నానం , ఉపవాసం , అతిశ్రమ , చల్లటిగాలి , మంచు , తడి ప్రదేశాల్లో ఉండరాదు.

ధన్యవాదములు 🙏

మీ నవీన్ నడిమింటి

విశాఖపట్నం

ఫోన్ -9703706660


*సభ్యులకు విజ్ఞప్తి*

******************

ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

కామెంట్‌లు లేవు: