జననేంద్రియ హెర్పిస్ అంటే ఏమిటి?జననేంద్రియ హెర్పిస్, ఒక లైంగిక సంక్రమణ వ్యాధి (STD, sexually transmitted disease) ఇది హెర్పిస్ వైరస్ (herpes virus) వల్ల సంక్రమించే ఒక సాధారణ వ్యాధి. ఇది ప్రధానంగా జననాంగాలు, పాయువు, లేదా నోటి భాగాలను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి ఇతర లైంగిక సంక్రమణ వ్యాధుల (STDs ) వలె ప్రాణాంతకమైనది కాదు, కానీ దీని శాశ్వతమైన నివారణ (పరిష్కారం) అందుబాటులో లేదు.
హెర్పెస్, హ్యూమన్ ఇమ్మ్యునో డెఫిషియన్సీ వైరస్ (హెచ్.ఐ.వి) సంక్రమణను పొందే ప్రమాదాన్ని పెంచుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. భారతీయ జనాభాలో ఈ సంక్రమణ (ఇన్ఫెక్షన్) వ్యాప్తికి సంబంధించిన సమాచారం పరిమితంగానే ఉంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
రోగులు ఎటువంటి లక్షణాలను అనుభవించరు మరియు సంక్రమణ మొదట్లో అసలు దాన్ని గుర్తించరు. సంక్రమణ సోకిన 2 నుండి 10 రోజుల్లోపు మొదటి రోగ లక్షణాలను గుర్తించవచ్చు. కొన్ని సాధారణ లక్షణాలు:
- జ్వరం
- తలనొప్పి
- బలహీనత
- వికారం
- కండరాల నొప్పి
- ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ద్రవం నిండిన బొబ్బలు జననాంగాలలో, పాయువు, పిరుదులు, లేదా పెదవుల మీద కనిపిస్తాయి
- మూత్రం విసర్జన చేస్తున్నపుడు మంట
- జననాంగాలలో నొప్పి
- యోని స్రావాలు
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
జననేంద్రియ హెర్పిస్ రెండు రకాల వైరస్ల వలన సంభవిస్తుంది: హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ 1 (HSV 1) మరియు హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ 2 (HSV 2). HSV 2 జననాంగాలు, పాయువు మరియు పిరుదులలో పుండ్లకు కారణమవుతుంది మరియు HSV 1 నోటి పూతల యొక్క సాధారణ కారణం.
హెర్పిస్ వైరస్ ప్రభావిత వ్యక్తులతో లైంగిక సంపర్కం (యోని, యానల్ లేదా ఓరల్ సెక్స్) వలన సంక్రమిత పుండ్ల (infected sores ) ద్వారా వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తికి పుండు లేనప్పటికీ సంక్రమణ వ్యాపిస్తుంది.
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
పైన పేర్కొన్న లక్షణాలను వ్యక్తి అనుభవించినట్లైతే, సదరు వ్యక్తి మరియు వారి భాగస్వామి వైద్యుడిని సంప్రదించాలి. వైద్యులు వైరస్ను గుర్తించడానికి పుండు (అప్పుడు ఉంటే కనుక) నుండి ద్రవ నమూనాను సేకరిస్తారు.పుండ్లు లేకపోతే, యాంటీబాడీలను (antibodies) గుర్తించడానికి రక్త పరీక్ష చేస్తారు.
వైద్యులు అంటువ్యాధి/సంక్రమణ తీవ్రత మరియు పునరావృత్తాన్ని తగ్గించడానికి వైరస్ వ్యతిరేక (anti-viral) మందులను సూచిస్తారు.. నొప్పిని తగ్గించడానికి మందులు సూచించబడతాయి. దురదృష్టవశాత్తు, ఎటువంటి నివారణ చర్య అందుబాటులో లేదు, కానీ వైరస్ వ్యాప్తిని తగ్గించవచ్చు
- శృంగార (సెక్స్) సమయంలో కండోమ్ ఉపయోగించాలి
- ఒక వ్యక్తికీ లేదా తన భాగస్వామికి పుళ్ళు ఉంటే సెక్స్ను నివారించాలి
- బహుళ శృంగార భాగస్వాములను నివారించాల
Medicine Name | Pack Size | |
---|---|---|
Herpex | Herpex 100 Tablet | |
Mama Natura Munostim | Mama Natura Munostim | |
Valanext | Valanext 1000 Mg Tablet | |
Logivir | Logivir 5% Cream | |
Logivir DT | Logivir DT 400 Mg Tablet | |
Valcet | Valcet 1000 Mg Tablet | |
Valcivir | VALCIVIR 1GM TABLET 10S | |
Zimivir | Zimivir 1000 Tablet | |
Valamac | Valamac 1000 Tablet | |
Valavir | VALAVIR 1GM TABLET 3S |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి