15, ఫిబ్రవరి 2021, సోమవారం

పాదాలు ఫై ఆనెలు నివారణకు తీసుకోవాలిసిన జాగ్రత్త లు అవగాహనా కోసం లింక్స్ లో చూడాలి

ఆనెకాయలు (Calluses) అంటే ఏమిటి?

ఆనెకాయలు (Calluses) అనేవి మన చేతులు మరియు కాళ్ళ చుట్టూ చర్మం పైన కఠినమైన చర్మంతోకూడిన మచ్చలు (patches). అవి కేవలం బాధించేటివీ మరియు అసౌకర్యమైనవే  కాదు, చూడడానికి కూడా ఆహ్లాదకరమైనవేం కాదు. ఆనెకాయలు ఓ తీవ్రమైన సమస్య కాదు, కానీ అవి వాటిని సులభంగా నివారించవచ్చు మరియు నయమూ చేసుకోవచ్చు.

ఆనెకాయలు మరియు ఆనెలు (corns) రెండూ ఒకటి కాదు. తరచుగా ఆనెకాయల్నే ఆనెలుగా వ్యవహరిస్తూ పొరపాటు పడటం జరుగుతోంది. ఆనెలు మరియు ఆనెకాయలు రెండూ కూడా ఘర్షణకు విరుద్ధంగా ఏర్పడే ప్రక్రియలో రక్షించుకోవడానికి చర్మపు కఠిన పొరలతో ఏర్పడ్డవే అయినా అనెకాయలు సాధారణంగా ఆనెల కంటే పెద్దవిగా ఉంటాయి. అనెకాయలు కేవలం ఆనెలు ఏర్పడేచోట్లలోనే కాక వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పడతాయి మరియు అరుదుగా ఎప్పుడూ బాధాకరమైనవే.

ఆనెకాయల ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

ఆనెకాయలు ముఖ్యంగా అడుగుల కింది అరికాళ్ళు లోని మడిమెల్లో (హీల్స్)  మరియు (పాదం బంతుల్లో) ముందు భాగంలో, అరచేతులు లేదా మోకాళ్లు; శరీరం భంగిమలు మరియు కదలికల నుండి కలిగే ఒత్తిడిని భరించే కేంద్రభాగాల్లో ఎక్కువగా ఏర్పడతాయి. అవి  సాధారణంగా ఈ క్రింది విధంగా కనిపిస్తాయి.

  • గట్టి బుడిపె లాగా పైకి ఉబికి ఉంటాయి.
  • గట్టిగా నొక్కినప్పుడు బాధాకరంగా ఉంటాయి. లేదా దాని ఉపరితలం క్రింద లోతులో సున్నితత్వంతో కూడిన నొప్పి కల్గుతుంది.
  • చర్మంపై మందమైన చర్మంతో కూడిన కఠినమైన పాచ్ (మచ్చ)
  • చర్మం మైనంలాగా,  పొడిగా మరియు పొరలు (పొలుసులు) గా కనిపిస్తుంది

ఆనెకాయలకు ప్రధాన కారణాలు ఏమిటి?

ఆనెకాయలకు ప్రధాన కారణం ఘర్షణ లేక రాపిడి. పాదాలకు ఈ ఘర్షణ లేదా రాపిడి ఎందుకు కలుగుతుందంటే:

  • పాదరక్షలు చాలా గట్టివి (hard) లేదా చాలా బిగుతు (tight )గా ఉన్నవి వేసుకోవటంవల్ల
  • కొన్ని సంగీత వాయిద్యాలను వాయించడం ద్వారా
  • జిమ్ పరికరాలతో పని చేయడం
  • బ్యాట్ లేదా రాకెట్ ను పట్టుకుని ఆడే క్రీడలో ఆడటంవల్ల
  • దీర్ఘకాలంపాటు కలం (pen) వంటి వాటిని పట్టుంకుని రాయడం మూలంగా కూడా చర్మంపై కాయలు కాస్తాయి.
  • తరచుగా చాలా దూరాలకు సైకిల్ లేదా మోటారుబైక్ పై స్వారీ
  • బూట్లు తో పాటు మేజోళ్ళు (సాక్స్) ధరించకపోవడంవల్ల.
  • కాలిబొటనవ్రేలి గోరుచుట్టు లేక మడమ శూలలు (Bunions) ,కాలిగోళ్ల వికృతరూపాలు లేదా ఇతర వైకల్యాలు ఆనెకాయల (calluses) ప్రమాదాన్ని పెంచుతాయి.
  • కొన్నిసార్లు, శరీరభాగాలన్నింటికీ సరిపోని రక్త ప్రసరణ మరియు మధుమేహం వంటి పరిస్థితులు కూడా ఆనెకాయల్ని కలిగించవచ్చు.

ఆనెకాయల నిర్ధారణను ఎలా చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

ఆనెకాయలను (calluses) గుర్తించడానికి డాక్టర్ కు కేవలం ఓ సాధారణ పరిశీలన చాలు. ఆనెకాయలకు కారణమైన  వికృతం ఎదో కంటికి కనిపించకుండా శరీరంలోపల ఉందని అనుమానమొస్తే ఓ X- రే తీయించామని డాక్టర్చే మీకు సలహా ఇవ్వబడుతుంది.

చాలా తరచుగా, ఆనెకాయలు తమకు తాముగా అదృశ్యం అయిపోతాయి, లేదా కొన్ని సాధారణ గృహ చిట్కాల వంటి వాటి సంరక్షణతోనే సమసిపోతాయి. వైద్యులు సాధారణంగా అనేకాయల చికిత్సలో సూచించే ప్రక్రియలు కిందున్నాయి:

  • పొడిగా తయారైన అదనపు చర్మాన్నితొలగించడం లేదా కత్తిరించడం.
  • అనెకాయల్ని తీసివేయడానికి పొరలు (Patches) లేదా ఔషధాలు
  • శాలిసిలిక్ ఆమ్లాన్ని (salicylic acid ) రాయడం ద్వారా ఆనెకాయల్ని  వదిలించుకోవటం
  • ఘర్షణను తగ్గించడానికి మరియు మరింతగా ఆనెకాయలు ఏర్పడకుండా ఉండేందుకు షూ ఇన్సర్ట్ను (shoe inserts) ఉపయోగించడం
  • ఏర్పడదగ్గ వైకల్యాన్ని నయం చేయదగ్గ సందర్భంలో శాస్త్ర చికిత్స
  • ఆనెకాయలేర్పడ్డా చోట చర్మాన్ని నానబెట్టి మృదుపర్చడం, తేమమర్దనం చేయడం, పూమిక్ స్టోన్ లేదా ఎమెరీ బోర్డు ను ఉపయోగించి మృతచర్మాన్ని తొలగించడం.
  • అన్ని సమయాలలో సాక్స్లతో చక్కగా అమర్చిన బూట్లు ధరించడం

ఆనెకాయలు కొరకు మందులు 

Medicine NamePack Size
Etaze SAEtaze SA Lotion
Halozar SHalozar S Ointment
TripletopTripletop Ointment
Halobik SHALOBIK S OINTMENT 15GM
Halosys SHalosys S Lotion
Halosys SHalosys S Ointment
SaliacSaliac Face Wash
SalicylixSALICYLIX 6% CREAM 50GM

ఆనెలు నివారణకు ఆయుర్వేదం లో నవీన్ సలహాలు 

                                         పాదాలలో ఆనెలు                            
 
            కలబంద గుజ్జు మీద పసుపు చల్లి ఆనెల మీద రుద్ది ఆ బిళ్ళను ఆనెల మీద పెట్టి దూది కప్పి ప్లాస్టర్  అంటించాలి.ఈ విధంగా రాత్రి పడుకునే ముందు 10,15 రోజులు చేస్తే ఆనెలు పూర్తిగా నివారింప బడతాయి.
 
2          దాక్చిన చెక్కను ఇనుప బాణలి లో వేసి బాగా మాడ్చి బూడిద లాగా చెయ్యాలి.చిటికెడు  బూడిదలో గురి గింజంత నీరు సున్నం కలిపి ఆనేలకు పట్టించాలి.
 
                              ఆనెల సమస్య --నివారణ                              
1.                        కలబంద గుజ్జు         -----కొద్దిగా
                           పసుపు పొడి          ----- 3 చిటికెలు

     కలబంద గుజ్జు మీద పసుపు పొడి చల్లి బిళ్ళగా ఆనెల మీద పెట్టి దూది కప్పి కట్టు కట్టాలి.  ఈ విధంగా   20 నుండి 40 రోజులు చేస్తే పూర్తిగా నివారింప బడతాయి.

2.                       దాల్చిన చెక్క పొడి               ----- కొద్దిగా
                          నీరు సున్నం                       ----- తగినంత

     దాల్చిన చెక్కను బాణలిలో వేసి నల్లగా బూడిద లాగా మారేంత వరకు వేయించాలి. దీనిలో నీరు సున్నం   కలిపి ఆనెలకు పట్టించాలి.

     సూచన:-- పై రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే చెయ్యాలి.

                       ఆనెలు, పులిపిర్లు,కురిడీలు -- నివారణ                                 

     చేతుల వేళ్ళ మీద వచ్చే చిన్న గద్దల్లాంటి లేదా గుల్లల్లాంటి లేదా గట్టి రాళ్ళ వంటి వాటిని కురిడి కాయలు  అంటారు.

     అరటి పండు తిన్న తరువాత తొక్కను తీసి దాని అడుగు భాగాన వున్న తెల్లని పదార్ధాన్ని గుజ్జుగా చేసి  ఆనేల మీద, పులిపిర్ల మీద, కురిడి కాయల మీద పట్టించాలి.  ఆనేల పై పట్టించే ముందు వాటిని బ్లేడు తో కొద్దిగా గీకాలి తరువాత ఈ గుజ్జును దట్టంగా పట్టించి దూది కప్పి ప్లాస్టర్ వెయ్యాలి.

                                ఆనెలు--చర్మ కీలలు-- నివారణ                                

అతి మధురం పొడి                 --- ఒక టీ స్పూను
పెట్రోలియం  జెల్లి                   ----ఒక టీ స్పూను  ( వాజలీన్)

    రెండింటిని కలిపి ఆనేల మీద గీరి పూయాలి.

                                             ఆనెలు -- నివారణ                                    

  లక్షణాలు:--

    ఆనెలున్నపుడు నడకలో మార్పు వస్తుంది.  దీని వలన శరీర ఆకృతిలో మార్పు వచ్చి సమస్యలు
ఏర్పడతాయి.

కారణాలు:--    పాదం మీద ఒత్తిడి పడడం, బిగుతుగా వున్న లేక వదులుగా వున్న చెప్పులు ధరించడం వలన ఒరిపిడి  కలగడం  , సాక్స్ లేకుండా  షూస్ వేసుకోవడం  , పనిముట్లు ఎక్కువగా వాడేటపుడు అంటే చెప్పులులేకుండా మిషన్ తొక్కడం, కారు ఆక్సిలరేటర్ తొక్కడం వంటి వాటి వలన వస్తాయి.

     బూట్లు ధరించినపుడు లోపల వేళ్ళు కదిలించ గలిగే విధంగా వుండాలి
.
చేయవలసిన పనులు :--   ఆనేలున్నపుడు సముద్రపు ఒడ్డున వున్న ఇసుకలో నడిస్తే ఆ రాపిడికి నివారింప  బడతాయి
.
     స్నానం చేసేటపుడు పాదం మీద వేసి రుద్దుకోవాలి.

     ఒక టీ స్పూను కలబంద గుజ్జులో అర టీ స్పూను పసుపు పొడిని కలిపి ఆనెల మీద పెట్టి పాలిథిన్ పేపర్ ను తొడిగి పడుకోవాలి. ఉదయం వేడి నీళ్ళతో కడగాలి.  పది నిమిషాలు ఆగి ఆనెల మీద ఆముదం పూయాలి.

    కాళ్ళను త్రిఫల కషాయం లో నానబెట్టి ఫ్యూమిక్ రాయి తో రుద్దాలి.

    మెగ్నీషియం  సల్ఫేట్  నీళ్ళలో పాదాలుంచి  పేపర్ తో రుద్దాలి.

                       


          అతి మధురం పొడిని పెట్రోలియం  జెల్లి తో కలిపి ఆనెల మీద రుద్దితే తగ్గుతాయి.

               అరి కాళ్ళలో ఆనెలు -- పరిష్కార మార్గాలు         

          ఒత్తిడితో పాదాలు జీవం కోల్పోవడం వలన  గట్టిపడి  ఆనెలు ఏర్పడతాయి. వాటిలోపల ఇన్ఫెక్షన్ చేరినపుడు నొప్పి తెలుస్తుంది. ఇతరుల చెప్పులను వాడడం వలన కూడా ఆనెలు వచ్చే అవకాశం వున్నది.

 కెమికల్స్ కలిసివున్న  చెప్పులను వాడడం వలన కూడా వచ్చే  అవకాశం వున్నది.
 రాళ్ళలో నడిచినపుడు రాళ్ళ లోని  ఇన్ఫెక్షన్ వలన కూడా రావచ్చు,

 కాళ్ళను సరిగా శుభ్రం చేసుకోక పోవడం వలన కూడా రావచ్చు.
 
లక్షణాలు :-- నడవలేక పోవడం, నొప్పి, మంట వుంటాయి.
 
                                                పెద్ద పెద్ద ఆనేలకు అగ్నికర్మ చికిత్స
 
           పంచలోహాలతో తయారైన పరికరాన్ని వేడి చేసి దానితో కాపడం పెట్టాలి.
 
            ఉత్తరేణి మొక్కను సమూలముగా తెచ్చి కాల్చి బూడిదను సేకరించుకోవాలి.
 
ఉత్తరేణి బూడిద                       --- 50 gr
దాల్చిన చెక్క బూడిద              ----50 gr
నీరుసున్నం                           ---- 25 gr                          
ఆముదం                               ---- తగినంత
 
      అన్నింటిని పేస్ట్ లాగా కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.
 
       దీనిని రాత్రి పూట ఆనేలకు పట్టించి ఉదయం కడుగుతూ వుంటే సమస్య నివారింప బడుతుంది.

                            ఆనెలు ---చర్మ కీల హర చికిత్స                             

కారణాలు:-- చెప్పులు,  బూట్లు సరిగా సెట్ కాకపోవడం,  సాక్స్ వేసుకొని బూట్లు వేసుకోకపోవడం వలన వచ్చే
అవకాశం కలదు .

వంటసోడా                      ---- 30 gr
ప్రొద్దుతిరుగుడు నూనె       ---- 45 gr  ( లేదా వంట నూనె )
వెనిగర్                          ---- 10 ml

       ఒక పెద్ద పాత్రలో నీళ్ళు  పోసి కాచాలి .  ఆ నీటిలో స్క్రబ్బర్  ను ముంచి దానితో పాదాలను రుద్దాలి .
ఆ వేడి నీటిలో వంటసోడా ను కలిపి దానిలో పాదాలను  నీళ్ళు చల్లారేవరకు ఉంచాలి . ఈ లోగా ఒక చిన్న గిన్నెలో
నూనె ,  వెనిగర్  వేసి బాగా కలిపి పెట్టుకోవాలి .  బాగా రుద్దాలి .

      పాదాలను బయటకు తీసిన తరువాత స్క్రబ్బర్ తోరుద్ది తడి లేకుండా తుడవాలి . తరువాత నూనె,  వెనిగర్ ల
మిశ్రమాన్ని పోయాలి.

      ఈ విధంగా 30 రోజులు చేస్తే మంచి ఫలితం వుంటుంది

      వంటసోడా శరీరాన్ని మృదువుగా మారుస్తుంది .

                    ఆనేల  నివారణకు  అర్క లేపనం                      

జిల్లేడు పాలు                --- 50 gr
ఆముదం                     --- 50 gr
తేనేమైనం                    ---100 gr 

          తేనేమైనాన్ని కరిగించి వదపోసుకోవాలి .  దానిలో జిల్లెడుపాల ,  ఆముదం యొక్క మిశ్రమాన్ని కొద్ది , కొద్దిగా వేస్తూ
బాగా కలపాలి .కొద్ది సేపటికి ఆ మిశ్రమం చల్లబడుతుంది . దీనిని వెడల్పు మూత వున్న  సీసాలో నిల్వ చేసుకోవాలి .
         దీనిని ఆనేల మీద పోయాలి
         ఇది ఎన్ని సంవత్సరాలున్నా చెడిపోదు
                 
                             ఆనెలు    ---  నివారణ                               

   1.     పచ్చి జీడిపప్పు గంధాన్ని ఆనేల మీద నెల రోజులు పూస్తే తగ్గుతాయి
   2.     మామిడి ఆకులను ఎండబెట్టి కాల్చి భస్మం చేసి జల్లించి నిల్వ చేసుకోవాలి .
           తగినంత భస్మాన్ని తీసుకొని నీరు కలిపి మెత్తగా చేసి ఆనేల పై రుద్దాలి .
సూచన :   మెత్తని చెప్పులను వాడాలి .

ధన్యవాదములు 🙏

మీ నవీన్ నడిమింటి

విశాఖపట్నం

ఫోన్ -9703706660

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.


కామెంట్‌లు లేవు: