సారాంశం
అపెండిక్స్ అనేది పెద్దపేగులో భాగమైన, అంధనాళానికి జతచేయబడిన ఒక సన్నని గొట్టం లాంటి అవయవము. ఇది ఉదరానికి క్రింది పక్క కుడి వైపున ఉంటుంది (ఛాతికి పొత్తికడుపుకి మధ్య ఉన్న ప్రదేశంలో). మన శరీరంలో అపెండిక్స్ యొక్క ఖచ్చితమైన పాత్ర తెలియనిదిగా మిగిలిపోయింది, కానీ ఇతర జంతువుల్లో; ఇది జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. అపెండిసైటిస్ ఒక అత్యవసర పరిస్థితి, ఇందులో అపెండిక్స్ ఎర్రబడి పొత్తికడుపు క్రింది పక్క కుడివైపున తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. ఇంతే కాకుండా, అపెండిసైటిస్ తో ఉన్నవారు వాంతులు, జ్వరం మరియు వెన్ను క్రింది భాగం నొప్పి వంటి లక్షణాలను ఎదుర్కుంటారు. రోగ నిర్ధారణ కొరకు, వైద్యులు దీని లక్షణాలను చూసి, అవసరమైతే ఒక క్లినికల్ పరీక్షను నిర్వహిస్తారు, అల్ట్రాసౌండ్, ల్యాబ్ టెస్టులు లేదా సిటీ స్కాన్లను సిఫార్సు చేస్తారు. అప్పెండెక్టమీ లేదా అప్పెండిసెక్టమీ అనేది అపెండిక్స్శ ను తొలగించడానికి పొత్తికడుపు లో ఒక గాటుని పెట్టేటువంటి ఒక శస్త్రచికిత్సా ప్రక్రియ . కొన్ని కేసులలో, యాంటిబయోటిక్ థెరపీని కూడా ఉపయోగిస్తారు. అపెండిక్స్ యొక్క సన్నని గొట్టం కు మలం మరియు ఆహార పదహార్దాల చేత అవరోధం కలిగినప్పుడు, అది చిట్లి ఆ పదార్ధాలు పొత్తికడుపు చుట్టుప్రక్క నాళాలకు వ్యాపితమై ఇన్ఫెక్షన్ ను కలిగిస్తాయి. ఇటువంటి సందర్భంలో, ఇన్ఫెక్షన్ ను సమయానికి అదుపు చేయడం అవసరము.
- సైటిస్ అంటే ఏమిటి?
అప్పెండిసైటిస్ అనేది ఏ వయసువారికైనా వచ్చే, మరీ సాధారణంగా 10-30 ఏళ్ళ వయసుల వారికి వచ్చే ఒక వైద్య అత్యవసర పరిస్థితి. ఇది పెద్ద పేగు నుండి విస్తరింపబడి ఉన్న ఒక చిన్న, గొట్టం లాంటి లేదా వేలు లాంటి సంచి, అపెండిక్స్ ఎర్రబడటం లేదా నొప్పితో కూడిన వాపు వాళ్ళ వస్తుంది. అపెండిక్స్ యొక్క రంధ్రము చిన్నగా ఉంటుంది మరియు ఆహరం లేదా మలము అందులో పేరుకుపోయి, కొన్నిసార్లు అవరోధాన్ని ఏర్పరుస్తుంది. ఈ అవరోధం, క్రిమి సంక్రమణ ను అభివృద్ధి చేయవచ్చును. ఈ దశలో అపెండిక్స్ చిట్లితే, క్రిమి సంక్రమణ ఉదర కూహరం లో వ్యాప్తి చెంది, సరైన సమయం లో చికిత్స చేయకుంటే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. అపెండిక్స్ ఎర్రబడినప్పుడు, మీరు పొత్తికడుపులో తాత్కాలికమైన నొప్పిని ఎదుర్కుంటారు( వస్తూ వెళుతూ). ఈ నొప్పి క్రమంగా తీవ్రంగా మరియు స్థిరమైనదిగా మారుతుంది. ఇది క్రింది వైపు కుడి పక్క భాగం అపెండిక్స్ ఉన్న ప్రదేశంలో అలాగే ఉండిపోతుంది. నడవటం, దగ్గటం, పొత్తికడుపుని నొక్కడం వల్ల నొప్పి మరింత తీవ్రం అవుతుంది. జ్వరం, ఆకలి లేకపోవటం మరియు అతిసారం వంటివి కూడా అప్పెండిసైటిస్ తో పాటుగా అప్పుడప్పుడు వస్తాయి.
అపెండిసైటిస్ యొక్క లక్షణాలు
పొత్తికడుపు క్రింది పక్క భాగము కుడివైపున నొప్పి అప్పెండిసైటిస్ తో సాధారణం. అయితే, దీనితో కూడుకున్న ఇతర లక్షణాలను కూడా మీరు ఎదుర్కొనవచ్చు, ఎలా అంటే:
- అతిసారం లేదా మలబద్ధకం.
- తక్కువ జ్వరం
- వికారం మరియు వాంతులు.
- ఆకలి లేకపోవటం.
- పొత్తికడుపు వాపు.
- ఉబ్బరం లేదా గ్యాస్ వదులుటలో ఇబ్బంది.
- బొడ్డు చుట్టూ నుండి పొత్తికడుపు క్రింది పక్క కుడి భాగము వరకు వచ్చే నొప్పి .
అప్పెండిసైటిస్ యొక్క లక్షణాలు నడవటం, పొత్తికడుపుని నొక్కడం లేదా దగ్గటం వలన మరింత తీవ్రం అవుతాయి.
అపెండిసైటిస్ యొక్క చికిత్స
ఒకసారి అప్పెండిసైటిస్ ఏర్పడ్డాక, శస్త్ర చికిత్సే ఎన్నుకునే వైద్యం. తక్షణ శస్త్ర చికిత్స వలన అపెండిక్స్ చిట్లే అవకాశాలను తగ్గించవచ్చు. అపెండిక్స్ ను తొలగించటాన్ని వైద్య పరిభాష లో అప్పెండెక్టమీ లేదా అప్పెండిసెక్టమీ అంటారు.
శస్త్ర చికిత్స
ఒక్కో అప్పెండిసైటిస్ కేసును బతి, విధానాలు అందుబాటులో ఉన్నాయి, మరియు వ్యక్తిగత ఎంపికను బట్టి, క్రింది విధానాల్లో దేన్నైనా అప్పెండెక్టమీకి ఎన్నుకోవచ్చు:
- లాపరోస్కోపిక్ చికిత్స
ఇది అత్యధికంగా మగ్గు చూపే విధానం ఎందుకనగా దీని తరువాత కోలుకునే సమయం తక్కువగా ఉంటుంది. ఈ శస్త్రచికిత్సలో, ప్రత్యేకమైన సాధనాలు మరియు కెమెరా జతపరిచిన ఒక అనువైన గొట్టాన్ని అపెండిక్స్ ను గుర్తించి మరియు పొత్తికడుపు పైన చిన్న గాట్లు పెట్టి తొలగించటానికి ఉపయోగిస్తారు. - లాపరోటమీ
ఈ శస్త్రచికిత్సలో, వైద్యులు అపెండిక్స్ ను తొలగించటానికి ఒక గాటుని మాత్రమే చేస్తారు . పొత్తికడుపు క్రింది కుడి పక్క ప్రదేశంలో ఒక గాటు పెడతారు. ఈ విధానాన్ని పెరిటోనిటీస్- ఉదర కూహర లోపలి గోడ యొక్క సంక్రమణం, ఉన్నప్పుడు కూడా చేస్తారు. - ఓపెన్ సర్జరీ
ఓపెన్ సర్జరీ ని లాపరోస్కోపీకి బదులుగా ఎప్పుడు చేస్తారంటే:- అప్పెండిసైటిస్ ఉన్న వ్యక్తికి గతంలో యూదారానికి సంబంధించిన శస్త్ర చికిత్సలు చేసి ఉన్నప్పుడు.
- అపెండిక్స్ లో అపెండిక్స్ మాస్ అనబడే బొబ్బను తయారైనప్పుడు.
- అపెండిక్స్ పగిలినప్పుడు
- ఆంటిబయోటిక్ థెరపీ
అపెండిక్స్ చికిత్సకు చేసే శస్త్ర చికిత్సలు మరియు యాంటిబయోటిక్ చికిత్సల ఫలితాలను సరిపోల్చిన కొన్ని అధ్యయనాల ప్రకారం, 70 శాతం అపెండిక్స్ కేసులు చికిత్స అవసరం లేకుండా యాంటిబయోటిక్స్ ద్వారానే పరిష్కరించవచ్చు. యాంటిబయోటిక్స్ సాధారణంగా ఎవరైతే వ్యక్తులు శస్త్రచికిత్స చేయించుకోవడానికి బలహీనంగా ఉంటారో వాళ్ళకి ఇవ్వబడతాయి. అప్పెండెక్టమీకి ముందు సెఫాలోస్పోరిన్స్ అనబడే ఐవి(ఇంట్రావీనస్) యాంటిబయోటిక్స్ ను ఇస్తారు. ఒకవేళ అపెండిక్స్ పగిలి తెరుచుకుని ఉంటే (చిట్లిన అపెండిక్స్), చీమును వెంటనే పిండేసి, రోగి యొక్క తెల్ల రక్తకణాల సంఖ్య మరియు శరీర ఉష్ణోగ్రత మాములుగా అయ్యేవరకు యాంటిబయోటిక్స్ ను ఇస్తూనే ఉంటారు.
జీవనశైలి నిర్వహణ
చికిత్స అనంతరం మిమ్మల్ని ఇంటికి పంపాక, మీరు కోలుకోవడానికి ఈ క్రింది చిట్కాలు సహాయపడతాయి:
- మీ వైదుడు సూచించకుండా ఎటువంటి యాంటిబయోటిక్స్ ను తీసుకోవద్దు.
- మీకు ఇంకా జ్వరంగా ఉన్నట్లయితే ప్రతి 2 గంటలకు మీ ఉష్ణోగ్రతను భద్ర పరుస్తూ ఉండండి. మీ తదుపరి పర్యటనలో వైద్యుడి వద్దకు దాన్ని తీసుకెళ్లండి.
- పెయిన్ కిల్లర్స్ ను ఉపయోగించవద్దు. నొప్పికి మందులు తీసుకోవడం వలన అప్పెండిసైటిస్ మెరుగుపడుతుందా లేదా అధ్వాన్నంగా మారుతుందా అనేది కనుక్కోవడం కష్టంగా మారవచ్చు.
- మరుసటి రోజు మీరు మరొక ఆరోగ్య పరీక్షకు వెళుతున్నట్లైతే ఏమి తినవద్దు తాగవద్దు .
- విరోచనకారి లేదా ఎనిమాలను ఉపయోగించవద్దు; చిట్లిన అపెండిక్స్ యొక్క పరిస్థితిని అవి ఇంకా పెంచవచ్చు.
- ఎక్కువ విశ్రాంతి మరియు తగినంత నిద్ర తీసుకోండి. అప్పెండెక్టమీ నుండి త్వరగా కోలుకోవడానికి ఇది సహాయపడుతుంది .
- పొత్తికడుపు కండరాలు శ్రమపడటాన్ని నివారించండి మరియు భారీ వస్తువులను ఎత్తవద్దు. ఆహారంలో ఎక్కువగా పీచు పదార్ధాలను చేర్చుకోండి, అవి మలబద్ధక నివారణకు మరియు మూత్ర విసర్జన సులభం చేయుటలో తోడ్పడతాయి.
- ప్రతిరోజు అధికంగా ద్రవాలను తీసుకోండి.
మీ వైద్యుడ్ని వెంటనే సంప్రదించండి ఒకవేళ:
- మూత్రం లేదా వాంతిలో రక్తం ఉంటే
- మూత్ర విసర్జనలో దీర్ఘకాల ఇబ్బంది ఉంటే.
- తరచూ వాంతి చేసుకోవటం.
- తల తిరగడం.
- పొత్తికడుపులో నొప్పి తీవ్రత పెరిగినప్ప
అపెండిసైటిస్ కొరకు మందులు
Medicine Name | Pack Size | |
---|---|---|
Tazar | Tazar 1.125 G Injection | |
Tazact | Tazact 1.125 Gm Injection | |
Montaz | Montaz 1g Injection | |
Amebis Forte | Amebis Forte Tablet | |
Tazoter | Tazoter Injection | |
Durataz | Durataz 2000 mg/250 mg Injection | |
Schwabe Resorcinum CH | Schwabe Resorcinum Dilution 1000 CH | |
Schwabe Rhamnus catharticus CH | Schwabe Rhamnus catharticus Dilution 1000 CH | |
Schwabe Rhamnus frangula CH | Schwabe Rhamnus frangula Dilution 1000 CH |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి