వేరికోసిల్ అంటే ఏమిటి?
స్పెర్మటిక్ కార్డ్ (spermatic cord, మనిషి యొక్క వృషణాలను పట్టి ఉండే ఒక త్రాడు) లో కనిపించే పాంప్నిఫారమ్ ప్లెక్సస్ (తీగవంటి అల్లికలు [pampiniform plexus]) యొక్క వెయిన్స్ (సిరల) లోని వాపును, వేరికోసిల్ అని పిలుస్తారు .100 మంది పురుషులలో, ప్రతి 10 నుంచి 15 పురుషులు వేరికోసిల్ అభివృద్ధి చెందుతుంది, ఇది కాళ్ళలో ఉండే వెరికోస్ వెయిన్స్ (సిరల వాపు/ఉబ్బు) మాదిరిగానే ఉంటుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
వేరికోసిల్ లో సాధారణంగా కనిపించే సంకేతాలు మరియు లక్షణాలు:
- అసౌకర్యం
- మొండి నొప్పి
- వృషణతిత్తి (scrotum) లో ఉండే నరాలు (సిరలు) ఉబ్బడం లేదా మెలిపడడం
- పురుషాంగం మీద నొప్పిలేని గడ్డ
- వృషణతిత్తి వాపు లేదా ఉబ్బు
- వంధ్యత్వం (సంతానలేమి)
- వీర్యకణాల సంఖ్య తగ్గిపోవడం
- అరుదుగా- ఏటువంటి లక్షణాలు ఉండవు
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
స్పెర్మటిక్ కార్డ్ లో ఉండే వెయిన్స్ (సిరల) యొక్క లోపకి వాల్వులకు హాని కలగడం వల్ల అవి వాచి చిన్నగా మారిపోతాయి అప్పుడు శుక్రనాళము (spermatic cord) లో రక్త ప్రసరణ తగ్గిపోవడం వల్ల ప్రధానంగా వేరికోసిల్ ఏర్పపడుతుంది. మూత్రపిండాల కణితి వంటి పరిస్థితులు కూడా వెయిన్స్ (సిరలో) లో రక్తం యొక్క ప్రవాహానికి అడ్డుపడతాయి.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
వైద్యులు లక్షణాల యొక్క పూర్తి చరిత్రను తెలుసుకుంటారు మరియు వృషణతిత్తి, వృషణాలలు, స్పెర్మటిక్ కార్డ్ లో ఏవైనా మెలిపడిన వెయిన్స్ యొక్క తనిఖీ కోసం గజ్జల ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలస్తారు. పడుకుని ఉన్న స్థితిలో, ఇది కనిపించకపోవచ్చు. అంతేకాకుండా, రెండు వైపులా వృషణముల యొక్క పరిమాణములో ఉండే వ్యత్యాసం కూడా పరిగణనలోకి తీసుకోబడుతుంది.
వైద్యులు వల్సల్వా మానువెర్ (Valsalva maneuver) నిర్వహిస్తారు, దీనిలో వైద్యులు వృషణతిత్తి పూర్తిగా పరిశీలించే వరకు వ్యక్తిని ఘాడ శ్వాస తీసుకుని ఉండమని చెప్తారు.
వైద్యులు వృషణతిత్తి, వృషణాలు మరియు మూత్రపిండాలు యొక్క అల్ట్రాసౌండ్ను కూడా సూచించవచ్చు.
నొప్పి, సంతానోత్పత్తి సమస్యలు మరియు వృషణాల వృద్ధిలో వ్యత్యాసం (కుడి వృషణం కన్నా ఎడమది నెమ్మదిగా పెరుగడం) వంటి సమస్యలు కలగనంత వరకు వేరికోసిల్కు చికిత్స అవసరం లేదు.
- అసౌకర్యాన్ని తగ్గించడానికి జాక్ స్ట్రెప్ (jock strap) లేదా సౌకర్యవంతంగా ఉండే లోదుస్తులను ఉపయోగించాలి.
- వరికోసలేక్టమీ (Varicocelectomy), వేరికోసిల్ ను సరిచేసే శస్త్రచికిత్స.
- వెరికోసిల్ ఎంబోలేజేషన్ (Varicocele embolization) అనేది ప్రత్యామ్నాయ శస్త్రచికిత్స విధానం.
- పెర్క్యుటేనియస్ ఎంబోలేజేషన్ (Percutaneous Embolization)
- వాపు మరియు నొప్పి నుండి ఉపశమనానికి మాత్రమే నొప్పి నివారిణులు (ఎసిటమైనోఫెన్, ఇబుప్
వేరికోసిల్ కొరకు మందులు
Medicine Name | Pack Size | |
---|---|---|
Oxalgin DP | Oxalgin DP Tablet | |
Diclogesic Rr | Diclogesic RR Injection | |
Divon | Divon Gel | |
Voveran | Voveran 50 GE Tablet | |
Enzoflam | Enzoflam SV Tablet | |
Dolser | Dolser Tablet MR | |
Renac Sp | Renac Sp Tablet | |
Dicser Plus | Dicser Plus Tablet | |
D P Zox | D P Zox Tablet | |
Unofen K | Unofen K 50 Table |
1 కామెంట్:
I am vericocele patient treatment and AYURVEDIC medicine AVAILABLE natural products sir
కామెంట్‌ను పోస్ట్ చేయండి