12, మార్చి 2021, శుక్రవారం

కంటికి లో కురుపులు వాపు నివారణకు తీసుకోవలిసిన జాగ్రత్త లు అవగాహనా కోసం లింక్స్ లో చూడాలి

కంటి కురుపు అంటే ఏమిటి?

కంటి కురుపుని అంజననామిక (hordeolum) అని కూడా పిలుస్తారు, ఇది కనురెప్పలను ప్రభావితం చేసే సంక్రమణ/ఇన్ఫెక్షన్. ఇది కనురెప్పల యొక్క వెలుపలి లేదా లోపలి ఉపరితలంపై ఏర్పడవచ్చు మరియు కంటి రెప్పల గ్రంథిని ప్రభావితం చేస్తుంది. కంటి కురుపు కనురెప్ప పై ఒక చిన్న మొటిమలాగా లేదా పొక్కులాగా కనిపిస్తుంది.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

  • కంటి కురుపు సాధారణంగా కంటి దగ్గర ఒక మొటిమ వలె కనిపిస్తుంది.
  • ఇది చిన్నగా ఎరుపు రంగులో ఉంటుంది. కురుపు చీము కలిగి ఉన్నందున, మధ్యలో పసుపు రంగులో కనిపిస్తుంది.
  • కంటి కురుపు ఉండడం వల్ల కంటిలో కురుపు ఉన్న ప్రాంతంలో నొప్పి కలుగుతుంది, ఈ నొప్పి కళ్ళు మూసినప్పుడు మరియు తెరిచినప్పుడు పెరుగుతుంది.
  • కనురెప్పలు వాచినట్టు కనిపిస్తాయి, మరియు ఈ వాపు నుండి కొన్ని స్రావాలు (discharge) స్రవించవచ్చు.
  • కంటి కదలికలు అసౌకర్యంగా మారతాయి, తరచూ కంటి నుండి నీళ్లు కారుతాయి, మరియు నిరంతరంగా కంటిలో ఏదో నలక (బయటి పదార్థం/వస్తువు) ఉన్న భావన కలుగుతుంది.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

  • కంటి కురుపు బ్యాక్టీరియా సంక్రమణ వలన కలుగవచ్చు.
  • రోగ నిరోధక వ్యవస్థ తక్కువగా ఉండడం మరియు పోషకాహారలోప ఆహారం వంటివి ప్రమాద కారకాలు.
  • ఇది సంక్రమణం/ఇన్ఫెక్షన్ అయినందున, ప్రభావిత వ్యక్తికీ దగ్గరగా ఉండడం ద్వారా, చేతిరుమాలులు (నాప్కిన్లు) లేదా ఇతర వస్తువులు పంచుకోవడం ద్వారా వ్యాప్తి చెందవచ్చు.
  • వ్యక్తిగత పరిశుభ్రత తక్కుగా ఉండడం కూడా కంటికురుపు ఏర్పడే ప్రమాదాన్ని పెంచే మరో అంశం.
  • కొన్నిసార్లు, అధికంగా పొడిబారిన కళ్ళు కూడా సంక్రమణను/ఇన్ఫెక్షన్ను ప్రేరేపిస్తాయి.

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

  • కంటి కురుపును నిర్ధారించడం చాలా సులభం మరియు ఎటువంటి పరిశోధనాత్మక విధానాలు (investigative procedures) అవసరం లేదు.
  • వైద్యులు ఒక లైట్ తో చూడటం ద్వారా కంటి కురుపును నిర్ధారిస్తారు.
  • అనేక సందర్భాల్లో, కంటి కురుపు దానికదే నయం అయ్యిపోతుంది/తగ్గిపోతుంది, కానీ దానికి కొన్ని రోజుల సమయం పడుతుంది.
  • అది ఎక్కువ రోజుల పాటు ఉంటే లేదా ఎక్కువగా బాధాకరంగా/నొప్పిగా  ఉంటే, వైద్యులు చికిత్సకు సలహా ఇస్తారు.
  • అవసరమైతే, సంక్రమణను నివారించడానికి మరియు బ్యాక్టీరియాను తొలగించడానికి యాంటీబయాటిక్స్ ఇవ్వబడతాయి.
  • చీము చేరడంతో కురుపు మీద ఎక్కువగా ఒత్తిడి ఏర్పడితే, ఒత్తిడిని తగ్గించడానికి మరియు చీమును తొలగించడానికి వైద్యులు ఒక చిన్న కాటు (incision) పెడతారు.
  • మంచి వ్యక్తిగత పరిశుభ్రతను పాట్టించాలి, తువ్వాళ్లను పంచుకోవడాన్ని నివారించాలి మరియు పదేపదే కురుపును తాకకుండా ఉండటం మంచిది.

కంటి కురుపు కొరకు మందులు

Medicine NamePack Size
AlthrocinAlthrocin 100 Drop
AcnetoinAcnetoin 10 Tablet
Agrocin TabletAgrocin 250 Mg Tablet
Citamycin TabletCitamycin Tablet
Cynoryl TabletCynoryl Tablet
E MycinE Mycin Suspension
ErocinErocin 100 Tablet
ErokidErokid Tablet
NebasporNEBASPOR OINTMENT 5GM
EromedEromed 125 Mg Suspension
हमारी ऐप डाउनलोड करें
myUpcharडॉक्टरों के लिए ऐप

ధన్యవాదములు 🙏

మీ నవీన్ నడిమింటి

  9703706660

విశాఖపట్నం 

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి

కామెంట్‌లు లేవు: