💠 *చేతులు, కాళ్ళు తిమ్మిర్లు కు పరిష్కారం అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు *👌👌👌
💠 ఇది వయసుతో నిమిత్తం లేకుండా అందరిలో కనిపించే ఓక సాధారణమైన లక్షణం, కొందరిలో ఇది చాలా కాలం పాటు బాధిస్తుంది...
💠 దీనిని ఆయుర్వేదశాస్త్రంలో "సుప్తి వాతం" అంటారు,సుప్తి అనగా నిద్ర. దీనికి ఆయుర్వేదంలో అనేక చికిత్సలు వివరించారు...
💠 *తిమ్మిర్లు కు గల కారణాలు*:
💠 అతి చల్లని వాతావరణం లేదా చల్లని పదార్దాలు తిన్నా, అధికబరువు, నరాలుకు దెబ్బ తగిలినా ప్రధానంగా మెడ , నడుముకు సంబందించి నరాలు,
💠 ఎక్కువసేపు కూర్చున్నా, బ్రెయిన్ ట్యూమర్, స్పైనల్ ట్యూమర్ లేదా స్ట్రోక్ వున్నా తిమ్మిర్లు సంభవించవచ్చు...
💠 (గమనిక: షుగర్ రోగులలో తిమ్మిర్లు ప్రమాదకరం, శరీరమంతయు వ్యాప్తి చెందును కనుక డాక్టర్ సలహా తప్పనిసరి)
💠 *తిమ్మిర్లు వచ్చాక చేయల్సీనవి*:👍
💠 ముందుగా కొంచెం అదుముతూ రక్త సరఫరాను పెంచాలి, తిమ్మిరి బాగం నకు వేడి తాపనం చేయాలి, కాళ్ల తిమ్మిర్లు వుంటే కొంచెం సేపు నడవాలి...
💠 గర్భస్థ స్త్రీలు కు తిమ్మిర్లు సాధారణం కావున కొంచెం అటూ ఇటుగా పొజిషన్ మారుస్తూ నిద్రపోవాలి...
💠 ఈ క్రింది ఏక ఔషదాలు సేవనం ద్వారా కూడా ఫలితం వుంటుంది...
💠 వెల్లుల్లి,తిప్పతీగ, ఉసిరి, హరితకి, భల, పునర్నవ, రాఁస్నా, ద్రాక్ష, జీవంతీ, దేవదారు,
💠 ప్రష్నిపర్ణీ మొదలగునవి ఔషదాలు తిమ్మిర్లు కు బాగా ఉపయోపడతాయి..
💠 *శాస్త్రీయ మందులు*:
1) మహా నారాయణ తైలం లేదా మహా మాష తైలంతో మర్దన లేదా పిండ తైలంతో రోజు ఒక పది నిమిషాల మర్దన చేసి అభ్యంగ స్నానం ఆచరస్తే తిమ్మిర్లు రావడం అనేది ఉండదు...
2) సహచరది తైలం కూడా మర్దనకు వాడవచ్చు...
3) యోగరాజ గుగ్గులు టాబ్లెట్స్ రోజు సేవించుట వలన కూడా తిమ్మిర్లు తగ్గుముఖం పడతాయి...
4)ఏకాంగఁ వీర రస,సమీర పన్నాగ రస, వాత గజంకుస రస వంటి రస ఔషది సేవనం కూడా బాగా పనిచేస్తుంది...
5) చలికాలంలో తిమ్మిర్లు రావటం సహజం కనుక రోజుకు ఓక ఇరవై నిముషాలు ఐనా వ్యాయామము చేసినచో తిమ్మిర్లు రాకుండా నివారించవచ్చు...
6)ఆయుర్వేదంలో ఒక వ్యక్తి నుండి వేరొక వ్యక్తికి శరీరతత్వాన్ని మందులు మారుతాయి.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
విశాఖపట్నం
ఫోన్ 9703606660
💠💠💠💠💠💠💠💠💠💠💠
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి