29, జూన్ 2021, మంగళవారం

గర్భిణీ డెలివరీ తరువాత వదులు అవడం టి తీసుకోవాలిసి జాగ్రత్త లు అవగాహనా కోసం లింక్స్ లో చూడాలి

.యోని వదులైందని చికాకు... పురుషాంగాన్ని పట్టి ఉంచే శక్తి ఎలా వస్తుంది...?

ప్రశ్న   :  మాకు బాబు పుట్టి 7 నెలలయింది. ఆయనకు సెక్స్ తృప్తిగా ఉండటంలేదట. యోని చాలా వదులయిందని విసుక్కుంటున్నాడు. ఇదివరకూ బిడ్డ పుట్టకమునుపు ఉన్న బిగుతు ఇప్పుడు లేదంటున్నారు. పురుషాంగాన్ని ప్రవేశపెట్టినా వదులుగా ఉంటోందనీ, తనకు తృప్తిగా లేదంటున్నాడు. యోనిని బిగుతుగా చేసుకునేందుకు ఏవైనా పరిష్కార మార్గాలు ఉన్నాయా...?

జవాబు   :  యోని వదులుగా ఉండటం వల్ల పురుషునికే కాదు స్త్రీకి కూడా రతిలో పూర్తి తృప్తి కలుగదు. వీర్య స్ఖలనానికే కాకుండా సెక్స్ తృప్తికి యోని బిగుతు కీలకం. యోని వదులుగా ఉంటే సెక్స్ చేస్తున్నప్పటికీ స్త్రీ ఆ అనుభవాన్ని ఆస్వాదించలేదు. దీనికి అనేక కారణాలున్నాయి. పిల్లలు పుట్టడం వల్ల కానీ, వయసురీత్యా లేదంటే ఇతర ఆరోగ్య పరిస్థితుల వల్ల యోని వదులు కావడం జరుగుతుంది.

అలాంటి అనుభవం కలిగినప్పుడు యోనిని బిగుతుగా చేసేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. యోని కండరాలు బిగుతుగా మార్చేందుకు ప్రత్యక వ్యాయామం కెజిల్ వ్యాయామం చేయాలి. అంతేకాకుండా మూత్రం పోసేటపుడు యోని కండరాలను బిగుతుగా పట్టి చూసుకోవాలి. అలా చేసినప్పుడు పెల్విక్ కండరాలు దారిలోకి వస్తాయి. అలా పెల్విక్ కండరాలను గట్టిగా బిగుతుగా పట్టి ఉంచుతూ వదిలేస్తూ ప్రాక్టీస్ చేయాలి. ఈ పద్ధతిని రోజుకు నాలుగైదుసార్లు చేస్తే ఫలితం ఉంటుంది. ఐతే చేయగానే మార్పు వచ్చేస్తుందని అనుకోరాదు. మెల్లగా సమస్య తగ్గిపోతుంది.

కామెంట్‌లు లేవు: