23, జూన్ 2021, బుధవారం

కాలిన గాయాలు కు తీసుకోవాలిసిన జాగ్రత్త లు ఏమిటే మచ్చలు నివారణ కు కోసం లింక్స్ లో చూడాలి


Burns – కాలిన గాయాలు కు తీసుకోవలిసిన జాగ్రత్త లు అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 

 

కాలిన గాయాలు

కాలిన గాయాల వలన ఏర్పడే బాధ శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా మనిషిని కుంగదీస్తుంది. కాలిన గాయాలకు వాటి స్వభావాన్ని బట్టి, గాయం తీవ్రతను బట్టి చికిత్స పొందాల్సి ఉంటుంది.

చర్మం మాత్రమే కాలినట్లయితే గాయం తీవ్రతను ప్రాథమిక స్థాయిగా గుర్తించి చికిత్స గాయం మానడానికి, నొప్పి తగ్గిపోడానికి సంబంధించిన చికిత్స చేస్తారు. అదే చర్మం కాలడంతోపాటు నరాలు కూడా దెబ్బతింటే గాయం తీవ్రతను ద్వితీయ స్థాయిగా గుర్తిస్తారు. ఇటువంటి గాయాలకు జాగ్రత్తగా చికిత్స చేయాల్సి ఉంటుంది. క్షతగాత్రుని 24 గంటల పాటు వైద్యుని పర్యవేక్షణలో ఉంచాల్సిఉంటుంది.

చర్మం, నరాలతో పాటు కండరాలు కూడా కండరాలు దెబ్బతింటే ఇటువంటి గాయం తీవ్రతను మూడో స్థాయిగా గుర్తిస్తారు. ఇటువంటి సమయంలో క్షతగాత్రున్ని ఐసీయులో ఉంచి చికిత్స చేస్తారు. ఈవిధంగా ఉండే క్షతగాత్రుని పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో వైద్యులు ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది.

కాలినగాయాలు, బొబ్బలు మూలంగా చాలా భాధాకరమైన పరిణామాలు కలుగుతాయి. అవి మచ్చలు, అంగవైకల్యము, మానసిక గాయం మొదలగునవి. ఈ ప్రభావాలన్నీ చాలా కాలం ఉండిపోతాయి. కాబట్టి సత్వర సరియైన జాగురూకత/ జాగ్రత్త తో చేసే చికిత్స ఎంతో అవసరం. శరీరం కొన్ని వేడి వస్తువులకు లేదా బలమైన రసాయనాలకు దగ్గరగా వచ్చినప్పుడు కాలినగాయాలవుతాయి.

కాలినప్పుడు నీళ్లు పోయరాదు, బొబ్బలొస్తాయనేది అపోహ. మాత్రమే. కాలేటప్పుడు నీళ్లు పోయడం వల్ల ఆ భాగం చల్లబడి కాలే తీత్రత తగ్గుతుంది. నూనె, ఇతర ఆయింట్‌మెంట్లు వెంటనే పూయడం వల్ల చర్మం గ్రంథులు మూసుకుని వేడి శరీరంలో నిక్షిప్తమవుతాయి. దీంతో ఇంకా ఎక్కువ చర్మం కాలి దెబ్బతినే అవకాశం అధికం. కాలిన తీవ్రతను బట్టి బొబ్బలెక్కుతాయి. అంతే కానీ నీళ్లు పోయడం వల్ల కాదు. నీళ్లు పోయడం వల్ల బొబ్బల తీవ్రత తగ్గుతుంది.

తరచూ కాలిన గాయాలవడానికి కారణాలు:

* వంట పాత్రలు, కేకులు తయారు చేసే ఓవెన్ అరలు, కుక్కర్ల చేతి పిడి
* ఆధునికమైన కరెంట్ పరికరాలు ఉదా : ఇస్త్రీ పెట్టెలు, టీ కాచుకునే పాత్రలు మొదలగునవి.
* ప్రమాదకరంగా గ్యాసుల మంట, కరెంట్ వైర్లు తగిలి, కాలుతున్న ఇనుప తడికెలు
* ప్రమాదకరంగా బట్టలకు అంటుకున్న మంటలు
* బ్లీచ్ / తెలుపు లేక చలవ చేయు బట్టల పొడి, పలుచ చేయని దుర్వాయువులను పొగొట్టే ద్రవాలు
* తీవ్రమైన సూర్యరశ్మి మరియు గాలి
* తాళ్ళ రాపిడి

చాలా వరకు కాలిన గాయాలు ఇంటిలోనే జరుగుతాయి. అందువల్ల వీటికి ఇంటిలోనే చికిత్స చేయాలి. అందునా ఇవి వంట ఇంటిలోనే ఎక్కువగా జరుగుతాయి. వీటిని వంట గదిలోనే అత్యవసర చికిత్స అందించవచ్చు. కానీ తగు జాగ్రత్తలు తీసుకుంటే ఇన్ని ప్రమాదాలు జరుగవలసిన అవసరం లేదనే నొక్కి చెప్పాలి.

సాధారణంగా ఈ ప్రమాదాలు ముసలి వారికి, పసి పిల్లలు ముఖ్యంగా ప్రాకే పిల్లల, అంగవైకల్యం వున్న వారిలో ఎక్కువగా జరిగే ప్రమాదం ఉంటుంది. పసి పిల్లలో, ముసలి వారిలో కలిగే కాలిన గాయాలను తీవ్రంగా పరిగణించాలి.

కాలిన గాయాలయినపుడు కొన్ని చేయగూడని పనులు:

కాలిన గాయాలు శరీరానికి ఏ విధమైన హాని కలిగిస్తాయో చెప్పే ముందు, వైద్య నిపుణుల సాయం అందేలోపు కాలిన గాయాలకు చేయగూడని పనులు కొన్ని క్రింద ఉదాహరించబడ్డాయి.

* కాలిన గాయాం మీద వెన్న, పిండి, వంటసోడా వంటవి అస్సలు పెట్టరాదు/పెట్టకూడదు
* విలేపనము (మలాము), నూనెలు, క్రిమి కీటక నాశిని వంట ద్రవాలు
* కాలిన గాయాల వల్ల వచ్చిన బొబ్బలను గ్రుచ్చకూడదు, లేదా పగుల గొట్ట కూడదు.
* గాయాలను అవసరానికి మించి ముట్టుకొనరాదు.
* కాలిన బట్టలు శరీరానికి అంటుకుపోయి వున్నట్టైతే వాటిని బలవంతంగా తాకరాదు.

ఈ రోజులలో బట్టలు కృత్రిమ నారతో నేసిన/చేసిన బట్టలవే కాబట్టి మంటలకు అవి పూర్తిగా కరిగిపోయి శరీరానికి అంటుకొనిపోతాయి. వీటిని బలవంతంగా లాగడానికి ప్రయత్నిస్తే వాటితో పాటు చర్మం కూడా వూడి వస్తుంది. దీని మూలాన అనవసరంగా క్రిములు శరీరంలోనికి చేరే అవకాశం వుంటుంది. ఎటూ అవి పూర్తిగా కాలినాయి కాబట్టి సూక్ష్మక్రిములు చనిపోయి వుంటాయి. అందుకని అలానే వదిలివేయడంమంచిది.

సాధారణ చికిత్స:

కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో తప్పించి కాలిన గాయాలన్నీంటికీ ఒకే విధమైన చికిత్స వుంటుంది. చాలా వరకూ ఏవో చిన్న కాలిన గాయాలు తప్పితే మిగిలినవన్నీ ప్రమాదకరమైనవే. చాలా నొప్పి, బాధ కొన్ని సందర్భాలలో ఘతము/ షాక్ ను కలిగిస్తాయి. చాలా వరకూ ఈ ప్రమాదాలు అత్యవసర పరిస్థితులు ఉదాహరణకు ఇళ్ళు కాలిపోతున్నప్పుడు, రోడ్డు ప్రమాదాలలో, పెట్రోలు కారడం మూలంగా కలుగుతాయి. కాబట్టి అత్యవసర పరిస్థితిలో వున్న రోగిని ప్రశాంతంగా వుంచాలి. ధైర్యం చెప్తూ చికిత్స ప్రారంభించాలి. ఎందుకంటే జరిగిన ప్రమాదం వల్ల రోగి ముందుగానే భయంతో, ఘాతములో వుంటాడు. రోగితో మృదువుగా ప్రవర్తిస్తూ త్వరిత గతిన చికిత్స ప్రారంభిస్తూ, పద్ధతి ప్రకారం ఏది ముందు, ఏది వెనక చేయాలో చేస్తూ పోవాలి.

ఒక్కసారి చర్మం, కణజాలం కాలిన తరువాత శరీరంలో నుంచి ద్రవాలు చాలా వరకూ నష్టపోతాయి. గాయపడిన కణజాలం వేడిని పట్టి వుంచుతుంది. దీని మూలంగా కణజాలం మరింత దెబ్బతింటుంది. కాబట్టి చికిత్సలో ముఖ్యమైన భాగం ఈ వేడిని తగ్గించడం. ప్రాధమిక చికిత్సలో ఈ ఉష్ణోగ్రతను తగ్గించడం.

తీసుకోవలసిన జాగ్రత్తలు:

* కాలిన గాయాలయిన శరీర భాగాన్ని వెంటనే చల్లటి నీళ్ళలో ముంచాలి. బకీట్ నీళ్ళలో గానీ, బట్టలుతికే టబ్బులో గానీ వంట ఇంటి సింకులో కానీ, కనీసం పంపు క్రింద నీళ్ళలో గానీ కాలిన భాగాన్ని వుంచాలి.
* ఈ విధంగా కనీసం కాలిన భాగాన్ని పదిహేను నిమిషాలు లేక నొప్పి తగ్గే వరకూ వుంచాలి.
* ఒక వేళ కాలిన భాగాన్ని నీళ్ళలో ముంచడం కష్టమయితే (ముఖము) శుభ్రమైన గుడ్డను చల్లని నీటిలో ముంచి కాలిన భాగం పై అద్దాలి. ప్రతిసారి అద్దే ముందు చల్లని నీటిలో ముంచాలి. గాయం మీద రుద్దకూడదు ఈ విధంగా చేయడం మూలంగా కణజాలం నుంచి కొంత వేడి గుంజేయడం జరిగి తద్వారా గాయం ఎర్ర బడడం, నొప్పి. బొబ్బలు రావడం నివారించవచ్చును.

* చేతికి వున్న వుంగరాలు, గాజులు, బూట్లు బిగుతుగా వున్న బట్టలు ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా తీసివేయాలి. ఎందుకంటే తరువాత కలిగే వాపు మూలాన తీయడం కష్టం కావచ్చును.
* చిన్న చిన్న ఉపరితలంలో వున్న గాయాలను పొడిగా, శుభ్రంగా వున్న బట్టతో అద్దాలి. ఆ తరువాత పట్టీలు కప్పాలి.పెద్ద గాయాలు, లోతుగా అయిన గాయాలు నీటిలో నుంచి బయటకు తీసిన తరువాత తేలికగా శుభ్రంగా ఈ మధ్యనే ఉతికిన పీచులు లేని బట్టతో కప్పాలి. (శుభ్రంగా వున్న దిండుగలేబు కాలిన గాయాలు వున్న కాళ్ళకు తొడగడానికి అనువుగా వుంటుంది.)
* వైద్యుడు లేదా ఆంబులెన్స్ కు కబురు చేయాలి.
* ఏదైనా కాలిన గాయం తపాలా బిళ్ళ కన్నా (2.21/2 సెం.మీ) పెద్దదిగా వున్నప్పుడు మీరు చల్లని నీళ్ళతో చికిత్స చేసిన వెంటనే వైద్యులను సంప్రదించాలి.
* కాలిన గాయాలు పెద్దవిగా వున్నప్పుడు రోగిని ఆసుపత్రికి తరలించేటప్పుడు ఒక తువ్వాలులో ఐసు వేసి దానిని గాయంపై ఎక్కువ వొత్తిడి లేకుండా ఉంచాలి.
* కాలిన గాయాల కణజాలాన్ని క్రిమి సంపర్కం నుంచి కాపాడలేక పోతే సూక్ష్మ జీవులు గాయాల పై వృద్ధి చెందుతాయి. ఈ విధంగా గాయాలను కప్పడం మూలాన రోగి ఆదుర్దా తగ్గుతుంది. ఎందుకంటే వారికి గాయాలు కనపడవు కాబట్టి బల్ల మీద కప్పే గుడ్డలు (నైలాను కాకూడదు) శరీరాన్ని కప్పడానికి బాగా పనిచేస్తాయి. గాయాలపై కట్టే బట్ట తేలికగా ఎక్కువ వొత్తిడి లేకుండా కప్పాలి.
* వైద్యుడు లేక ఆంబులెన్స్ వచ్చే వరకూ రోగికి ధైర్యం చెప్తూ ప్రశాంతంగా ఉండేలా చూడాలి. పసి పిల్లలైతే ఎత్తుకుని వూపాలి. అదే సమయంలో కాలిన గాయాలకు వొత్తిడి కలగకుండా చూసుకొవాలి.

ప్రత్యేకమైన చికిత్స అవసరమైన పరిస్థితులు బట్టలకు నిప్పు అంటుకున్నప్పుడు

* బట్టలు ఇంకా మండుతున్నట్టైతే చల్లని నీరు మంటలపై వేసి మంటలు ఆర్పాలి లేదా రోగిని దుప్పటితో కప్పి ( దుప్పటి లేకపోతే కోటు లేదా పెద్ద గుడ్డ ముక్కతో నైనా సరే) గాలి తగలకుండా చూడాలి. కంబళి కూడా పని చేస్తుంది దుప్పటి మీ ముందు భాగంలో వుండే విధంగా నిలబడాలి దీని వల్ల మంటలు మీకు అంటుకోకుండా వుంటాయి.
* మంటలలో కాలుతున్న రోగి భయంతో ఒక గదిలో నుంచి మరొక గదిలోనికి పరిగెత్తుతూ వుండవచ్చు. అటువంటప్పుడు అన్ని చోట్ల మంటలు అంటుకునే ప్రమాదం వుంటుంది. మంటల వేడికి తట్టుకోలేక బయటకు పరిగెత్తుతారు. బయట గాలికి మంటలు ఇంకా ఎక్కువయే అవకాశం వుంటుంది. అందువలన రోగిని కదలకుండా వుండమని ప్రోత్సహించాలి.
* మంటలు ఆర్పిన తరువాత పైన తెలియ చేసిన విధంగా చికిత్స ప్రారంభించాలి.

కంటిలోనికి చిమ్మిన రసాయనాలు:

వీటి వలన కంటికి శాశ్వతమైన హాని కలగడమే కాకుండా చూపు కూడా కోల్పోవచ్చు. కాబట్టి చికిత్స అతి త్వరగతిన మొదలై పోవాలి. ముందుగా రసాయనాన్ని పలుచపరచే పని చూడాలి.

* రోగిని వెల్లకిలా పడుకో బెట్టి బొటనవేలు వుంగరంతో వేళ్ళతో కంటి రెప్పలను వేరు చేసి ముక్కువైపు నుంచి కంటి ముందు భాగం వైపు చల్లని నీరు ఆపకుండా కొద్ది సేపు పోయాలి. దీని మూలంగా రసాయనకం పలచబడుతుంది. రెండో కంటిలో రసాయనం పడకుండా తల కొద్దిగా ప్రక్కకు తిప్పి నీరు పోయాలి.
* కంటి రెప్పలు పదే పదే మూసి తెరవడం వల్ల రసాయనం కంటి లోపలి భాగంలో ఉండి (మడతలలో) పోకుండా బయటకు వచ్చేస్తుంది.
* కంటిని కడిగే ప్రక్రియ కనీసం పది నిమిషాలు చేయాలి. గడియారంలో చూసుకుంటూ చేయాలి. సమయం తగ్గించకూడదు.
* కంటిని కడిగిన తరువాత రెప్పలు మూసి కంటిపై శుభ్రమైన బట్ట పెట్టాలి
* రోగికి ధైర్యం చెప్పి ఆసుపత్రికి తరలించాలి

కరెంట్ తో కాలిన గాయాలు: 

ఈ గాయాలు చిన్నవిగా వున్నా లోతుఎక్కువగా వుంటాయి. ఇవి ముఖ్యంగా కరెంట్ శరీరంలోనికి ప్రవేశించి మరలా బయటకు వెళ్ళి పోయిన ప్రదేశంలో కనబడతాయి.

* అత్యవసర పరిస్థితిలో వున్న రోగికి చికిత్స చేసే ముందు కరెంట్ స్విచ్ బంద్ చేసి ప్లగ్గు తీసి వేయాలి దీని మూలంగా కరెంట్ సరఫరా నిలిచిపోతుంది.
* రోగి నీళ్ళలో పడి వున్నట్టైయితే మీరు దూరంగా వుండండి. తడి కరెంట్ ప్రసరణ చేసే గుణాన్ని శ్రేష్టంగా పెంచుతుంది. దీని మూలంగా రోగిని సంకల కింద చేతులు వేసి లేపకూడదు.
* రోగి శ్వాస ప్రక్రియను గమనించాలి విద్యుచ్ఛక్తి ఛాతీ మరియు గుండె గుండా ప్రసరించి శ్వాసను, గుండెను ఆపివేసి వుండవచ్చు. నొటి ద్వారా శ్వాస నందించడం, గుండె మర్దన వెంటనే మొదలు పెట్టాలి.
* రోగిని అనుకూలంగా పరుండబెట్టి సాధారణ చికిత్స మొదలు పెట్టాలి.

కాలిన గాయాల నుంచి బ్యాక్ టు లైఫ్: 

దీపాలు, బాణాసంచాతో దీపావళి ఆనందంగా వెళ్లిపోయింది. పండగ మిగిల్చిన ఆనందాలను కొందరు మదిలో పదిలంగా దాచుకుంటే, మరికొందరు విషాదాన్ని మూటగట్టుకొని ఉంటారు. బాణాసంచా పేలుడులోనో, ప్రమాదంగా మారిన పరిస్థితుల వల్లనో కాలిన గాయాలతోనో బాధపడుతూ ఉంటారు. మొన్నటి వరకు అందంగా ఉన్న శరీరం అనుకోని ప్రమాదం కారణంగా అందవిహీనంగా మారితే? లేదా ఇతరత్రా అవకారాలు మిమ్మల్ని బాధిస్తూ ఉంటే? ఆవేదన వద్దు… ప్లాస్టిక్ సర్జరీతో పరిష్కారం ఉంది.
అందంగా ఉన్న శరీరం ప్రమాదం కారణంగా అందవిహీనంగా మారితే! ఆ బాధ మాటల్లో చెప్పలేం. శరీరం పూర్వపు స్థితిని పొందాలన్నా, ఉన్నదానికన్నా మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకోవాలన్నా అందుబాటులో ఉన్న చికిత్స ప్లాస్టిక్ సర్జరీ. ఒకప్పుడు సెలబ్రెటీలకు మాత్రమే అందిన ఈ వైద్యం, నేడు సాధారణ ప్రజానీకానికీ చేరువైంది. మొన్నటి దీపావళికి కాలిన శరీరపు గాయాలకే కాదు… కాస్మొటిక్ సమస్యతో మనసును కాల్చే గాయాలకూ ప్లాస్టిక్ సర్జరీ పరిష్కారం చూపిస్తుంది.

ప్లాస్టిక్ సర్జరీ…: 

‘ప్లాస్టిక్’ అనే పదం గ్రీక్ ‘ప్లాస్టికోస్’ నుంచి వచ్చింది. అంటే మలచడం, మౌల్డింగ్ అని అర్థం. అంతే తప్ప ప్లాస్టిక్ మెటీరియల్‌తో తయారుచేస్తారని కాదు. పాస్టిక్ సర్జరీలో ప్రధానంగా రెండు విభాగాలు ఉంటాయి. ఒకటి- కాస్మొటిక్ సర్జరీ (అందం మెరుగుపరచడానికి చేసే సర్జరీ), రెండు (రీ కన్‌స్ట్రక్టివ్ సర్జరీ) అవయవాన్ని కొత్తగా తయారుచేసి సెట్‌చేయడం. పాస్టిక్ సర్జరీ అనగానే టీవీ సీరియల్స్‌లోనూ, సినిమాల్లోనూ చూపించిన విధంగా ఒకరికి బదులుగా మరొకరిలా మార్చడం జరగదు. ప్లాస్టిక్ సర్జరీలో రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ, హ్యాండ్ సర్జరీ, మైక్రోసర్జరీ… అని చాలా రకాలు ఉన్నాయి.

స్కిన్‌గ్రాఫ్ట్…:

శరీరంలోనే అతిపెద్ద అవయవం చర్మం. శరీరభాగాలను కప్పి ఉంచే ఈ చర్మం కనుబొమల దగ్గర సున్నితంగా, అరచేయి, పాదాల్లో గట్టిగా ఉంటుంది. శరీరం మొత్తంలో అధిక ప్రాధాన్యం ఉన్న ఈ చర్మం ఏ కారణం చేతనైనా కాలినా, దెబ్బతగిలి గాయపడి పాడైపోయినా ఆ ప్రాంతంలో దానిని తొలగించి, శరీరంలో ఇతర చోట్ల ఆరోగ్యంగా ఉన్న చర్మాన్ని తీసి అతికిస్తారు. ఈ పద్ధతిని స్కిన్ గ్రాఫ్ట్ అంటారు. గాయం చిన్నదైతే ఫస్ట్ డిగ్రీ సూపర్‌ఫిషియల్, సెకండ్ డిగ్రీ సూపర్ ఫిసియల్ చికిత్స చేస్తారు. అంటే డ్రెస్సింగ్, క్రీములతో గాయం నయం అయ్యేలా చూస్తారు. గాయం పెద్దదై రిస్క్ ఎక్కువ ఉన్నట్లయితే హాస్పిటల్‌లో ఆ వ్యక్తి అడ్మిట్ కావాల్సి ఉంటుంది. రిస్క్‌ను బట్టి చికిత్స ఉంటుంది. కాలిన గాయం లోతుగా ఉంటే డీప్ సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ బర్న్స్‌గా పేర్కొంటారు. స్కిన్ గ్రాఫ్ట్‌కు సాధారణంగా తొడల నుంచి చర్మం తీసి వేస్తుంటారు. అయితే తొడల దగ్గర కూడా చర్మం కాలినప్పుడు మరో చోట నుంచి ఆరోగ్యకరమైన చర్మం తీయాల్సి ఉంటుంది. ఈ చికిత్సలన్నీ అన్ని వసతులు ఉన్న చోట, నిపుణులైన సర్జన్‌తో చేయించుకుంటేనే మంచి ఫలితాలు వస్తాయి.

కాస్మొటిక్ సర్జరీ..: 

అందాన్ని మెరుగుపరుచుకోవడానికి చేసే రైనోప్లాస్టీ(ముక్కును సరిచేయడం), లైపోసక్షన్(ఫ్యాట్‌ను తగ్గించడం), ఫేస్‌లిఫ్ట్ (ముఖ చర్మం ముడతలు రాకుండా చేయడం), బ్ట్రెస్ సర్జరీ(పెద్దగా ఉన్న బ్రెస్ట్‌ను తగ్గించడం, తక్కువగా ఉన్న బ్రెస్ట్‌ను పెంచడం, సాగిన బ్రెస్ట్‌ను సరిచేయడం), పురుషుల్లో పెద్దగా ఉన్న బ్రెస్ట్‌ను (గైనకోమాస్టియా) తగ్గించడం… ఇలా చెప్పుకుంటే శరీరంలో ప్రతి భాగాన్ని సర్జరీ ద్వారా అందంగా మార్చుకోవడానికి చేసేది కాస్మొటిక్ సర్జరీ. లోపాలను సవరించుకోవడానికి, అందాన్ని మెరుగుపరుచుకోవడానికి చేయించుకునే ఈ సర్జరీకి ఒక రోజు మాత్రమే పడుతుంది.

పేలడం వల్ల అయిన గాయాలకు..: 

చేతుల్లోనే బాణాసంచా కాలి గాయాల పాలైన కేసులు ఎక్కువగా హాస్సిటల్స్‌కు వస్తుంటాయి. బాణాసంచా వల్లనో, ప్రమాదాల వల్లనో చేతి ఎముకలు విరగడం, నర్వ్ ఫంక్షన్ దెబ్బతినడం, కదలికలు లేకపోవడం, కండరాలు దెబ్బతినడం, చర్మం పాడైపోవడం… ఇలా అన్నింటిపైన రిస్క్ ఉంటుంది. ఇలాంటప్పుడు వీరికి కాంప్లెక్స్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. అంటే ముందుగా టెండార్ రిపేర్ చేయడం, తర్వాత నర్వ్ రిపేర్ ఆ తర్వాత స్కిన్ గ్రాఫ్ట్.. ఇలా దశలవారీగా చికిత్స చేస్తూ వెళతారు. శరీరం నలభై శాతం కంటే ఎక్కువ కాలినట్టయితే వీరికి ప్రాణాపాయం ఎక్కువ. వీరిని ఐ.సి.యూలో ఉంచి కొన్ని రోజుల పాటు వైటల్స్ స్టెబిలైజ్ అయిన తర్వాత పైన చెప్పిన చికిత్స చేయాలి. ఇలాంటప్పుడు ఇన్ఫెక్షన్ సమస్యలు రాకుండా జాగ్రత్తపడాల్సి ఉంటుంది

ధన్యవాదములు 🙏

మీ నవీన్ నడిమింటి

విశాఖపట్నం

ఫోన్ 9703706660

కామెంట్‌లు లేవు: