శరీరంలో ఆమ్లం నిల్వ శాతం పెరగడాన్ని హైపర్ యూరికేమియా అని పేర్కొంటారు. యూరిక్ యాసిడ్/ యూరిక్ ఆమ్లము స్థాయి చాలా హెచ్చుగా ఉండటం ఆరోగ్య సమస్యకు దారితీస్తుంది. ప్రోటీన్ల విచ్ఛిన్నం కారణంగా శరీరంలో యూరిక్ ఆసిడ్ తయారవుతుంది. ప్రొటీన్లు విచ్ఛిన్నమయినపుడు వాటిలోని రసాయనక సమ్మేళనాన్ని ప్యూరిన్లు అంటారు. అవి యూరికి ఆసిడ్ గా విచ్చిత్తి అవుతాయి. మూడు ప్రధానంగా కారణాల వల్ల యూరిక్ ఆమ్లం స్థాయి పెరగవచ్చు . అవి యూరిక్ ఆసిడ్ హెచ్చు ఉత్పత్తి, యూరిక్ ఆసిడ్ విసర్జన తగ్గడం, లేదా ఈ రెండు వ్యవస్థల కలయిక.
హైపర్ యూరికేమియా ఏ లక్షణం లేకుండా (అసింప్టోమాటిక్) ఉండవచ్చు. లేదా అది లక్షణాలతో కూడి ఉండవచ్చు ( సింప్టొమాటిక్). శరీరంలో యూరిక్ ఆసిడ్ స్థాయి పెరుగుదలకు పెక్కు వైద్యపరమైన స్థితిగతులు ఉంటాయి. అవి లక్షణాలతో కనిపిస్తాయి. ఇవి యూరిక్ ఆసిడ్ నెఫ్రోపతి ( మూత్రంలో హెచ్చుస్థాయిలో యూరిక్ ఆసిడ్ ఉన్న కారణంగా కిడ్నీ పనితీరు తగ్గుతుంది.) , గౌట్ ( రక్తంలో ప్రసరించే హెచ్చు స్థాయి యూరిక్ ఆసిడ్ మోతాదు కారణంగా కీళ్లలో యూరేట్ క్రిస్టల్ డిపొజిషన్) , యూరిక్ ఆసిడ్ నెఫ్రోలితియాసిస్ ( యూరిక్ ఆసిడ్ కిడ్నీస్టోన్స్) మేరకు ఉంటాయి శరీరంలో ఆమ్లం నిల్వ శాతం పెరగడంతో ఏలాంటి వెంబడించే లక్షణాలు లేకపోయినప్పుడు, సాధారణంగా చికిత్స సిఫారసు చేయబడదు. అయితే లక్షణాలతో కూడిన హపర్ యూరికేమియాకు నిర్ధారణను అనుసరించి చికిత్స అవసరం కాగలదు. శరీరంలో ఆమ్లం నిల్వ శాతం పెరగడంతో ఎదురయ్యే సమస్యలలో గౌట్, అక్యూట్ యూరిక్ ఆసిడ్ నెఫ్రాపతీ, యూరిక్ ఆసిడ్ నెఫ్రాలితియాసిస్ మరియు దీర్ఘకాలిక రెనాల్ తక్కువ మోతాదు వంటివి ఉంటాయి
యూరిక్ యాసిడ్ యొక్క లక్షణాలు - Symptoms of High Uric Acid (hyperuricemia)
మీకు హైపర్ యూరికేమియా జబ్బు ఉన్నట్లయితే, మీ వైఫ్యుడు మీ జబ్బు పూర్వాపరాలను కూలంకషంగా పరిశీలిస్తాడు. తద్వారా మీరు జబ్బు లక్షణాలను పొందినవారా లేదా లక్షణాలకు అతీతులా అని నిర్ధారిస్తాడు. తర్వాత జబ్బు కారణాలను మరియు ఎదురవుతున్న ఇతర వైద్య సహ సమస్యలను గుర్తిస్తాడు.
జబ్బు లక్షణాలు కనిపించనప్పుడు సాధారణంగా ప్రత్యేకంగా జబ్బు నిర్ధారణ జరిపే అవసరం ఉండదు. అయితే జబ్బు లక్షణాలు ఉన్నప్పుడు, పరీక్ష తర్వాత ఈ క్రింది అంశాలు వెలుగులోకి వస్తాయి. :
- తీవ్రమైన గౌట్ కీళ్లనొప్పుల సందర్భంగా దెబ్బతిన్న కీలు చూసేందుకు ఎర్రగా ( ఎరిథెమాటస్) కనిపిస్తుంది. తాకినప్పుడు వెచ్చగా ఉంటుంది. వాపు కలిగి ఉంటుంది మరియు హెచ్చు నొప్పికి దారితీస్తుంది.
- దీర్ఘకాలంగా గౌటీ కీళ్లనొప్పులకు గురవుతున్నవారిలో క్రిస్టలిన్ యూరిక్ ఆసిడ్ (టోఫీ) నిల్వలు పేరుకుపోతాయి. అవి చెవి మృదులాస్థిలో, చేయి ముందుభాగం లోపల, మోచేయి మరియు శరీరం లేదా ఇతర కణజాలం మధ్య పలుచని ద్రవం పొరలో ఇది చేరి ఉంటుంది.
- యూరిక్ ఆసిడ్ నెఫ్రోలితియాసిస్ లో జబ్బుమనిశి పొత్తికడుపు లేదా ఒరలో ( పృష్టభాగం మరియు పక్క ఎముకల మధ్య ప్రదేశంలో) నొప్పి కలిగి ఉంటాడు ( హెచ్చు వివరాలకు చదవండి – కిడ్నీలో రాళ్లకు చికిత్స)
హైపర్ యూరికేమియాకు ఇతర వైద్యకీయ జబ్బులకు మధ్య గల తేడాను గమనించవలసి ఉన్నది. అవి ఒకే రకం లక్షణాలను కలిగి ఉంటాయి. వాటిలో క్రిందివి చోటుచేసుకొని ఉంటాయి.
- ఆల్కహాలిక్ కేటోఆసిడోసిస్
మద్యం వాడకం మరియు ఆహారం లేమితో ఎదురయ్యే జైవిక దుస్థితి. - డయాబెటిక్ కేటోఆసిడోసిస్
మీ బ్లడ్ షుగర్ చాలాకాలంపాటు చాలా హెచ్చుగా ఉన్నప్పుడు మీ రక్తంలో ఆసిడ్లు చోటుచేసుకోవడం. - గౌట్ మరియు సూడోగౌట్
ఇవి మంటతో కూడిన కీళ్లనొప్పికి సంబంధించినవి. - హేమోలిటిక్ రక్తహీనత
శరీరంలో రక్తంలోని ఎర్రకణాలు తమ సాధారణ జీవితకాలానికి మునుపే వినాశానికి గురయ్యే దుస్థితి - హొడ్గ్కిన్ లింఫోమా
తెల్ల రక్త కణాలలో ఆవర్భవించే ఒక రకం కేన్సర్ - హైపర్ పారాథైరోయిడిజం
ఇట్టి దుస్థితిలో రక్తప్రవాహంలో పారా థైరాయిడ్ హార్మోన్ హెచ్చుగా ఉంటుంది - హపోథైరాయిడిజమ్
శరీరం అవసరమైన స్థాయిలో థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేయలేయలేని స్థితి - నెఫ్రోలిథియాసిస్ (మూత్రపిండాలలో రాళ్లు చేరడం)
ఇది మూత్రవ్యవస్థలో రాళ్లు చేరే ప్రక్రియ - నెఫ్రోలిథియాసిస్
గర్భంతో ఉన్న దశలో ఒక మహిళ ( ఇదివరకు హెచ్చుస్థాయిలో రక్తపీడనం లేకుండా ఉండి ) ఇప్పుడు హెచ్చుస్థాయి రక్తపీడనం పెంపొందించు కోవడం మరియు దానితోపాటు మూత్రంలో హెచ్చుస్థాయి ప్రోటీన్లు కలిగి ఉండటం. - I ఏ రకం గ్లైకోజన్ స్టోరేజ్ జబ్బు
ఈ రకం జబ్బును జి ఎస్ డి 1 ఏ జబ్బు అని కూడా అంతారు. రక్తకణాలలో గ్లైకోజన్ అనబడే చక్కెర ఉన్న కారణంగా ఎదురయ్యే దుస్థితి. కొన్ని అవయవాలలో మరియు కణజాలంలో కూడా గ్లైకోజెన్ స్థాయి పెరగవచ్చు - యూరిక్ ఆసిడ్ నెఫ్రోపతి
మూత్రంలో హెచ్చుస్థాయి యూరిక్ అసిడ్ ఉన్న కారణంగా కిడ్నీ పనితీరు దిగజారడంతో ఎదురయ్యే స్థితి
యూరిక్ యాసిడ్ యొక్క చికిత్స - Treatment of High Uric Acid (hyperuricemia)
లక్షణరహితమైన హైపర్ యూరికేమియా
లక్షణరహితమైన హైపర్ యూరికేమియా రోగులకు సాధారణంగా వైద్య చికిత్స సిఫారసు చేయబడదు. అట్టి రోగులలో జీవన సరళి/ విధానం లో మార్పు అవసరం. వాటిలో ఆహార వ్యవస్థలో మార్పు, వ్యాయామం ఉంటాయి. అవి యూరిక్ ఆసిడ్ స్థాయిని అదుపు చేస్తాయి.
లక్షణాలతో కూడిన హైపర్ యూరికేమియా
హైపర్ యూరికేమియా గౌట్ రూపంలో, యూరిక్ ఆసిడ్ రాళ్లు లేదా యూరిక్ ఆసిడ్ వెఫ్రాపతి లక్షణాలతో కూడినది కావచ్చు
గౌట్ ( వాతము )
- తీవ్రమైన గౌటీ కీళ్లనొప్పులు
తీవ్రమైన గౌట్ కీళ్లనొప్పి జబ్బుకు చికిత్స కల్పించే ముఖ్య ఉద్దేశం నొప్పి నివారణ. దీనితో సాధారణంగా మంట నివారణ జరిగేవరకు ఎన్ ఎస్ ఏ ఐ డి లను ( నాన్ స్టెరాయిడల్ ఆంటి-ఇన్ఫమెటరీ డ్రగ్స్) సిఫారసు చేస్తారు. ఇవి సాధారణంగా 7 – 10 రోజుల వాడకానికి సూచిస్తారు. లేదా వైద్యపరీక్ష నిర్ధారణను పరిస్థితిని బట్టి 3-4 రోజులకు కూడా సూచిస్తారు. - దీర్ఘకాలిక గౌట్ థెరపీ
వాతపు కీళ్లనొప్పి లక్షణాలు నయమయిన తర్వాత, వాతపు కీళ్లనొప్పి రోగి అంతర-తీవ్రస్థాయి దశకు చేరుకొంటాడు. ఈ దశలో సాధారణంగా ప్రోఫిలాటిక్ కాల్కిసైన్, యూరికోస్యూరిక్ మందులు, (యూరిక్ ఆసిడ్ ను విసర్జింపజెసే మందులు) మరియు సాంతిన్ ఆక్సిడేస్ నిరోధకాలు ( యూరిక్ ఆసిడ్ ఉత్పత్తిని నిరోధింపజేసే మందులు) సూచింపబడతాయి.
యూరిక్ అసిడ్ నెఫ్రాలిథియాసిస్
ఈ సందర్భంలో అల్లోప్యూరినాల్ మందులు వాడుతారు
యూరిక్ ఆసిడ్ నెఫ్రాపతి
యూరిన్ ను పలచపరచడానికై ఫ్యూరోసెమైడ్ లేదా మానిటాల్ వంటి మందులు) ఇంట్రావీనస్ సెలైన్ మరియు మందులు ఉపయోగించి యూరిక్ ఆసిడ్ మరింత గట్టిపడకుండా నివారిస్తారు. సోడియం బైకార్బినేట్ లేదా అసెటాజోలామైడ్ తోపాటు యూరిన్ ఆల్కలైజేషన్ కూడా చేయవచ్చు.
క్లినికల్ పరీక్షలు, జబ్బు నిర్ధారణ ఫలితాల ఆధారంగా మీ వైద్యుడు మిమ్మల్ని ఒకానొక వైద్య నిపుణుని (స్పెషలిస్ట్) సలహాకై పంపవచ్చు
- తీవ్రమైన లేదా దీర్ఘకాలిక గౌటీ కీళ్లనొప్పుల రోగులను ర్యుమటాలజిస్టును సంప్రతించమని సూచించవచ్చు
- తీవ్రమైనయురెట్ నెఫ్రాపతీ లేదా దీర్ఘకాలిక రెనాల్ ఫెయిల్యూర్ రోగులను కిడ్నీ స్పెషలిస్టును సంప్రతింపమని సూచించవచ్చు.
- లక్షణాత్మక యూరిక్ ఆసిడ్ నెఫ్రాలిథియసిస్ రోగులను యూరాలజిస్టును సంప్రతింపమని సూచించవచ్చు.
జీవన సరళి నిర్వహణ
హైపర్ యూరీకేమియా, ప్రత్యేకంగా లక్షణరహితమైనట్టిది, పెక్కు సందర్భాలలో జీవనవిధానంలో మార్పులతో నయం చేస్తారు. లక్షణాత్మకమైన హైపర్ యూరీకేమియా కూడా ఈ మార్పులతో ప్రయోజనం పొందగలదు.
ఆహారవ్యవస్థలో మార్పులు
- వేటిని సేవించరాదు ?
- గొర్రె, పంది, ఎద్దు వంటివాటి ఎర్ర మాంసాన్ని తీసుకొనకండి
- కొవ్వుతో కూడినట్టి పౌల్ట్రీ మరియు హెచ్చు కొవ్వు కలిగిన డెయిరీ ఉత్పత్తుల వాడకాన్ని అదుపు చేయండి
- సార్డైన్, టునా షెల్ చేపలు మరియు ఆంకోవీ జాతి చేపల వాడకాన్ని తగ్గించండి. వాటిలో ప్యూరిన్స్ హెచ్చుగా ఉంటాయి. అలాగే తీపుగావింపబడిన సంపూర్ణ ధాన్యాలను వాడకండి.
- ఫ్రక్టొస్ తో తీపు చేయబడ్ద పానీయాలను, ఆల్కహాల్ ను (ముఖ్యంగా బీర్) మానండి
- ఏవి తినవచ్చు ?
- అవసరమైన మోతాదులో నీరు సేవించి చక్కటి హైడ్రేషన్ కలిగి ఉండండి
- తక్కువ కొవ్వుతో కూడిన డెయిరీ ఉత్పత్తులను, ప్రొటీన్ వనరుల కోసం కూరగాయలను సేవించండి
- హెచ్చు మోతాదులో ( వితమిన్ సి హెచ్చుగా ఉండే) పళ్లను, కూరగాయలను, తృణధాన్యాలను సేవించండి
- వ్యాయామం
మీ ఎత్తుకు సరిపడే శారీరక బరువును పొందడానికి క్రమం తప్పకుండా వ్యాయామం జరపండి వ్యాయామం యూరిక్ ఆసిడ్ ఉత్పత్తి స్థాయిని తగ్గించడమే కాకుండా అది కీళ్లపై బరువును తగ్గిస్తుంది మరియు కాళ్లను బలపరచడానికి స
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి