20, జూన్ 2021, ఆదివారం

చెవుల్లో ఇన్ఫెక్షన్ నివారణ అవగాహనా లింక్స్ లో చూడాలి

చెవుల్లో రింగుమనే మ్రోత అంటే ఏమిటి?

చెవుల్లో రింగుమనే మ్రోత లక్షణాన్నే వైద్యపరంగా “టిన్నిటస్” అని పిలుస్తారు మరియు ఎలాంటి బాహ్య కారణం లేకుండా అసాధారణమైన “రింగు రింగు”మనే ధ్వని లేదా సందడి ధ్వని ఒక చెవి లేదా రెండు చెవుల్లోను వినిపించడం దీని లక్షణం. చెవుల్లో ధ్వని గర్జనలాగా,  క్లిక్-క్లిక్ మనే ధ్వనిలా లేదా హిస్-హిస్ మనే బుసలుకొట్టే ధ్వని వినిపించవచ్చు. ఈ ధ్వని మృదువైనదిగా లేదా బిగ్గరగానూ ఉండవచ్చు. అయినప్పటికీ, టిన్నిటస్ అనేది ఒక వ్యాధి కాదు మరియు చెవుల్లో తమకిలా ఉంటోందని చాలామంది వ్యక్తులు వైద్యులకు నివేదించారు.

ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

చెవుల్లో రింగుమనే మ్రోత లేక టిన్నిటస్ అనేదే ఓ వ్యాధి లక్షణం, ఇది వినికిడి వ్యవస్థలో అసహజతను సూచిస్తుంది.

టిన్నిటస్ (Tinnitus) సాధారణంగా ఒకటి లేదా రెండు చెవుల్లో “రింగు రింగు” మనే ధ్వని  వినబడేదిగా వర్ణించబడింది. టిన్నిటస్ లక్షణం కల్గిన వ్యక్తి ఈ ధ్వనిని ఇంకా కింది విధంగా కూడా వర్ణించవచ్చు:

  • గర్జించే ధ్వనిన (Roaring)
  • బుసలు కొట్టే (హిస్ హిస్ మనే) ధ్వని (Hissing)
  • ఈల ధ్వని (విజ్లింగ్)
  • అస్పష్ట సందడిగా ఉండడం (Vague buzzing)

చెవుల్లో “రింగు రింగు” మనే ఈ ధ్వనిని కొందరు బిగ్గరగా ఉన్నట్లు నివేదించవచ్చు, ఇంకొందరు వ్య క్తులకు ఇది చాలా మందకొడిగా ఉండే ధ్వనిగా అనిపించొచ్చు. అయితే, టిన్నిటస్ లో ధ్వని తప్పనిసరిగా వెలుపలి మూలం నుండి రాదు. ఇది కొన్ని నిమిషాలు లేదా సుదీర్ఘకాలంపాటు చెవుల్లో అనుభవించవచ్చు.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

టిన్నిటస్ వృద్ధుల్లో చాలా సాధారణమైన లక్షణంగా ఉంటుంది, మరియు ఇది పురుషులు మరియు స్త్రీలకు కూడా వస్తుంది. టిన్నిటస్ కు కింద సూచించినటువంటి చాలా కారణాలే ఉండవచ్చు:

  • చెవి సంక్రమణం.
  • సైనస్ ఇన్ఫెక్షన్ (ముక్కు కారడం) .
  • హార్మోన్ల మార్పులు.
  • థైరాయిడ్ అసాధారణతలు.
  • చెవికి గాయం.
  • అలసట.
  • చెవి కాలువ మైనపు నిక్షేపం (ear wax) కారణంగా నిరోధించబడడం.
  • కొన్ని ఔషధాల సేవనంవల్ల

వృద్ధుల్లో టిన్నిటస్ రావడమనేది వినికిడి నష్టానికి మొదటి సంకేతం కావచ్చు.

కర్మాగారాలు మరియు సంగీత కార్యక్రమాల వంటి ధ్వని వాతావరణంలో పనిచేసే వ్యక్తులకు ఈ టిన్నిటస్ లక్షణం స్వల్ప కాలికంగా గాని లేదా శబ్దప్రేరిత వినికిడి నష్టం యొక్క నిరంతర లక్షణంగా కానీ అభివృద్ధి కావచ్చు.

టినిటస్ కుంగుబాటు మరియు ఇతర మానసిక అనారోగ్యాల లక్షణంగా కూడా కనిపిస్తుంటుంది.

టిన్నిటస్ చాలా సాధారణం కావడంతో, స్పష్టమైన కారణమంటూ ఏదీ లేకుండా కూడా  సంభవించవచ్చు.

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

టిన్నిటస్ యొక్క కారణాన్ని నిర్ధారించడానికి లేదా గుర్తించడానికి, వైద్యుడు ఒక వినికిడి పరీక్షను నిర్వహించి, ఎలాంటి ధ్వనిని వింటున్నారన్న దాని గురించి వ్యక్తిని మరింతగా  విచారణ చేయవచ్చు. CT మరియు MRI వంటి స్కానింగ్ మరియు ఇమేజింగ్ పరీక్షలు కూడా గాయం యొక్క ఏవైనా సంకేతాలను గుర్తించడానికి చేయవచ్చు. చెవిలో ఏదైనా విదేశీ శరీరం (foreign body) ఉనికిని  తనిఖీ చేయటానికి చెవి లోపల చూడ్డానికి ఉపయోగించే ఒక పరికరం “ఒటోస్కోపీ” ని వైద్యుడు నిర్ధారణలో ఉపయోగించవచ్చు.

సాధారణంగా, చెవుల్లో రింగు గింగు మనేది దానంతటదే మాయమైపోతుంది, దీనికి ప్రత్యేకమైన చికిత్స అవసరం లేదు. అయితే, ఈ చెవిరుగ్మత లక్షణానికి ఏదైనా నిర్దిష్ట కారణం ఉంటే, చికిత్స అవసరమవుతుంది.

రక్తనాళాల గాయం అయ్యుంటే దాన్ని చికిత్స చేసేందుకు మందులివ్వబడతాయి లేదా ఒత్తిడి సంబంధిత టిన్నిటస్ను కూడా మందులు ఇవ్వబడతాయి. వ్యక్తి యొక్క వినికిడి నష్టానికి హియరింగ్ ఎయిడ్ సాధనాలు ఇవ్వబడవచ్చ



చెవుల్లో రింగుమనే మ్రోత (టిన్నిటస్) కొరకు అల్లోపతి మందులు
Medicine NamePack Size
OtzOtz 200 Mg/500 Mg Tablet
Pik ZPik Z 50 Mg/125 Mg Syrup
DiofloxDioflox 100 Infusion
Mark OMark O 200 Mg Tablet
OxanidOxanid Tablet
Pin OZPin OZ Tablet
DiroxinDiroxin 100 Tablet
MaxofMaxof 200 Mg Tablet
Oxflo ZlOxflo ZL Suspension



టినెటస్‌-చెవిలో హోరు,Tinitus-noise in the Ear


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -టినెటస్‌-చెవిలో హోరు,Tinitus-noise in the Ear- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


-చాలామందికి చెవిలో విపరీతమైన పోరు ఉంటుంది. ఇలా చెవిలో హోరు వినిపిస్తోంటే చాలావరకు శ్రవణ నాడి దెబ్బ తిన్నదని అర్థం చేసుకోవాలి. కర్ణభేరికి రంధ్రం, చెవికి ఎముకలు బిగిసినా, గొలుసు కదిలిపోయినా, మధ్యచెవిలో దీర్ఘకాలం స్రావాలు చేరినా, గట్టిగా తలకు దెబ్బ తగిలిన్ఠా, మెదడులో రక్తనాళాల వ్యాధి లేక కంతులు ఏర్పడినా లేక గువిలితో పూర్తిగా నిండి చెవి మూసుకున్నా చెవిలో హోరు రావచ్చు. కేవలం హోరు మాత్రమే ఉండి వినికిడిలో మార్పు ఉండకపోవచ్చు. కొన్నిసార్లు నరాలు దెబ్బతిని వినికిడి కూడా తగ్గవచ్చు. కాబట్టి ముందుగా హోరుకు సరైన కారణం, నిర్థారణ చేయవలసి ఉంటుంది.

పరీక్షలు
-పూర్తి వివరాలు తీసుకున్నాక చెవిపరీక్ష .
ఆడియోగ్రామ్‌ వంటి వినికిడి పరీక్షలు ,
అవసరమైతే సి.టి.స్కాన్‌, ఎమ్‌.ఆర్‌.ఐ.

చికిత్స:

- వినికిడి లోపం లేకుండా కేవలం హౌరు మాత్రమే ఉంటే మీరు అనుమానాలు భయాలు పెట్టుకోకుండా దానితో జీవించడానికి అలవాటు పడాల్సి ఉంటుంది.

- వినికిడి లోపం కూడా ఉంటే, వినికిడి యంత్రం సహాయపడుతుంది.- ఇది చాలా మటుకు హౌరుని తగ్గిస్తుంది.

- అలాగే లోపలి హౌరు ఇబ్బంది పెట్టకుండా రక రకాల మార్గాలను అనుసరిం చవచ్చు.

- ముందుగా సాధ్యమైనంత వరకూ దానిని పట్టించు కోకూడదు.

- ఆధునికంగా బయటి శబ్దాలు మాత్రమే వినిపిస్తూ లోపలి హౌరును తగ్గించే టినెటస్‌ మాస్కర్లను అవస రాన్ని బట్టి వాడవచ్చును. కాబట్టి నిపుణు లను సంప్రదిస్తే 'టినెటస్‌' హౌరుకి తగిన సలహాలు, చికిత్స పొందవచ్చును.
- తీవ్ర జలుబు, ఇతర వ్యాధులు ఈ టినెటస్‌కు కారణం కాదని నిర్ధారణ చేసుకున్నాక, ముఖ్యంగా వైద్యులు రోగికి మనోధైర్యం యివ్వాలి.

- ఈ లక్షణాల నుంచి దృష్టిని మరల్చుకోవాలి. ఇంకో వ్యాపకంపై దృష్టిని పెట్టుకోవాలి.

ఇంగ్లిష్ మందులు :
Tab . Diziron 1 tab 3 times / day 3-4 days
Tab. vertizac 1 tab 2 time /day 5-7 days
Tab .vertin 1 tab 2 times / day 4-5 day
పై మందులలో ఏదో ఒకటే వాడాలి . దానితో బి.కాంప్లెక్ష్ మాత్రలు వాడాలి
Tab . beplex forte 1 tab daily for 15 to 20 days.


  • ======================================

ధన్యవాదములు 🙏

మీ మీ నవీన్ నడిమింటో

విశాఖపట్నం,

ఫోన్ - 9703706660





అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి



కామెంట్‌లు లేవు: