కిడ్నీ వ్యాధులు.. ఈ లక్షణాలతో జాగ్రత్తలు నవీన్ నడిమింటి సలహాలు
కిడ్నీ వ్యాధులు.. ఈ లక్షణాలతో జాగ్రత్త!!
కిడ్నీ వ్యాధులను ముందుగా గుర్తించడం చాలా కష్టం. చిన్న చిన్న సూచనలతోనే ముందుగానే వీటిని పసిగట్టకపోతే పరిస్థితి చేజారే ప్రమాదం ఉంది. కిడ్నీ వ్యాధుల కారణంగా క్రమంగా దాని పనితీరు మందగిస్తుంది. డాక్టర్లు సూచిస్తున్న కిడ్నీ వ్యాధుల లక్షణాలు..
జీవనశైలి సమస్యలే కారణం..
కిడ్నీ వ్యాధులు ఫలానా కారణంగా వస్తున్నాయని చెప్పలేం. జీవనశైలి సమస్యలు ఈ వ్యాధికి కారణం అవుతున్నాయి. సమస్యను ముందుగానే గుర్తించకపోవడం తీవ్ర నష్టానికి దారి తీస్తోంది. కాబట్టి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం.
బీపీ, డయాబెటిస్‌తో జాగ్రత్త..
హైబీపీ, డయాబెటిస్, కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కిడ్నీ వ్యాధులు ఉండటం, 60 ఏళ్లు పైబడిన వారు ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ కిడ్నీ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. డయాబెటిస్ వ్యాధితో బాధపడే వారిలో 40 శాతం మంది దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయి.
బరువు తగ్గుతున్నారా..?
ఎలాంటి కారణం లేకుండా అనూహ్యంగా బరువు తగ్గడం కూడా కిడ్నీ వ్యాధులకు సంకేత ఫొటోలు మరిన్ని చూడండి
కాళ్లు ఉబ్బినట్లు కనిపిస్తే..
కిడ్నీల్లో ఒంట్లో పేరుకున్న వ్యర్థాలను తొలగిస్తాయి. కిడ్నీల పనితీరు మందగిస్తే.. ఒంట్లోని పేరుకుపోయిన ద్రవాల కారణంగా ముఖం చేతులు, కాళ్లు, పాదాలు లేదా మడమల్లో నీరు పేరుకుపోయి ఉబ్బినట్లు కనిపిస్తాయి.
నిస్సత్తువకు లోనవుతున్నారా..?
శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడమే కాకుండా.. ఎరిథ్రోఫోయిటిన్ అనే హార్మోన్‌ను కిడ్నీలు స్రవిస్తాయి. ఈ హార్మోన్ ఎర్ర రక్తణాలు ఆక్సిజన్‌ను మోసకెళ్లడటంలో తోడ్పడతాయి. కిడ్నీల పనితీరు మందగిస్తే.. ఈ హార్మోన్‌ను సరిగా ఉత్పత్తి చేయలేవు. కాబట్టి కొన్ని ఎర్ర రక్త కణాలే ఆక్సిజన్‌ను మోసకెళ్తాయి. ఫలితంగా కండరాలు, మెదడు త్వరగా అలసటకు గురవుతాయి. దీన్నే అనీమియా అంటారు. ఏ పని చేయకుండానే నిస్సత్తువకు లోనవుతారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
మూత్రంలో రక్తం వస్తోందా..?
యూరిన్‌లో రక్తం వస్తుంటే.. ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. మూత్రంలో ప్రోటీన్లు ఉండటం క్లిష్టమైన అంశం. దీన్ని మూత్ర పరీక్షల ద్వారానే గుర్తించగలం. కాబట్టి తరచుగా చెకప్ చేయించుకోవాలి.
తరచుగా మూత్రానికి వెళ్లాల్సి వస్తోందా..?
కిడ్నీ వ్యాధులకు గురైతే.. తరచుగా మూత్రానికి వెళ్లాల్సి రావొచ్చు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ సమస్య అధికం అవుతుంది. కొద్ది కొద్దిగా మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు యూరిన్ ముదురు రంగులో ఉండటంతోపాటు, లేత రంగులో ఎక్కువ మొత్తంలో మూత్రవిసర్జన కూడా ఇబ్బందికరమే. మూత్రవిసర్జన చేయడంలో ఇబ్బంది, మూత్రం పోయాల్సిన అవసరం లేకున్నా ఒత్తిడిగా అనిపించడం కూడా కిడ్నీల సమస్యకు సంకేతాలే.
దద్దుర్లు..
శరీరంలో వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల చర్మంపై దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది. చర్మం దురదగా అనిపించొచ్చు.
నొప్పులు..
కిడ్నీ జబ్బుల బారినపడినప్పుడు కొన్ని సందర్భాల్లో నొప్పి రావొచ్చు. శరీరంలోని వివిధ భాగాల్లో నొప్పులు తీవ్రంగా ఉంటాయి.
హైబీపీతో డేంజర్..
శరీరంలో ఆక్సిజన్‌ను మోసుకెళ్లే సామర్థ్యం తగ్గడం వల్ల గుండె వేగంగా రక్తాన్ని సరఫరా చేస్తుంది. హైబీపీ వల్ల గుండె అధికంగా పని చేయాల్సి రావడంతోపాటు హైపర్ టెన్షన్‌కు కారణం అవుతుంది.
వికారం, వాంతి వచ్చినట్లుగా ఉండటం..
కిడ్నీ జబ్బుల కారణంగా ఒంట్లో వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల వికారం, వాంతి లాంటి లక్షణాలు కనిపిస్తాయి. కిడ్నీ వ్యాధుల కారణంగా అనీమియా రావడం వల్ల మెదడుకు అందే ఆక్సిజన్ పరిమాణం తగ్గుతుంది. ఫలితంగా మైకంగా ఉండటం, ఏకాగ్రత లోపించడం లాంటి సమస్యలు తలెత్తుతాయి.
అంగస్తంభన సమస్యలా..?
అంగస్తంభన సమస్యలు కూడా కిడ్నీల జబ్బుకు సంకేతం కావొచ్చు. నరాలు దెబ్బతినడం, ధమనులు, తంతు కణజాలం దెబ్బతినడం వల్ల వల్ల పురుషాంగంలోకి రక్త సరఫరా తగ్గుతుంది.
అల్ట్రాసౌండ్‌తో..
మూత్రంలో ప్రొటీన్లు ఉండటం అనేది కిడ్నీ వ్యాధులు రాబోతున్నాయి అనడానికి సూచిక. ఒంట్లో పేరుకున్న వ్యర్థాలను గణించడానికి డాక్టర్లు రక్త పరీక్షను సూచించే వీలుంది. అల్ట్రాసౌండ్ ద్వారానూ కిడ్నీ సమస్యలను మెరుగ్గా గుర్తించొచ్చు. ముందుగా గుర్తించడం వల్ల కిడ్నీ ఫెయిల్ అవకుండా కాపాడుకోవచ్చు.
తరచుగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి..
తరచుగా వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరం. వైద్య పరీక్షల వల్ల వ్యాధిని ముందుగానే పసిగట్టడంతోపాటు ప్రశాంతంగా జీవించవచ్చు. జీవితంలో అనూహ్య ఆటంకాలు రాకుండా కాపాడుకోవచ్చు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి