18, జూన్ 2021, శుక్రవారం

శ్రీ తులసి ఉపయోగం ఏమిటి అవగాహనా కోసం లింక్స్ లో చూడాలి

మనం అందరం తులసి మొక్క గురించి వినే ఉంటాం మరియు చూసే ఉంటాం. కాని మనలో చాలా మందికి పంచ తులసి యొక్క ప్రయజనాలు తెలియదు.

తులసి ఔషధీ పరంగానూ, హిందూ సంప్రదాయాలలోనూ ఎంతో ప్రాముఖ్యత ఉన్న మొక్క. తులసి మొక్కల్లో కృష్ణ తులసి మరియు రామతులసి అనీ రెండు జాతులున్నాయి. పూజకు మాత్రమే కాకుండా ఆయుర్వేద ఔషధాలలో కూడా కృష్ణతులసిని అధికంగా వాడుతారు.

తులసి తీర్థం లేదా తులసి రసంని సర్వరోగ నివారణిగా భావిస్తారు. వేలాది సంవత్సరాలుగా ఆయుర్వేదంలో తులసి ఒక ముఖ్యమైన ఔషధిగా వాడబడుతున్నది.

కృష్ణ తులసి, మరువ తులసి, రామ తులసి, బిస్వా తులసి, నింబుక తులసి, విష్ణు తులసి, కర్పూర తులసి, వన తులసి, విభూది తులసి ఇవే కాకుండా తులసిలో ఇంకా వివిధ రకాలు ఉన్నాయి.

తులసి  ప్రతి ఇంట్లో ఎంతో పవిత్రంగా పెట్టుకునే మొక్క. నేడు విదేశీయులు సైతం తులసిలోని విశేషమును అంగీకరించుచున్నారు. మరి ఎందుకు ఆలస్యం? తులసిలో ఎన్ని రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

తులసి ప్రయోజనాలు తెలుసా?

దీని ఔషధీగుణంపై ఇప్పుడు మరింత పరిశోధన జరుగుతున్నది. అనేక ఆధునిక ఔషధాలలో కూడా తులసిని వాడుతున్నారు. శరీరంలో వివిధ ప్రక్రియలను సమతుల్యం చేసే ప్రభావం ఉన్న మొక్కగా తులసిని గుర్తించారు. కనుక మానసిక వత్తిడిని తగ్గించే ప్రభావం, ఆయుర్వృద్ధి కలిగించే ప్రభావం తులసిలో నిండుగా ఉన్నాయి.

పంచ తులసిలో ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు సైతం దాగున్నాయి అని చెప్పుకున్నాం కదా అవేమిటంటే:

  • యాక్నె సమస్యపై ఇది బాగా పనిచేస్తుంది.
  • రకరకాల క్యాన్సర్ల రిస్కు నుంచి కాపాడుతుంది.
  • హార్మోనుల సమతుల్యతను కాపాడడంతోపాటు ఒత్తిడిని తగ్గిస్తుంది.
  • విటమిన్ కె ఇందులో పుష్కలంగా ఉంది.
  • యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇందులో బాగా ఉన్నాయి.
  •  రేడియేషన్ దుష్పరిణామాలు శరీరంపై పడకుండా పరిరక్షిస్తుంది.
  • యాంటీ – బ్యాక్టీరియల్, యాంటీ – వైరల్ గా పనిచేస్తుంది.
  • టెస్టోస్టెరాన్ లను వృద్ధి చేస్తుంది.
  • శుక్లాల బారిన పడకుండా కాపాడుతుంది. కంటి సమస్యలు తలెత్తకుండా నిరోధిస్తుంది.
  • బ్లడ్ షుగర్ నిల్వలను క్రమబద్దీకరిస్తుంది.
  • బరువు తగ్గడంలో కూడా సహకరిస్తుంది.

శ్వాసకోస సంబంధ సమస్యలను తగ్గిస్తుంది

మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మంచిది

మెదడు చురుగ్గా పని చేసేలా సహకరిస్తుంది

నొప్పులను తగ్గించే గుణం కూడా తులసి ఆకుల్లో ఉంది

 రోగ నిరోధక శక్తిని పెంచే గుణం ఉంది

దంతాలను పరిరక్షిస్తుంది. ఓరల్ హెల్త్ కాపాడుతుంది


 






లసి ఆకులు పోషక విలువలు:


1 కప్పు తులపు ఆకులుకి పోషక విలువలు:

  • శక్తి (23 కెకాల్),
  • కార్బోహైడ్రేట్ (2.65 గ్రా),
  • ప్రోటీన్ (3.15 గ్రా),
  • ఫ్యాట్ (0.64 గ్రా),
  • కొలెస్ట్రాల్ (0mg),
  • ఆహార ఫైబర్ (1.60 గ్రా),
  • ఫోలేట్స్ (68)
  • రియాఫ్లావిన్ (0.076 mg),
  • థయామిన్ (0.034mg),
  • విటమిన్ ఎ (5275 IU),
  • విటమిన్ సి (18 mg),
  • విటమిన్ E (0.80 mg),
  • విటమిన్ E (0.902 mg),
  • పాంటోథెనిక్ యాసిడ్ (0.209 mg) ,
  • కాల్షియం (385 mg),
  • ఐరన్ (3.17 mg),
  • మెగ్నీషియం (64mg),
  • మాంగనీస్ (1.15mg),
  • జింక్ (0.81mg),
  • విటమిన్ సి (18mg),
  • సోడియం (4mg),
  • పొటాషియం (295 mg) మరియు
  • కాల్షియం(177 mg).

 

తులసి దాని యొక్క వివిధ ఆరోగ్య ప్రయోజనాలకు చాలా ప్రజాదరణ పొందింది. ఆయుర్వేద చికిత్సలకు సంబంధించినంత వరకు తులసి సుమారు 300 చికిత్స కేసుల్లో ఉపయోగించబడుతుంది.  తులసి ఆకులు ఆరోగ్యాన్ని ప్రోత్సహించే అనేక రసాయన సమ్మేళనాలను కలిగి ఉంటాయి.

ఇవే కాకుండా జలుబు, తలనొప్పి, పొట్టకు సంబంధించిన వ్యాధులు, వాపులు, గుండె జబ్బులు, విషాహారాలు, మలేరియా వంటి చాలా రకాల రుగ్మతలను నయం చేయడానికి తులసి వాడుతారు

Share this post

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *


కామెంట్‌లు లేవు: