24, ఆగస్టు 2020, సోమవారం

హెపటైటిస్ B సమస్య ఉన్నా వరకు పరిష్కారం మార్గం అవగాహనా కోసం

హెపటైటిస్‌-బి వాక్సిన్ అనేది liver(కాలేయం)సంబంధించిన వ్యాధి. హెపటైటిస్‌-బి వైరస్ ద్వారా ఈ వ్యాధి వస్తుంది..

దీనికి సీరం హెపటైటిస్ (serum hepatitis) అని కూడా అంటారు..

ఒంట్లో హెపటైటిస్‌-బి వైరస్‌ లక్షణాలు ఏంటంటే?

కాలేయానికి వాపు రావటం, వాంతులు, పచ్చ కామెర్లు ఈ వ్యాధి లక్షణాలు..

ఈ వ్యాధి ముదిరితే కాలేయం గట్టిబడిపోయి (liver cirrhosis) లివర్ కాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది..

ఒకసారి హెపటైటిస్‌-బి వైరస్‌ ఒంట్లో ప్రవేశించిందంటే ఒంట్లో దాని సంఖ్య విపరీతంగా లక్షల్లో పెరిగిపోతూ అది లివర్‌ను దెబ్బతియ్యటం స్టార్ట్ చేస్తుంది..

తర్వాత వాళ్ల రక్తంలోనూ, వీర్యంలోనూ, లాలాజలంలోనూ, ఇతరత్రా శారీరక స్రావాలన్నింటిలోనూ ఈ వైరస్‌ ఉండొచ్చు..

ఈ వైరస్ ఎక్కువగా శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది. సెక్స్, రక్తమార్పిడి,సిరంజిలు,నిడిల్స్ తల్లినుండి బిడ్డకు వస్తాయి..

స్టార్టింగ్ స్టేజ్
.................
హెపటైటిస్‌-బి వైరస్‌ శరీరంలో ప్రవేశించిన తర్వాత సాధారణంగా చాలామందికి కొద్దిరోజుల్లో కామెర్లు వస్తాయి.. 

తర్వాత కామెర్లతో పాటు వికారం, అన్నం సయించకపోవటం, కొద్దిపాటి జ్వరం ఇలాంటి లక్షణాలూ ఉంటాయి..

ఈ దశలో మనం HBsAg టెస్ట్ చేస్తే 'పాజిటివ్‌' వస్తుంది.. 

అంటే ఏదో మార్గంలో హెపటైటిస్‌-బి వైరస్‌ వీరి శరీరంలో ప్రవేశించిందని, దాని కారణంగా కామెర్లు వచ్చాయని అర్థం. వీరికి 'లివర్‌ ఫంక్షన్‌ టెస్టు'ల్లో కూడా కాస్త తేడాలుంటాయి..

ఇలా కామెర్లు వచ్చి, హెపటైటిస్‌-బి 'పాజిటివ్‌' ఉన్న వారిలో నూటికి 99.5 మందికి ప్రాణాపాయం ఉండదు.. 

ఈ దశలో మనం వీరికి మంచి ఆహారం, పూర్తి విశ్రాంతి ఇస్తే చాలు..

ముఖ్యంగా లివర్‌ను దెబ్బతీసే మందులు వాడకూడదు.. 

ఊర్లల్లో చేసే నాటు వైద్యం కానీ..పసర్లు తాగించటం, చేతులు కాల్పించటం లాంటివేమీ చెయ్యకూడదు..

క్రమంగా కామెర్లు వాటంతట అవే తగ్గిపోతాయి. 95% మందికి ఆరు నెలల్లో హెపటైటిస్‌-బి వైరస్‌ శరీరం నుంచి పూర్తిగా తొలగిపోతుంది కూడా.. 

ఆరు నెలల తర్వాత వీరికి మళ్లీ HBsAg పరీక్ష చేస్తే- 'నెగిటివ్‌' వచ్చేస్తుంది..

పెద్దల్లో కేవలం కొద్దిమందికి (5%) మాత్రం ఆరు నెలల తర్వాత కూడా హెపటైటిస్‌-బి వైరస్‌ ఒంట్లో ఉండిపోవచ్చు..

అదే పిల్లల్లో అయితే 90 శాతం మందికి ఈ వైరస్‌ పూర్తిగా పోదు, అదలాగే శరీరంలో ఉండిపోతుంది..

అంటే హెపటైటిస్‌-బి ఎంతోమందికి సోకినా కేవలం కొద్దిమందికి మాత్రమే అది ఒంట్లో నిల్వ ఉండిపోతుంది..

ఒకసారి హెపటైటిస్‌-బి ఉన్నట్టు తేలిందంటే వారి నుంచి అది ఇతరులకు సంక్రమించకుండా ఇంట్లోని వారంతా టీకాలు వేయించుకోవటం లాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి.. 

జీవిత భాగస్వాములకు ఈ జాగ్రత్తలు మరీ ముఖ్యం..

కామెర్లు తగ్గిన ఆరు నెలల తర్వాత కూడా HBsAg టెస్ట్ పాజిటివ్‌ వస్తుంటే దాన్ని దీర్ఘకాలిక సమస్యగా క్రానిక్‌ హెపటైటిస్‌గా పరిగణిస్తారు.. అంటే ఇక హెపటైటిస్‌-బి వైరస్‌ శరీరంలో ఉండిపోవటానికే ప్రయత్నిస్తోందన్నట్టే..

ఇలా హెపటైటిస్‌-బి ఒంట్లో ఉండిపోతున్నా కూడా వీరిలో 60 శాతం మంది జీవితాంతం అలాగే.. ఏ సమస్యలూ లేకుండా ఉండిపోవచ్చు..

వీళ్లను అన్ ఎఫెక్టెడ్‌ క్యారియర్స్‌ అంటారు..

అంటే వైరస్‌ ఒంట్లో ఉన్నందువల్ల వీళ్లకే సమస్యా ఉండదు..

ఏ లక్షణాలూ, ఏ బాధలూ ఉండవు. చాలాసార్లు ఒంట్లో వైరస్‌ ఉన్న విషయం కూడా వీరికి తెలీదు.. 

మామూలు హెల్త్‌చెకప్‌లకు వెళ్లినప్పుడో, రక్తదానం చేసినప్పుడో, గర్భం దాల్చినప్పుడు సాధారణంగా చేసే పరీక్షల్లోనే ఈ విషయం బయటపడుతుంది..

మరిన్ని టెస్ట్లు చేస్తే వీరికి HBsAg- పాజిటివ్‌ ఉంటుందిగానీ SGPTనార్మల్‌గానే ఉంటుంది, HBeAg నెగిటివ్‌ ఉంటుంది..

వైరల్‌లోడ్‌ కూడా తక్కువే ఉంటుంది.. 

అంటే వీళ్ల ఒంట్లో వైరస్‌ ఉందిగానీ దానివల్ల లివర్‌ ప్రభావితం కావటం లేదని అర్థం..

వైరస్‌ వల్ల వీరికే సమస్యా లేకపోయినా వీరి నుంచి వైరస్‌ ఇతరులకు సంక్రమించే అవకాశం మాత్రం ఉంటుంది..

వీళ్లకు లివర్‌ సమస్యలు వచ్చే అవకాశం తక్కువే..

అయినా వీళ్లు ఆర్నెల్లకోసారి వైద్యులను కలిసి ముఖ్యమైన పరీక్షలు ఒకటిరెండు చేయించుకోవటం ఉత్తమం..

ఎందుకంటే ఇప్పటికి వైరస్‌ వల్ల ఏ ఇబ్బందీ లేకపోయినా జీవితాంతం ఇలాగే ఉంటుందని చెప్పలేం..

కొందరు జీవితాంతం ఈ దశలోనే ఇలాగే ఏ ఇబ్బందీ లేకుండా గడిచిపోయేవారూ ఉంటారు..

వీళ్లు ఎప్పుడూ రక్తదానం చెయ్యకూడదు..

దేనికోసం డాక్టర్స్ దగ్గరకు వెళ్లినా హెపటైటిస్‌-బి ఉన్న విషయం చెప్పాలి..

మద్యం ముట్టకూడదు..

మంచి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి..

వీరి నుంచి వైరస్‌ సంక్రమించకుండా ఇతరులు జాగ్రత్తలు తీసుకోవాలి..

భవిష్యత్తులో ప్రమాదం
.................................
ఒంట్లో వైరస్‌ నివాసం ఏర్పరచుకున్న క్రానిక్‌ హెపటైటిస్‌ బాధితుల్లో 60 పర్సెంట్ మందికి ఏ ఇబ్బందీ లేకపోయినా, ఓ 40 పర్సెంట్ మందికి మాత్రం భవిష్యత్తులో కొంచం  నుంచి తీవ్రస్థాయి లివర్‌ వ్యాధులు మొదలయ్యే అవకాశం ఉంటుంది.. 

వీరికి భవిష్యత్తులో సమస్య ఎలా ఉండొచ్చు
..................................................................
ఎంత తీవ్రంగా ఉండొచ్చన్నది టెస్ట్లను బట్టి చెప్పొచ్చు..

పరీక్షల్లో- HBsAg పాజిటివ్‌గా ఉండటమే కాకుండా HBeAg కూడా పాజిటివ్‌ ఉండి, SGPT (కాలేయానికి సంబంధించిన ఎన్‌జైమ్‌) ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉండి వైరల్‌ లోడ్‌ 5 లక్షల కంటే ఎక్కువ ఉందంటే అర్థం వీరికి భవిష్యత్తులో ఎప్పుడోకప్పుడు లివర్‌ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని..

దాన్ని నివారించుకోటానికి కావాల్సిన మెడిసిన్స్ అందుబాటులో ఉంటాయి..

వీరు తక్షణం పెగ్‌-ఇంటర్‌ఫెరాన్‌, లెమోవిడిన్‌, ఎడిఫోవిర్‌, ఎంటకావిర్‌ వంటి యాంటీ వైరల్‌ మందులు తీసుకోవటం ద్వారా మున్ముందు కూడా అసలు లివర్‌ వ్యాధి రాకుండా నివారించుకునే అవకాశం ఉంది..
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
విశాఖపట్నం 
9703706660

*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

కామెంట్‌లు లేవు: