4, ఆగస్టు 2020, మంగళవారం

మొలలు ఫైల్స్ ఫిషర్ సమస్య కు అవగాహనా మార్గం



తీవ్రమైన నొప్పి, ఎవరికీ చెప్పుకోలేని బాధ, మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, రక్తస్రావం కావటం, మలబద్ధకం వంటి సమస్యలతో చాలామంది బాధపడుతుంటారు. ఈ సమస్యలకు పైల్స్‌, ఫిషర్స్‌, ఫిస్టులా కారణం కావచ్చు. మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్ల వల్ల వస్తున్న ఈ సమస్యలకు జెనెటిక్‌ కాన్‌స్టిట్యూషనల్‌ చికిత్సతో సంపూర్ణంగా నయం చేయవచ్చంటున్నారు హోమియో వైద్యనిపుణులు డాక్టర్‌ శ్రీకాంత్‌ మొర్లావర్‌.
మలద్వారంలో ఉండే రక్తనాళాలు ఉబ్బి, వాపునకు గురై తీవ్రమైన నొప్పి, రక్తస్రావం అవటాన్ని పైల్స్‌ అంటారు. దీర్ఘకాలికంగా మలబద్ధకం, పొత్తికడుపు ఎక్కువ కాలం ఒత్తిడి కి గురవటం, దీర్గకాలంగా దగ్గు ఉండటం, గర్భధారణ సమయంలో, కాలేయ వ్యాధులతో బాధపడే వారిలో పైల్స్‌ వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. మలవిసర్జన మార్గంలో రక్తనాళాలు వాపునకు గురవటం వల్ల ఇంటర్నల్‌ పైల్స్‌ ఏర్పడతాయి. మలద్వారం చివరి ప్రాంతంలో ఉన్న రక్తనాళాలు వాపునకు గురై, వాటిపైన ఉన్న మ్యూకస్‌ పొర బయటకు పొడుచుకొని రావడాన్ని ఎక్‌ ్సటర్నల్‌ పైల్స్‌ అంటారు. దీనిలో తీవ్రమైన నొప్పితోపాటు రక్తస్రావం ఉండవచ్చు.
ఫిషర్స్‌ : మలద్వారం దగ్గర ఏర్పడే నిట్టనిలువు చీలికను ఫిషర్‌ అంటారు. దీర్ఘకాలికంగా మలబద్ధకం ఉండి, మల విసర్జన సమయంలో ఒత్తిడి ఏర్పడి మలద్వారం ద్వారా ఫిషర్స్‌ ఏర్పడే అవకాశం ఉంది. ఎక్కువ కాలం విరేచనాలు కావటం, గర్భధారణ సమయంలో ఫిషర్‌ ఏర్పడే అవకాశం ఉంది.
ఫిస్టులా : రెండు కణజాలాల మధ్య ఉండే ఒక గొట్టం లాంటి నిర్మాణాన్ని ఫిస్టులా అంటారు. మానవశరీరంలో ఫిస్టులా ఎక్కడైనా ఏర్పడవచ్చు. సర్వసాధారణంగా ఏర్పడేది ఏనల్‌ ఫిస్టులా. ఉబకాయం ఉన్నవారిలో రెండు పిరుదుల మధ్య ప్రాంతంలో మలద్వారం పక్కన ఏర్పడుతుంది. చర్మంపైన చిన్న మొటిమలా ఏర్పడి నొప్పి, వాపు ఏర్పడి రెండు,మూడు రోజుల్లో పగిలి చీము కారుతుంది.

పైల్స్‌ని త్వరగా తగ్గించే నవీన్ సలహాలు 


పైల్స్, హెమరాయిడ్స్.. మలద్వారం దగ్గర మొదలయ్యే ఈ సమస్య ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. సరిగా కూర్చోలేరు.. నిలబడలేరు అన్నట్లుగా ఉంటుంది వీటితో బాధపడేవారి పరిస్థితి. అయితే, ఈ సమస్యని తగ్గించుకునేందుకు కొంతమంది అలోపతి వంటి మందులను ఆశ్రయిస్తారు. అలా కాకుండా ఇంటి చిట్కాల ద్వారా ఈ సమస్యను పూర్తిగా తగ్గించుకోవచ్చు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.


    
మలద్వారం లోపల, చుట్టూ వాపువచ్చి పెరిగే కణితులనే పైల్స్, హెమరాయిడ్స్, మొలలు అంటారు. ఇవి రక్తనాళాలు, కండ మొదలైనవాటితోనే ఏర్పడే కణసముదాయాలు. ఇవి రకరకాల సైజుల్లో ఉంటాయి, మలద్వారం బయట కూడా ఇవి పెరగొచ్చు. ఇది తీవ్ర సమస్య కాదు, ఎందుకంటే సాధారణంగా వాటంతట అవే తగ్గిపోతాయి. కానీ, గుర్తించాల్సిన విషయం ఏంటంటే, కొన్నిసార్లు మొలల సమస్యను తగ్గించుకునేందుకు ఆపరేషన్ కూడా అవసరం అవుతుంది. సాధారణంగా మొలలు జన్యు కారణాలు, వృద్ధ్యాప్యంకి చేరుకుంటున్నకొద్దీ ఎక్కువ అవుతుందని చెబుతారు. గర్భవతుల్లో సమస్య ఎక్కువగా ఉంటుంది. తరచుగా పొట్ట భాగంలో వచ్చే ఒత్తిడి వల్ల మలద్వారం దగ్గరి సిరలు పొంగి, వాచి మొలలుగా మారతాయి. ఊబకాయం ప్రధాన కారణంగా చెప్పవచ్చు. మరో ముఖ్యకారణం, ఆహారపు అలవాట్లు. మన జీవనశైలిలో ఆహారం చాలా ముఖ్యమైన అంశం, అనారోగ్యకరమైన ఆహారం తినటం వల్ల అనేక ఆరోగ్యసమస్యలు వస్తాయి. మొలలు కూడా వాటిల్లో ఒకటి.

చాలామందికి మొలల సమస్య ఉందని కూడా తెలియదు. కొన్ని లక్షణాలతో సమసయని గుర్తించొచ్చు. మలద్వారం వద్ద నొప్పి, రక్తస్రావం చాలా సాధారణం. చాలామందికి మలద్వారం వద్ద వాపు లేదా పెద్ద బొడిపెలలాగా పెరుగుతాయి.. వాటినే పైల్స్ అంటారు. ఈ సమస్య కారణంగా దురద, స్రావం కూడా సాధారణమే.

అదృష్టవశాత్తూ, ఈ సమస్యకి పరిష్కారం మన ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి.. మనం బాధపడాల్సిన అవసరం లేదు.

పైల్స్ తగ్గించే నవీన్ సలహాలు  ఇవే..

ఆయుర్వేద నిపుణులైన బిఎన్ సిన్హా మొలలకి ఏకైక కారణం మలబద్ధకమని అందుకు గల కారణాలు తెలిపారు. ఎక్కువగా కూర్చుని పనిచేసేవారికి ఇది మరింత సాధారణం. ఏ రకమైన వ్యాయామం చేయని వారికి, శరీరం కదపని వారికి ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.

2-3 వారాల వ్యవధిలోనే సమస్యని మెరుగుపర్చే ఇంటి చిట్కాలు :

1) త్రిఫల చూర్ణం పొడి – మొలల సమస్యకి ప్రధాన కారణం మలబద్ధకం. కాబట్టి త్రిఫల చూర్ణం పొడిని క్రమం తప్పకుండా తీసుకుంటే మలబద్ధకం తగ్గుతుంది, అలాగే పైల్స్ కూడా పెరగకుండా ఉంటాయి.


ఎలా వాడాలి? 4గ్రాముల త్రిఫల పొడిని వేడినీటిలో కలిపి ప్రతిరోజూ నిద్రపోయేముందు తీసుకోమని బిఎన్ సిన్హా సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా తీసుకుంటే అద్భుత ఫలితాలు ఉంటాయి. .

2) ఆముదం నూనె- ఆముదంలో యాంటీఆక్సిడెంట్లు, ఫంగస్, బ్యాక్టీరియా అలాగే వాపు వ్యతిరేక లక్షణాలు కూడా ఉన్నాయి. అందుకనే ఇది మొలల పరిమాణాన్ని, నొప్పిని తగ్గించటంలో సాయపడుతుంది.


ప్రతిరోజూ రాత్రిపూట పాలల్లో 3 ఎంఎల్ ఆముదం నూనెను కలిపి తీసుకోమని బిఎన్ సిన్హా సూచిస్తున్నారు. అలాగే మొలల ప్రాంతంలో కూడా ఈ నూనెను రాయాలి. బయటనుండి నూనెను రాయడం, లోపలకేమో పాలలో కలిపి తీసుకోవటం వలన అది ప్రభావవంతంగా నొప్పి, ఇతర మొలల లక్షణాలను తగ్గిస్తుంది.

3) రాత్రిపూట అధిక భోజనం వద్దు –మనం ప్రస్తుతం అనుభవిస్తున్న అన్ని ఆరోగ్య సమస్యలకి మూలం మన ఆహారపద్ధతులే. మొలలను కారణమయ్యే మలబద్ధకాన్ని ముందుగా తగ్గించాలి. అందుకు తగ్గ ఆహారాన్నే తీసుకోవాలి. అలా అని ఎక్కువ పీచుపదార్థమే (ఫైబర్) ఉన్న ఆహారం తీసుకోకూడదు. పీచు పదార్థానికి ఆహార పరిమాణాన్ని పెంచే లక్షణం ఉంది. అందుకని దానికి దూరంగా ఉండాలి. అలాగే ఎక్కువగా విరోచనకారులైన పదార్థాలు తింటే మలం మరీ పల్చగా మారి, మొలలతో బాధపడుతున్నవారికి అసౌకర్యంగా మారుతుంది. బాగా వేయించిన పదార్థాలు హెమరాయిడ్లను (మొలలను) మరింత తీవ్రతరం చేస్తాయి. అవి జీర్ణవ్యవస్థను మందగించేలా చేసి,ప్రేగులు సరిగ్గా పనిచేయనివ్వకుండా చేసి, లోపలి వాపులను పెంచుతాయి. దీనివల్ల మరింత చికాకుగా, నొప్పిగా ఉంటుంది. రాత్రి పూట అధికభోజనం, ఎక్కువ కారాలు, మసాలాలు ఉన్న పదార్థాలు తీసుకోకూడదు. ముఖ్యంగా రక్తస్రావం ఉన్న పైల్స్ కి అయితే ఇవి భరించలేని బాధని కలిగిస్తాయి. అందుకని కేవలం ఆరోగ్యకరమైన,తేలికైన ఆహరాన్నే తీసుకోండి.


4) నీరు ఎక్కువగా తాగడం – పైల్స్ ని అరికట్టడానికి ఇది చాలా సులభ పద్ధతి. సరిపడినంత నీరు తీసుకోవటం, అలాగే మంచి ఆరోగ్యకరమైన ఆహారం వలన ప్రేగులు కూడా చక్కగా పనిచేస్తాయి. ఎక్కువ నీరు తాగటం వలన మలబద్ధకం, దాని ద్వారా పైల్స్ రెండూ నివారించబడతాయి. రోజూ 8-10 గ్లాసుల నీరు తాగితే జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. నివారణే చికిత్స కన్నా మెరుగైనది అని అంటుంటారు కదా, మరి ఈ సింపుల్ చిట్కాని అమలుచేసి ఆరోగ్యకర జీవనశైలితో మీరెందుకు జీవించకూడదు?

5) సలాడ్లు – మొలలతో బాధపడేవారు... ప్రతిరోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన వెంటనే దోసకాయ వంటి సలాడ్లను తినమని సలహా ఇస్తున్నారు బిఎన్ సిన్హా. క్యారట్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఇంకా వాపు వ్యతిరేక లక్షణాలు ఉంటాయి, ఇవి మొలలను తగ్గించటంలో సాయపడతాయి. వీటిలోని విటమిన్ సి, కె లు రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

6) ఇంగువ – మొలల సమస్య ఉన్నవారిని రోజువారీ ఆహారంలో ఇంగువను చేర్చుకోవడం మంచిదని చెబుతున్నారు బిఎన్ సిన్హా. అది కూరల్లోనైనా వేసుకోవచ్చు. లేదా గ్లాసు నీటిలోనైనా కలుపుకుని తాగొచ్చు. మన దేశవాళీ వంటదినుసు అయిన ఇంగువకి కొన్ని జబ్బులను నయం చేసే గుణం ఉంది. ఇది జీర్ణక్రియని మెరుగుపరిచి మొలల సమస్యని కూడా తగ్గిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:


నిర్ధారణ పరీక్షలు : సీబీపీ, ఈఎస్సార్‌, ఫిస్టులోగ్రామ్‌, ఎంఆర్‌ఐ, సీటీస్కాన్‌, కొలోనోస్కోపీ మొదలైన నిర్ధారణ పరీక్షల ద్వారా వ్యాధి తీవ్రతను గుర్తించవచ్చు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు : సరైన పోషకాహారం తీసుకోవడం, ఆహారంలో పీచు పదార్థాలు అధికంగా ఉండేటట్లు చూసుకోవడం, మాంసాహారం తక్కువగా తినడం, మలవిసర్జన ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఉండే విధంగా చూసుకోవటం, సరైన వ్యాయామం చేయడం, ఊబకాయం రాకుండా చూసుకోవటం మేలు.
హోమియో వైద్యం : జెనెటిక్‌ కాన్‌స్టిట్యూషనల్‌ ట్రీట్‌మెంట్‌ ద్వారా పైల్స్‌, ఫిషర్స్‌, ఫిస్టులా, మలబద్ధకం వంటి సమస్యలను సంపూర్ణంగా నయం చేయవచ్చు. ఈ సమస్యలు మళ్లీ తిరగబెట్టకుండా హోమియో వైద్యం తోడ్పడుతుంది.


పాటించాల్సినవి-పాటించకూడనివి
నీరు ఎక్కువగా తాగాలి. జంక్ ఫుడ్, ఉప్పు, కారం అధికంగా ఉండే ఆహార పదార్థాలు తగ్గించాలి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.

పడుకునే ముందు ఒకగ్లాసు వేడి పాలను తాగడం వల్ల మర్నాడు ఉదయం మలవిసర్జన సాఫీగా అవుతుంది.

మలబద్దకం ఉన్నవారు వేడి పాలలో కొంచెం ఆముదం కలుపుకుని తాగవచ్చు.

రోజులో మూడుసార్లు వేడినీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగితే మలబద్దకం సమస్య తగ్గిపోతుంది.

మలబద్దకం ఉన్నవారు తేలికగా జీర్ణమయ్యే పండ్లు, కాయగూరలు, సలాడ్లు, తాజా ఆహార పదార్థాలు తీసుకోవడం మేలు చేస్తుంది
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
విశాఖపట్నం 
9703706660

*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

కామెంట్‌లు లేవు: