24, ఆగస్టు 2020, సోమవారం

విషం త్రాగిన వాళ్లకు తీసుకో వలిసిన జాగ్రత్తలు

🛑 ఎవరైనా విషం తాగితే 
......................................

డాక్టర్ దగ్గరకు వెల్లెలోపో,
డాక్టర్ వచ్చేలోపో ఈ పనులు చేయండి..

కుదిరితే అతను ఏం విషం తాగాడు అనేది ఒక వేళ అక్కడ బాటిల్ కనిపిస్తే పక్కన పెట్టండి(డాక్టర్ కి చూపించటానికి)

🛑 పేషేంట్ స్పృహ లో లేకపోతే
..............................................

పేషేంట్ ని బోర్లా పడుకోపెట్టి 
(తల కింద దిండు పెట్టకూడదు)
తలను ఒక పక్కకు తిప్పి ఉంచాలి..
 
అలా చేయటం వలన వాంతి అయి గాలి పీల్చు ద్వారం లోనికి పోకుండా ఉంటుంది..

అలా పడుకోపెట్టటం వల్ల నాలుక కూడా ఊపిరి మార్గానికి అడ్డుపడదు..

అలాఅయితే ఊపిరి తీసుకోవటానికి వీలవుతుంది..

పేషేంట్ కి వాంతి ఎక్కువగా ఉంటే ఒక కాలు ని ముందుకు వంచి ఉంచాలి.. 

అంటే, తను ఒక పక్కకు పడుకున్నట్టుగా.. కాలు వంచి ఒక దిండును రొమ్ము క్రింద ఉంచాలి..

ఆ వ్యక్తికి ఊపిరి తక్కువ ఆడుతుంటే..
వెంటనే ఊపిరికోసం తన ఛాతి ని నొక్కటం
మొదలుపెట్టాలి..(పేషేంట్ ని బోర్లా పడుకోపెడతాం  కాబట్టి ఛాతి ప్రెస్ అయ్యేలా వీపుని నొక్కాలి)
డాక్టర్ వచ్చేవరకు ఇలా చేయటం మానకూడదు..

🛑 ఒకవేళ పేషేంట్ విషం తాగినా కూడా స్పృహలో ఉన్నట్లయితే
........................................................................... 

రెండు వేళ్ళు గొంతులో వరకు పెట్టించి వాంతి చేయించండి..

అప్పటికి వాంతి కాకపోతే..

రెండు పెద్ద గరిటెల ఉప్పును ఒక గ్లాస్ నీళ్ళలో కలిపి తాగించాలి..

🛑నోట్-  పేషేంట్ ఆసిడ్ లాంటివి తాగి మూతి కాలి వున్నప్పుడు..

చర్మము మీద పసుపు లేక బూడిదరంగు మచ్చ లేర్పడినప్పుడు..

వాంతి చేయించడానికి ప్రయత్నించకూడదు..
గమనిక :పాము కరిచితే కచ్చితంగా మూడు గంటలకు లో ఇంజక్షన్ వేయాలి 
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
విశాఖపట్నం 
9703706660

*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ గ్రూపులో  పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

కామెంట్‌లు లేవు: