మైగ్రేన్, తలనొప్పి: లక్షణాలు, చికిత్సా విధానం అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 

మైగ్రేన్ తలనొప్పి

అప్పుడే ఆఫీసు నుంచి ఇంట్లో అడుగు పెట్టిన మూర్తి తలపట్టుకుని కుర్చీలో కూలబడ్డాడు."అయ్యో ఏమైందండీ"అంది అరుణ గాబరాగా..

"ఏంలేదు తలనొప్పి "అన్నాడు మూర్తి."పదండి డాక్టర్ దగ్గరకి వెళదాం"అంటుంటే "వద్దులే, అదే తగ్గిపోతుంది, మాత్ర వేసుకుంటా "అన్నాడు మూర్తి." లేదండీ.. ఈ మధ్య తరచూ ,తలనొప్పి అంటున్నారు" అని బలవంతంగా డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్లింది అరుణ.

డాక్టర్ వివరాలన్నీ అడిగి,బి.పి,షుగర్ చెక్ చేసి,తలకి స్కాన్ కూడా తీసి,అది "టెన్షన్ హెడ్ ఏక్ "అనీ పని చేసేచోట ఒత్తిడి ఎక్కువగా వుండటం, కంప్యూటర్ వాడేటప్పుడు, ఒకే పొజిషన్లో కూచోవడం,అపసవ్య పధ్ధతిలో కూచోవడం ఇవన్నీ కారణమయి వుండవచ్చని వివరించాడు.

మందులతో పాటు కొన్ని సూచనలు కూడా ఇచ్చాడు.

వంటింట్లో పోపు పెడుతున్న ప్రియాంకకి ఉన్నట్టుండి ధనధనమనితలలో సుత్తులతో మోదుతున్నట్టు నొప్పి మొదలయింది. ఈ మధ్య కొన్ని వాసనలు తగిలినప్పుడూ, కొన్ని రకాలయిన ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడూ తలకు ఒక పక్కనే నొప్పి మొదలయి రెండు మూడు రోజులు నిలబడిపోతోంది. ఏ విధమయిన శబ్దం విన్నా, వెలుతురు చూసినా చికాకుగా వుంటోంది. తలనొప్పితో పాటు వాంతులు కూడా అవుతున్నాయి. కంగారు పడి హాస్పిటల్ కి వెళితే ,వాళ్లు అన్ని రకాలుగా పరీక్షించి "పార్శ్వ నొప్పి "(మైగ్రేన్ )అని చెప్పారు. కొన్ని రకాలయిన మందులు వాడమని చెప్పి పరిసరాలూ ,మనసూ కూడా ప్రశాంతంగా వుంచుకోవాలని సూచించారు.

మూడు రోజులక్రితం, యాక్సిడెంట్లో తలకు దెబ్బ తగిలిన మాధమరావు బాగానే తిరుగుతూ తిరుగుతూ హఠాత్తుగా తీవ్రమయిన తలనొప్పితో బాధ పడుతూ,స్పృహ కోల్పోతే కంగారుగా హాస్పిటల్లో చేర్చారు. పరీక్షల్లో తేలిందేమంటే తలకి తగిలిన దెబ్బ వలన మెదడులో రక్తం గూడు కట్టిందనీ, వెంటనే ఆపరేషన్ చేయాలనీ లేకపోతే ప్రాణప్రమాదమనీ.

వీరి ముగ్గురి కథలూ ఇలా వుంటే డాక్టర్ కిరణ్ కథ పూర్తిగా వేరుగా వుంది. అతను ఏ దురలవాట్లూ లేని ఆరోగ్యంగా తిరిగే యువ డాక్టర్. అతని భార్యకూడా డాక్టరే. ఒక పది రోజులుగా సన్న గా వేధించే తలనొప్పిని లెక్క చేయకుండా బిళ్లలేసుకుని రోగులను చూస్తూ, వైద్యం చేస్తూనే వున్నాడు.

హఠాత్తుగా ఒక రోజు వాంతులయి ,ఫిట్స్ కూడా రావడంతో చాలా ఆందోళనకు గురయి న్యూరాలజిస్ట్ ని సంప్రదిస్తే సి.టి.స్కాన్ తీసి"బ్రెయిన్ ట్యూమర్ "అని నిర్థారించి, అప్పటికే అడ్వాన్స్డడ్ స్టేజ్ లో వుందన్నారు.

దీనిని బట్టి అర్థం చేసుకోవలసిందేమంటే తలనొప్పికి సాధారణమైన ,ప్రమాదంలేని కారణాలతో బాటు (ఉదా,,,,ఒత్తిడి ,ఆందోళన),అసాధారణమైన,ప్రమాదకరమైన జబ్బులు కూడా కారణమై వుండవచ్చని.

వయసు, జాతీ, వర్గం, జెండర్, భేదం లేకుండా ప్రతి ఒక్కరినీ పట్టి పీడించే ఆరోగ్య సమస్య ఈ తలనొప్పి.

అసలు జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో దీని బారిన పడకుండా వుండరు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క ప్రకారం ప్రపంచ జనాభాలో సగం మంది కనీసం సంవత్సరానికొక సారయినా దీని బారిన పడుతూ వుంటారంటే ,ఇది ఎంత కామన్ గా వచ్చే సమస్యో అర్థం అవుతుంది కద

తలనొప్పి అంటే ఏమిటి? అది ఎలా ,ఎందుకు వస్తుంది? దానిలో రకాలేమైనా వున్నాయా?

తల భాగంలో కలిగే బాధనే తలనొప్పి అంటారు.తల చుట్టూ వుండే కండరాలూ, రక్తనాళాలూ, నరాలూ, కపాలంలో వుండే ఎముకల పై పొరా ,బ్రెయిన్ ని చుట్టుకుని వుండే "మెనింజెస్ "అనే పొరలూ,ఇవన్నీ నొప్పిని తెలియజేసే రిసెప్టార్స్ ని కలిగి వుంటాయి.

మరీ ముఖ్యంగా మెదడు అడుగు భాగం ఈ నొప్పికి తీవ్రంగా స్పందిస్తుంది. విచిత్రంగా మెదడులో పెయిన్ రిసెప్టార్స్ లేని కారణం వల్ల,మెదడుకి దెబ్బతగిలినా,కోసినా కూడా నొప్పి తెలియదు.

వాపు కారణం గానో ,కణుతుల కారణంగానో అది వ్యాకోచించి ఒత్తిడి పెరిగినపుడు మాత్రమే నొప్పి తెలుస్తుంది.

తల నొప్పి ఎలా వస్తుందంటే, యేదయినా దెబ్బ తగిలినపుడు పెయిన్ రిసెప్టార్స్ స్పందించి,అక్కడున్న నాడీ కణాలలో తీవ్రమయిన స్పందనలని కలగ జేస్తాయి, తద్వారా పెప్టయిడ్స్, సిరటోనిన్ అనే పదార్థాలు అనే పదార్థాలు విడుదలవుతాయి. ఇవి మెదడు పొరలలోనూ,రక్తనాళాలలోనూ,వాపుని కలగ జేస్తాయి. రక్తనాళాలు వ్యాకోచిస్తాయి కూడా .ఈ కార్యక్రమమంతా నొప్పిని మెదడుకు తెలియ జేస్తుంది. కొన్ని రకాల మందులు ఈ సిరటోనిన్ ని బ్లాక్ చేయడం ద్వారా తలనొప్పిని తగ్గిస్తాయి

నిద్రపోతున్న యువతి

తలనెప్పులూ రకాలూ

IHS ఇంటర్నేషనల్ హెడ్ ఏక్ సొసైటీ వారు తలనెప్పులని ప్రధానంగా రెండు రకాలుగా విభజించారు.

  • ప్రయిమరీ హెడేక్స్
  • సెకండరీ హెడేక్స్

ప్రయిమరీ హెడేక్స్ తల చుట్టూ వుండే కండరాలలోనూ, రక్తనాళాలలోనూ, నరాలలోనూ యేదైనా వత్తిడి కలిగినపుడూ లేదా యేదైనా దెబ్బ తగిలినప్పుడూ వచ్చే తలనెప్పులు.

ఇవి 20-40 సంవత్సరాల వయసులో వస్తూ వుంటాయి.

తలనెప్పులలో తొంభై శాతం నెప్పులు ప్రయిమరీ హెడేక్సే.

ఇవి తరచూ వస్తూ పోతూ వుంటాయి. ప్రమాదంలేనివి. వీటికి యే ఇతర జబ్బులూ కారణం కాదు. ఇందాక చెప్పుకున్నట్టు మెదడులో జరిగే రసాయనిక చర్య వీటికి కారణమని భావిస్తున్నారు.

కారణాలు

  • అలసట, శారీరకంగా గానీ ,మానసికంగా గానీ కలిగే ఒత్తిడి
  • నిద్రలేమి
  • అతినిద్ర
  • ఎక్కువగా ఏడవటం ,వేదన చెందడం
  • డీహైడ్రేషన్
  • మలబధ్ధకం
  • కంప్యూటర్ల ముందూ,ఆఫీసులోనూ,పని చేసే చోట ఒకె పొజిషన్లో ఎక్కువ సేపు కూచోవడం వలన కండరాలు పట్టేయడం.
  • ఇవి సర్వ సాధారణ మయిన కారణాలు.
  • మళ్లీ ప్రయిమరీ హెడేక్స్ ని మూడు రకాలుగా విభజించ వచ్చు అవి టెన్షన్ హెడేక్స్ , క్లస్టర్ హెడేక్స్ , మైగ్రేన్ లేక వాస్క్యులర్ హెడేక్స్.
  • టెన్షన్ హెడేక్: ఇది చాలా కామన్ గా వచ్చే తలనొప్పి. ప్రతి యేటా ప్రపంచ జనాభాలో 1.6 బిలియన్ల మంది దీని బారిన పడుతూ వుంటారు. ఇది ఆడవాళ్లలో ఎక్కువగా కనపడుతుంది.
  • శారీరక లేదా మానసిక ఒత్తిడి ముఖ్య కారణం.
  • లక్షణాలు: తలచుట్టూ బిగించినట్లుగా, టైట్ గా అనిపిస్తుంది.
  • సాధారణంగా మధ్యాహ్నం పూట వస్తుంది.
  • మెడ నుండీ,తలకు గానీ,తల నుండీ మెడకు గానీ వ్యాపిస్తుంది.
  • కొన్ని గంటలనుండీ కొన్ని రోజుల వరకూ వుండవచ్చు.

క్లస్టర్ హెడేక్స్: ఇవి మగ వారిలో ఎక్కువ కనపడతాయి. తలకు ఒక పక్కన వస్తుంది, ఒక కంటి చుట్టూ నొప్పిగా వుంటుంది, కన్ను ఎర్రబడటం, నీరు కారడం. ఒక్కొక్క సారి కన్ను మూతబడటం,బుగ్గ వాచడం కూడా జరగ వచ్చు.

ఈ తలనొప్పి రోజులో అప్పుడప్పుడూ వచ్చిపోతూ ఉంటుంది.

అలా కొన్ని వారాలూ, నెలలూ కనపడి మళ్లీ కొంతకాలం అసలు కనపడక పోవచ్చు, అందుకే వీటిని "క్లస్టర్ హెడేక్స్ "అంటారు.

ఇవి రావడానికి కారణం "హైపోథలామస్ "(బయలాజికల్ క్లాక్ )లో యేర్పడినఅసాధారణ పరిస్థితి అని భావిస్తున్నారు

ప్రతి యేటా ఒక మిలియన్ పైగా దీని వలన బాధ పడుతున్నారు.అందువలన విలువైన పనిగంటలు నష్టపోవలసి వస్తుంది.దీనికి చికిత్స "ట్రిప్టాన్ "గ్రూపు మందులు వాడటం

మైగ్రేన్ లేక వాస్క్యులర్ హెడేక్ : దీనినే పార్శ్వనేప్పి అంటారు. ఇది చాలా తీవ్రమయిన నొప్పి. తలకు ఒక పక్కనే వస్తుంది. ఏటా 848 మిలియన్ల మంది ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్యతో బాధ పడుతున్నారు.

నొప్పి లక్షణం: ధన్ ధన్ మని కొట్టుకుంటున్నట్టూ,సుత్తులతో మోదుతున్నట్టూ వుంటుంది ,దీనినే "థ్రాబింగ్ లేక పల్సటైల్ హెడేక్ "అంటారు.ఇది ఆడవారిలో ఎక్కువగా కనపడుతుంది.

తలనొప్పితో పాటు వికారం ,వాంతులూ వుంటాయి,కాంతినీ ,శబ్దాలనీ తట్టుకోలేక పోవడం,చీకటినీ,నిశ్శబ్దాన్నీ కోరుకోవడం దీని లక్షణాలు.

కొన్ని గంటల నుంచి కొన్నిరోజులపాటు వేధిస్తుంది. పని గంటలు నష్టపోవడానికి కూడా కారణమవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా అనారోగ్యంతో పనిమానెయ్యడానికి ఆరవ ప్రధాన కారణంగా మైగ్రేన్ నిలుస్తోందని స్టాటిస్టిక్స్ చెబుతున్నాయి.

కారణం: జెనెటిక్ కారణాలతో పాటు , పరిసరాలూ వాతావరణ పరిస్థితులూ కూడా ప్రభావం చూపుతాయంటున్నారు.

కొంతకాలం క్రితం మెదడులోని రక్త నాళాలలో కలిగే మార్పులు కారణం అనుకునే వారు,ఇప్పుడు నరాల పనితీరు సక్రమంగా లేకపోవడం మైగ్రేన్ కి కారణమని భావిస్తున్నారు,అలా వాస్క్యులర్ థీరీ వెనక్కు వెళ్లిపోయింది.

మైగ్రేన్ తలనొప్పి కి ముందు గా హెచ్చరించే సూచనలు

  • కళ్ల ముందు జిగ్ జాగ్ లైన్లు కనపడటం
  • కళ్లు చీకట్లు కమ్మడం
  • కళ్ల ముందు వెలుతురు
  • కళ్లలో నీళ్లు రావడం
  • కళ్లెర్ర బడటం
  • చెవులలో శబ్దాలు
  • మాట్లాడలేకపోవడం
  • శరీరం ఒక పక్క సూదులు గుచ్చినట్టు వుండటం

ఇన్వాలెంటరీ జెర్కీ మూవ్‌మెంట్స్

ఈ లక్షణాలు మైగ్రేన్ తలనొప్పి రాబోతోందని సూచిస్తాయి వీటినే "ఆరా "అంటారు.

  • ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్
  • కొన్ని రకాల ఘాటైన వాసనలూ
  • కొన్ని రకాల ఆహార పదార్థాలూ
  • నిద్రలేమి
  • మలబధ్ధకం
  • ఒత్తిడి
  • ప్రీ మెన్సట్రువల్ టెన్షన్
  • ఆల్కహాల్ ముఖ్యంగా రెడ్ వైన్
  • స్మోకింగ్
  • ఇవన్నీ మైగ్రేన్ తలనొప్పిని ప్రేరేపిస్తాయి వీటినే ట్రిగ్గర్ ఫాక్టర్స్ అంటారు.
  • మైగ్రేన్ వచ్చి తగ్గిన వెంటనే కూడా మందకొడిగానో,అత్యుత్సాహంగానో ,డిప్రెషన్ గానో కనిపించవచ్చు, నీరసం, నిస్త్రాణ, మూడీగా వుండటం కూడా జరగవచ్చు.

మైగ్రేన్ ని మళ్లీ మూడు రకాలు గా కూడా విభజిస్తారు

క్లాసికల్ మైగ్రేన్ : ఆరా "లక్షణాలుంటాయి , తలనెప్పీ, వాంతులుంటాయి

కామన్ మైగ్రేన్ : "ఆరా "వుండదు ,తలనెప్పీ , వాంతులుంటాయి

కాంప్లికేటెడ్ మైగ్రేన్ : నరాలలో చచ్చు వచ్చినట్టుంటుంది (న్యూరలాజికల్ డెఫిసిట్ )

ప్రివెన్షన్ లేక మైగ్రేన్ రాకుండా నిరోధించడం ఒకనెలలో నాలుగు అటాక్స్ కంటే ఎక్కువ వస్తే ,మైగ్రేన్ రాకుండా నిరోధించేందుకు మందులు వాడతారు

సెకండరీ హెడేక్స్: ఇవి శరీరంలోని కొన్ని వ్యాధుల ప్రభావం వలన కలిగే తలనెప్పులు.

జ్వరాలు, వైరల్ ,బాక్టీరియల్ ,టి.బీ,లేదా చీము గడ్డల వలన వచ్చే జ్వరాలు

తలకు, బలమైన దెబ్బ తగిలి నప్పుడు----బ్రెయిన్లో రక్తం గూడు కట్టినా,కపాలం ఎముక చిట్లినా, రక్తస్రావమయినా, కంకషన్ ఇంజురీ (అంటే అదురు దెబ్బ)అయినా

పళ్లకి సంబంధించిన వాపులూ,దెబ్బలలోనూ

కళ్లు: దృష్టి దోషాలూ,ట్యూమర్లూ,అక్యూట్ కంజెస్టివ్ గ్లాకోమా

చెవి సమస్యలలో: వాపులూ, చీముగడ్డలూ

ముక్కు సమస్యలలో: ఇందులో ముఖ్యంగా చెప్పుకోవలసింది "సైనసైటిస్ "లో వచ్చే "సైనస్ హెడేక్ " నుదురు దగ్గర,ముక్కు మొదట,బుగ్గల ఎముకల దగ్గర నొప్పి అనిపిస్తుంది,ముందుకు వంగినా దగ్గినా తుమ్మినా ఎక్కువ అవుతుంది.

జీర్ణాశయ సమస్యలు, వాంతులు,విరోచనాలు,

బి.పి ఎక్కువయినప్పుడు

బ్రెయిన్ ట్యూమర్ ,ఇతర కాన్సర్లలో తలనెప్పే ప్రధాన లక్షణం

స్ట్రోక్ లో బ్రెయిన్ స్ట్రోక్ లో తలనొప్పి ఎక్కువగా వుంటుంది

గర్భిణీ లో తలనెప్పీ, బి.పి పెరగడం గుర్రపు వాతానికి దారి తీస్తాయి.

చిన్న పిల్లలలో అంటే 10-20మధ్య వయసు వారిలో మెదడులో చేరిన పురుగుల గుడ్లు తలనొప్పికీ,ఫిట్స్‌కీ కారణమవు తాయి

మెనింజైటిస్,ఎన్ సెఫలైటిస్ వీటిలో తీవ్రమైన తలనొప్పి వుంటుంది.

నిద్ర లేమి సమస్యలు

కొన్ని విచిత్రమైన తలనెప్పులు

  • ప్రయిమరీ కాఫ్ హెడేక్: తీవ్రమైన దగ్గుతెర వచ్చాక కానీ, తుమ్ములు వచ్చాక కానీ వచ్చే తీవ్రమైన తలనొప్పి
  • ప్రయిమరీ ఎక్జర్షనల్ హెడేక్: వ్యాయామం తర్వాత వచ్చే తలనొప్పి
  • ఐస్క్రీమ్ హెడేక్‌: చాలా చల్లగా వున్న ఆహార పదార్థాలని త్వరగా తినడం వలన వచ్చే తలనొప్పి.
  • రిబౌండ్ హెడేక్‌: తలనొప్పి మందులు ఎక్కువగా వాడి హఠాత్తుగా ఆపేయడం వలన కలిగే తలనొప్పి
  • ప్రయిమరీ సెక్స్ హెడేక్: సంయోగం తర్వాతా, సుఖప్రాప్తి సమయంలోనూ వచ్చే తలనొప్పి .అప్పుడప్పుడూ దీనికి సబ్ అరఖ్నాయిడ్ హెమరేజ్ కారణమవుతూ వుంటుంది. అందుకే అశ్రధ్ధ చేయగూడదు.

అయితే తల నెప్పులు సాధారణ కారణాల వలన ,వస్తున్నాయా? లేక అసాధారణమైన ,ప్రమాదకరమైన జబ్బుల వలన వస్తున్నాయా తెలుసుకుని ,జాగ్రత్తగా తగిన పరీక్షలు చేసి వ్యాధిమూలాలను అన్వేషించి తగిన చికిత్స ఇవ్వడం వలన ప్రాణప్రమాదాలను తప్పించవచ్చు.

తలనొప్పి తో బాటు ఈ కింది లక్షణాలు కనపడితే తప్పనిసరిగా,ఆ తలనొప్పి కారణాన్ని శోధించాలి

  • జ్వరం వుండడం
  • బరువు తగ్గడం
  • నలభై యేళ్ల వయసు తర్వాత తలనొప్పి రావడం
  • కాన్సర్ ,హెచ్ .ఐ.వి లాంటి వ్యాధులు వుండడం
  • హఠాత్తుగా తలనొప్పి తీవ్రమవడం
  • తలకి దెబ్బ తగిలాక తలనొప్పి రావడం
  • స్పృహ కోల్పోవడం
  • ఫిట్స్ రావడం
  • కాళ్లూ చేతులూ చచ్చుబడటం

వ్యాధి నిర్థారణ

తలనొప్పి అనేది నిజం చెప్పాలంటే జబ్బు కాదు .అనేక జబ్బులలో కనపడే ఒక లక్షణం. రోగితో మాట్లాడి ,వ్యాధి లక్షణాలు సమగ్రంగా తెలుసు కోవడం వలన చాలావరకూ వ్యాధి నిర్థారణ జరిగిపోతుంది అంటే అది ప్రయిమరీ హెడేకా?,సెకండరీ హెడేకా? అనేది అవగాహనవుతుంది.

ప్రయిమరీ హెడేక్ కి కారణమైన శారీరక మానసిక ఒత్తిడిని తగ్గించుకోమని సలహా ఇవ్వడంతో పాటు ,పెయిన్ కిల్లర్స్ అదీ ప్రమాదం కలిగించని పారసిటమాల్ ,అసిటమైనోఫెన్ లాంటి మాత్రలు డాక్టర్ సలహాపై వాడొచ్చు

సెకండరీ హెడేక్‌లో

బి.పి చెక్ చేయడం

రక్త పరీక్షలునిర్వహించడం

న్యూరలాజికల్ పరీక్షలు నిర్వహించడం

ఎక్స్ రే పరీక్షలు

సి.టి స్కాన్

యం.ఆర్ .ఐ

సి.టి. యాంజియో గ్రామ్

ఇవన్నీవ్యాధి నిర్థారణకీ ,తలనొప్పికి మూలకారణాన్ని అన్వేషించడానికీ తోడ్పడతాయి. ఒకసారి తలనొప్పికి మూలకారణం తెలిశాక,చికిత్స సులువవుతుంది

చికిత్స

ప్రయిమరీ హెడేక్స్ ని తగ్గాలంటే పాటించాలిసిన విషయాలు

ఒత్తిడిని తగ్గించుకోవడం

రిలాక్సేషన్ టెక్నిక్స్ పాటించడం

క్రమం తప్పని వ్యాయామం. దీనివలన కండరాలు రిలాక్సవుతాయి.

వేళ తప్పని సమతుల మితాహారం

మైగ్రేన్ వున్న వాళ్లు, కొన్ని పదార్థాలు తీసుకోకూడదు. ఛీజ్ ,నట్స్ ,ఆల్కహాల్ ,స్మోకింగ్ వీటికి దూరంగా వుండాలి, తమకు పడని వాసనలకి కూడా దూరంగా వుండటం మంచిది.

రోజుకి కనీసం యెనిమిది గంటలు చక్కని ప్రశాంతమైన నిద్ర పోతే చాలా వ్యాధులు దూరంగా వుంటాయి.

గోరు వెచ్చని నీటితో స్నానం,యోగా,మెడిటేషన్ లాంటివి మానసిక ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను కలిగిస్తాయి.

ఇలా జీవన శైలిలో మార్పులు చేసుకోవడంతో పాటు అవసరమైతే డాక్టర్ సలహాతో ప్రమాదంలేని పెయిన్ కిల్లర్స్ ని యెంచుకుని వాడాలి.

చిన్నపిల్లలలో యాస్పిరిన్ వాడకూడదు.

మైగ్రేన్ తలనెప్పులుండే వాళ్లు ప్రశాంతంగా చీకటి గదిలో చల్లని వాతావరణంలో సేదదీరడంతో పాటు, సుమా ట్రిప్టాన్ ,ఆమ్లో ట్రిప్టాన్ , తోపాటు ట్రైసైక్లిక్ యాంటీ డిప్రెసెంట్స్ ని చికిత్సకోసమూ,తరచూ ఎటాక్స్ రాకుండా ప్రొఫైలాక్టిక్ గానూ కూడా వాడవచ్చు.

ఇంకా ఇతర లక్షణాలను బట్టి మందులు వాడుకోవాలి అంటే వాంతులవుతుంటే వాంతుల మందులు వాడటం అలా..

మెనింజైటిస్ ,బ్రెయిన్ ట్యూమర్ ఇంకా ఇతర జబ్బులవలన వచ్చే తలనెప్పులకి ,ఆయా వ్యాధులకి తగిన చికిత్స చేయడం ద్వారా తలనొప్పిని నివారించవచ్చు.

ఇంకా ఇతర లక్షణాలను బట్టి మందులు వాడుకోవాలి అంటే వాంతులవుతుంటే వాంతుల మందులు వాడటం అలా .మెనింజైటిస్ ,బ్రెయిన్ ట్యూమర్ ఇంకా ఇతర జబ్బులవలన వచ్చే తలనెప్పులకి ,ఆయా వ్యాధులకి తగిన చికిత్స చేయడం ద్వారా తలనొప్పిని నివారించవచ్చు.


తలనొప్పి


రక్తపోటు పెరగడం (హై - బిపి /హైపర్ టెన్షన్)

 

“తలనొప్పిగా ఉంది. ఈ రోజు ఇహ పని చేయలేను" అనే మాటను మనం అనేక సందర్భాలలో అనేక సార్లు అంటూ ఉంటాము. లేదా వింటూ ఉంటాము. కొంతమంది దీనిని నిస్త్రాణకు పర్యాయపదంగా కూడా వాడుతుంటారు. అయితే చాలా రకాలైన భౌతిక కారణాలూ, మానసిక పరిస్థితులూ తలనొప్పికి దారితీస్తాయనేది మాత్రం నిజం, అడుగడుగునా ఎదురయ్యే లక్షణం కాబట్టి చాలా మంది తలనొప్పిని చాలా తేలికగా తీసుకుంటారు. అదే తగ్గిపోతుందిలెమ్మని అశ్రద్ధ చేస్తారు. కొన్ని సందర్భాలలో ఇది ప్రమాదభరితమైన వ్యాధికి ప్రప్రథమ సంకేత సూచికగా ఉండే అవకాశముందని గ్రహించరు.

 

సాధారణంగా వచ్చీపోయే తలనొప్పులకు కారణాలు అత్యంత సాధారణమైనవే అయినప్పటికీ వాటిని నిర్ణయించడానికి మీకు కొంత విశ్లేషణ అవసరమవుతుంది. ఆయుర్వేద సంహితలు తలనొప్పిని 'శిరశ్మూల' అనే పేరుతో వివరించాయి. సంహితా గ్రంథాలు తలనొప్పిని కారణాలను ఆధారంగా చేసుకుని కాకుండా, దోషాలను ఆధారం చేసుకుని విభజించి వర్ణించాయి. ఇలా చేయడం వలన తలనొప్పి ఎన్ని రకాలైన కారణాలతో వచ్చినప్పటికీ వాటిని ఒకటిగా చేర్చి అధ్యయనంచేయడానికీ, లేదా చికిత్సలను చూచించడానికి వీలవుతుంది. ఇది ఆయుర్వేద ప్రత్యేకత.

 

ఉదాహరణకు కఫ, పిత్త, వాతాల వల్ల వచ్చే తలనొప్పులను చూద్దాం.

కఫం ప్రధానంగా ఉన్న తలనొప్పిలో కఫ లక్షణాలు - అంటే, తల బరువుగా ఉండటం, కళ్లనుంచి నీరు కారడం, చేవిలోపల (అభ్యంతర కర్ణం లేదా ఇన్నర్ ఇయర్ లో) వాపు జనించడం, ముక్కునుండి స్రావాలు కారడం, ముక్కులోపల శ్లేష్మపు పొరలు ఉబ్బి గాలిని అడ్డుకోవడం, పాలిప్స్ తయారవడం మొదలైనవి ఎక్కువగా ఉంటాయి. ఈ లక్షణాలు ఉదయం పూట ఎక్కువగా కనిపిస్తాయి. ప్రాతఃకాలాన శరీరంలో కఫ పేరుకుపోవడం దీనికి కారణం. అలాగే వర్షాలు పడే రోజులలోనూ, చలికాలంలోనూ, ఈ 'కఫజశిరష్శూల' ఎక్కువగా కనిపిస్తుంటుంది. భోజనం చేసిన తరువాత కూడా ఇది కనిపించడానికి అవకాశాలున్నాయి. 

 

రెండవరకమైనది శరీరంలో పిత్త దోషాన్ని ఆధారం చేసుకుని వచ్చే 'పిత్తజ శిరశ్శూల'. దీనిలో పైత్యపు లక్షణాలు (కళ్లు మంటలు పుట్టడం, తలనుంచి ఆవిర్లు చిమ్ముతున్నట్లుండటం, ముక్కునుంచి రక్తం కారడం ఇత్యాదివి) ఎక్కువగా ఉంటాయి. మిట్టమధ్యాహ్నం పూట, ఎండలు మండిపోతున్నప్పుడు ఈ రకమైన నొప్పి వస్తుంటుంది.

 

చివరిది 'వాతజ శిరశ్శూల', దీనిలో వాయువుకు ఆపాదించిన లక్షణాలు (కళ్లు తిరుగున్నట్లుండటం, కళ్లు పొడిగా ఇసుకపోసినట్లు మెరమెరలాడడం, తలలో విభిన్న ప్రదేశాలలో విభిన్న రకాలుగా నొప్పి రావడం మొదలైనవి) ఎక్కువగా కనిపిస్తాయి. ఇవే కాకుండా కొన్ని ప్రత్యేక వ్యాధులుగా సూర్యవర్తం, అనంతవాతం, శంఖకం, అర్థావభేదం అనే వ్యాధుల వివరణలు కూడా మనకు శాస్త్ర గ్రంథాలలో కనిపిస్తాయి.

 

తక్కువ నిడివితో బాధించే తలనొప్పినీ, దాని సమగ్ర రూపాన్నీ తేలికగా అంచనా వేయవచ్చు. ఉదాహరణకు, బాగా అలసిపోయినప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడూ తలనొప్పి వస్తుంది. అదే విధంగా ఒత్తిడికి లోనైనప్పుడూ, ఆదుర్దాగా ఉన్నప్పుడూ, ఎండలోనూ వడగాల్పులలోనూ తిరిగినప్పుడూ తలనొప్పి వస్తుంది. అలాగే సినిమా, టివి. కంప్యూటర్ తదితరాలను తదేకంగా చూసినప్పుడు కూడా, కంటి కండరాలు ఒత్తిడికి లోనవ్వడం వలన తలనొప్పి వస్తుంది. అంతే కాకుండా తక్కువ వ్యవధిలో ఎక్కువ స్థాయిలో వ్యాయామం చేసినా తలనొప్పి వచ్చే అవకాశముంది.

 

తలనొప్పి ఉన్నప్పుడు కొంతమంది బ్రెయిన్ ట్యూమరేమోనని అనుమానంతో కంగారు పడుతుంటారు. నిజానికి తీవ్రమైన తలనొప్పి ఉన్నప్పుడు అది బ్రెయిన్ ట్యూమర్ వంటి ప్రమాద భరితమైన వ్యాధుల వలన అయ్యే అవకాశం ఒక శాతం మాత్రం, అయితే ఆ ఒక్క శాతాన్ని ఎవరికీ వారు తమకే అన్వయించుకోవడం వల్ల అసలైన చిక్కు వస్తుంది.

 

మనం నరాల ద్వారా, మెదడు ద్వారా నొప్పిని గ్రహిస్తాము. అయితే ఈ మెదడు మాత్రం తలలోపల జనించే నొప్పిని గ్రహించలేదన్న సంగతి చాలా మందికి తెలియదు. కపాలంలోని ఎముకమ కింద ఉండే మెదడు వెలుపలి పొరలూ, వెన్నుపామూ, రక్తనాళాలూ, మెదడు గదులను వేరుపరిచే తంతు నిర్మితమైన విభాజికాలూ ఇవన్నీ మెదడులో ఏర్పడిన నొప్పిని ప్రసారం చేస్తాయి.

 

ప్రమాద సంకేతాలు:

తలనొప్పి సాధారణంగా కనిపించే లక్షణమే అయినా కొన్ని సంకేతాలు కనిపించినప్పుడు మాత్రం దానిని సీరియస్ గా తీసుకోవాలి.

ఈ క్రింద పేర్కొన్న ప్రమాద సంకేతాలను ఎప్పుడూ అశ్రద్ధ చేయకండి:

తలనొప్పి నిద్రతో తగ్గకపోవడం, పైగా నిద్రను చెడగొట్టడం. నొప్పి తీవ్రంగా, తెరలు తెరలుగా రావడం.

తలను పక్కకు తిప్పినప్పుడుల్లా నొప్పి ఎక్కువ కావటం, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నొప్పి మరింత తీవ్రరూపాన్ని దాల్చడం.

కణతలలో నొప్పి కేంద్రీకృతమై ఉండటం, ఏ పక్క కణతలో నొప్పి ఉందో అదే పక్క కంటి చూపు మసక బారటం.

35 సంవత్సరాల వయసు పైబడిన తరువాత జీవితంలో మొదటిసారిగా మైగ్రేన్ తరహా తలనొప్పి రావడం. తలనొప్పి ప్రమాదకరమైన స్థాయిలో ఉందా, లేదా అనేది అంచనా వేయడానికి ఈ కింది విషయాలు. వాటిని అనుసరించి ఉండే వివరణలూ తోడ్పడుతాయి.


టెన్షన్ తలనొప్పి:

తలనొప్పికి అత్యంత సాధారణమైన కారణమూ, ప్రధానమైన కారణమూ టెన్షనే. టెన్షన్ తలనొప్పిలో తల వెనుక ప్రాంతంలోనూ, మెడ ప్రాంతంలోనూ నొప్పి ఉంటుంది. నొప్పి కొన్ని వారాల నుంచి కొన్ని నెలల వరకు కొనసాగుతుంది. మధ్య మధ్యలో సాంత్వన లభించవచ్చుగాని, అది స్వల్పకాలికమే. తీవ్రత విషయంలో నొప్పి ఎప్పుడూ ఒకే మాదిరిగా ఉండకపోవచ్చు. నిద్రను చెడగొట్టక పోవడం ఈ తరహానొప్పి ప్రధాన లక్షణం. పైగా రాత్రంతా ప్రశాంతంగా నిద్రపోతే నొప్పి తగ్గినట్లనిపిస్తుంది. తలనొప్పి ఎలా ఉంటుందో చెప్పమన్నప్పుడు చేతులతో ఒత్తుతున్నట్లుగా ఉంటుందనీ, నలగగొడుతున్నట్లుగా ఉంటుందనీ, లేదా ఒక బిగుతైన పట్టీని తల చుట్టూ బిగించినట్లుగా ఉంటుందనీ బాధితులు చెబుతుంటారు. జాగ్రత్తగా తరచి చూస్తే ఈ తరహా నొప్పితో బాధపడే వారందరి జీవితాలలోనూ అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలూ, నిరంతరంగా రగిలే వ్యధలూ కనిపిస్తాయి. పోను పోనూ తలనొప్పి ఉన్నదన్న ఊహ కూడా తలనొప్పిని కొనసాగిస్తుంది.

 

ఒకోసారి కూర్చోవటం, పడుకోవడం, వాహనాలను నడపటం వంటివి సరైన రీతిలో చేయనప్పుడు కూడా మెడ కండరాల మీద ఒత్తిడి పడి, రక్త సరఫరాకు అంతరాయం ఏర్పడి, తలనొప్పి వస్తుంది.

 

సూచనలు:

టెన్షన్ వల్ల తలనొప్పి వస్తున్నప్పుడు జీవనశైలిని కాస్తంత మార్చుకుంటే సరిపోతుంది. ఆర్గనైజ్డ్ గా, వ్యూహాత్మకంగా ఉంటే అనవసరమైన హడావుడికి ఆస్కారం ఉండదు. విశ్రాంతిగా గడపడం, ఆయుర్వేద శాస్త్రం నిర్దేశించిన విధానంలో శరీర మర్ధనలను చేయించుకోవడం వంటి వాటి వలన మంచి ఫలితం ఉంటుంది. ఆత్మన్యూనతా భావం వల్ల తలనొప్పి వస్తున్నప్పుడు సమస్య ఎక్కడ ఉందో కనుకోనడానికి సమగ్రమైన కౌన్సిలింగ్ ఉపయోగపడుతుంది. మనసును ఆహితమైన ఇంద్రియార్థాలనుంచి మరల్చుకోవాలి. దీనికి ఆయుర్వేదంలో చెప్పిన జ్ఞాన, విజ్ఞానం ధైర్య, స్మృతి, సమాధులు తోడ్పడుతాయి. అలాగే శారీరక వ్యాయామమూ, కొన్ని ప్రత్యేకమైన ఔషధాలూ అవసరమవుతాయి.

 

ఔషధాలు:

సర్పగంధ చూర్ణం, బ్రాహ్మీఘృతం, వచాచూర్ణం, జటామాంసీ చూర్ణం, తగరు చూర్ణం.

ఇన్ఫెక్షన్లు:

తలనొప్పికి వైరల్ ఇన్ఫెక్షన్లూ, బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్లూ కారణాలవుతాయి. అధిక ఉష్ణోగ్రత వలన శరీరం నిర్జలీయంగా మారినప్పుడు తల నొప్పికి ఆస్కారం ఏర్పడుతుంది. అంతేకాకుండా సూక్ష్మక్రిములు విడుదల చేసే విషపదార్థాలు కూడా తలలోని రక్తనాళాలను వ్యాకోచపరిచి తద్వారా తలనొప్పిని కలిగిస్తాయి. ఈ స్థితిలో ప్రధానంగా రక్తనాళాలు మార్పులకు లోనవుతాయి. కనుక తలను కలిపినప్పుడూ, ముందుకు వంచినప్పుడూ రక్త ప్రసరణలో హెచ్చుతగ్గులు సంభవించి నొప్పి మరింత తీవ్రతరమవుతుంది. ఈ తరహా తలనొప్పుల్లో కీటాణు నాశక ఔషధాలను వాడాల్సి ఉంటుంది.

 

ఔషధాలు:

కర్పూరాదివటి, ఖదిరాదివటి, గంధకవటి, సంజీవనీవటి, టంకణ భస్మం, తాళ సింధూరం, వ్యాధిహరణ రసాయనం. దంత సమస్యలు: చిగుళ్ల వ్యాధులు, పిప్పిపళ్లవంటివి స్థానికంగా బాధించడమే కాకుండా నరాల ద్వారా ఎగువకు ప్రసరించి తలనొప్పిని సైతం కలిగించే అవకాశం ఉంది. వైద్య పరిభాషలో ఇటువంటి నొప్పిని 'రిఫర్డ్ పెయిన్' అంటారు. దీనిలో ప్రధాన సమస్యకు చికిత్స చేస్తే తలనొప్పి దానంతట అదే తగ్గిపోతుంది.


గృహచికిత్సలు:

1. ఇంగువను పొంగించి వేడిగా వున్నప్పుడు పిప్పి పన్ను మీద ఉంచాలి. 2. అన్న భేది, పొంగించిన ఇంగువ, పటిక వీటిని మెత్తగా నూరి ఉండలాగ చేసి నొప్పిగా వున్న దంతంపైన ఉంచాలి. 3. సుగంధిపాల ఆకును నూరి పిప్పి పంటిమీద వుంచాలి. 4. తుమ్మ బంకనుగాని, మునగచెట్టు బంకనుకాని పిప్పి పన్నుమీద వుంచాలి. 5. జెల్లెడు పాలను సేకరించి కాటన్ బడ్ ను ముంచి పన్ను మీద మాత్రమే ప్రయోగించాలి. 6. పిప్పళ్ళు, సైంధవలవణం, జీలకర్ర, పటిక వీటిని సమతూకంలో తీసుకొని మెత్తగా దంచి టూత్ పౌడర్ మాదిరిగా రోజు రెండు పూటలా దంత ధావనానికి వుపయోగించాలి.

 

మదాత్యయం (అల్కహాలిజం):

ఆల్కహాల్ వలన తలనొప్పి వస్తున్నప్పుడు ఒకరింతలు, కడుపులో గడబిడ వంటివి అనుబంధ లక్షణాలుగా కనిపిస్తాయి. మద్యం సేవించిన తరువాత శరీరంలో జలీయాంశం తగ్గిపోతుంది. అప్పుడు తలలోని కొన్ని సున్నితమైన రక్తనాళాలు అతిగా సాగి నాడీ స్పందనలతో పైకి కిందకి ఉబుకుతుండటం వలన తలంతా పోట్లు పొడుస్తున్నట్లుగా నొప్పి బయల్దేరుతుంది. దీనికి తోడు మద్యంలో ఉండే విషపదార్థాలు కూడా రక్తనాళాలు వ్యాకోచం చెందడానికి దోహదపడతాయి. అంతటితో ఆగకుండా మద్యం రక్తంలో ఉండే గ్లూకోజ్ నిల్వలను అమాంతం తగ్గించేసి నీరసానికీ, నిస్సత్తువకూ కారణమవుతుంది. మద్యపానం తరువాత – హంగోవర్ వల్ల వచ్చే తలనోప్పిలో - & ద్రవ పదార్థాలను, తీపి పదార్థాలను, పిండి పదార్థాలను, తీపి పదార్థాలను తగినంతగా తీసుకోవాలి.

 

ఔషధాలు:

కళ్యాణకఘృతం, జహర్ మొహరా, వసంతకుసుమాకర రసం, శతావర్యాది ఘృతం, సువర్ణ మాక్షిక భస్మం, ముక్తాపిష్టి, వరాటికాభస్మం, శంఖభస్మం, గుడూచీసత్వం, విషతిందుకవటి.

 

నీటికాసులు (గ్లాకోమా):

కనుగుద్దులో ఉండే ద్రవాంశం పరిమితి స్థాయికి మించి పెరిగితే లోలోన ఒత్తిడి ఎక్కువై 'గ్లాకోమా' అనే స్థితి ప్రాప్తిస్తుంది. దీనిని తెలుగులో 'నీరుకాసులు' అంటారు. ఈ వ్యాధిలో తలనొప్పి ఒక ప్రధాన లక్షణం. దీనికి వాపును తగ్గించే 'శోథ హర' చికిత్సలు అవసరమవుతాయి.

 

ఔషధాలు: ప్రవాళపిష్టి, స్వర్ణ,మాక్షిక భస్మం, చంద్రోదయవర్తి (అంజనం), త్రిఫలాగుగ్గులు, సప్తామృత లోహం.

 

మైగ్రేన్ తలనొప్పి:

ఈ నొప్పి ఎక్కువగా ఒక పక్కనే వస్తుంది కాబట్టి దీనిని తెలుగులో 'ఒంటి కణత నొప్పి' లేదా పార్శ్వ నొప్పి అంటారు. సాధారణంగా మైగ్రేన్ యుక్తవయసులో మొదలవుతుంది. కొన్ని కుటుంబాలలో అనువంశికంగా కొనసాగుతుంటుంది. ఈ తరహా నొప్పితో బాధపడేవారు ఎప్పుడూ చిరాకుగా, అసహనంగా ఉంటారు. చిన్న శబ్దాన్ని కూడా భరించలేరు. మిరిమిట్లు గొలిపే కాంతిని సహించలేరు. తలపోటు కళ్లకు పైన, లేదా కన్నుల వెనుక మొదలై తలలో ఒక పక్కకు సర్దుకుంటుంది. ఎప్పుడు వచ్చినా ఒక పక్కనే ఎక్కువగా వస్తుంది.

 

కళ్లముందు మెరుపులు మెరుస్తున్నట్లుగా, మసకలు కమ్ముతున్నట్లుగా అనిపిస్తుంది. ఒకోసారి కొద్దిసేపు ఏమీ కనిపించకపోవచ్చు. కొద్దిసేపు మాటకూడా మామూలుగా రాకపోవచ్చు, తలనొప్పిని అనుసరించి వాంతులూ, ఒకరింతలూ ఉంటాయి. కొంతమందిలో ఒంటికణత నొప్పి వారానికి రెండుమూడు సార్లు వస్తే మరి కొందరిలో జీవితకాలం మొత్తంలోనే రెండు మూడుసార్లు వస్తుంది. అయితే వచ్చినప్పుడు మాత్రం నాలుగు నుంచి పన్నెండు గంటల పాటు తల్లడిల్లేలా చేస్తుంది. అదృష్టవశాత్తూ చాలామందిలో గాఢనిద్ర మైగ్రేన్ తలనొప్పి నుంచి ఉపశమనం పొందేలా చేస్తుంది.

 

మైగ్రేన్ తలనొప్పి తిరగబెట్టడానికి కొన్ని అంశాలు దోహదపడతాయి: విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనవ్వడం, శారీరకంగా అలసిపోవడం, బహిష్టు సమయాలు, ప్లోరోసెంట్ లైట్లను చూడటం, తదేకంగా సినిమాలు లేదా టీవీలు చూడటం ఇటువంటివి. అలాగే చాక్లెట్లు, వెన్న, మద్యం మొదలైన ఆహార పదార్థాల వల్ల కూడా మైగ్రేన్ పెరిగే అవకాశం ఉంది.

 

మైగ్రేన్ తలనొప్పికి ఒక ప్రత్యేక లక్షణం ఉంటుంది - బాగా శ్ర్రమ పడిన తరువాత, విశ్రాంతి తీసుకుందామనుకుంటుండగా మొదలు కావడం. అందుకే చాలామందిని వారాంతపు శెలవురోజున, సెలవులలో తొలిరోజున ఈ నొప్పి ఇబ్బంది పెడుతుంది.

 

మైగ్రేన్ కి ఆయుర్వేదం విధానంలో మంచి చికిత్సలున్నాయి: ఈ తలనొప్పికి ప్రధానంగా 'నిదాన పరివర్ణనం' (కారణాలకు దూరంగా ఉండటం) అవసరం, పిత్తాన్ని తగ్గించడానికి, మానసిక ప్రశాంతతను చేకూర్చడానికి ఇవి దోహదపడుతాయి. రోగి వ్యక్తిగత శారీరక స్థితిని బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి ఈ చికిత్సలను ఇవ్వాల్సి ఉంటుంది.


గృహచికిత్సలు:

1. పొద్దు తిరుగుడు గింజల పేస్టును నుదురుమీద రాసుకోవాలి. 2. సూర్యోదయానికి ముందు వెల్లుల్లిరసాన్ని, తుమ్మి మొక్క రసాన్ని రెండేసి చుక్కల చొప్పున రెండు ముక్కురంధ్రాల్లో వేసుకోవాలి. 3. మునగాకు రసాన్ని రెండేసి చుక్కల చొప్పున ముక్కులో డ్రాప్స్ గా వేసుకోవాలి.

 

ఔషధాలు:

అశ్వగంధ చూర్ణం, ధన్వంతర గుటిక, గోరోచనాది గుటిక, కస్తూర్యాది గుటిక, కస్తూరి మాత్రలు, మహా సూర్యవర్తి రసం, సూర్యావర్తి రసం క్షీరబలా తైలం (101 అవర్తాలు), వామనామృతం బిళ్లలు, వాత గజాంకుశ రసం, యోగరాజ గుగ్గులు.


నిత్యరోంప (సైనసైటిస్):

సైనసైటిస్ లో తలనొప్పి ఉండే అవకాశం ఉంది. దీని గురించి చెప్పడానికి ముందు, అసలు తలలో ఉండే సైనస్ ల గురించి కొంత చెప్పాలి.

 

ముక్కుకు ఇరుపక్కలా, తలలోపల గాలి గదుల వంటి నిర్మాణాలుంటాయి. వీటిని 'సైనస్' లు అంటారు. ఇవి స్వతస్సిద్ధంగా తల ఎముకలను బరువులేకుండా, తేలికగా ఉంచడానికి దోహదపడతాయి. అంతేకాకుండా మనం మాట్లాడుతుండగా వెలువడే శబ్దాలను బిగ్గరగా చేయడానికి కూడా తోడ్పడతాయి. ఇంతటితో ఈ సైనస్ ల ప్రత్యేకత అయిపోలేదు; శరీరేతర పదార్థాలనూ, హానికరాంశాలనూ వెలుపలికి నేట్టేయడానికి శ్లేష్మాన్ని కూడా తయారుచేస్తారు. అసలు చిక్కు ఇక్కడే వస్తుంది - ఈ గాలి గదుల లోపలి శ్లేష్మపు పొరలు వివిధ రకాల ఇన్ ఫ్లమేషన్ ల వలన ఉబ్బిపోయి తమ స్రావాలను తామే అడ్డుకుని లోపల పెరుకుపోయేలా చేస్తాయి. ఫలితంగా తలబరువు, తలనొప్పి మొదలైనవి వస్తాయి. ఇలా సామాన్యంగా జలుబు చేసిన తరువాత జరుగుతుంది.

 

నొప్పి ఎక్కువగా నుదురు లోపలగాని, కళ్ల వెనుక భాగానగాని ఉంటుంది. ముక్కు బిగెయ్యడం, ముక్కు కారడం మార్చిమార్చి జరుగుతాయి. తల ముందుకు వంచినప్పుడు మరింత బరువుగా అనిపిస్తుంది. చెంపల్లోపల – ఎముకల లోపలి భాగంలో కూడా నొప్పిగా అనిపిస్తుంది. నొప్పి ఉదయం పూట ఎక్కువగా ఉండి, సూర్యుడు నడినెత్తికి వచ్చేటప్పటికి కొంచెం తగ్గుతుంది. రోజువారీ పనులతో ముక్కుదిబ్బడ తొలగడం వలన ఇలా జరుగుతుంది. ఈ లక్షణాలాధారంగా ఈ తరహా నొప్పులను ఆయుర్వేదంలో వివరించిన 'సూర్యావర్తం'తో పోల్చవచ్చు. దగ్గు, తుమ్ము వంటివి ఈ తలనొప్పిని మరింత ఎక్కువ చేస్తాయి. అలాగే ధూమపానం మొదలైనవి కూడా దీనిని తీవ్రతరం చేస్తాయి. సైనసైటిస్ వలన వచ్చే తలనొప్పిలో మాటీమాటీకీ ఇన్ఫెక్షన్లు రాకుండా వ్యాధి నిరోధక శక్తి పెంచాల్సి ఉంటుంది. ఆయుర్వేద రసాయన చికిత్సలు దీనికి తోడ్పడతాయి. ఆయుర్వేదం ఈ తలనొప్పికి స్వేదకర్మ మొదలైన ఆయుర్వేద ప్రక్రియలతో పాటు పలు శక్తివంతమైన రసౌషధాలను సూచించింది. తగిన వైద్య సలహా మేరకు వీటిని వాడుకోవచ్చు.


గృహచికిత్సలు: 1. తులసి, అల్లం, ఎలాక్కాయలు, మిరియాలు, మునగాకులను కషాయం కాచుకుని తాగాలి. 2. వావిలి రసం (పావులీటరు), నువ్వుల నూనె (పావులీటరు), ఉల్లిముద్ద (పావుకిలో) వీటినన్నిటిని కలిపి సన్నని సెగమీద ఉడికించాలి. నూనె మాత్రం మిగులుతుంది. దీనిని రోజువారిగా తలకు రాసుకోవాలి. 3. తుమ్మి ఆకులను (గుప్పెడు, వెల్లుల్లి గర్భాలను (మూడు), ఉప్పును (చిటికెడు) కలిపి ముద్దచేసి రసం పిండాలి. దీనిని ఉదయం ఆహారానికి ముందు ముక్కులో డ్రాప్స్ గా నాలుగైదు రోజులు వేసుకోవాలి.

 

ఔషధాలు:

ఆరోగ్యవర్ధీనీ వటి, చిత్రక హరీతకి, కాంచనార గుగ్గులు, మధుస్నుహిరసాయనం, మహాయోగరాజ గుగ్గులు, నవక గుగ్గులు, నవాయాస చూర్ణం, పంచతిక్త ఘృత గుగ్గులు, యోగరాజ గుగ్గులు, పైకి వాడాల్సివని - అసన బిల్వాది తైలం, బలా గుడూచ్యాది తైలం, బలాశ్వగంధాది తైలం, రాస్నాది చూర్ణం, నిర్గుండి తైలం, త్రిఫలాది తైలం.


మెడ వెన్నుపూసలు అరిగిపోవటం (సర్త్వెకల స్పాండిలోసిస్):

మెడలోని వెన్నుపూసలు అరిగినప్పుడు తత్సంబంధమైన నరాలు, కండరాలు ఇరిటేట్ అవుతాయి. ఫలితంతా తలనొప్పి ప్రాప్తిస్తుంది. ఈ తరహా తలనొప్పి ఉదయం పూట కాకుండా సమయం గడుస్తున్నకొద్ది ఎక్కువవుతుంటుంది. మెడ లాగడం ఉంటుంది. దీనికి 'గుగ్గులు' వంటి ఇన్ ఫ్లమేషన్ తగ్గించే మందులు అవసరమవుతాయి.

 

ఔషధాలు:

ఏరండపాకం, మహాయోగరాజగుగ్గులు, వ్యాధిహరణ రసాయనం, కాంతలోహ భస్మం, రౌష్య భస్మం, వాత విధ్యంసినీ రసం, మహావాత విధ్వంసినీ రసం, అమసుందరివటి, అమవాతారి రసం, చోప్ ఛీన్యాది చూర్ణం, లక్ష్మీవిలాసరసం, (నారదీయ), శిలాజిత్వాది లోహం, బృహత్ వాత చింతామణి రసం. బాహ్యప్రయోగాలు - మహానారాయణ తైలం, ప్రసారణీ తైలం.


చెవి సమస్యలు:

మధ్య కర్ణం (మిడిల్ ఇయర్) వ్యాధిగ్రస్తమైనప్పుడు - ఇన్ఫెక్షన్ వల్ల – నరాల ఇరిటేటై, తలనొప్పిని కలిగించడానికి ఆస్కారం ఉంది. వైద్యసలహాతో కీటాణునాశక ఔషధాలను వాడితే ఈ సమస్య తగ్గుతుంది.

 

గృహచికిత్సలు:

1. అల్లం రసాన్ని వేడిచేసి రెండు మూడు చుక్కల చొప్పున రోజుకు రెండు మూడు సార్లు డ్రాప్స్ గా వేయాలి. 2. జిల్లేడు ఆకులను బాగా పండిపోయిన వాటిని తెచ్చి, నెయ్యి రాసి నిప్పుసెగను చూపించి పిండితే రసం వస్తుంది. దీనిని రెండు మూడు చుక్కలు చెవుల్లో డ్రాప్స్ గా వేయాలి. 3. వెల్లుల్లి/మునగాకు/ముల్లంగి వీటిలో ఏదో ఒక దాన్నుంచి రసం తీసి వేడి చేసి గోరువెచ్చగా వున్నప్పుడు చెవిలో డ్రాప్స్ గా వేయాలి.

 

ఔషధాలు: శారిబాదివటి, కాంచనార గుగ్గులు, సర్పగంధఘనవటి. బాహ్యప్రయోగాలు - బిల్వ తైలం, క్షార తైలం.

 

అంగిటి ముల్లు (టాన్సిలైటిస్):

టాన్సిల్స్ వాచినప్పుడు తలనొప్పి కూడా వచ్చే అవకాశం ఉంది. టాన్సిలైటిస్ లో గొంతునొప్పి ప్రధానంగా ఉన్నా, ఒక్కొక్కసారి దానితోపాటు అనుబంధంగా జ్వరం మొదలైనవి కూడా జతచేరి తలనొప్పికి కారణమవుతాయి.

 

గృహచికిత్సలు:

1. పటికను (పావు చెంచా) వేడి నీళ్ళలో (కప్పు) వేసి గొంతు తగిలేలా పుక్కిట పట్టాలి. 2. త్రిఫలా చూర్ణం (చెంచాడు) నీళ్ళలో వేసి కాషాయం కాచి పుక్కిట పట్టాలి. 3. వెల్లుల్లిని ముద్దుచేసి, రసం పిండి కొద్దిగా వేడి చేయాలి. దీనికి తేనె కలిపి కాటన్ బడ్ తో టాన్సిల్స్ పైన ప్రయోగించాలి. 4. పసుపు, మిరియాల చూర్ణాలను (చిటికెడు) వేడి పాలతో తీసుకోవాలి.


ఔషధాలు: కాంచనార గుగ్గులు, లఘుమాలినీవసంత రసం, తాళీసాది చూర్ణం, త్రిభువన కీర్తిరసం, ఇరిమేదాది తైలం, చంద్రప్రభావటి, శుభ్రవటి, వాసాకంటకారిలేహ్యం, కఫకేతురసం, తుండికేరి రసం.


టెంపోరల్ ఆర్టిరైటిస్:

ఇది ఒక ప్రత్యేక తరహా తలనొప్పి, కాస్త వయస్సు మళ్లిన వారిలో - కణతలలో - అదీ సాధారణంగా ఒక పక్కనే వస్తుంటుంది. ఇది స్థానికంగా ఉండే రక్తనాళాలు వ్యాధిగ్రస్తం కావడం వలన జనిస్తుంది. రోజుల తరబడి ఉంటుంది. వేలితో తాకిచూస్తే కణతలో ఒక ప్రత్యేకమైన స్థానంలో నొప్పిగా అనిపిస్తుంది. మాట్లాడేటప్పుడు, నమిలేటప్పుడు నొప్పి మరింత ఉధృతమవుతుంది. దీనితోపాటు కణతలలోని రక్తనాళాలలో రక్తం గడ్డలు ఏర్పడితే చూపు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది కనుక దీనికి అత్యవసరంగా వైద్య సహాయం తీసుకోవాలి.


ఔషధాలు: లశునాదివటి, నాగార్జునాభ్రరసం, యష్టిచూర్ణం, స్వర్ణసమీరపన్నగ రసం.


తలకు దెబ్బతగలడం (హెడ్ ఇంజ్యురీ):

తల మీద పైపైన తగిలినా తల లోపల నొప్పి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వయస్సు మళ్లిన వారిలో తలకు దెబ్బ తగిలిందన్న జ్ఞాపకం లేకుండానే లోపల కపాలం కింద రక్తస్రావమై మెదడుకు, కపాలపు ఎముకకు మధ్య చేరి మెదడు మీద ఒత్తిడిని కలిగిస్తుంది. అప్పుడు తలనొప్పే కాకుండా మగతగా ఉండటం, అయోమయం ఆవరించడం వంటివి కూడా ఉంటాయి.దీనికి సమగ్రమైన పరీక్షలు అవసరమవుతాయి.


మెదడుకు సంబంధించిన వ్యాధులు (మెనింజైటిస్ తదితరాలు):

మెదడుకు, లేదా వెన్నుపామును ఆవరించి ఉండే కండరాలు ఇరిటేటైనప్పుడు తలనొప్పి తీవ్రాతితీవ్రంగా, నిరంతరంగా బాధిస్తుంది. దీనితోపాటు మెడ కూడా బిగదీసుకుపోతుంది. అలాగే వాంతులు, ఒకరింతలు, వెలుతురును చూడలేకపోవడం, ఫిట్స్ రావడం వంటి లక్షణాలుంటాయి. ఇది అత్యవసరంగా చికిత్స చేయాల్సిన పరిస్థితి. మెదడు పొరలు వ్యాధిగ్రస్తం కావాడం మెనింజైటిస్), మెదడు కణజాలాలు వ్యాధిగ్రస్తం కావడం (ఎన్ కెఫలైటిస్), హైబిపీ వలన మెదడులో రక్తనాళాలు చిట్లడం వంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఇలాంటి తలనొప్పిని కలిగిస్తాయి. ఇది ప్రమాదకరమైన స్థితి, దీనికి అత్యవసరంగా వైద్యసహాయం పొందాలి.

 

ఔషధాలు: శిరః శూలాది వజ్రరసం, స్మ్రతిసాగర రసం, రౌష్య భస్మం, ఉన్మాదగజకేసరి రసం, వాతకులాంతక రసం, కంజనకారి రసం.

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660


*సభ్యులకు విజ్ఞప్తి*

******************

ఈ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.