“ప్లాస్మా దానం
౼౼౼౼౼౼౼౼
మానవ శరీరంపై దాడి చేసే ఎన్నో రకాల బాక్టీరియాలతో, వైరస్ లతో పోరాడే వ్యవస్థనే “రోగనిరోధక వ్యవస్థ (Immune system)” అంటారు. ఇది మన శరీరానికి ఒకవిధంగా ‘రక్షణ వ్యవస్థ (Defense system)’ లాంటిది. ప్రతీ వ్యక్తి శరీరంలో సహజంగానే ఉండే ఈ “రోగ నిరోధక వ్యవస్థ (Immune system)” అన్నది రక్తంలో “ప్లాస్మా (Plasma)” కలిగి ఉండే “ప్రతిరోధకాలు” అనగా “యాంటీ-బాడీస్ (Antibodies)” ఆధారంగానే సమర్థవంతంగా పని చేస్తూ ఉంటుంది.
మనవ శరీరంలో “రోగ నిరోధక వ్యవస్థ” అన్నది అందరిలోనూ ఒకలా పని చెయ్యదు. కొందరిలో బలహీనంగా పనిచేస్తే, మరి కొందరిలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఆ విధంగా “రోగ నిరోధక వ్యవస్థ” సమర్థవంతంగా పనిచేసే వ్యక్తులు ఏదైనా ప్రమాదకరమైన వైరస్, బాక్టీరియా బారిన పడినప్పటికీ వారి రక్తంలో “ప్లాస్మా” లో ఉండే “యాంటీ-బాడీస్ (Antibodies)” ఆ వైరస్ లేదా బాక్టీరియా “సూక్ష్మజీవుల (microorganisms)” తో పొరాడి వ్యాధి బారిన పడకుండా కాపాడుతుంటాయి.
అలాంటి “రోగ నిరోధక వ్యవస్థ” బలంగా పనిచేసే వ్యక్తులు గతంలో ఏదైనా వైరస్ బారిన పడి కోలుకున్న తరువాత వారి రక్తంలోని “ప్లాస్మా”ను సేకరించి, రోగనిరోధక శక్తి “బలహీనంగా” ఉన్న వారి రక్తంలో ప్రవేశపెట్టి “రోగ నిరోధక శక్తి”ని పెంచటం ద్వారా ప్రమాదకర వ్యాధిని నయం చేసే ప్రక్రియనే “ప్లాస్మా థెరపీ (Convalescent plasma therapy)” లేదా “యాంటీ-బాడీ థెరపీ (Antibody therapy)” అంటారు.
వివరంగా చెప్పాలంటే కరోనా వైరస్ లాంటి ప్రమాదకర వైరస్ లకు వ్యాక్సిన్ సైతం దొరకనప్పుడు అలాంటి వైరస్ లతో సైతం పోరాడగలిగే బలమైన “రోగనిరోధక” రక్షణ వ్యవస్థ ప్రతీ మానవుని శరీరంలో సహజంగానే ఉంటుంది. దానినే “ఇన్నేట్ ఇమ్మ్యున్ సిస్టమ్ (Innate Immune System)” అంటారు.
ఈ రోగ నిరోధక వ్యవస్థ ఉండబట్టే నేడు ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడుతున్న ఎందరో తిరిగి కోలుకుని మామూలు స్థితికి వస్తున్నారు.
కాబట్టి ఒకసారి కరోనా “పాజిటివ్”గా నిర్ధారించబడ్డ వ్యక్తి రక్తంలో ఉండే ప్లాస్మాలో “యాంటీ-బాడీస్” సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటే గనుక అతని “రోగనిరోధక వ్యవస్థ” కూడా సమర్థవంతంగా వైరస్ ను ఎదుర్కొని కొద్దిరోజుల్లోనే అతను కరోనా నుండి బయటపడ్డాక.. అతని ప్లాస్మా ఎవరైనా ‘రోగనిరోధక శక్తి’ బలహీనంగా ఉన్న రోగికి దానం చెయ్యటం వలన ఆ వ్యక్తి కూడా కరోనా నుండి కోలుకోగలడన్నమాట! ఆ విధంగా “ప్లాస్మా” దానం ద్వారా ఒకప్పటి “కరోనా వ్యాధి వాహకులే” తరువాత “కరోనా వ్యాధి నిరోధకులు” గా మారిపోతారు.
రక్తం ప్రధానంగా ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్లెట్స్, ప్లాస్మా ఈ నాలుగు పదార్థాలను కలిగి ఉంటుంది. వీటిలో “ప్లాస్మా” అనేది రక్తంలో ఉండే పసుపురంగు ద్రవభాగం. ఇది రక్తంలో 55% పరిమాణం కలిగి 90% నీళ్లను కలిగి ఉండేదే ప్లాస్మా. ఇంకా శరీరానికి అతి ముఖ్యమైన ప్రోటీన్స్ (సీరం, అల్బుమిన్, ఫైబ్రినోజెన్స్) గ్లూకోస్, ఆమినో యాసిడ్స్, ఎంజైమ్స్, ఫ్యాట్స్, ఎలెక్ట్రోలైట్స్, హార్మోన్స్ ను శరీరంలో వివిధ అవయవాలకు అందించటంతో పాటు “ఇమ్మ్యూనోగ్లోబిన్స్ (యాంటీ-బాడీస్)” ను కలిగి ఉంటుంది.
ప్లాస్మా దానం వలన దాతలకు ఎలాంటి ప్రమాదం ఉండదు. రక్తదానం వలన ఎలాంటి ప్రమాదం ఉండదో అలాగే ప్లాస్మా దానం వలన కూడా ఎలాంటి ప్రమాదం ఉండదు. పైగా రక్తం నుండి సేకరించబడిన ప్లాస్మా తిరిగి 24 నుండి 48 గంటల్లో రక్తంలో సదరు ప్లాస్మా దాత శరీరంలో యదావిధిగా తయారైపోతుంది. 600 ML రక్తం నుండి 360ML ప్లాస్మా ను సేకరించవచ్చు. అంతేకాదు ఒక ఆరోగ్యవంతుడైన వ్యక్తి ప్లాస్మాను 28 రోజులకోసారి సంవత్సరంలో 13 సార్లు దానం ఇవ్వొచ్చు.
విస్తృత అధ్యాయనాల ప్రకారం ప్లాస్మా థెరపీ కరోనా నివారణకు ప్రభావవంతంగా పని చేస్తుంది, అయితే చాలా మందిలో ప్లాస్మా దానం చెయ్యటం పట్ల కొన్ని అపోహల కారణంగా ప్లాస్మా దానానికి ముందుకు రావటం లేదు.
దయచేసి అపోహలు వీడండి. ప్లాస్మా దానం చేయండి. ప్రాణదాతలుగా మారండి..
ధన్యవాదములు
మీ నవీన్ నడిమింటి
విశాఖపట్నం
9703706660
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి