24, ఆగస్టు 2020, సోమవారం

డెంగీ మలేరియా టైఫాయిడ్ సమస్యలు ఈ లింక్స్ లో చూడాలి

1) తీవ్ర జ్వరం (102 కి మించి) 3 రోజుల కంటే ఎక్కువ ఉంటే, అది 80% కరోనానే ( ఇప్పుడు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు తగ్గాయి - ఎందుకంటే జనాలు నయానో భయానో శుభ్రత, బైటి ఆహారం తినకపోవడం, నీళ్లు వేడి చేసుకొని తాగడం లాంటివి చేస్తున్నారు కనుక). అందువలన కషాయం తాగుతూ ఆవిరి పడుతూ చూద్దాం లే ఒక 4-5 రోజులు అనుకోకుండా , వెంటనే హాస్పిటల్ కి వెళ్ళండి.

2) ప్రతి ఇంట్లో ఉండవలసిన పరికరాలు - 
పల్స్ ఆక్సిమీటర్ (రక్తం లో ఆక్సీజన్ సంతృప్త శాతం తెలుసుకోవడానికి), ధర్మా మీటర్, మాస్కులూ, గ్లవుస్, వాడి పడేసే ప్లేట్లు, గ్లాసులు (పేపర్ వి అయితే మరీ మంచిది). 
ఇంట్లో కూడా వీలైతే మాస్క్ లు వాడడం ఉత్తమం. 
పల్స్ ఆక్సేమీటర్ లో ఆక్సీజన్ సంతృప్త శాతం 94 కి తగ్గితే వైరస్ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించింది అని అర్థం.  ఇలా ఒకేరోజు 3 మార్లు తగ్గితే  వెంటనే హాస్పిటల్ కి వెళ్ళడం మంచిది.సాధారణంగా ఆక్సీజన్ శాతం 95 కంటే ఎక్కువ ఉండాలి, .  పరిపూర్ణ ఆరోగ్య వంతుల్లో 97 కంటే ఎక్కువ ఉంటుంది.  కాబట్టి, శ్వాసలో ఇబ్బంది, ఎగపోత, ఛాతీ పట్టేసినట్టు అనిపించే వరకు ఇంట్లోనే ఉండి, విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి. పల్స్ ఆక్సీమీటర్ రీడింగ్ అన్నిటికంటే ముఖ్యమైనది. 

3) 2-3 రోజులుగా అధిక జ్వరం (102 కంటే ఎక్కువ) ఉంటే, వెంటనే దగ్గరలోని హాస్పిటల్ కి తీసుకువెళ్ళి, గొంతు తెమడ పరీక్ష (RT PCR throat swab ), ఇతర  రక్త పరీక్షలు (CBP, CRP, Ferritin, D Dimer) , మరియూ HRCT (వైద్యుని ఆదేశం మేరకు) చేయించడం మంచిది. 
వైరస్ గొంతులో ఉంటే, గొంతు నొప్పి, సాధారణ జ్వరం లాంటి లక్షణాలు కనపడతాయి. అదే వైరస్ గొంతు లోంచి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తే, శ్వాస సంబంధ సమస్యలు, తీవ్ర జ్వరం కనిపిస్తాయి. 

4) ఇంట్లో ఒకరికి కరోనా వస్తే, దాదాపు గా అందరికీ వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే వైరస్ గాలిలో ఉండిపోయి (air borne) ఇంటిల్లిపాదికీ వ్యాపించగలదు. అలాగే కరోనా సోకిన మనిషిని, హాస్పిటల్ కి తీసుకెళ్లే సమయంలో, కారులో/అంబులెన్స్ లో, అద్దాలు అన్నీ కిందికి దించుకుని, AC వేసుకోకుండా ప్రయాణించడం వల్ల, వాహనం లోని ఇతరులకు వైరస్ సోకకుండా ఉంటుంది. 70 శాతం కేసులు కేవలం మన అజాగ్రత్త/అతి ప్రేమ వల్ల సోకినవే. 

5) ఎవరైనా ఒక్క వైద్యుడిని (జెనరల్ మెడిసిన్ / పల్మొనాలజీ) మనస్ఫూర్తిగా నమ్మండి. వైద్యుడు సూచించిన మాత్రలు , జాగ్రత్తలు పాటించి, ఫాలో అప్ లో ఉండండి. రోజుకి ఒక వైద్యుడిని మార్చడం వల్ల మీకు ఎలాంటి మేలు జరగదు. అన్నిటికంటే ముఖ్యమైనది, వైద్యం జరుగుతూ ఉన్నన్ని రోజులు కాస్త ఓపికతో ఉండండి. 

వైరస్ సోకిన అందరికీ లక్షణాలు కనిపించవు. 
లక్షణాలు కనిపించిన అందరికీ ప్రాణాపాయం కలగదు.  ప్రాణాపాయం ఉన్న అందరినీ వెంటిలేటర్స్, యాంటీ వైరస్ మందులు కాపాడలేవు. 

చివరగా, కరోనా తగ్గాక, మీ రక్తంలోని యాంటీ బాడీలు (ప్లాస్మా) హాస్పిటల్స్/ బ్లడ్ బ్యాంక్ కి గానీ ఇవ్వండి, మనం మరొక ప్రాణం కాపాడిన వాళ్ళం అవుదాం.
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
విశాఖపట్నం 
9703706660

*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి., 

కామెంట్‌లు లేవు: