21, జనవరి 2021, గురువారం

అరికాళ్ళ పగుళ్లు మంటలు,నివారణకు అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు

కాళీ పగుళ్ళు సమస్యలతో బాధపడుతున్నారా? ఈ కాలీ పగుళ్లను సులభంగా ఈ విధంగా తగ్గించుకోండి !అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 


  1. కాళ్ల పగుళ్ల సమస్యను తగ్గించుకోవాలంటే.. ముందు దానికి గల కారణాలను తెలుసుకోవాలి. కాళ్ల పగుళ్లు చాలా కారణాల వల్ల ఏర్పడతాయి. అందులో ముఖ్యమైనవి ఒంట్లో వేడి ఎక్కువ అయినప్పుడు గాని కాళ్ల మీద ఎక్కువ దూరం నడిచినప్పుడు గాని ఒంట్లో ఉండే అధికమైన వేడి వల్ల కాలి పగుళ్లు ఏర్పడతాయి కాళ్ళ పగుళ్ళు తగ్గాలంటే కలబంద జెల్ లో పసుపు కలిపి రాస్తే బాగా తగ్గుతాయి. ఇంకా నిమ్మకాయ ను రెండు చెక్కలు గా కోసి ఆ రసాన్ని అరికాళ్ళలో రుద్దితే పగుళ్ళు మంటలు తగ్గుతాయి. గోరింటాకు నూరి ఆ రసాన్ని రాసినా కూడా బాగా పనిచేస్తుంది. పిల్లలకు గాని పెద్దవారికి గాని షూ వేసుకున్నప్పుడు కాళ్ళ వ్రేళ్ళ మధ్య పాసినట్లు అయి దురదలు వస్తాయి ఇవి తగ్గాలంటే కొబ్బరినూనె లో కర్పూరం కలిపి రాస్తే వెంటనే తగ్గిపోతాయి.చలికాలంలో పాదాలు పగులుతుంటాయి. ఈ పగుళ్లు తగ్గాలంటే… అర కప్పు కొబ్బరి నూనెలో 10 వేపాకులు, చిటికెడు పసుపు, చిటికెడు కర్పూరం వేసి మరిగించి, చల్లారిన తర్వాత వడకట్టి నిల్వ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా రెండు వారాల పాటు పాదాలకు రాసుకుంటే పగుళ్ళు తగ్గి మృదువుగా తయారవుతాయి.credit: third party image reference

ఆరోగ్యం బాగుండేలా చూసుకుంటే.. చాలా వరకూ కాళ్ల పగుళ్లు కూడా తగ్గుముఖం  కాలి పగుళ్లు చలికాలంలో ఆడ, మగ, చిన్నా, పెద్దా తేడా లేకుండా ఎవరి పాదాలైన పగలడం సహజం. దీంతోపాటు కాళ్లు కూడా గరుకుగా మారుతాయి. ఈ నేపథ్యంలో కింద పేర్కొన్న పలు చిట్కాలను పాటిస్తే కాళ్లు, పాదాలను సంరక్షించుకోవడంతోపాటు వాటిని మృదువుగా ఉంచుకునేందుకు వీలవుతుంది.రోజ్ వాటర్, గ్లిజరిన్ సమపాళ్ళలో తీసుకొని పగుళ్ళున్న చోట దూదితో రాసి, కొంత సమయం తరువాత కడిగివేయాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే పగుళ్ళు క్రమంగా తగ్గుముఖం పట్టి పాదాలు మృదువుగామారతాయి.దీన్నికాళ్లకు కూడా రాసుకోవచ్చు.బొప్పాయి గుజ్జులో నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి మర్దనా చేస్తే మడమలకున్న మురికి పోతుంది. క్రమంగా ఇలా చేస్తే మురికి తొలగడమే కాకుండా పగుళ్ళు కూడా దరి చేరవు.పాదాలు మృదువుగా తయారవ్వాలంటే నాలుగు చెంచాల ఓట్ మీల్ పొడి, మూడు చెంచాల ఆలివ్ నూనె కలిపి మర్దనా చేసి, అరగంట తరువాత చల్లని నీటితో కడగాలి. దీంతో మృతకణాలు(డెడ్ సెల్స్) కూడా తొలగిపోతాయి.పావు బకెట్ నీళ్ళలో చెంచా కొబ్బరి నూనె, చెంచా వంటసోడా,చెంచా విటమిన్ ఈ నూనె వేసి అరగంట సేపు కాళ్ళుఅందులో ముంచేలా ఉంచాలి. ఇలా వారానికి ఒకసారి చొప్పున చేయడం ద్వారా పాదాలు మృదువుగా ఉంటాయి.credit: third party image reference 3. ఇంకా మర్రి చెట్టుపాలను కూడా కాళీ పగుళ్లను నివారించడంలో ఉపయోగించవచ్చును కాలి పగుళ్లు ఉన్న చోట మర్రి చెట్టు పాలు తీసుకొని ఉదయం సాయంత్రం రెండు పూటలా ఒక వారం రోజులు రాస్తే కాళ్లు పగుళ్లు తగ్గిపోతాయి అదేవిధంగా నువ్వుల నూనెను గోరు వెచ్చగా వేడి చేసి రాత్రి పడుకునే ముందు రాసుకుంటే పాదాలు మృదువుగా తయారవుతాయి.బెస్ట్ చిట్కా: కాళ్ళ పగుళ్ళు తగ్గాలంటే నిమిషం పాటు గోరువెచ్చని నీటిలో నానబెట్టి గరుకు రాయి తో రెండు రోజుల పాటు రుద్దితే కాళ్ళ పగుళ్ళు తగ్గుముఖం పడతాయి.ముఖ్యంగా ఎక్కువ సేపు నిలబడి చేసే పనులకు స్వస్తి పలకాలి. అలాగే బరువు తగ్గడానికి ప్రయత్నించాలి. సాధారణంగా శరీరంలో, చర్మంలో తేమ తక్కువగా ఉండడం, నీళ్లలో ఎక్కువ సేపు తడవడం వల్ల కాళ్ల పగుళ్లు ఎక్కువగా వస్తుంటాయి. వీటిని నివారించడం వల్ల కాళ్ల పగళ్లు రాకుండా చేసుకోవచ్చు.వీటన్నింటితో పాటు ఫ్లిప్ ఫ్లాప్స్, శాండల్స్, ఓపెన్ బ్యాక్ షూలు, హీల్స్, టైట్‌గా ఉండే చెప్పులు వేసుకోవడం వల్ల కాళ్ల పగుళ్లు ఎక్కువవుతాయి. కాబట్టి వాటిని ధరించకుండా కాళ్లకు పూర్తి రక్షణను అందించే చెప్పులు ధరించాల

*అరికాళ్ళ మంటల&నడుము నొప్పి కు  నివారణకు వ్యాయామం,ఆహార నియమాలు అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు*


అరికాళ్ళ మంటల నివారణకు వ్యాయామం:

1 ) ఆముదం లేదా కొబ్బరినూనె  లేదా నెయ్యి వీటిలో ఏదో ఒకటి తగినంత తీసుకుని వేడిచేసి అరికాలికి మర్దన చేసి రెండు బొటన వేళ్ళతో గుచ్చినట్లు press చేయాలి.

2 ) కుర్చీ ఫై కాలు పెట్టి మోకాలి ఫై అరచేతులు ఉంచి వెనక్కు,ముందుకు వంగాలి.

3 ) చెక్క ముల్లుల కర్రతో  అరచేతులను,అరికాళ్ళను రుద్దాలి.

అరికాళ్ళ మంటల నివారణకు ఆహార కానుక :

1 ) ఆముదం పప్పును తగినన్ని పాలతో paste చేసి రాత్రి అరికాలికి మర్దన చేసి ఉదయం కడగాలి.

2 ) నానిన పెసర పప్పు పొట్టుతో సహా తీసుకుని హారతి కర్పూరం బిళ్ళలు వేసి paste చేసి రాత్రి అరికాలికి మర్దన చేసి ఉదయం కడగాలి.వీటిలో ఏదో ఒకటి రోజూ చేయడం వల్ల అరికాలి మంటలు తగ్గుతాయి.  

3 )  వేడి చేసే ఆహార పదార్ధాలు తినకూడదు.బార్లీ గంజి,మజ్జిగ ,కొబ్బరి నీళ్ళు తాగాలి.

4 ) ఉదయం  గ్లాస్ నీటిలో ధనియాలు నానబెట్టి సాయంత్రం వడబోసుకుని  తాగాలి.అలాగే సాయంత్రం గ్లాస్ నీటిలో ధనియాలు నానబెట్టి ఉదయం వడబోసుకుని  తాగాలి.

పాదాలలో వచ్చే ఆనెలకు సౌందర్య కానుక:

1 ) కలబంద గుజ్జులో 3 చిటికెల పసుపు వేసి రాత్రి పడుకునే ముందు  పాదం ఫై ఉన్న ఆనె ఫై ఈ paste పూసి కట్టు కట్టి ఉదయం కడగాలి.ఇలా 40 రోజులు చేస్తే ఆనెలు తగ్గుతాయి.

2 ) దాల్చిన చెక్కను వేయించి బూడిద చేసి సున్నం నీరు కలిపి రాత్రి పూట ఆనెలకు పూసి కట్టు కట్టి ఉదయం కడగాలి.


*👉🏿నడుం నొప్పికి వ్యాయామం,ఆహార నియమాలు*


నడుం నొప్పికి వ్యాయామం:

1 ) బోర్లా పడుకుని నౌకాసనం వేయాలి.

2 ) నిటారుగా నిలబడి ఎడమచేయి  ఫైకి ఎత్తి  కుడి కాలు వెనక్కి చాపాలి.అదే విధంగా కుడిచేయి ఫైకి ఎత్తి ఎడమకాలు వెనక్కి చాపాలి.

నడుం నొప్పికి ఆహారకానుక :

1 )  మినపపిండిలో 4 వెల్లులిరేకులు,3 గ్రా అల్లం,3 చిటికెల ఇంగువ,1 /4 స్పూన్ సైంధవలవణం వేసి రుబ్బి వడలాగా చేసి నూనెలో  వేయించాలి.ప్రతిరోజు ఒకటి లేదా రెండు వడలు తినడం వలన నడుం నొప్పి,మోకాల్లనొప్పులు,మెడ  నొప్పులు వాత నొప్పులు తగ్గుతాయి.

2 )  బాదం పప్పు - 1 /4 kg(రాత్రి నీటిలో నానవేసి ఉదయం పొట్టు తీసి నీడలో ఆరబెట్టి పొడి చేసుకోవాలి.)

      1 /4 kg గసాలు పొడి చేసుకోవాలి.

      1 /4 kg కలకండ పొడి చేసుకోవాలి.

ఫై పొడులని గాజు సీసాలో నిల్వచేసుకుని గ్లాసు పాలలో ఒక స్పూన్ పొడి కలిపి ప్రతి రోజూ ఉదయం,సాయంత్రం తాగాలి.

ఇలా 40 రోజులు తాగడం వలన నడుం గట్టిపడుతుంది.

ధన్యవాదములు 🙏

మీ నవీన్ నడిమింటి

9703706660

*సభ్యులకు విజ్ఞప్తి* 

******************

ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ  నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.


https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

కామెంట్‌లు లేవు: