6, జనవరి 2021, బుధవారం

శీఘ్రస్కలనం సమస్య ఉంటే తీసుకోవలిసిన జాగ్రత్త లు అవగాహన కోసం ఈ లింక్స్ లో చూడాలి

సారాంశం

పురుషులు ఎదుర్కొంటున్న ప్రధానమైన లైంగిక సమస్యలలో శీఘ్ర స్ఖలనం ఒకటి. ఇది హెచ్చు శాతం మందిని  మానసికంగా కృంగదీస్తున్నది. పురుషుడు సంభోగం సందర్భంగా అంగస్తంభనను నిలుపకోలేకపోవడం ఈ సమస్యకు కారణం. ఉద్వేగం  పొందడానికి మునుపే స్ఖలనం జరగడం శీఘ్రస్ఖలనంగా చెప్పబడుతుంది. రతి ప్రారంభించిన నిమిషం లోపుగా వీర్య  స్ఖలనం జరిగితే దానిని శీఘ్ర స్కలనం లేదా  ప్రి-మెచ్యూర్ ఎజాక్యులేషన్ – ( పి ఐ) అంటారు. ఈ దుస్థితి పురుషునికి మానసికంగా ఇబ్బంది కలిగించి  తన లైంగిక భాగస్వామితో సంబంధాలను త్రుంచివేస్తుంది శీఘ్ర స్ఖలనం ప్రాథమిక (యావజ్జీవ ప్రాతిపదిక ) స్థాయిలో లేదా సెకండరీ స్థాయిలో ( తెచ్చుకొన్నది)  ఉంటుంది. ఈ దుస్థితికి కారణం  శారీరక , మానసిక లేదా జన్యుపమైనది కావచ్చు.  మానసిక ఒత్తిడి నిర్వహణ, ఔషధాల వాడకం, మానసిక వైద్య నిపుణుని సలహాలు మరియు సముచిత వ్యాయామం తో కూడిన  విభిన్న చికిత్సలు పరిస్థితిని చక్కదిద్దుతాయి. శీఘ్రస్ఖలనం సమస్య హెచ్చు  మోతాదులో ఉన్నప్పుడు, చికిత్స లోపం మానసిక ఒత్తిడిని మరింత తీవ్రం చేస్తుంది.. కొన్ని సందర్భాలలో , ఇది పుంస్త్వం/ పుంసకత్వం సమస్యకు దారితీస్తుంది. ఎందుకంటే వీర్యం యోనిలో ప్రవేశించడంలో విఫలమవుతుంది. ఎక్కువ మంది పురుషులలో శీఘ్ర స్ఖలనం సమస్యను వైద్య సహాయంతో నయం చేయవ

శీఘ్ర స్కలనం యొక్క లక్షణాలు

డి ఎస్ ఎం  - 5  ప్రకారం  ఇక వ్యక్తి శీఘ్ర స్ఖలనం సమస్యను ఎదుర్కోవడానికి క్రిందివాటిలో ఏదయినా కారణం కావచ్చు :

  • సంభోగం ప్రారంభించిన నిమిషంలోపుగా స్ఖలనం జరగడం
  • ఆరు నెలల పాటు అంతకంటే హెచ్చు కాలం శీఘ్రస్ఖలనం జరగడం
  • 75% నుండి  100 %  సంభోగం సందర్భాలలో  శీఘ్రస్ఖలనం జరగడం
  • లైంగిక భాగస్వాములలో లైంగికంపరమైన అసంతృప్తి, విసుగు, మానసిక ఒత్తిడి
  • మానసిక దుస్థితి కలగడం, లేదా వైద్య చికిత్స పర్యవసానం అట్టి పరిస్థితికి దారి తీయడం
  • లోగడ మాదక ద్రవ్యాలకు బానిస కావడం, శీఘ్ర స్ఖలనానికి దారితీసే కొన్ని మందులను సేవించడం

శీఘ్ర స్కలనం యొక్క చికిత్స 

చికిత్సకు పెక్కు ఐచ్చికాలు లభిస్తున్నాయి. వాటిలో సలహాలు తీసుకోవడం, ఔషధాల సేవన, లైంగిక ప్రవర్తనలో కొత్త విధానాలు, సమయోచితంగా మత్తు పొందడం వంటివి.

  • సలహాల కల్పన మరియు సెక్స్ థెరపీ.
    సలహాల ప్రక్రియ మీ సలహాదారునితో (కౌన్సెలర్) మీ లైంగిక సమస్యలపై ముఖాముఖిగా మనసు విప్పి చర్చించడం.  మీ సలహాదారు లేక డాక్టరు పరిస్థితిని సరిదిద్దుకోవడానికి ఎదురవుతున్న దుస్థితిని అధిగమించడానికి విధానాలను వివరిస్తారు. ఆందోళనకు, మానసిక ఒత్తిడికి మార్గం సూచిస్తారు.. సెక్స్ థెరపీ మరియి సంబంధాల సలహా ప్రక్రియ భాగస్వాముల మధ్య సత్సంబంధాన్ని పునరుద్ధరిస్తుంది. 
  • ఔషధాలు
    స్ఖలనం ఆలస్యం కావడంలో సహకరించడానికి వివిధ రకాల మందులు సూచింప బడతాయి. వీటిలో ఆంటీడిప్రెషంట్స్, అనాల్జెసిక్స్ మరియు ఫాస్ఫోడైయ్స్టరేస్- 5 నిరోధకాలు చేరి ఉంటాయి. ఇవి స్ఖలనాన్ని నిదానం చేసే గుణం కలిగి ఉంటాయి ( అయితే ఇవి ఎఫ్ డి ఏ ఆమోదం పొందలేదు). మీ ఆరోగ్య స్థాయిని అనుసరించి మీ డాక్టరు ఈ మందులను విడిగా గాని, లేదా ఇతర కొన్న మందులతోపాటుగా గానీ సూచించవచ్చు. స్వయంగా మందులను తీసుకోవడం వల్ల తీవ్రమైన వైద్యపరమైన సమస్యలు ఎదురుకావచ్చు. దీనితో ఈ జబ్బు ఎదుర్కొంటున్న వ్యక్తి వైద్యుని సలహా లేకుండా స్వయంగా మందులను తీసుకొనకూడదు
  • నడచుకోవడంలో విధానాలు
    కొందరిలో శీఘ్రస్కలనాన్ని కేవలం నడవడిక విధానంలో మార్పులతో సరిదిద్దవచ్చు. యోనిలో సంభోగంతో  కాకుండా లైంగికంగా ఇతర విధాలతో సాన్నిహిత్యం పెంపొందించుకోవడంపై దృష్టి నిలపడం ఒక ప్రక్రియ. ఇది పరిస్థితిని చక్కదిద్దుతుందని వెల్లడయింది. మీ డాక్టరు  శీఘ్రస్ఖలనాన్ని అధిగమించడానికి అదుపుచేయడానికి వీటిలో కొన్ని మార్గాలను సూచించవచ్చు.
  • సమయోచితమైన అనీస్థిటిక్స్
    మీ డాక్టరు అనీస్థిటిక్ క్రీములు, స్ప్రేలు సూచించవచ్చు. ఇవి జననాంగంపై వాడినప్పుడు అవి స్పర్శజ్ఞానాన్ని తొలగించి స్ఖలనాన్ని నివరిస్తాయి. వీటిని లైంగిక క్రియకు 10-15 నిమిషాల ముందు ఉపయోగించాలి.  వీటిలో కొన్ని స్ప్రేలు మందుల దుకాణంలో మందుల సూచిక లేకుండా లభిస్తాయి. కొన్నిటికి సూచిక అవసరం.  వీటిలో పెక్కు ఔషధాలు శీఘ్రస్ఖలనాన్ని అదుపు చేసినప్పటికీ, కొన్ని సందర్భాలలో అవి స్పర్శజ్ఞానం కోల్పోవడానికి, స్త్రీలు, పురుషులలో  లైంగిక కోరిక తగ్గడానికి దారి తీస్తాయని కొన్నినివేదికలు పేర్కొంటున్నాయి.
  • వ్యాయామాలు
    కటి కండరాలను ఒత్తిడి చేయడం వల్ల ఒక వ్యక్తి స్ఖలనాన్ని నిదానం చేయవచ్చు. బలహీనమైన కటి కండరాలు శీఘ్ర స్ఖలనానికి వీలు కల్పిస్తాయి.
    • సరియైన కండరాలను గుర్తించండి
      ఈ ప్రక్రియలో చోటుచేసుకొన్న కండరాలను గుర్తించడానికి సంభోగానికి ముందుగా మూత్ర విసర్జనను నిలిపివేయండి. ఈ కండరం స్ఖలనాన్ని నిలుపుతుంది. వాయువును సమయానుసారం బయటకు వదలడాన్ని  నిలపడం వల్ల కూడా స్ఖలనం అదుపుచేయబడుతుంది.
    • కండరాలను  మీ దారికి మలచుకొనండి
      మీ కటి కండరాలను 3 – 4 సెకన్లపాటు సంకోచం చేయండి తర్వాత సడలించందడి. ఈ వ్యాయామాన్ని 4-5 మార్లు కొనసాగించండి.. మీ కండరాలు గట్టి పడటంతో  వ్యాయామాన్ని ప్రతి సమయంలో  10 మార్లు వంతున రోజుకు మూడు మార్లు జరపండి.
  • పాస్- స్వీజ్ ప్రక్రియ
    ఈ ప్రక్రియ శీఘ్ర స్ఖలనం అదుపునకు సహకరిస్తుంది.. సంభోగానికి మునుపు తొలి ప్రక్రియలు యధావిధిగా జరపండి మీరు అంగస్తంభనను అదుపులో ఉంచుకొనలేక , స్ఖలనం జరిగితే, మీ భాగస్వామిని  మీ జననాంగాన్ని ఒత్తిపట్టుకొనాలని చెప్పండి. స్ఖలనం జరపాలనే కోరిక తీరేవరకు కొన్ని సెకన్లు  అలాగే ఉంచుకోవాలి.  ఈ ప్రక్రియను వీలయినన్ని మార్లు కొనసాగించండి. స్ఖలనం జరపకుండా మీ లైంగిక భాగస్వామిలోనికి చొచ్చుకువెళ్లండి. తద్వారా మీరు మీ స్ఖలనాన్ని  అదుపు చేసుకొనగలరు. తర్వాత మీరు స్ఖలనం నియంత్రణకు ఈ ప్రక్రియ అనుసరించే అవసరం ఉండదు. ఈ విధానాన్ని స్ఖలనం జరపకుండా మీ భాగస్వామి శరీరంలోకి చొచ్చుకు వెళ్ళేవరకు కొనసాగించండి. దీనిద్వారా మీరు స్ఖలనాన్ని అదుపులో ఉంచుకొనగలరు
  • తొడుగుల వాదకం
    మందమైన పదార్థం చేయబడిన రబ్బరు తొడుగులు ( కాండోంలు ) జననాంగంలో స్పర్శజ్ఞానాన్ని  జాప్యంచేసి స్ఖలనాన్ని అదుపు/ నిదానం చేస్తాయి  కొన్ని దేశాలలో కాండోములలో ‘క్లైమాక్స్ కాండోము’ లు లభిస్తున్నాయి. ఇవి స్పర్శజ్ఞానాన్ని తగ్గిస్తాయి.

స్వయంగా శ్రద్ధ తీసుకోవడం :

శీఘ్రస్ఖలనం లైంగిక జీవితంపై , భార్యాభర్తల సాన్నిహిత్యంపై చెడుప్రభావం కలిగిస్తుంది.  ఇది దంపతులలో మానసిక ఒత్తిడి కలిగించి వారి మధ్య దూరాన్ని పెంచుతుంది. ప్రతి ముగ్గురిలో ఒకరు తమ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు  శీఘ్రస్కలనాన్ని ఎదుర్కొంటున్నారని పరిశీలనలు  వెల్లడిస్తున్నాయి. రెండు మూడు అనుభవాలతో దంపతులువారికివారే సరిపడుతున్నారు.

లైంగిక క్రియలో ఆందోళన సమస్యను మరింత జటిలం చేస్తుంది. మీ మనసును, శరీరాన్ని  ప్రశాంతంగా ఉంచుకోండి. సుఖ సాంసారిక జీవితం అనుభవించడానికి ప్రయత్నించండి.  శీఘ్రస్ఖలనం సమస్య ఉన్నప్పటికీ మానసిక ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండండి. ఒక విషయం జ్ఞప్తిలో ఉంచుకోండి.మీ లైంగిక భాగస్వామిని సంతృప్తి పరచడానికి పెక్కు మార్గాలు ఉన్నాయి.  మీలో దానికి అవసరమైన జ్వాల రగులుతూ ఉంటుంది. మీ సాన్నిహిత్యం దెబ్బతినకుండా ఉంటుంది. మీకు సహాయం కావాలనుకొంటే, మీ డాక్టరును సంప్రతించడానికి సందేహించకండి.

జీవన సరళి/ విధానం నిర్వహణ

శీఘ్రస్ఖలనానికి పెక్కు కారకాలు ఉంటాయి. అవి మానసికమైనవి మరియు శరీరకమైనవి కూడా. మానసిక ఒత్తిడి మరియు లైంగిక క్రియ సందర్భంగా ఆందోళన శీఘ్రస్ఖలనంలో కీలకమైన పాత్ర వహిస్తాయి. ఒత్తిడి స్థాయిని అదుపు చేసుకోవడం, మీ లైంగిక భాగస్వామితో నిజాయతీగా దేనినీ దాచిపెట్టకుండా చర్చించడం వల్ల ఈ దుస్థితి నుండి బయటపడవచ్చు. ఒత్తిడిని తొలగించుకొంటే పరిస్థితి చక్కబడుతుంది. కొన్ని జీవనసరళి జబ్బులైన మధుమేహం, హెచ్చు బి పి, థైరాయిడ్ సమస్యలు, ప్రొస్టేట్ సమస్యలు పరిష్కారమైతే  శశీఘ్రస్ఖలనం సమస్యకు పరిష్కారం లభిస్తుంది..


శీఘ్ర స్కలనం కొరకు  మందులు

శీఘ్ర స్కలనం సమస్య ఉన్న వరుకు ఈ మందులు అన్ని డాక్టర్ సలహాలు మేరకు మాత్రమే వాడాలి సైడ్ ఎఫెక్ట్ బాగా ఉంటది 

Medicine NamePack Size
XyloXylo 2% Infusion
Xylocaine InjectionXylocaine Viscous Solution
Xylocaine HeavyXylocaine Heavy 5% Injection
XylocardXylocard Injection
CorectilCorectil Capsule
XyloxXylox Gel
ADEL Titanium Metallicum DilutionADEL Titanium Metallicum Dilution 1000 CH
Rexidin M Forte GelRexidin M Forte Gel
AlocaineAlocaine Injection
Dr. Reckeweg Titanium Metallicum DilutionDr. Reckeweg Titanium Metallicum Dilution 1000 CH

"లైంగిక సామర్థ్యం"ను పెంచే ఆహారాలు


 ప్రస్తుత కాలంలో చాలా మంది లైంగిక సమస్యలతో బాధపడుతున్నారు.పని ఒత్తిడి మనసు ఎక్కడా కాసేపు నిలకడగా ఉండనీయడంలేదు. ప్రతిక్షణం ఉద్యోగ వ్యాపారాల ధ్యాసే. వేగవంతమైన జీవితం, కలుషిత వాతావరణం, సమయపాలనా లేని ఆహారం. దీంతో ఆరోగ్యం పట్ల శ్రద్ధ కరువై ఇతర అనారోగ్య సమస్యలతోపాటు ‘లైంగికపరమైన' సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నేడు ‘డయాబెటిస్' వ్యాధిగ్రస్తులు 50 నుండి 60 శాతం మంది సెక్స్ సమస్యలతో బాధపడుతున్నారు.
 నేడు కనిపిస్తున్న లైంగిక సమస్యల్లో అత్యధిక శాతం మానసిక దుర్భలత్వం, భయం , డయాబెటిస్‌వలన వచ్చినవే. మధుమేహ వ్యాధిగ్రస్తులలో వచ్చే నాడీ సంబంధ వ్యాధుల లోపాలవలన, అంగస్తంభన, శీఘ్రస్కలన సమస్య, సెక్స్ కోరికలు తగ్గడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనికి గల కారణం హార్మోన్ల లోపాలు, డయాబెటిక్ న్యూరోపతి, నిత్య జీవితంలో మానసిక ఒత్తిళ్లు ఎక్కువగా ఉండటం. లైంగిక సామర్థ్యం మానసిక శక్తిమీద ఆధారపడి ఉంటుంది. భయం, ఆందోళన, అనుమనాలు, శీఘ్రస్కలనాలు, స్తంభన లోపాలు వంటి సమస్యలు మనిషిని మానసికంగా బలహీనపరిచి లైంగిక సామర్థ్యాన్ని తగ్గిస్తున్నాయి. 
 సామర్థ్యం తగ్గకుండా ఉండాలంటే: కొన్ని ముఖ్యమైన ఇండియన్ ఆహారాలు సెక్స్ డ్రైవ్ ను నేచురల్ గా పెంపొందించుకోవచ్చు. మంచి ఆహారపు అలవాట్లు అలవరచుకోవాలి. సెక్స్ హార్మోన్లను పెంపొంధించుకోవడానికి పాలు, తేనెను పురాతన కాలం నుండినే ఉపయోగిస్తున్నారు. ఇవే కాక బాదం, ఖర్జూరం, మొలకెత్తిన విత్తనాలు, గ్రుడ్లు, తాజా ఆకుకూరలు తీసుకోవాలి. కీర దోసకాయ, క్యారెట్, బీట్‌రూట్‌తో తయారుచేసిన జ్యూస్‌ను రోజు ఉదయం ఒక గ్లాసు తీసుకోవాలి. యాపిల్, జామ, దానిమ్మ, ద్రాక్ష, నేరేడు వంటి తాజా పండ్లు తీసుకోవాలి. మద్యపానం సేవించుట, స్మోకింగ్, గుట్కాలు, పాన్‌పరాగ్, నార్కోటిక్స్ తీసుకోవటంవంటి వ్యసనాలను వదిలివేయాలి. తక్షణ లైంగిక సామర్థ్యం కోసం ‘స్టిరాయిడ్స్' నిత్యం వాడటంవలన లైంగిక పటుత్వం క్రమేపి తగ్గిపోవును. లిబిడో సమస్యలను అధిగమించడానికి పురాతన కాలం నుండి అశ్వగంధని మనకు ప్రసాధించింది. సెక్స్ డ్రైవ్ ను పెంచే ఇండియన్ ఆహారాలు, నేచురల్ లిబిడో బూస్టర్స్ గా సహాయపడుతాయి. అవే మీ సంతోకర జీవితానికి, కొన్ని మసాలాలు ఉన్నాయి. వాటిని పరిశీలించి మీ లిబిడో సమస్యలను నివారించుకోండి...
యాలకులు: ఇండియన్ మసాలా దినుసుల్లో ఒకటిగా చెప్పుకొనే యాలకులు మానసిక స్థితి పెంచడం ద్వారా లిబిడో పునరుద్ధరించవచ్చు. ఏలకుల ఆయిల్ మసాజ్ చాలా రొమాంటిక్ మరియు నపుంసకత్వంను తగ్గించి, లైంగిక స్పందన పెంచే cineole కలిగి ఉంది.

సెలరీ(Celery): ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్, ఆడ్రోస్టెనోన్ ను విడుదల చేయడం వల్ల ఇది అంత ఘాటైన వాసన కలిగి ఉంటుంది. ఈ సుగంధ వాసన, భాగస్వామిని ఇట్టే ఆకర్షిస్తుంది.

అరటి పండు: అరటి పండులో ఉండే బ్రొమెలైన్(bromelain)అనే ఎంజైమ్ లిబిడోను పెంపొందిస్తుంది మరియు పురుషుల్లో లైంగిక సమస్యలను తగ్గిస్తుంది. అంటిపండులో ఉండే పొటాషియం మరియు విటమిన్ బి శరీరానికి కావల్సినంత శక్తిని అంధిస్తుంది.

 గుడ్లు: గుడ్లలో విటమిన్ బి6 మరియు విటమిన్ బి5 పుష్కలంగా ఉంటాయి. ఇవి హార్మోనుల లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తాయి. ఒత్తిడితో పోరాడుతాయి. అధిక లైంగిక వాంఛను కలిగిస్తాయి. ముఖ్యంగా గుడ్లను ఫెర్టిలిటికి సంకేతంగా సూచిస్తారు.

 వెల్లుల్లి: వెల్లుల్లిలో ఆశ్చర్యకరమైన ఎల్లిసిన్ ఉండి సెక్స్యువల్ ఆర్గాన్స్ కు రక్త ప్రసరణ అంధించడానికి బాగా సహాయపడుతాయి. ఇవి రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల లిబిడో సమస్యలను దూరంగా ఉంచి లైంగికజీవితంలో అలసట లేకుండా సహాయపడుతుంది

అశ్వగంధ: సెక్స్ డ్రైవ్ పెంచడానికి అద్భుతంగా సహాయడే ఔషధం అశ్వగంధ. ఎల్లప్పుడూ సెక్స్ లైఫ్ ను పెంచడానికి భారతీయ ఆయుర్వేద వైద్యంలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఒక చిటికెడు పల్లేరుకాయల చూర్ణాన్ని, ఒక టీస్పూన్ అశ్వగంధ చూర్ణాన్ని ఒక కప్పు పాలకు కలిపి మరిగించి, వడపోసుకొని పడుకునే సమయంలో తాగితే మగవాళ్లలో లైంగిక బలహీనత తగ్గుతుంది. ఇలాగ కనీసం పది పదిహేను రోజులు వాడాల్సి ఉంటుంది.

Ginseng(ఒక విధమైన మూలిక): ఈ జిన్సెంగ్ మూలిక యొక్క వేరును లిబిడో సమస్యలను నివారించడంలో విస్తృతంగా ఉపయోగించారు. దీన్ని ఇంకా లోయర్ బ్లడ్ ప్రెజర్ మరియు రోగనిరోధక వ్యవస్థను పెంచడానికి ఉపయోగిస్తారు.

డార్క్ చాక్లెట్: డార్క్ చాక్లెట్ లిబిడో బూస్టర్ గా బాగా ప్రసిద్ధి చెందింది. చాక్లెట్ లో మీకు సెక్స్ లైఫ్ అనుభూతిని కలిగించి ఒక రసాయనం phenylethylamine ఇందులో ఉంటుంది. డార్క్ చాక్లెట్ తినడానికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. డార్క్ చాక్లెట్ లో ఉండే ఫోనోఫినాయిల్స్ మెదడులోని ఎండోర్ఫిన్ ఉత్పత్తికి బాగా సహాయపడుతుంది. అంతే కాదు లైంగిక జీవితానికి కూడా బాగా సహాయ పడుతుంది.

ఫిగ్: ఇది పురాతనకాలం నుండి వినియోగిస్తున్నారు. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మాత్రమే కాదు..సెక్స్ లైఫ్ కు సహాయపడటంతో పాటు పురుషుల్లో సంతానోత్పత్తిని పెంపొందిస్తుంది. వీర్యకణాల పెరుగుదలకు సహాయపడుతుంది. డ్రై ఫ్రూట్ ఫిగ్ లిబిడోను సహజంగా పెంపొంధిస్తుంది. సెక్స్ లైఫ్ ను సహజగా పెంచడంలో ఇదొక ఇండియన్ ఫుడ్ గా సూచిస్తారు.

స్ట్రాబెర్రీ: కలర్ ఫుల్ స్ట్రాబెర్రీస్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చూడటానికి మాత్రమే కాదు, రుచి, వాసన కూడా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ సెక్స్ లైఫ్ కు అద్భుతంగా సహాయపడుతాయి.

ఆస్పరాగస్:  దీన్ని ఆహారంగా పురాతన కాలం నుండే తీసుకుంటున్నారు. ఇందులో పొటాషియం, థైమిన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, విటమిన్ సి మరియు విటమిన్ ఇలు పుష్కలంగా ఉన్నాయి. ఇది కండారాలకు బూస్ట్ వంటిది. తగినంత శక్తిని అందిస్తుంది.

అవొకాడో: ఇది బట్టర్ ఫ్రూట్. అవొకాడోలో మోనో సాచురేటెడ్ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఫ్యాట్స్ మగవారిలో టెస్టోస్టిరాన్ ఉత్పత్తికి బాగా సహాయడుతాయి. మరియు ఇవి లైంగిక జీవితానికి కావల్సిన ఎనర్జీలెవల్స్ ను పుష్కలంగా అంధిస్తాయి.

గ్రీన్ వెజిటేబుల్స్: గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ లో అధికంగా జింక్ మరియు ఐరన్ మరియు కావల్సినన్ని విటమిన్లు ఉండి శారీరక ఆరోగ్యానికి మరియు లైంగికజీవితానికి బాగా సహాయపడుతాయి.

రెడ్ వైన్: ఒక గ్లాస్ రెడ్ వైన్ లో కావల్సినన్ని పోషకాంశాలు ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడంతో పాటు హార్ట్ రేట్ ను తగ్గిస్తాయి. అంతే కాదు హార్మోనులను నిలకడగా ఉంచుతాయి. ఒక గ్లాస్ రెడ్ వైన్ త్రాగడం వల్ల సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది.

ధన్యవాదములు 🙏

మీ నవీన్ నడిమింటి

9703706660

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.


1 కామెంట్‌:

pamarthi ss prasad చెప్పారు...

Excellent information Sir...will be in touch with you for Ashwagandha churnam..thank you