రక్త పోటు ఉన్న వాళ్ళు తీసుకోవాలిసిన జాగ్రత్త లు అవగాహన కోసం నవీన్ నడిమింటి సలహాలు ,
Blood Pressure
గుప్పెడంత గుండె మన ఛాతీలో రెండు ఊపిరితిత్తుల మధ్య పెరికార్డియం అనే పోరని కప్పుకొని నియమం గా , నిశ్చలం గా ఉండే ఓ శరీర అవయవము . ఈ గుండె తన క్రమాన్ని , నియమాన్ని తప్పి ఎక్కువగా కొట్టుకున్నా , తక్కువగా కొట్టుకున్నా అది మన జీవనాన్ని శాసించే వ్యాధి ... గుండె జబ్బు. గుండె జబ్బులలో ఒకటి ఈ రక్తపోటు .
గుండె , రక్త నాళా లలో ఉండే రక్తం వాటి గోడలపై చూపించే వత్తిడి ని రక్తపోటు లేదా బ్లడ్ ప్రజర్ అంటారు . ఇది ముఖ్యం గా రెండు స్థితుల పై ఆశారపడి ఉంటుంది . 1.గుండె కండరాలు పంపు చేసే శక్తి , 2. రక్తనాళాలు పంపు చేసిన రక్తాన్ని ఎంతవరకు తీసుకుంటాయో... ఆ శక్తి .
బ్లడ్ ప్రజర్ రెండు స్థితులలో గమనిస్తాము ... గుండె పూర్తిగా ముకులించుకునే (ముడుచుకునే) స్థితి ని " సిస్తొ లిక్ (Systolic)" అని , పూర్తీ గా విచ్చుకునే స్థితిని " డయస్టొలిక్(Diastolic)"అని అంటారు . ఈ రెండిటికీ మధ్య తేడాని " పల్స్ ప్రజర్(Pulse Pressure)" అని వ్యవహరిస్తారు .
బ్లడ్ ప్రజర్ ని కొలిచే సాదనం -- స్పిగ్మో మనో మీటర్ (Spygmomanometer) ఇందులో మెర్కురి రకము మంచిది . watch type - గాలినివాడే రకము , ఎలక్ట్రానిక్ రకము -సరిఅయిన కొలతలను (Readings) చూపించడం లేదు .
ఆరోగ్యవంతమైన నడివయసు వారికి 120 సిస్తోలిక్ , 80 డయాస్టోలిక్ ఉంటుంది . పుల్సు ప్రజర్ 4౦ ఉంటుంది . ఈ రక్తపోటు అనేక అంశాలమీద ఆధారపడి మారుతూ ఉంటుంది . ఇది 140/90 కంటే ఎక్కువైతే " అధిక రక్తపోటు(Hypertension) హై ప్రజర్ " గాను , 90/60 కంటే తక్కువైతే " అల్ప రక్తపోటు (Hypotension) లో ప్రజర్ " గాను అంటాము . ఈ రెన్దూ ప్రమాదకరమైనవే .
రక్తపోటును ఎక్కువ చేసే పరిస్తితులు --
- శారీరకంగా , మానసికంగా .. ఎక్కువ శ్రమ పొందినపుడు ,
- ఆవేశము పడినపుడు ,
- మానసిక ఆందోళన చెందినపుడు ,
- ఉరకనే కోపం తెచ్చుకోవడం ,
- తరచూ నిర్లిప్తతకు లోనుకావడం , భయం , ఆత్రుత .
- వయసు మళ్ళిన వారికి ,
- రక్త నాళాల లోపలి పోర గట్టిపడి పోవడం " ఆర్టీరియో స్క్లీరోసిస్" వలన ,
- మూత్రపిండాల వ్యాధులలోను ,
- రక్తము లో వచ్చే కొన్ని మార్పులు ,
- లావుగా ఉండడము ,
- ఉప్పు , కారాలు ఎక్కువగా తినడం ,
- పొగ , ఆల్కహాల్ .. ఎక్కువగా తాగడం ,
- వంశపారంపర్యం గా వచ్చే రకము .
- ఏదైనా దీర్ఘకాలిక జబ్బు పడినపుడు ,
- ఎక్కువరోజులు ఉపవాసం ఉండటం ,
- మానసిక వ్యాధులకు వాడిన కొన్ని మందులవలన ,
- తీసుకున్న కొన్ని మందులు వికటించినప్పుడు ,
- ఎక్కువ రక్తస్రావం జరిగినపుడు ,
- మధుమేహం ఉన్నప్పుడు ,
వ్యాధి లక్షణాలు :
- తరచూ తలనొప్పి రావడం ,
- నడినెత్తి లో బరువు , భారం గా ఉండడం ,
- తలతిరగడం ,
- చాతి బరువు , నొప్పి గా ఉండడం ,
- చూపు మందగించడం .
- వికారము ,వాంతి అనిపించడం ,
- మాట తడబడడం ,
- తరచూ చెమట పట్టడడం ,
హై బీపీ నివారణ,High B.P prevention
ఈమధ్యకాలంలో ఎక్కువమంది ఎదుర్కొంటున్న సమస్య హై బీపీ. ఆహారపు అలవాట్లు, జీవన శైలి, ఒత్తిడి, మానసిక ఆందోళన, ఊబకాయం, కిడ్నీ సమస్య, హార్మోన్లలో మార్పులు, ఉప్పు ఎక్కువగా తినడం, వంశ పారంపర్య లక్షణం లాంటి అనేక కారణాలతో హై బీపీ వస్తుంది. కారణం ఏదైతేనేం అధిక రక్తపోటు సమస్య మూత్రపిండాల వ్యాధి, గుండెపోటు లాంటి ఆటుపోట్లకు దారితీస్తుంది. బ్రెయిన్ హామరేజ్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. కనుక హై బీపీని అశ్రద్ధ చేయడానికి వీల్లేదు.
బీపీ అదుపు తప్పకుండా చూసుకోవాలి. అందుకు ఎన్నో సులువైన మార్గాలున్నాయి. వాటిల్లో ఏ కొన్ని పాటించినా హై బీపీ నుండి బయట పడవచ్చు. అలాంటి రెమెడీలు మీ కోసం...
- * రోజూ వ్యాయామం చేయాలి. అందువల్ల రక్తప్రసరణ సవ్యంగా సాగి, హై బీపీ తగ్గుతుంది.
- * పచ్చటి చెట్ల మధ్య అరగంటపాటు వాకింగ్ చేస్తే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
- *ప్రాణాయామం, వజ్రాసనం, మత్స్యాసనం మొదలైన ఆసనాలు హై బీపీని తగ్గిస్తాయి.
- * తినే పదార్ధాల్లో ఉప్పు బాగా తగ్గించాలి. వత్తిడిని తగ్గించుకోవాలి. అందుకోసం మెడిటేషన్ చేయాలి.
- * సిగరెట్, ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఉంటే తక్షణం మానేయాలి.
- * ఉసిరి పొడిని తేనెతో రంగరించి తింటే హై బీపీ తగ్గుతుంది.
- * పుచ్చకాయ జ్యూసు అధిక రక్తపోటును నివారిస్తుంది.
అన్నీ తేలికైన మార్గాలే. వీటిల్లో ఏ కొన్నిటిని పాటించినా హై బీపీ నుండి బయటపడవచ్చు. ఇంత సులువైన మార్గాలను వదిలి ప్రాణాంతకమైన హై బీపీని నియంత్రించడం అలాటు చేసుకోవాలి.
హై బి.పి. కి :->
ఆహార అలవాట్లలో మార్పూ -- ఉప్పు ,కారము , క్రొవ్వు పదార్దములు తక్కువగా తినాలి , వ్యసనాలు (తాగుడు ,ధూమపానము ) మానివేయాలి .
క్రమము తప్పకుండ వ్యాయామము చేయాలి .
వాడె మందులు :
central Acting:
adelphan , levo dopa .
periperally Acting :
Alpha blockers---Alfuzosin , * Prazosin * Doxazosin * Tamsulosin * Terazosin
Beta blockers --, atenolol,metaprolol
Calcium chanel blockers,--- depin ,amlodepin
ACE inhibitors ,--=eg.-analapril maleate
ARBlockers ,---=eg. all sartans - telmisartan
Diuretics eg ;--- frusemide , spiranolactone
LowPressure కి మందులు అవసరం ఉండదు .
- నీరసంగా ఉన్నప్పుడు ... పడుకొని రెస్ట్ తీసుకోవాలి .
- నీరు , మజ్జిక త్రాగాలి ,
- అవసరమైతే .. డాక్టర్ సలహాతో సెలైన్ ఎక్కించుకోవాలి .
- బి .కాంప్లెక్ష్ మాత్రలు వాడితే లోప్రెజర్ అంతగా రాదు .
రక్తపోటుకు చెక్ కి కొన్ని చిట్కాలు :
రక్తపోటు సాధారణ స్థాయి 120/80. ఇది చాలామందికి తెలిసిందే. మరి అధికరక్తపోటు అంటే... 140/90. అదే చక్కెరవ్యాధి, మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారికైతే అది 130/80కి చేరుకున్నా ప్రమాదంలో పడ్డట్టే. దీని బారి నుంచి తప్పించుకోవాలంటే జీవనశైలీ ఆహారపుటలవాట్లూ మార్చుకోవాల్సిందే.
ఆహారంలో ఉప్పు తగ్గించగానే సరిపోదు, పొటాషియం అధికంగా లభ్యమయ్యే పళ్లూ కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. బొప్పాయి, అరటి, మామిడి, కమలా, స్ట్రాబెర్రీ పళ్లల్లోనూ బంగాళదుంప, టొమాటో, దోస, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, తాజా క్యారెట్లు వంటి కూరగాయల్లోనూ పొటాషియం అధికం. పచ్చిటొమాటోల్లో ఉండే లైకోపీన్ బీపీని తగ్గిస్తుంది. మటన్, బీఫ్, పోర్క్ వంటివాటిని తగ్గించి చేపల్ని ఎక్కువగా తినాలి. వంటల్లో నువ్వులనూనె వాడితే మంచిది. అప్పడాలు, వడియాలు అస్సలు తినొద్దు.
రోజుకు ఒక కప్పు మించి కాఫీ తాగొద్దు. అందులో ఉండే కెఫీన్ గుండెపై ఒత్తిడిని పెంచుతుంది. ఫలితంగా రక్తపోటు పెరుగుతుంది. పొగతాగడం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోతాయి. మద్యపానం అలవాటుంటే ఒకటిన్నర పెగ్గుకు మించకూడదు.
రోజూ పూలమొక్కల మధ్య కాసేపు నడిస్తే ప్రశాంతంగా ఉంటుంది.
నిత్యం ధ్యానం చేయడం వల్ల కూడా ఫలితం కనిపిస్తుంది.
వృద్ధాప్యంలో అధిక రక్తపోటు
వయస్సు పెరిగే కొద్దీ చాలామందిలో అధిక రక్త పోటు ఉంటుంది. 2005 సంవత్సరంనాటి గణాంకాల ప్రకారం అమెరికాలో 6.5 కోట్లమం దికి అధిక రక్తపోటు ఉండగా, వీరిలో చాలా మంది వృద్ధులే.
వృద్ధాప్యంలో అధిక రక్తపోటు వల్ల గుండె పోటు, పక్షవాతం, గుండె వైఫల్యం, మూత్ర పిండాల వైఫల్యం మొదలైన సమస్యలన్నీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.
వృద్ధుల్లో వయస్సును బట్టి రక్తపోటు కొంత ఎక్కువగా ఉండవచ్చుననే అపోహ ప్రజల్లో ఉండేది. ఇది సరైన అవగాహన కాదని శాస్త్రీ యంగా నిరూపణ అయింది.
70 సంవత్సరాల వయసు వారిలో సిస్టో లిక్ రక్తపోటు 170 ఉండవచ్చుననే అభిప్రాయం సరికాదు. ఏ వయస్సులోని వారికైనా సిస్టోలిక్ రక్తపోటు 140, అంతకంటే ఎక్కువ ఉండకూ డదు. డయస్టోలిక్ రక్తపోటు 90 అంతకంటే ఎక్కువ ఉండకూడదు.
వయస్సు పెరుగుతున్నకొద్దీ 80 ఏళ్ల వరకూ సిస్టోలిక్ రక్తపోటు పెరుగుతూ ఉంటుందని, 55 సంవత్సరాల వయస్సు తరువాత డయ స్టోలిక్ రక్తపోటు పెద్దగా పెరగదని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది.
సిస్టోలిక్ రక్తపోటు 140, అంతకంటే ఎక్కువ గానూ, డయస్టోలిక్ రక్తపోటు 90 అంతకంటే తక్కువగానూ ఉండటాన్ని ఐసోలేటెడ్ సిస్టోలిక్ అధిక రక్తపోటు అంటారు. ఈ విధమైన అధిక రక్తపోటు 60 సంవత్సరాల వయస్సు దాటిన అధిక రక్తపోటు రోగుల్లో 65 శాతం మందిలో ఉంటున్నదని సర్వేలు తెలుపుతున్నాయి.
సిస్టోలిక్ రక్తపోటు సంఖ్యనుంచి డయస్టోలిక్ రక్తపోటు సంఖ్యను తీసివేయగా వచ్చిన దానిని పల్స్ ప్రెషర్ (నాడి ఒత్తిడి) అంటారు.
మామూలుగా ఉండవలసిన రక్తపోటు 120/80 కాగా, మామూలు పల్స్ ప్రెషర్ 40. ఒక వృద్ధుడికి రక్తపోటు 170/90 ఉంటే అతడి పల్స్ ప్రెషర్ 80 అని చెప్పవచ్చు.
ఈ విధంగా వృద్ధాప్యంలో పెరిగే సిస్టోలిక్ రక్తపోటు, పల్స్ ప్రెషర్‌లు తమ దుష్ప్రభా వాలను ఆ వ్యక్తి గుండె మీద, రక్తనాళాల మీద చూపిస్తాయి.
ఎసెన్షియల్ హైపర్‌టెన్షన్,Essential Hypertension
నూటికి సుమారు 95మందిలో రక్తపోటు పెరగ టానికి కారణాలు ఇతమిత్థంగా తెలియవు. దీనిని ఎసెన్షియల్ (ప్రైమరీ) హైపర్‌టెన్షన్ అంటారు. 5 నుంచి 10 శాతం రోగుల్లో అధిక రక్తపోటుకు కొన్ని ప్రత్యేక వ్యాధులు కారణం కావచ్చు. వీటిని సెకండరీ హైపర్ టెన్షన్ అంటారు.
ఎసెన్షియల్ హైపర్‌టెన్షన్ రావడానికి వంశానుగత కారణాలు ముఖ్యపాత్ర వహిస్తాయని వైద్య శాస్త్రవే త్తలు విశ్వసిస్తున్నారు. అధిక రక్తపోటు వంశపారం పర్యంగా వచ్చే వ్యాధుల్లో ఒకటని చెప్పవచ్చు.
రక్తపోటు మామూలుగా ఉన్నవారిలో కంటే రక్త పోటు అధికంగా ఉన్నవారి రక్త బంధువుల్లో అధిక రక్తపోటు, పక్షవాతం, కరొనరీ గుండె జబ్బులు ఒకటిన్నర రెట్లు ఎక్కువ. అధిక రక్తపోటు ఉన్నవారి తల్లిదండ్రుల్లో, రక్తబంధువుల్లో పక్షవాతం (పెరాలి సిస్) 3 నుంచి 5 రెట్లు ఎక్కువని వైద్యశాస్త్ర నివేది కలు పేర్కొంటున్నాయి.
వయస్సు పెరిగే కొద్దీ పురుషుల్లోనూ, స్త్రీలలోనూ రక్తపోటు పెరుగుతూ ఉంటుంది. 50 సంవత్సరాల వయస్సు వరకు ఈ వ్యాధి పురుషుల్లో ఎక్కువగా ఉంటున్నది. తరువాతి వయస్సులో అధిక రక్తపోటు స్త్రీ పురుషుల్లో దాదాపు సమంగానూ, వృద్ధాప్యంలో స్త్రీలలో కొంత ఎక్కువగాను ఉంటున్నది.
-ఫ్రామింగ్‌హామ్ అధ్యయనం ప్రకారం 30 నుంచి 65 సంవత్సరాల వరకు సిస్టోలిక్ రక్తపోటు సగటున 20 మిల్లీమీటర్ల చొప్పున, డయస్టోలిక్ రక్తపోటు 10 మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతూ ఉంటుందని వెల్లడైంది. రక్తపోటు అధికంగా ఉన్నవారిని 20 సంవత్సరాలపాటు పరీక్షించగా, వయస్సు పెరిగే కొద్దీ కరొనరీ గుండెజబ్బు వచ్చే అవకాశాలు మరింత ఎక్కువ అవుతాయని స్పష్టమైంది.
అధిక రక్తపోటు ఉన్న వారిలో 38 శాతం మంది స్థూలకాయులని వెల్లడైంది. మద్యపానం వల్ల సిస్టోలిక్ రక్తపోటు పెరుగుతుంది. అధి కంగా పొగ తాగే వారిలో రక్త పోటు, గుండెపోటు, హఠాన్మ రణం ఎక్కువ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
పొగాకులోని నికోటిన్ గుండె వేగాన్ని, రక్తపోటును పెంచుతుంది. రోజువారీ వ్యాయామం చేసే వారిలో కంటే శారీరక వ్యాయామం చేయకుండా సోమరి జీవనాన్ని గడిపే వారిలో అధిక రక్తపోటు ఎక్కువగా ఉంటుంది. ఆహారంలో ఉప్పు ఎక్కువగా వినియోగిం చడానికి, అధికరక్తపోటుకు సంబంధం ఉన్నదని అధ్య యనాల్లో వెల్లడైంది.
ఆహారంలో రోజుకు రెండు గ్రాముల కంటే తక్కువ ఉప్పు వాడే వారిలో (ఉదాహరణకు దక్షిణ అమెరికా, ఆఫ్రికా, దక్షిణ పసిఫిక్ దీవుల్లోని కొన్ని జాతులు) అధిక రక్తపోటు దాదాపు లేదనే చెప్పవచ్చు.
తినే ప్రతి వస్తువులో ఉప్పు వేసుకునే వారిలో అధిక రక్తపోటు ఎక్కువ. శరీరానికి ఉప్పు అవసరమే. ప్రతి జీవకణంలోను ఉప్పు ఉంటుంది. రక్తంలోనూ, శరీర కణాల్లోనూ ఉప్పు ఒక నిర్ణీత స్థాయిలో ఉండే విధంగా మూత్ర పిండాలు నియంత్రి స్తాయి. ఒక మామూలు వ్యక్తికి రోజుకు 2 నుంచి 3 గ్రాముల ఉప్పుకంటే ఎక్కువ అవసరం లేదు. ఈ మాత్రం ఉప్పు మనం తీసుకునే ప్రాథమిక ఆహారాల్లోనే ఉంటుంది. దీనికి ఉదాహరణగా పండ్లు, పచ్చి కూరగాయలను చెప్పుకోవచ్చు.భారతీయులు సాధారణంగా రోజుకు 5 నుంచి 15 గ్రాముల వరకూ అంటే సగటున 8 గ్రాముల ఉప్పు తీసుకుంటారు. మనకు అవసరమైన 2 నుండి 3 గ్రాముల ఉప్పు కాకుండా, వంటలో కాని, భోజనం చేసేప్పుడు కాని మరింత ఉప్పును (3 నుంచి 10 గ్రాముల వరకూ) అదనంగా కలిపి తింటారు.
మామూలు వ్యక్తుల్లో ఈ అదనపు ఉప్పును మూత్ర పిండాలు రక్తంనుండి మూత్రం ద్వారా విసర్జిస్తాయి. వంశానుగతంగా సంక్రమించిన లోపాల వల్ల, అధిక రక్తపోటు ఉన్న వ్యక్తుల్లో, ఆహారం ద్వారా అదనంగా చేరిన ఉప్పును మూత్ర పిండాలు విసర్జించకపోవడం వల్ల మరింత సోడియం, నీరు, రక్తంలోను, కణాల్లోనూ నిలువ ఉండిపోతుంది.
ధమనుల గోడల్లోని కణాల్లోకి మరింత సోడియం, నీరు చేరడం వల్ల ధమనులు కుంచించుకుపోయి, గుండె నుండి రక్తప్రవాహానికి ఆటంకం ఏర్పడి, మొత్తం వాస్క్యులార్ రెసిస్టెన్స్ పెరిగి తద్వారా రక్తపోటు అధికమవుతుంది. రక్తపోటు పెరిగే అవకాశం ఉన్నవారిలో, ఎక్కువ ఉప్పు వినియోగించడం వల్ల, అధిక రక్తపోటు వస్తుందని వైద్య పరిశోధకుల నిశ్చితాభిప్రాయం.
జపాన్, కొరియా దేశాల ప్రజల్లో రోజుకు 6 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకునే అలవాటు ఉంది. పక్షవాత వ్యాధి మిగతా దేశాలకంటే జపాన్‌లో ఎక్కువగా ఉంటున్నది. జపాన్ దేశీయులు 1971 - 1981 మధ్య కాలంలో ఉప్పును రోజుకు 4 గ్రాముల కంటే తక్కువ వినియోగించడం ప్రారంభించాకా, అధిక రక్తపోటు తగ్గుముఖం పట్టింది.
బెల్జియం దేశంలో 1968 - 81 మధ్య కాలంలో ఉప్పు వినియోగం తగ్గించిన తరువాత పక్షవాతం తగ్గుముఖం పట్టింది. అధిక రక్తపోటు ఉన్న వ్యక్తుల సంతానంలో కూడా ఉప్పు ఎక్కువగా వాడటం వల్ల, ఆందోళన కలిగించే సందర్భాల్లోనూ, చిన్నవయస్సులోనే రక్తపోటు పెరగవచ్చు.
ఎసెన్షియల్ హైపర్‌ట ెన్షన్‌కు దారి తీసే మరి కొన్ని కారణాలను వైద్య శాస్త్రజ్ఞులు విశ్లేషిస్తున్నారు. వంశానుగత కారణాల వల్ల మానసిక ఒత్తిళ్ల వల్ల, మెదడులోని సింపథిటిక్ నాడీ మండలం ప్రభావితం చెంది ఎడ్రినలిన్, నార్ ఎడ్రినలిన్‌ల ఉత్పత్తి ఎక్కువ అవుతుంది.
ఇవి గుండె వేగాన్ని, గుండెనుండి ప్రవహించే రక్త పరిమాణాన్ని పెంచడమే కాకుండా, ధమనులను కుంచింప చేయడం ద్వారా రక్తపోటును పెంచు తాయి. సింపథిటిక్ నాడీ మండలం ప్రోద్బలం వల్ల మూత్ర పిండాలు, ఎడ్రినల్ గ్రంథుల్లోని ఎంజైములు (రెనిన్, ఏంజియోటెన్సిన్ - ఆల్డో స్టిరోన్ సిస్టమ్) చైతన్యవంతం అవుతాయి.
ఏంజియోటెన్సిన్ ధమనులను అధికంగా కుంచింపజేయడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఎడ్రినల్ గ్రంథుల్లో ఉత్పత్తి అయ్యే హార్మోన్ ఆల్డో స్టీరోన్ వల్ల మూత్రపిండాలు మరింత సోడియంను, నీటిని శరీరంలో నిలువ చేయడం ద్వారా రక్తపోటు పెరుగుతుంది. ఇంకా అనేక పరిశోధనలు జరుగు తున్న ఈ రంగంలో ఎసెన్షియల్ హైపర్‌టెన్షన్‌కు సరైన కారణం ఇంకా నిర్ధారణ కాలేదు.
స్త్రీలలో కుటుంబ నియంత్రణకు వాడే మదుల వల్ల కొంతమందిలో కొద్దిగా రక్తపోటు పెరుగవచ్చు. ఈ మందులు వాడటం మానివేశాకా, 6 నెలల్లో రక్తపోటు తిరిగి మామూలు స్థితికి వస్తుంది. స్టీరాయిడ్ ఔషధాలు, ఉబ్బస వ్యాధికి, జలుబుకు, కీళ్ల నొప్పులకు వాడే మందుల వల్ల కూడా కొంతమందిలో రక్తపోటు పెరగవచ్చు. డాక్టర్ సలహా లేనిదే స్వంతంగా ఏ మందులూ వాడకూడదు.
అధిక రక్తపోటుకు అత్యాధునిక చికిత్స-
దేశంలో తొలిసారిగా 'కేర్'లో ఆరంభం
హైదరాబాద్, న్యూస్‌టుడే: అధిక రక్తపోటును తగ్గించేందుకు అధునాతన 'రీనల్ డినర్వేషన్ థెరపీ' విధానాన్ని హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రి అందుబాటులోకి తెచ్చింది. మూత్రపిండాలకు వెళ్లే నాడుల సున్నితత్వాన్ని తగ్గించటం ఈ చికిత్స ప్రత్యేకత. దీనిని మన దేశంలో తొలిసారిగా తమ ఆసుపత్రిలోనే అందిస్తున్నట్టు ఆసుపత్రి వైద్యులు డా. సి.నరసింహన్, డా.చక్రవర్తి, డా. శ్రీనివాస్, డా. సోమరాజు తెలిపారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో వారు విలేకరులతో మాట్లాడారు. మందులు వేసుకుంటున్నా రక్తపోటు నియంత్రణలోకి రానివారికి ఈ చికిత్సతో మంచి ఫలితాలు కన్పిస్తున్నాయన్నారు. చికిత్సలో భాగంగా చిన్న శస్త్ర చికిత్స చేస్తారని.. ఆరుగంటల్లోనే రోగిని ఇంటికి పంపిస్తారని వివరించారు. ఇప్పటికే నలుగురికి దీని ద్వారా ఉపశమనం లభించిందని తెలిపారు.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
విశాఖపట్నం
9703706660
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ వాట్సాప్ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి