27, జనవరి 2021, బుధవారం

అమ్మాయి లో ఋతుచక్ర సమస్య అవగాహనా కోసం ఈ లింక్స్ లో చూడాలి

స్త్రీలలో రుతుచక్ర సమస్యలు పై అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు అవగాహనా కోసం మాత్రమే 

అమినోరియా

అమినోరియా: స్ర్తీలలో రుతుక్రమం రాకపోవడాన్ని అమినోరియా అంటారు. ఇది రెండు రకాలు

ప్రైమరీ అమినోరియా:

అనగా స్ర్తీలు యుక్త వయసుకు వచ్చినప్పటికీ అనగా 16 సంవత్సరాలు తరువాత కూడా రుతుచక్రం ప్రారంభం కాకపోవడాన్ని ప్రైమరీ అమినోరియా అంటారు

కారణాలు: క్రోమోజోమల్‌ లేదా జన్యుపరమైన సమస్యలు ముఖ్యంగా టర్నర్స్‌ సిండ్రోమ్‌, గర్భాశయ నిర్మాణలోపాలు, గర్భాశయ ఇన్‌ఫెక్షన్లు, సిస్టిక్‌ ఫైబ్రోసిస్‌, కుషింగ్స్‌ సిండ్రోమ్‌ వంటి సమస్యలు హార్మోన్‌ అసమతుల్యతలు ముఖ్యంగా ఎడ్రినల్‌ గ్రంధి సమస్యలు, కేన్సర్‌ నివారణ మాత్రలు, ఆంటీ డిప్రెసివ్‌ మాత్రలు కారణమవుతాయి.

సెకండరీ అమినోరియా:

బహిష్టు ప్రక్రియ సక్రమంగా ఉండి, సంతానోత్పత్తి దశ లో మాత్రం స్ర్తీలలో 3 నెలల వరకు బహిష్టు కాకపోవడాన్ని సెకండరీ అమినోరియా అంటారు.

కారణాలు: పిల్లలకు పాలు ఇచ్చే సమయంలో తల్లికి నెలసరి రాదు. దీనికోసం ఎలాంటి ట్రీట్‌మెంట్‌ అవసరం లేదు. పిట్యూటరీ గ్రంధి, థైరాయిడ్‌ సమస్యలు, గర్భనిరోదక మాత్రలు, కొన్ని రకాల ఆంటి డిప్రెషన్‌ మందులు వాడటం, పీసీఓడీ(పాలిసిస్టిక్‌ ఒవేరియన్‌ డిసీజ్‌), శక్తికి మించి వ్యాయామం చేయడం, ఎక్కువ సార్లు డి్క్షసి చేయడం, గర్భ సంబంధిత ఆపరేషన్లు.

ఆలిగోమెనోరియా: రుతుచక్రం 35-40 రోజుల కంటే ఎక్కువ రోజులకు రుతుస్రావం రావడం లేదా నెలసరి సమయంలో 30మిల్లిలీటర్ల కంటే తక్కువ రుతుస్రావం కావడాన్ని అలిగోమెనోరియా అంటారు.

కారణాలు: పీసీఓడీ, పిట్యుటరీ గ్రంధిలో కణతులు ఏర్పడటం, నెలసరి ఆగిపోయే సమయంలోనూ వచ్చే అవకాశం ఉంది.

మెట్రోరేజియా: రెండు రుతుచక్రాల మధ్యలో రుతుస్రావం కనబడటాన్ని మెట్రోరెజియో అంటారు. ముఖ్యంగా అండం విడుదల సమయంలో ఈ మెట్రోరేజియో కనిపించే అవకాశం ఉంది.

కారణాలు: అడినోమస్‌, ఎండోమెట్రియాసిస్‌, ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ, హార్మోన్ల అసమతుల్యత, గర్భ నిరోధక పరికరాలు (ఐయూడీ), గర్భనిరోధక మాత్రల వల్ల కూడా మెట్రోరెజియో ఉంటుంది.

మెనోరేజియా: సాధారణం కంటే ఎక్కువ రోజులు రుతుస్రావం కావడాన్ని మెనోరేజియో అంటారు.

కారణాలు: గర్భాశయంలో కణుతులు, పీసీఓడీ థైరాయిడ్‌ సమస్యలు, ఎండోమెట్రియాసిస్‌, గర్భాశయంలో కేన్సర్‌ వంటి కారణాలు మెనోరేజియాకు దారి తీస్తాయి.

డిస్మెనోరియా: సీ్త్ర సాధారణ దినచర్యలను ప్రభావితం చేసేంతటి తీవ్రమైన పొత్తికడుపు నొప్పి నెలసరి సమయంలో రావడాన్ని డిస్మెనోరియా అంటారు. ఇది నెలసరికి కొద్ది రోజుల ముందు కానీ లేదా నెలసరి ప్రారంభమైన మొదటి రోజు నుంచి 3 రోజుల వరకు ఉండవచ్చు.

కారణాలు: ఎండోమెట్రియోసిస్‌, గర్భసంచికలో కణుతులు, అండాశయంలో నీటి తిత్తులు ఏర్పడటం, హార్మోన్‌ అసమతుల్యతలు.

నిర్ధారణ పరీక్షలు: రక్త పరీక్షలు - సీబీపీ, ఈఎస్‌ఆర్‌, హార్మోన్‌ పరీక్షలు - ఎఫ్‌ఎస్‌హెచ్‌, ఎల్‌హెచ్‌, ఎస్‌ ప్రోలాక్టిన్‌, థైరాయిడ్‌ ప్రోఫిక్‌, అలా్ట్రసౌండ్‌, సిటి స్కాన్‌ అబ్డామిన్‌ ద్వారా రుతుచక్ర సమస్యలకు గల కారణాన్ని గుర్తించవచ్చు.

హోమియోకేర్‌ వైద్యం: హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌ జెనటిక్‌ కాన్స్‌టిట్యూషనల్‌ పద్ధతిలో జరుపబడే చికిత్స ద్వారా రుతుచక్ర సమస్యలకు మూల కారణమైన హార్మోన్ల అసమతుల్యతను, పీసీఓడీ, గర్భాశయంలోని ఇతర సమస్యలను సరిచేసి, గర్భాశయం ఆరోగ్యంగా ఉండేలా చేసి రుతుచక్ర సమస్యలు సంపూర్ణంగా, ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా దూరం చేయవచ్చు.

మహిళల్లో బుతుస్రావం గురించి కొన్ని సాధారణ అపోహలు

సమీరా ఆమె బాస్ ను ఒక రోజు లీవ్ కావాలని కోరారు. ఎందుకు? ఎందుకంటే ఆమెకు పీరియడ్స్ మొదలైన రోజు. ఆమెకు ఆ సమయంలో చాలా తక్కువ మరియు నీరసమైన భావనలు ఉంటాయి. ఆమెకు ఆఫీసు లేదా పార్టీకి హాజరు కావడానికి మూడ్ ఉండదు. ఆమె షాప్ కి వెళ్ళటానికి తిరస్కరిస్తుంది. ఇక్కడ ప్రతి స్త్రీ తెలుసుకోవలసిన ఋతుస్రావానికి సంబంధించిన కొన్ని అపోహలు ఉన్నాయి.

మహిళల్లో ఋతుస్రావం గురించి 9 సాధారణ అపోహలు:

దీనిలో మొత్తం నిజం లేదు. ఎందుకంటే రక్తం నష్టం వలన శరీరం బలహీనం అవదు. మీరు 150 ml రక్తాన్ని మాత్రమే కోల్పోతారు. అంటే 4-6 స్పూన్ల రక్తాన్ని మాత్రమే కోల్పోతారనేది నిజం. కానీ,మీకు రక్తహీనత ఉంటే అది ఒక బిన్నమైన పరిస్థితి అని చెప్పవచ్చు.

ఋతు రక్తం ఒక ఏలియన్ గా భావన:

నో మహిళలు! రక్తం,ఋతు చక్రం సమయంలో రక్తాన్ని పోలి ఉంటుంది. సాధారణ రక్తస్రావం ఉన్నప్పుడు, చెడు వాసన ఉండదు. దాని గురించి అసాధారణం ఏమీ లేదు.గుర్తుంచుకోండి! బాక్టీరియా నివారించేందుకు ప్యాడ్స్ మార్చండి.మిమ్మల్ని తాజాగా ఉంచుతుంది.

వ్యాయామం లేకపోవుట:

ఇది ఒక చెత్త అపోహ మాత్రమే. మీ వర్క్ అవుట్స్ మిమ్మల్ని నిర్వీర్యం చేయవచ్చు. కానీ, మీకు యోగ సాధన ఉంటే,అప్పుడు స్త్రేచింగ్ మరియు భారీ శ్వాస ఆసనాలను నివారించాలి. మీరు కూడా మహాసముద్రాలలో ఈత కోసం వెళ్ళవచ్చు. చింతించకండి,రక్త స్రావాలు ఉంటే సొరచేపలు విందు చేసుకుంటాయని భయపడకండి.

సెక్స్ మానుకోండి:

మీరు ఇబ్బందిగా భావిస్తే, మీరు సెక్స్ ను నివారించవచ్చు. కానీ,మీకు మరియు మీ భాగస్వామికి ఇష్టమైతే, అప్పుడు విశ్రాంతిని మర్చిపోండి. ఏమి అనుకుంటున్నారు? భావప్రాప్తి అనేది మీకు తీవ్రమైన తిమ్మిరిని కలిగిస్తుందా.

ఋతు తిమ్మిరి:

ఇది ప్రతి స్త్రీ ఎదుర్కొనే మొట్టమొదటి ఇబ్బంది. మొదటి రోజు తీవ్రమైన నొప్పి ఉండటం సాధారణం. అలాగే మీరు చాక్లెట్లు తింటే ఇది తగ్గుతుంది. ఇది బాగా పనిచేస్తుంది. నమ్మండి. ఇంకా తగ్గకపోతే ఒక గైనకాలజిస్ట్ ని సంప్రదించండి.

విశ్రాంతి, గర్భం రాదు:

ఇది ఒక అపోహ మాత్రమే. పీరియడ్స్ సమయంలో మీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ పని ఆపదు. మీరు పిరియడ్ సమయంలో కూడా గర్భం పొందవచ్చు. అలాగే ఒక మంచి కండోమ్ ను ఉపయోగించండి. అవాంఛిత గర్భం ధరించినప్పుడు,దానిని నిరోధించడానికి గర్భ నిరోధక మాత్రలను తీసుకోవాలి.

జుట్టు శుభ్రం చేయకూడదు:

ఎవరు చెప్పారు? పిరియడ్ సమయంలో షాంపూ ఉపయోగించ కూడదని ఖచ్చితమైన కారణం ఏమి లేదు. మీరు మీ జుట్టును శుభ్రం చేయవచ్చు. అలాగే జుట్టు కత్తిరించుట,హెయిర్ స్పా కి వెళ్ళుట, జుట్టుకు రంగు వేయుట,జుట్టు స్రైట్ చేయుట వంటివి చేయవచ్చు.

తినకూడదు:

ఇది ఒక అపోహ మాత్రమే. ఈ రోజులలో ఏదైనా తినవచ్చు. మీకు నచ్చినది ఏదైనా తినవచ్చు. ఈ 5 రోజులు ఎటువంటి ప్రత్యేక ఆహారం చార్ట్ అనుసరించవలసిన అవసరం లేదు.

28 రోజుల చక్రం:

సాదారణంగా ఋతుస్రావ చక్రం మహిళ యొక్క భౌతిక ఆరోగ్యాన్ని బట్టి మారుతూ ఉంటుంది. 28 రోజుల చక్రం కేవలం సగటు సమయం మాత్రమే. కాబట్టి మహిళలు ఉత్సాహంగా నినాదాలు చేయండి ! మీకు కావలసింది చేసి ఆనందించండి!

గైనిక్ సమస్యలు - పరిష్కారాలు

పీరియడ్స్ సమయంలో నొప్పి...ఏం చేయాలి... ?

నా వయసు 15 ఏళ్లు. ఏడాది క్రితం పుష్పవతిని అయినప్పటి నుంచి పీరియడ్స్ సమయంలో పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి వస్తోంది. ఈ నొప్పి తగ్గడానికి ఏం చేయాలి? భవిష్యత్తులో దీనివల్ల ఏమైనా ప్రమాదమా? దయచేసి వివరించగలరు. నాకు చాలా భయంగా ఉంది.

చాలామంది యువతుల్లో రుతుక్రమం మొదలయ్యాక పీరియడ్స్ సమయంలో పొత్తికడుపులో నొప్పి రావడం అన్నది చాలా సాధారణమైన విషయం. చాలా మంది దీని గురించి ఆందోళన పడతారు. అయితే ఇది చాలా సహజమైన విషయం. ఇలా నొప్పి రావడం చాలా మందిలో కనిపించేదే. పీరియడ్స్ రావడానికి 14 రోజుల ముందు అండం విడుదలై ఉంటుంది. అంటే పీరియడ్స్‌కు 14 రోజుల ముందుది ఓవ్యులేషన్ పీరియడ్ అన్నమాట.

అది ఫలదీకరణ జరగకపోవడం వల్ల క్షీణించిన అండం రాలిపోవడం పీరియడ్స్ సమయంలో జరుగుతుంది. చాలామందికి ఈ టైమ్‌లో నొప్పి వస్తుంది. ఈ సమయంలో నొప్పి ఉండటం ఎంత ఆరోగ్యకరమైన లక్షణం అంటే... పీరియడ్స్ సమయంలో నొప్పి లేని యువతుల్లో కంటే... పీరియడ్స్ సమయంలో నొప్పి ఉన్న యువతులకే పెళ్లి తర్వాత గర్భధారణకు అవకాశాలు చాలా ఎక్కువ. పీరియడ్స్ మొదలైన తొలి 24 గంటల్లో నొప్పి ఎక్కువగా ఉండి ఆ తర్వాత క్రమంగా తగ్గుతుంది.

ఈ నొప్పి మరీ భరించలేనంతగా ఉంటే తీవ్రతను బట్టి ప్రతి ఎనిమిది గంటలకు లేదా ప్రతి 12 గంటలకు ఒకటి చొప్పున రెండు మూడు నొప్పి నివారణ మాత్రలు వాడితే సరిపోతుంది. అయితే ఈ నొప్పి 3, 4 రోజుల పాటు తగ్గకుండా వస్తున్నా లేదా పెయిన్ కిల్లర్స్ వాడాక కూడా నొప్పి ఏమాత్రం తగ్గకున్నా లేదా... పీరియడ్స్‌కూ, పీరియడ్స్‌కూ మధ్యన నొప్పి వస్తున్నా... కొంచెం ఆలోచించవలసిన విషయమే. కాబట్టి అలా ఉంటే మాత్రం డాక్టర్‌ను సంప్రదించండి.

యూరిన్ సమస్య తగ్గడం లేదు...

నా వయసు 22. ఇంకా పెళ్లికాలేదు. ఒకసారి పదిహేను రోజులకు, ఇంకోసారి 28 రోజులకు పీరియడ్స్ వస్తుంటాయి. విపరీతమైన మాడునొప్పి ఉంటుంది. మలబద్దకం, యూరిన్ సమస్యలు ఉన్నాయి. బయటకు వెళ్లినప్పుడు యూరిన్ సమస్య మరీ బాధిస్తోంది. ఏం చేయమంటారో చెప్పగలరు.

మీరు చెప్పిన సమస్యలన్నీ విడివిడిగా పరీక్షించడం మంచిది. చుండ్రు, పేలు వంటివి ఉన్నా తలనొప్పి రాదు. తలనొప్పికి టెన్షన్లు, రక్తహీనత, మైగ్రేన్, దృష్టికి సంబంధించిన సమస్యలు ముఖ్యమైన కారణాలు. ఇవి కాక చెవికి, పళ్లకి, మెదడుకు సంబంధించిన ఎన్నో కారణాలు తలనొప్పికి దారితీయవచ్చు. మలబద్దకానికి ఈ వయసులో సరైన ఆహారపు అలవాట్లు పాటించకపోవడమే ముఖ్యకారణం. పీచు ఎక్కువగా ఉండే ఆకుకూరలు, మునక్కాయ, టొమాటో, క్యాబేజీ, బీన్స్.. వంటి కూరగాయలు ఎక్కువగా తీసుకోండి. రోజుకి రెండు నుంచి మూడు లీటర్ల నీళ్లు తాగండి. ఇక మూత్ర సమస్యకి డాక్టర్‌ని కలిసి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లేదా నులిపురుగుల సమస్య ఉందేమో పరీక్షలు చేయించుకోండి. పీరియడ్స్‌కు సంబంధించి కూడా థైరాయిడ్, ప్రొలాక్టిన్ వంటి హార్మోన్లు స్కానింగ్ ద్వారా గర్భసంచి, ఓవరీస్ చూడాల్సి ఉంటుంది. అందువల్ల మీరు చెప్పిన సమస్యలన్నింటికీ విడివిడిగా డాక్టర్‌చేత పరీక్ష చేయించుకొని తగు చికిత్స పొందండి.

నా వయసు 20. బరువు 72. ట్యాబెట్లు వాడితే తప్ప పీరియడ్స్ రావు. డాక్టర్ స్కానింగ్ తీసి పీసీఓడీ అని చెప్పారు. మోచేతులు, పొట్ట, గడ్డం, పెపైదవి... మీద వెంట్రుకలు వస్తున్నాయి. తీసేస్తే మళ్లీ వస్తున్నాయి. నా సమస్యల పరిష్కారానికి ఎవరిని సంప్రదించాలి?

పాలిసిస్టిక్ ఓవరీస్ అనే కండిషన్‌లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్, బరువు పెరగడం, అవాంఛిత రోమాలు రావడం వంటివి గమనిస్తాం. హార్మోన్ల హెచ్చు తగ్గుల వల్ల బరువు పెరగడంతో పీరియడ్స్‌లో క్రమం తప్పడం, తిరిగి బరువు పెరగడం జరుగుతుంటాయి. దీనికి చికిత్స రెండురకాలుగా ఉంది. ఒకటి- డాక్టర్ ఇచ్చే షార్ట్‌టర్మ్ ట్రీట్‌మెంట్. అంటే పీరియడ్స్ సక్రమంగా రావడానికి మూడు నుంచి ఆరు నెలల దాకా ట్యాబ్లెట్లు వాడటం. రెండవది- పేషంట్ చేయవలసిన లాంగ్‌టర్మ్ ట్రీట్‌మెంట్. దీనిలో సరైన ఆహారం తీసుకోవడం, బరువు నియంత్రించుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటివి ముఖ్యమైనవి. డాక్టర్ ఇచ్చే ట్యాబ్లెట్లు క్రమం తప్పకుండా వేసుకున్నా కాని దీర్ఘకాలికంగా ఫలితాన్ని చూపించే జీవనశైలిలో మార్పులు ఎంత వరకు చేయగలిగారు?వంటి వాటిపై కూడా దృష్టి సారించి, బరువు కొంత తగ్గగలిగితే ఈ సమస్యను నియంత్రించవచ్చు. అవాంఛిత రోమాలు ట్రీట్‌మెంట్ ద్వారా తగ్గవు. ఇంకా ఎక్కువగా రాకుండా ట్రీట్‌మెంట్ మీకు ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఉన్న అవాంఛిత రోమాలను వ్యాక్సింగ్ లేదా లేజర్ పద్ధతిలో తొలగించుకోండి.

నెలసరి కడుపు నొప్పి

కొంత మందికి నెలసరికీ నెలసరికీ మధ్యలోనూ రక్తస్రావం అవుతుంది. నెలసరి సమయంలో గానీ లేదా అంతకు ముందు గానీ తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంది. లక్షణాలను అనుసరించి హోమియో మందులు వే సుకుంటే చాలా వరకు ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. కొంత మందికి రక్తస్రావం పెరిగేకొద్దీ నొప్పి తీవ్రత పెరుగుతూ ఉంటుంది. వీరికి సింసిఫ్యూగా-200 మందును నెలసరికి ముందే తరుచూ ఇవ్వడం ద్వారా ఈ నొప్పి రాకుండానే నివారించవచ్చు.

కొంతమంది స్త్రీలకు నెలసరి సమయంలో తీవ్రమైన కడుపునొప్పి ఉంటుంది. పైగా తరచూ నిరాశా నిస్పృహలకు గురవుతూ ఉంటారు. వీరికి ప్లాటినా-200 మందును ప్రతి 6 గంటలకు ఒక డోసు చొప్పున మూడు డోసులు వేస్తే ఈ సమస్యనుంచి ఉపశమనం లభిస్తుంది. కొంతమందికి నొప్పి అధికంగానే అయినా ఆగి ఆగి వస్తూ ఉంటుంది. రక్తస్రావం నొప్పి ఒకేసారి వస్తాయి. రక్తంలో పొరలు కనపడతాయి. ఆ పొరలు కనపడగానే నొప్పి కొంత తగ్గుతుంది. వీరు బొరాక్స్-200 మందును ప్రతి రెండు గంటలకు ఒక డోసు చొప్పున 7 సార్లు వేసుకుంటే ఈ సమస్య తగ్గుముఖం పడుతుంది.

కొంతమందికి నెలసరికన్నా కాస్త ముందే నొప్పి మొదలవుతుంది. రక్రసావం మొదలైన మరుక్షణం నుంచే నొప్పి తగ్గుతుంది. రక్తం నల్లగా ఉంటుంది. వీరికి లేకసిస్-200 మందును ప్రతి నాలుగు గంటలకు ఒక డోసు చొప్పున మూడు డోసులు ఇస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

కొందరికి రక్తం తీగలా, నల్లగా సాగుతూ ఉంటుంది. కొద్దిపాటి కదలికతో కూడా రక్తస్రావం అధికమవుతుంది. పొత్తి కడుపులోనొప్పి నడము వరకు పాకుతుంది. పాదాలు చల్లబడతాయి. వీరికి క్రోకస్ సటైవా-200 మందును ప్రతి 6 గంటలకు ఒక డోసు చొప్పున ఏడుసార్లు వేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

అన్ని రకాల లక్షణాలనూ తగ్గించే మందులు కూడా హోమియోలో ఉన్నాయి. అలాంటి వాటిలో మెగ్నీషియా ఫాస్-200 ఒకటి. ప్రతి అర గంటకు ఒక డోసు చొప్పున 5 సార్లు ఈ మందును వేసుకుంటే ఎంతో ఉపశమనం లభిస్తుంది.

గమనిక : సూచించిన ఈ మందులన్నీ ప్రధమ చికిత్సకోసం ఉద్దేశించినవి. ఒకవేళ ఈ మందులతో ఉపశమనం లభించకపోతే దగ్గరలో ఉన్న హోమియో వైద్యుణ్ని సంప్రదించండి.

నెలసరి కడుపు నొప్పి

కొంత మందికి నెలసరికీ నెలసరికీ మధ్యలోనూ రక్తస్రావం అవుతుంది. నెలసరి సమయంలో గానీ లేదా అంతకు ముందు గానీ తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంది. లక్షణాలను అనుసరించి హోమియో మందులు వే సుకుంటే చాలా వరకు ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. కొంత మందికి రక్తస్రావం పెరిగేకొద్దీ నొప్పి తీవ్రత పెరుగుతూ ఉంటుంది. వీరికి సింసిఫ్యూగా-200 మందును నెలసరికి ముందే తరుచూ ఇవ్వడం ద్వారా ఈ నొప్పి రాకుండానే నివారించవచ్చు.

కొంతమంది స్త్రీలకు నెలసరి సమయంలో తీవ్రమైన కడుపునొప్పి ఉంటుంది. పైగా తరచూ నిరాశా నిస్పృహలకు గురవుతూ ఉంటారు. వీరికి ప్లాటినా-200 మందును ప్రతి 6 గంటలకు ఒక డోసు చొప్పున మూడు డోసులు వేస్తే ఈ సమస్యనుంచి ఉపశమనం లభిస్తుంది. కొంతమందికి నొప్పి అధికంగానే అయినా ఆగి ఆగి వస్తూ ఉంటుంది. రక్తస్రావం నొప్పి ఒకేసారి వస్తాయి. రక్తంలో పొరలు కనపడతాయి. ఆ పొరలు కనపడగానే నొప్పి కొంత తగ్గుతుంది. వీరు బొరాక్స్-200 మందును ప్రతి రెండు గంటలకు ఒక డోసు చొప్పున 7 సార్లు వేసుకుంటే ఈ సమస్య తగ్గుముఖం పడుతుంది.

కొంతమందికి నెలసరికన్నా కాస్త ముందే నొప్పి మొదలవుతుంది. రక్రసావం మొదలైన మరుక్షణం నుంచే నొప్పి తగ్గుతుంది. రక్తం నల్లగా ఉంటుంది. వీరికి లేకసిస్-200 మందును ప్రతి నాలుగు గంటలకు ఒక డోసు చొప్పున మూడు డోసులు ఇస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

కొందరికి రక్తం తీగలా, నల్లగా సాగుతూ ఉంటుంది. కొద్దిపాటి కదలికతో కూడా రక్తస్రావం అధికమవుతుంది. పొత్తి కడుపులోనొప్పి నడము వరకు పాకుతుంది. పాదాలు చల్లబడతాయి. వీరికి క్రోకస్ సటైవా-200 మందును ప్రతి 6 గంటలకు ఒక డోసు చొప్పున ఏడుసార్లు వేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

అన్ని రకాల లక్షణాలనూ తగ్గించే మందులు కూడా హోమియోలో ఉన్నాయి. అలాంటి వాటిలో మెగ్నీషియా ఫాస్-200 ఒకటి. ప్రతి అర గంటకు ఒక డోసు చొప్పున 5 సార్లు ఈ మందును వేసుకుంటే ఎంతో ఉపశమనం లభిస్తుంది.

గమనిక: సూచించిన ఈ మందులన్నీ ప్రధమ చికిత్సకోసం ఉద్దేశించినవి. ఒకవేళ ఈ మందులతో ఉపశమనం లభించకపోతే దగ్గరలో ఉన్న హోమియో వైద్యుణ్ని సంప్రదించండి.

ఆ రక్త స్రావం... ఎందుకని?

నా వయసు 63 సంవత్సరాలు. నాకు రుతుక్రమం ఆగిపోయి కూడా పదిహేనేళ్లు అవుతోంది. కానీ ఆర్నెళ్లుగా మూత్ర విసర్జనకు వెళ్లినప్పుడు కొద్దిగా రక్తస్రావం కనిపిస్తోంది. అప్పుడప్పుడు లో దుస్తులకు కూడా రక్తం అంటుకుని కనిపిస్తోంది. నాకు చాలా భయమేస్తోంది. నా స్నేహితురాలు ఒకరు తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించమని సూచించారు. నాకు ఇద్దరు కొడుకులే. వారితో ఈ సమస్యను ఏ విధంగా చెప్పుకోను? అసలు నాది సమస్యేనంటారా? నేనే అతిగా ఆలోచిస్తున్నానా?

మీ సమస్యను పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటారు. మీ స్నేహితురాలు సరిగ్గానే చెప్పారు. ఈ సమస్య ఉన్న వారు తప్పనిసరిగా గైనకాలజిస్ట్‌ను సంప్రదించాల్సిందే. ఈ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్‌కు చాలా కారణాలు ఉంటాయి. గర్భసంచి ముఖద్వారానికి క్యాన్సర్, లేదా గర్భసంచి లోపలి పొరకు క్యాన్సర్‌గాని సోకినప్పుడు ఇలా రక్తస్రావం కనిపించే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఆ్ఛnజీజn ్కౌజూడఞట వల్ల కూడా కొద్దిగా రక్తస్రావం జరగొచ్చు. ఇంకా చాలా ఆ్ఛnజీజn ఇౌnఛీజ్టీజీౌnట వల్ల కూడా ఇలా పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది.

మీరు ఆలస్యం చేయకుండా మీకు దగ్గరలో ఉన్న మంచి గైనకాలజి స్ట్‌ను సంప్రదించండి. కొడుకులైనా సరే, మీ ఆరోగ్య సమస్య గురించి చెప్పక తప్పదు. వారితో చూచాయగానైనా చెప్పండి. పోనీ, మీకు లేడీ డాక్టర్‌ను సంప్రదించాల్సిన అవసరం కలిగిందని చెప్పండి. మీ సమస్యను మీ కొడుకులు తప్పక అర్థం చేసుకుంటారు.

నా వయస్సు 45 సంవత్సరాలు. నాకు రుతుక్రమం రెండు మూడు నెలలకొకసారి వస్తోంది. రుతుస్రావం కూడా రెండు రోజులే ఉంటోంది. అది కూడా చాలా తక్కువగా అవుతోంది. నేను ఈ మధ్య అల్ట్రా సౌండ్ స్కానింగ్-పెల్విస్ చేయించాను. నా గర్భసంచిలో ఐదు ఫైబ్రాయిడ్స్ పెరిగినట్లు రిపోర్టులో వచ్చింది. వాటిలో ఒకటి 2 గీ 2 సెం.మీ. ఒకటి 2 గీ 3 సెం.మీ. మిగిలినవి 1 గీ 1 సెం.మీ. ఉన్నట్లు చెప్పారు. మా డాక్టర్ గర్భసంచి తీసివేస్తేనే మంచిదంటున్నారు. నాకేమో శస్త్ర చికిత్స అంటుంటే గాభరాగా ఉంది. మీరేమంటారు?

మీరు శస్త్ర చికిత్స చేయించుకోవలసిన అవసరం లేదమ్మా. ఎందుకంటే మీరు మెనోపాజ్ దశకు చేరుకుంటున్నారు. రుతుస్రావం కూడా చాలా తక్కువగా ఉంటోందని రాశారు. పోతే, మీ గర్భసంచిలో ఉన్న ఫైబ్రాయిడ్స్ పరిమాణం కూడా తక్కువగానే ఉంది. అన్నిటినీ మించి ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల మీకెలాంటి సమస్య కలగడం లేదు కదా? కాబట్టి మీరు శస్త్ర చికిత్స చేయించుకోవలసిన అవసరం లేదు. అయితే ఏడాదికి ఒకసారి మాత్రం అల్ట్రా సౌండ్ స్కానింగ్-పెల్విస్ చేయించుకుంటూ ఉండండి. ఫైబ్రాయిడ్స్ బాగా పెద్దవి అయినా, వాటివల్ల కడుపులో నొప్పి వస్తున్నా గైనకాలజి స్ట్‌ను సంప్రదించండ



మీ సూచనను పోస్ట్ చేయండి

(పై కంటెంట్‌పై మీకు ఏమైనా వ్యాఖ్యలు / సూచనలు ఉంటే, దయచేసి వాటిని ఇక్కడ పోస్ట్ చేయండి)

కామెంట్‌లు లేవు: