29, జూన్ 2021, మంగళవారం

యూరిన్ ఎక్కువ టైమ్స్ ఆపుకొంటే వచ్చే సమస్య లు అవగాహనా కోసం లింక్స్ లో చూడాలి

యూరిన్ ఆపుకుంటున్నారా.. బ్లాడర్ జర భద్రం!!.

హిళల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్(UTI) అనేది కామన్. దీని కారణంగా బ్లాడర్‌కు ఎంతో ప్రమాదముంది. ఫలితంగా స్త్రీలలో లైఫ్ టైం తగ్గిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. బ్లాడర్ ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో తెలుసుకోవాలి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, ప్రతీసారి యూరిన్‌కు వెళ్లాల్సి వస్తుండటం లాంటి కారణాలు ఉన్నప్పుడు మరింత జాగ్రత్త తీసుకోవాలి. వయస్సు పెరిగే కొద్దీ చాలా మందిలో యూరిన్ లీకేజ్ అనేది గమనిస్తూ ఉంటాం’ అని వెల్‌నెస్ కోచ్.. ల్యూక్ కౌటిన్హో అంటున్నారు.  ఎక్కువ మంది యూరిన్ కు వెళ్లకుండా ఆపుకుంటూ ఉంటారు. అది బ్లాడర్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. దాని కారణంగా ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చేప్రమాదాలు ఉన్నాయి. ప్రతి సమయంలో మన బ్లాడర్ ఖాళీగా ఉందో లేదా అనే అలర్ట్‌లో ఉండాలి.  1. మల బద్ధకం ఉందా:

మలబద్ధకం ఉన్న వాళ్లు.. శరీరంలోని వ్యర్థాలను విసర్జించాలనుకున్న ప్రతీసారి కష్టపడాలి. దీని వల్ల బ్లాడర్‌పై ఎక్కువ బలం ప్రయోగించాల్సి ఉంటుంది. ఫలితంగా కండరాలు క్రమేపీ బలహీనపడే అవకాశాలు ఉన్నాయి. హెల్తీ లైఫ్ స్టైల్, డైట్‌లో మార్పులు కారణంగా దీనిని అదుపులోకి తీసుకురాగలం. affect bladder health 2. యూరిన్‌ను ఎక్కువసేపు ఆపుకోవద్దు:
బ్లాడర్ బలహీనపడటానికి ప్రధాన కారణాలలో ఇదొకటి. యూరిన్‌ను ఎక్కువ సేపు బ్లాడర్ లో అట్టిపెట్టుకోవడం కారణంగా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఫలితంగా అది బలహీనపడే ప్రమాదం ఉంది.  affect bladder health 3. నిద్రపోయే ముందు నీళ్లు తాగడం:
త్వరగా లేవాలని పడుకునే ముందు నీళ్లు తాగితే యూరిన్ కు వెళ్లే ఆలోచనలో ముందే లేస్తామని అనుకుంటూంటారు. ఇది నిద్రపోవడాన్ని చెడగొట్టడమే కాకుండా.. అప్పటివరకూ యూరిన్ ను స్టోర్ చేసుకునేలా చేస్తుంది. మరి కొందరు యూరిన్ కు వెళ్తే నిద్రచెడిపోతుందని అలాగే నిల్వ ఉంచుకుంటూ ఉంటారు. ఇది చాలా ప్రమాదం. affect bladder health 4. ఆల్కహాల్.. కెఫ్ఫైన్ ఎక్కువ మొత్తంలో:
బ్లాడర్ సమస్య ఉన్న వాళ్లు ఆల్కహాల్.. కెఫ్ఫైన్ మానేయడమే మంచిది. లేదా వీలైనంత వరకూ అలవాటు తగ్గించుకోవడం బెటర్. affect bladder health 5. శరీర బరువు:
శరీర బరువును నియంత్రించుకోవాలి. ఇది కిడ్నీలపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఎక్సర్‌సైజులు, హెల్తీ డైట్లతో ఈ పని చాలా సులువుగా చేయొచ్చు.  affect bladder health 6. కెగల్ ఎక్సర్‌సైజ్‌లు:
ఈ ఎక్సర్‌సైజ్‌లు పెల్విక్‌ను బలపడేలా చేస్తాయి. యూటరస్‌ కండరాలకు, బ్లాడర్, చిన్న పేగుకు, రెక్టమ్ సపోర్ట్ ఇస్తాయి. ఇలా చేయడం వల్ల మగాళ్లలో త్వరగా వీర్య స్కలనం కాకుండా, మహిళ్లలో సెక్సువల్ ఇన్ఫెక్షన్ అవకుండా ఆపగలం. 7. సెక్స్‌కు ముందు తర్వాత:
సెక్స్ చేయడానికి ముందు తర్వాత యూరినేషన్ తప్పనిసరి చేసుకోవాలి. అంతేకాకుండా ముందు నుంచి వెనుక్కు పూర్తిగా తుడుచుకోవడం మరిచిపోకూడదు.  affect bladder health   8. కాటన్ అండర్‌వేర్:
కాటన్ తడిని పీల్చుకుంటుందనేది తెలిసిందే. తద్వారా చర్మం పొడిగా ఉంటుంది. టైట్ దుస్తులు వాడటం ద్వారా చెమట పేరుకుపోయి బ్యాక్టీరియా పెరిగే ప్రమాదాలు ఉన్నాయి.  9. నీళ్లు తాగడం: 
శరీరానికి డీ‌హైడ్రేటెడ్‌గా అనిపించినప్పుడు సరైన మోతాదులో యూరిన్ పాస్ చేయలేం. అంటే ఎక్కువ నీళ్లు తాగకపోవడం వల్ల వచ్చిన సమస్య మాత్రమే కాదు.. ఆరోగ్య సమస్యల కారణంగా ఎలక్ట్రోలైట్స్‌ను శరీరంలోకి పీల్చేసుకోవడం కూడా కావొచ్చు.  affect bladder health 10. డైట్:
చివరిగా చాలా ముఖ్యమైంది డైట్. అరటిపళ్లు, కొబ్బరి, యాపిల్, గ్రేప్స్, అన్నీ బెర్రీ పండ్లు బ్లాడర్ ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకంగా వ్యవహరిస్తాయి. వీటితో పాటు కూరగాయలు.. దోసకాయ, చిక్కుడు లాంటివి. యూరిన్ సమస్యలు ఉన్న వారు పచ్చి ఉల్లిపాయ, టమాటాలు తినడం మంచిది. దాంతో పాటు కాఫీ
#మూత్రం_ఆపుకోలేకపోతున్నారా_ఇలా_చేయండిఅవగాహనా_కోసం_నవీన్_నడిమింటి_సలహాలు ..

             మూత్రం ఆపుకోలేకపోవడం అనేది సాధారణ సమస్యే. ముఖ్యంగా ఈ సమస్య పెద్దవయసు మహిళల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.
    
దగ్గినా, తుమ్మినా మూత్రం లీకవుతూ ఉంటుంది. కొన్ని సార్లు మూత్రానికి వెళ్ళవలసిన తొందర అకస్మాత్తుగా అలాగే బలంగా ఏర్పడుతుంది. యూరినరీ ఇంకాంటినెన్స్ అనేది వివిధ రకాలు. అవేంటంటే...

1. #స్ట్రెస్_ఇంకాంటినెన్స్ :

         దగ్గడం, తుమ్మడం, నవ్వడం అలాగే ఎక్సర్సైజ్ చేయడం లేదా బరువైన వస్తువులను ఎత్తడం వంటి పరిస్థితులలో బ్లాడర్ పై ప్రెజర్ పడటంతో మూత్రం లీకవుతుంది.

2. #అర్జ్_ఇంకాంటినెన్స్ :

              సడెన్ గా మూత్రానికి వెళ్లాల్సిన అవసరం ఏర్పడుతుంది. మూత్రం లీకవడం ప్రారంభమవుతుంది. తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం జరుగుతుంది. రాత్రంతా కూడా ఈ సమస్య తెగ చికాకు పెడుతుంది. చిన్న చిన్న కండిషన్స్ వల్ల అంటే ఇన్ఫెక్షన్ వల్ల ఈ సమస్య రావచ్చు. లేదా న్యూరాలజికల్ డిజార్డర్ లేదా డయాబెటిస్ వల్ల కూడా ఈ సమస్య రావచ్చు.

3. #ఓవర్_ఫ్లో_ఇంకాంటినెన్స్:

             బ్లాడర్ కంప్లీట్ ఐన ఫీలింగ్ మీకు లభించదు. కాబట్టి, తరచూ మూత్రానికి వెళ్లాల్సిన అవసరం ఏర్పడుతుంది.వివరాలు కూ లింక్స్ లో చూడాలి
https://www.facebook.com/1536735689924644/posts/2763549030576631/

4. #ఫంక్షనల్ _ఇంకాంటినెన్స్:

               శారీరక అలాగే మానసిక ఇబ్బందుల వల్ల మూత్రం లీకవుతుంది. ఉదాహరణకు, విపరీతమైన కీళ్లనొప్పులతో బాధపడుతున్నప్పుడు బాత్రూంకు వెంటనే కదల్లేరు. దాంతో, మూత్రం లీకేజీ ఏర్పడుతుంది.

5. #మిక్స్డ్_ఇంకాంటినెన్స్:

                  ఒకటి కంటే ఎక్కువ రకమైన యూరినరీ ఇంకాంటినెన్స్ తో బాధపడటం జరుగుతుంది.

యూరినరీ ఇంకాంటినెన్స్ అనేది డిసీజ్ కాదు. ఇదొక లక్షణం. ప్రతిరోజూ అలవాట్ల వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. అలాగే కొన్ని మెడికల్ కండిషన్స్ లేదా ఫిజికల్ ప్రాబ్లెమ్స్ కూడా ఈ సమస్యకు దారితీయవచ్చు. డాక్టర్లు డయాగ్నోస్ చేసి ఈ ఇంకాంటినెన్స్ ను కారణం తెలియచేస్తా

 #టెంపరరీ_యూరినరీ_ఇంకాంటినెన్స్:

             కొన్ని డ్రింక్స్, ఫుడ్స్ అలాగే మెడికేషన్స్ అనేవి మూత్ర విసర్జనని ఎక్కువ చేసే మందులా పనిచేస్తాయి. బ్లాడర్ ను స్టిమ్యులేట్ చేస్తాయి. యూరిన్ వాల్యూంను పెంచుతాయి. అవేంటంటే, ఆల్కహాల్, కెఫైన్, కార్బోనేటేడ్ డ్రింక్స్, స్పార్కిల్డ్ వాటర్, ఆర్టిఫీషియల్ స్వీటనర్స్, చాకొలేట్, చిల్లి పెప్పర్స్, కారం ఎక్కువగా ఉన్న ఫుడ్స్, షుగర్ లేదా యాసిడ్, సిట్రస్ ఫ్రూట్స్, హార్ట్ మరియు బ్లడ్ ప్రెజర్ మెడికేషన్స్, సెడేటివ్స్ మరియు మజిల్ రిలాక్సన్ట్స్, విటమిన్ సిను ఎక్కువగా తీసుకోవడం వంటివి టెంపరరీ యూరినరీ ఇంకాంటినెన్స్ కు దారితీస్తాయి.

#యూరినరీ_ఇంకంటినెన్స్_అనే_ఈ_సమస్యను_దూరం_చేసే_నవీన్_సలహాలు_టిప్స్..

1. ఉదయాన్నే ఎండు ఖర్జూరాలను తినాలి.

2. పెసర్లను వండినవి గాని లేదా మొలకెత్తినవి గాని తినాలి.

3. బ్రేక్ఫాస్ట్, లంచ్ మరియు డిన్నర్ లో ఒక టీస్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి.

హెల్తీ డైట్ తో పాటు కొన్ని ఎక్సర్సైజులను తరచూ చేయాలి. అప్పుడే యూరినరీ ఫంక్షన్ రెగ్యులేట్ అవుతుంది. ఆ ఎక్సర్సైజులేంటంటే...

స్ట్రెంత్ ట్రెయినింగ్: స్ట్రెంత్ మరియు ఒత్తిడిని ఓర్చుకునే శక్తిని పెంచే ఎక్సర్సైజెస్ ఇవి. మల్టిపుల్ మజిల్ గ్రూప్స్ ను స్ట్రెంతెన్ చేసే వ్యాయామాలు.

కెగెల్ ఎక్సర్సైజెస్: ఇది గట్టిగా పట్టుకుని మరియు రిలీజ్ చేసే ఏక్సర్సైజెస్. యుటెరస్, బ్లాడర్, స్మాల్ ఇంటస్టైన్ మరియు రెక్టమ్ కి సపోర్ట్ చేసే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ ను స్ట్రెంతెన్ చేయడానికి హెల్పవుతాయి.

తాడాసన: దీన్నే మౌంటెయిన్ పోజ్ అని కూడా అంటారు. నించుని వేసే ఆసనం. శ్వాస తీసుకునే ప్రక్రియపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ చేసే స్ట్రెచింగ్ ఆసనం ఇది.

ఒకవేళ అప్పుడప్పుడూ మూత్రం లీకయ్యే సమస్యతో ఇబ్బందిపడుతున్నట్టయితే ఈ లైఫ్ స్టైల్ మార్పులు మీకు హెల్ప్ చేస్తాయి అనంటున్నారు.

#ఒబెసిటీ_వల్ల_మూత్రం_లీకవుతోందా?

ఇదిలా ఉంటే ఒబెసిటీ వల్ల మూత్రం లీకవుతుందా అన్న కోణంలో నిపుణులు స్టడీ చేస్తున్నారు. ఒబెసిటీ అనేది హార్ట్ డిసీజ్, హైపర్టెన్షన్, డయాబెటిస్, డిప్రెషన్, ఆర్తరైటిస్, గాల్ బ్లాడర్, లివర్ డిసీజ్ మరియు క్యాన్సర్ వంటి అనేక వ్యాధులతో అనుసంధానమై ఉన్న సమస్య.

ఒబెసిటీ మరియు ఓవర్ వెయిట్ వంటి సమస్యలతో మూత్రం లీకయ్యే సమస్య నేరుగా అసోసియేటై ఉందని అనేక స్టడీస్ వెల్లడిస్తున్నాయి.

బాడీ మాస్ ఇండెక్స్ లో ప్రతి ఐదు యూనిట్ల పెరుగుదల అనేది డైలీ యూరినరీ ఇంకాంటినెన్స్ రిస్క్ ను దాదాపు 60 నుంచి 100 శాపెంచుతుందట.

#ఈ_జాగ్రత్తలు_తీసుకోండి:

1క్ పై దృష్టిపెట్టండి:

మీరు గనక తగినన్ని నీళ్లు తాగకపోతే డీహైడ్రేట్ అవుతారని నిపుణులు చెబుతూ ఉంటారు. ఐతే, మూత్రం లీకేజీ సమస్య ఉన్నప్పుడు లాట్స్ ఆఫ్ వాటర్ తాగితే మరిన్ని ఇబ్బందులు కొనితెచ్చుకున్నట్టేనని వారే హెచ్చరిస్తున్నారు. అలాగని మరీ తక్కువగా తాగితే మూత్రం చిక్కగా మారడంతో బ్లాడర్ ఇరిటేట్ అవుతుంది. కాబట్టి, వైద్యులను సంప్రదించి ఎంత వాటర్ తాగాలో తెలుసుకోండి.

2. #ఆల్కహాల్:

బ్లాడర్ పై ఆల్కహాల్ డైరెక్ట్ ఎఫెక్ట్ చూపెడుతుందని నిపుణులు చెబుతున్నారు. తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. ఆల్కహాల్ అనేది బ్రెయిన్ నుంచి బ్లాడర్ కు వెళ్లే సిగ్నల్స్ పై ప్రభావం చూపెడుతుంది. ఆల్కాహాల్ కు అడిక్ట్ ఐతే బ్రెయిన్ నుంచి బ్లాడర్ కు చేరే సిగ్నల్స్ కు అంతరాయం కలుగుతుంది. ఆల్కహాల్ ను పూర్తిగా నిరోధిస్తే మరీ మంచిది. లేదంటే, కనీసం మోతాదునైనా తగ్గించాలి.

3. #కెఫైన్_ను_తగ్గించాలి:

సాఫ్ట్ డ్రింక్స్, టీలు అలాగే చాకొలేట్ వంటివి మూత్రానికి వెళ్లాల్సిన అవసరాన్ని పెంచుతాయి. డైట్ లోంచి కెఫైన్ ను తొలగించండి. కనీసం మోతాదునైనా తగ్గించండి. కాఫీను ఉదయానికే పరిమితం చేయండి. ఏడు దాటిన తరువాత కాఫీని ఎట్టిపరిస్థితుల్లోనూ ముట్టుకోకండి. కేఫైనేటెడ్ బెవెరేజెస్ ను రోజుకి ఒకటి లేదా రెండు కప్పులకే పరిమితం చేయండి.

4. #స్పైసీ_ఫుడ్స్_ను_తగ్గించండి:

         ఓవర్ యాక్టివ్ బ్లాడర్ ఉన్నట్టయితే స్పైసీ ఫుడ్స్ ను తగ్గించాలి. ఎందుకంటే, ఇవి కెఫైన్ లాగానే బ్లాడర్ లైనింగ్ ను ఇరిటేట్ చేస్తాయనంటున్నారు నిపుణులు.

5. #యాసిడ్_ను_అవాయిడ్_చేయండి:

              సిట్రస్ ఫుడ్స్ అలాగే నారింజ మరియు పైనాపిల్ వంటి ట్రాపికల్ జ్యూసెస్ అనేవి బ్లాడర్ ను ఇబ్బందిపెడతాయి. బాత్రూంకు వెళ్లాల్సిన తొందరను పెంచుతాయి. టమాటోలు కూడా ఎసిడిక్ నేచర్ కలిగినవే. కాబట్టి, వీటిని అవాయిడ్ చేయడం మంచిది.

ఈ జాగ్రత్తలతో అప్పుడప్పుడూ ఎదురయ్యే మూత్రం లీకేజీ సమస్యను తగ్గించవచ్చు.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
విశాఖపట్నం
9703706660
*సభ్యులకు విజ్ప్తి*
******************
ఈ వాట్సాప్ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

సెక్స్ కొంతమంది అపోహలు అవగాహనా కోసం లింక్స్ లో చూడాలి

సెక్స్ గురించి టాప్ 5 అపోహలు, అసలు నిజాలు


సెక్స్ అనే పదం ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో, ఆ పదం చుట్టూ అన్ని అపోహలు కూడా ఉంటాయి. సెక్స్ ఎడ్యుకేషన్ తక్కువ, పనికిమాలిన పుస్తకాలు ఎక్కువ ఉన్న మన సమాజంలో అయితే ఈ అపోహలకి కొదువే లేదు. అలాంటి అపోహల్లో టాప్ 5 అపోహలు, అసలు నిజాలు తెలుసుకోండి.

1. అంగం ఎంత పెద్దది అయితే ఆమెకి అంత సుఖం
ఇది ఇంకొక పెద్ద అపోహ. ఈ మధ్య పోర్న్ చూడటం ఎక్కువయ్యాక ఈ ఆలోచన ఎక్కువ అవుతుంది. సినిమా హీరోలంటే అందంగా ఉండాలని ఎలా చూస్తారో, అలాగే పురుషాంగం పెద్దగా ఉన్నవాళ్లకే పోర్న్ స్టార్స్ గా అవకాశాలు వస్తాయి. అది చూసి, తమకి అంత పొడవు లేదని, అందుకే తృప్తి ఇవ్వలేకపోతున్నానని చాలామంది అపోహ పడుతుంటారు. అయితే, నిజానికి పొడవు తక్కువ అయితే అసంతృప్తి మాత్రం ఉండదు. ఏదైనా శారీరక లోపం వల్ల అంగం మరీ చిన్నగా ఉంటె ఇబ్బంది కాని, ఒక అంగుళం అటూ ఇటూగా ఉంటే తృప్తి విషయంలో తేడారాదు.

2. శీఘ్రస్కలనం పెద్ద జబ్బు
శీఘ్రస్కలనం అనేది జబ్బు అని చాలామంది, మగవాళ్ళే కాదు, ఆడవాళ్ళూ అనుకుంటుంటారు. ఇది అపోహ మాత్రమె. పురుషులు తమ జీవితంలో ఏదో ఒక దశలో శీఘ్రస్కలనం సమస్య ఎదుర్కొంటారు. సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం, జీవితంలో వత్తిళ్ళు, అలసట, ఆత్రుత ఇవన్నీ కూడా శీఘ్ర స్కలనానికి కారణాలు. మంచి తిండి, మానసిక ప్రశాంతత ఉంటె శీఘ్రస్కలనం సమస్యని ఈజీగా అధిగమించవచ్చు.

3. కండోమ్ లేకుండా సెక్స్ చేసినా గర్భం రానివ్వని టెక్నిక్
కొంతమంది తాము చాలా తెలివైనవాళ్ళమని, తమ శరీరం తన కంట్రోల్లో ఉంటుందని, సెక్స్ లో ఎంత తన్మయత్వంలో మునిగినా, గర్భం రాకుండా చూడగలనని అనుకుంటారు. స్కలనం జరగబోతుండగా, అంగాన్ని బయటకి తీసేస్తే గర్భం రాదు అని వీళ్ళ నమ్మకం. వీర్య స్కలనం జరిగితేనే గర్భం వచ్చేమాట నిజమే కాని, పురుషాంగం కూడా మానవ శరీరంలో ఒక భాగమే. ఇది కూడా మెదడు ఇచ్చే సూచనలని బట్టి నడుస్తుంది కాని, కొన్నిసార్లు ఆ కమ్యూనికేషన్ మిస్ అవడమో, అప్పుడే స్కలనం కాదు అని అనుకుంటుండగా, కొన్ని చుక్కల వీర్యం విడుదలకావడమో జరుగుతుంది. ఒక్క చుక్క వీర్యం చాలు కదా గర్భం రావడానికి, సో మీరెంత కాలిక్యులేటెడ్ గా ఉన్నా ఒక్కొకసారి గర్భం వచ్చే చాన్సెస్ ఉన్నాయి. గర్భం వద్దు అనుకుంటే, కండోమ్ లేదా ఇతర జాగ్రత్తలు తప్పక తీసుకోండి.

4. తగిన వాతావరణం ఉండాలి
ఇది ఇంకొక అపోహ. మూడ్ రావాలంటే అందుకు తగిన వాతావరణం, పరిస్థితులు ఉండాలని అనుకుంటుంటారు. మంచి డ్రెస్ (అంటే అర్థం అవుతుంది కదా), మంచి ఫిజిక్, కొన్ని భంగిమలు ఉంటేనే మూడ్ వస్తుందనుకుంటారు ఇందులో నిజం లేదు. ఒక్కొకరికి ఒక్కొకలా మూడ్ వస్తుంది. చాలా కాలంగా సెక్స్ కి దూరంగా ఉంటె, లేదా అలాంటి పుస్తకాలూ చదివితే, ఎలాంటి పరిస్థితుల్లో అయినా రెడీ అయిపోతుంది.

5. ఆ రోజుల్లో సెక్స్ చేస్తే గర్భం రాదు
పీరియడ్స్ టైమ్ లో సెక్స్ లో పాల్గొంటే గర్భం రాదని ప్రపంచ వ్యాప్తంగా ఒక నమ్మకం. ఫలదీకరణం చెందని అండాలు ఆ రోజుల్లో బయటకి వెల్లిపోతుంటాయి, కొత్త అండాలు ఉత్పత్తి కావు అని అందరికీ తెలిసిందే. అయితే, జననాంగంలోకి ప్రవేశించిన శుక్రకణాలు కొన్ని రోజుల పాటు సజీవంగా ఉంటాయి. ఉదాహరణకి పీరియడ్స్ లో రెండో రోజు సెక్స్ లో పాల్గొంటే, విడుదల అయిన శుక్రకణాలు మరో మూడు రోజులు సజీవంగా ఉన్నాయని అనుకుంటే, ఐదో రోజు విడుదల అయే అండంతో, ఇవి కలిసే అవకాశం ఉంటుంది. అప్పుడు గర్భం వచ్చే అవకాశం ఉంది. ఇక కొంతమంది స్త్రీలలో పీరియడ్స్ మూడో రోజే కొద్దిగా అండాలు విడుదల కావచ్చు, అప్పుడు కూడా గర్భం వచ్చే చాన్సెస్ ఉంటాయి. కాబట్టి గర్భం వద్దు అనుకుంటే కండోమ్ వాడటమే కరెక్ట్.

గర్భిణీ డెలివరీ తరువాత వదులు అవడం టి తీసుకోవాలిసి జాగ్రత్త లు అవగాహనా కోసం లింక్స్ లో చూడాలి

.యోని వదులైందని చికాకు... పురుషాంగాన్ని పట్టి ఉంచే శక్తి ఎలా వస్తుంది...?

ప్రశ్న   :  మాకు బాబు పుట్టి 7 నెలలయింది. ఆయనకు సెక్స్ తృప్తిగా ఉండటంలేదట. యోని చాలా వదులయిందని విసుక్కుంటున్నాడు. ఇదివరకూ బిడ్డ పుట్టకమునుపు ఉన్న బిగుతు ఇప్పుడు లేదంటున్నారు. పురుషాంగాన్ని ప్రవేశపెట్టినా వదులుగా ఉంటోందనీ, తనకు తృప్తిగా లేదంటున్నాడు. యోనిని బిగుతుగా చేసుకునేందుకు ఏవైనా పరిష్కార మార్గాలు ఉన్నాయా...?

జవాబు   :  యోని వదులుగా ఉండటం వల్ల పురుషునికే కాదు స్త్రీకి కూడా రతిలో పూర్తి తృప్తి కలుగదు. వీర్య స్ఖలనానికే కాకుండా సెక్స్ తృప్తికి యోని బిగుతు కీలకం. యోని వదులుగా ఉంటే సెక్స్ చేస్తున్నప్పటికీ స్త్రీ ఆ అనుభవాన్ని ఆస్వాదించలేదు. దీనికి అనేక కారణాలున్నాయి. పిల్లలు పుట్టడం వల్ల కానీ, వయసురీత్యా లేదంటే ఇతర ఆరోగ్య పరిస్థితుల వల్ల యోని వదులు కావడం జరుగుతుంది.

అలాంటి అనుభవం కలిగినప్పుడు యోనిని బిగుతుగా చేసేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. యోని కండరాలు బిగుతుగా మార్చేందుకు ప్రత్యక వ్యాయామం కెజిల్ వ్యాయామం చేయాలి. అంతేకాకుండా మూత్రం పోసేటపుడు యోని కండరాలను బిగుతుగా పట్టి చూసుకోవాలి. అలా చేసినప్పుడు పెల్విక్ కండరాలు దారిలోకి వస్తాయి. అలా పెల్విక్ కండరాలను గట్టిగా బిగుతుగా పట్టి ఉంచుతూ వదిలేస్తూ ప్రాక్టీస్ చేయాలి. ఈ పద్ధతిని రోజుకు నాలుగైదుసార్లు చేస్తే ఫలితం ఉంటుంది. ఐతే చేయగానే మార్పు వచ్చేస్తుందని అనుకోరాదు. మెల్లగా సమస్య తగ్గిపోతుంది.

26, జూన్ 2021, శనివారం

ఫిషర్ పైల్స్ సమస్య ఉన్న వరుకు నొప్పి నుండి ఎలా నివారణ తీసుకోవాలిసిన జాగ్రత్త లు అవగాహనా కోసం లింక్స్ లో చూడాలి

» పైల్స్ మరియు పగుళ్లను నయం చేసే ఆయుర్వేద మార్గం నవీన్ నడిమింటి సలహాలు 

పైల్స్ మరియు పగుళ్లను నయం చేసే ఆయుర్వేద మార్గం అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 

కూడా Haemorrhoids అని పిలుస్తారు, పైల్స్ అనలాగ్ కాలువ ఎర్రబడిన లేదా వాపు ఇక్కడ ఒక స్థితి. రక్త నాళాలు వెనుక భాగం యొక్క లైనింగ్ లోపల ఉన్నప్పుడు చాలా విస్తృత మరియు అధిక రక్తం తో ఎర్రబడినప్పుడు ఇది జరుగుతుంది. అనల్ విస్ఫోటనాలు కోతలు, కన్నీళ్లు లేదా పాయువులో మరియు పాలిపోయినట్లుగా ఉంటాయి. ఇది తీవ్రమైన లేదా దీర్ఘకాలికంగా ఉంటుంది. మీకు తెలిసిన ముందు పైల్స్ మరియు పగుళ్లకు ఉత్తమ ఆయుర్వేద medicine షధం, దాని కారణాలు మరియు లక్షణాలు చర్చించడానికి వీలు.

పైల్స్ అంటే ఏమిటి

పైల్స్ యొక్క కారణాలు

పాయువు చుట్టూ సిరలు చాలా ఒత్తిడికి వర్తింపజేసినప్పుడు, వారు వాపు, వాపు లేదా వాపుకు దారితీస్తుంది. మరియు, ఇది జరుగుతుంది;

  • ప్రేగు కదలికల సమయంలో ఎక్కువ ఒత్తిడి ఉంటుంది
  • సుదీర్ఘకాలం టాయిలెట్ మీద కూర్చుని
  • తీవ్రమైన మలబద్ధకం లేదా డయేరియా అనుభవించడం
  • ఊబకాయం
  • గర్భం
  • అనల్ సంభోగం
  • తక్కువ ఫైబర్ ఆహారం తీసుకోవడం

పైల్స్ యొక్క లక్షణాలు

  • పాయువు చుట్టూ గట్టిగా లేదా బాధాకరమైన ముద్దగా ఉండడంతో పైల్స్ యొక్క సూచన ఉంటుంది. ఈ ముద్ద గడ్డకట్టబడిన రక్తం కలిగి ఉండవచ్చు మరియు తరువాత వారు థ్రోంబోసెడ్ బాహ్య hemorrhoids అని పిలుస్తారు.
  • స్నాయువులను ఉత్తీర్ణించినా కూడా భావోద్వేగాలు బాగానే ఉన్నాయి.
  • ప్రేగులలో రక్తాన్ని గుర్తించడం.
  • పాయువు చుట్టూ ఉన్న ప్రాంతం గొంతు, ఎరుపు లేదా దురద ఉంటుంది.
  • ప్రేగు కదలిక సమయంలో నొప్పి అనుభవించడం.
పైల్స్ మరియు ఫిస్టులా మధ్య వ్యత్యాసం

అనల్ ఫిజ్చర్ యొక్క కారణాలు

ఒక ఆసన పగులు యొక్క అత్యంత సాధారణ కారణాలు;

  • చాలా కష్టం మరియు పెద్ద బల్లలు దాటుతుంది
  • మలబద్ధకం లేదా ప్రేగు కదలికల సమయంలో చాలా ఒత్తిడి
  • తీవ్రమైన విరేచనాలు
  • ప్రసవ
  • క్రోన్'స్ వ్యాధి లేదా తాపజనక ప్రేగు వ్యాధి కూడా అనల్ ఫిషర్‌కు కారణమవుతుంది.

ఒక ఆసన పగులు యొక్క తక్కువ సాధారణ కారణాలు;

  • అనాల్ క్యాన్సర్
  • HIV
  • క్షయ
  • సిఫిలిస్
  • హెర్పెస్

ఆసన పగులు యొక్క లక్షణాలు

  • పాయువు లో ఒక కన్నీటి
  • పాయువులోని కన్నీటి పక్కన ఒక ముద్ద అనిపిస్తుంది
  • ఒక ప్రేగు ఉద్యమం సమయంలో కుట్లు నొప్పి అనుభవించటం
  • బల్లలు సమయంలో రక్తం గుర్తించడం
  • పాయువు లో ఒక మంట లేదా దురద సంచలనాన్ని.

పైల్స్ మరియు పగుళ్లను నయం చేయడానికి ఉత్తమ మార్గం

1. నీటి

అది కాకుండా ఆయుర్వేద ఉత్పత్తులు, నీరు స్వతస్సిద్ధంగా పైల్స్ వదిలించుకోవటం సహాయపడుతుంది. మీ శరీరంలో ఉన్న కణాలకు నీరు అవసరమైన పోషకాలను రవాణా చేస్తుంది మరియు మీ ముఖ్యమైన అవయవాల నుండి అన్ని విషాన్ని తొలగిస్తుంది. అయితే, సరైన నీటిని ఏది తింటాలి? ఎత్తైన అద్దాలు లేదా ఔన్సుల కనీస. సో, సులభంగా చేయడానికి, కేవలం గంటకు ఒక గాజు తినే మరియు మీరు అన్ని సెట్. ఈ పరిహారం కేవలం పైల్స్ మరియు పగులులను నిరోధించదు, కానీ ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు మీ చర్మంకు ఒక గ్లో జోడించండి.

2. శుభ్రత

ఒక సాధారణ దశ, కానీ చాలా ముఖ్యమైన ఒక అయితే. మీరు గాయంతో బాధపడుతున్నట్లయితే సంక్రమణను నివారించడానికి మీరు ఈ ప్రాంతాన్ని శుభ్రం చేస్తారు. అందువల్ల, శస్త్రచికిత్సానికి కారణం కావచ్చునందున పాయువులో సంక్రమించే ప్రమాదం తప్పనిసరి. అందువల్ల ప్రతి రోజు కనీసం ఒక షవర్ తీసుకొని సరిగా మీ పాయువు శుభ్రం చేయండి. మీరు తడి తొడుగులు లేదా శుభ్రమైన నీటిని ఉపయోగించవచ్చు.

3. కణజాలం రకం

మీరు కణజాలం వాడుతున్న వ్యక్తి అయితే, అది తడిగా ఉన్న వైదాలకు మారడం మంచిది. రెగ్యులర్ డ్రై కణజాల పత్రాలు వలె కఠినంగా ఉండటం వల్ల, అవి పాయువు చర్మం ఉపశమనం మరియు తక్కువ కరుకుగా మారతాయి. కూడా, ప్రాంతం శుభ్రం ఉంచడానికి, మీ పాయువు కొన్ని శిశువు పొడి dab.

4. సరైన ఆహారం

సమతుల్య ఆహారం తినండి

ముందే చెప్పినట్లుగా, పైల్స్ మరియు పగుళ్లు ఎక్కువగా ప్రేగు కదలిక యొక్క ఫలితం. అందువల్ల, సమతుల్య భోజనం తీసుకోవడం ఈ పరిస్థితిని సరిదిద్దడానికి కీలకం. అందువల్ల, ప్రతి రోజు, పండ్లు, కూరగాయలు, బీన్స్ మరియు తృణధాన్యాలు తినండి. మీరు కూడా శోధించవచ్చు ఆయుర్వేద ఉత్పత్తులు ఆన్‌లైన్.

5. వ్యాయామం

యాక్టివ్ పొందండి

వ్యాయామం ఎలా పని చేస్తుందని మీరు ఆలోచిస్తున్నారా? అన్నింటిలో మొదటిది, క్రమమైన వ్యాయామం మీ మొత్తం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించడానికి ఒక మార్గాన్ని కూడా అందిస్తుంది. మరియు, మీరు వ్యాయామం చేసినప్పుడు, మీ గుండె ఎక్కువ రక్తాన్ని పంపుతుంది మరియు పాయువు సరైన రక్తం పొందినప్పుడు, అది వేగంగా నయం అవుతుంది. అయితే, ఆసన పగుళ్లు మీ వ్యాయామ ఎంపికలను పరిమితం చేస్తాయి. నువ్వు చేయగలవు; నడవండి, యోగా చేయండి, సాగతీత వ్యాయామాలు, కయాకింగ్, కానోయింగ్, తేలికపాటి ఇంటి పనులు మరియు తోటపని చేయండి. ఏదేమైనా, బైక్ తొక్కడం, భారీ బరువులు ఎత్తడం, పరుగు అవసరమయ్యే క్రీడలు, ఇతర వ్యాయామాలను నివారించండి.

6. పైల్స్ మరియు ఫిషర్ కోసం ఆయుర్వేద ine షధం

పైల్స్ కోసం ఆయుర్వేదిక్ మెడిసిన్

ఆయుర్వేదం దాదాపు ప్రతి వ్యాధికి ఉత్తమ పరిష్కారాన్ని అందిస్తుంది. HerboPile ఒక పైల్స్ కోసం ఆయుర్వేద ఔషధం మరియు వైద్యుడు డాక్టర్ వైద్యం అభివృద్ధి చేసిన విస్ఫోటనం. డాక్టర్ వైద్యం ఒక ఆన్లైన్ ఆయుర్వేద దుకాణం మరియు క్లినిక్, మీరు వివిధ రుగ్మతలకు నిజమైన ఆయుర్వేద మందులు ఎదుర్కునే. స్కిన్ కేర్ నుంచి రెగ్యులర్ విటమిన్స్ వరకు, అవి అన్నింటినీ కలిగి ఉంటాయి. మీరు త్వరితగతి రోగనిర్ధారణకు వారి అంతర్గత వైద్యుడిని సంప్రదించవచ్చు. ఈ ఆయుర్వేద ఔషధం తప్పనిసరిగా 3 సార్లు ఒక రోజు తీసుకోవాలి మరియు ఇది యుగాలు -20 ఏళ్లకు అనుకూలంగా ఉంటుంది. 15 కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు, సగం టాబ్లెట్ సూచించబడింది.

*ఫిష్టులా, Fistula in Ano* అంటే   మలద్వారం వద్ద / ప్రక్కన వ్రణము లాగా ఏర్పడి మనిషిని విపరీతంగా బాధ పెట్టె వ్యాధి. ఇది   

నొప్పిని మరియు బాధను, చీము లేదా స్రావాన్ని,  కలిగిస్తుంది. 

గుదం వద్ద కలిగే ఫిస్టులాను సాధనంగా శస్త్ర చికిత్స ద్వారా తొలగించటం జరుగుతుంది. అయితే ఇది కొంత కాలం తర్వాత తిరిగి పునరావృతం అవుతుంది కానీ ఆయుర్వేద క్షరసూత్ర చికిత్స ద్వారా ఫిస్టులా వ్యాధి శాశ్వతంగా నయం అయ్యే అవకాశము ఉంది.

 ఫిస్టులా వ్యాధిని సమూలంగా నాయము చేయటానికి ఆయుర్వేద చికిత్సలో 


*1.ఔషధ చికిత్స*

*2.ఆహార చికిత్స*

*3.క్షార సూత్రం చ


మొదటి రెండు పద్ధతుల్లో లొంగని వారికి  *క్షార సూత్ర* చికిత్స ద్వారా సంపూర్ణంగా నయము చేసే అవకాశము ఉంది.


*పైల్స్(Piles)*


పైల్స్ ను మొలలు లేదా అర్సస్సు లేదా ఆర్ష మొలలు అని సాధారణంగా అంటారు.


పైల్స్‌ 4 స్టేజి లలో కనిపిస్తాయి 


మొదటి స్టేజి లో పైల్స్ బయటకి కన్పించవు. 


2nd స్టేజి లో మల విసర్జన సమయంలో బయటికి వస్తాయి. వాటంతట అవే లోనికి పోతాయి. 


      3rd స్టేజి లో మొలలు మలవిసర్జన సమయం లో బయటికి వచ్చి తరువాత గట్టిగా లోపలికి నెడితేగాని లోపలికి పోవు. 

4th స్టేజి లో మొలలు  బయటే ఉండిపోతాయి.చేతికి పిలకల లాగా తగులుతూ ఉంటాయి


 

పైల్స్/మొలలు  తీవ్రత ఎక్కువగా ఉన్నట్లైతే  విపరీతమైన నొప్పి,బాధ నిలబడలేరు, కూర్చోలేరు, ఎక్కువగా రక్తం పోతుంటే నీరసం వస్తుంది. విపరీతంగా కాళ్ళు లాగుతాయి. విసుగు, కోపం వస్తాయి. రక్తహీనత కలగవచ్చు. కొన్ని ఇతర anorectal  జబ్బులలో కూడా ఇవే లక్షణాలు కనిపించే అవకాశం ఉంది,అందుకని వెంటనే డాక్టర్లను సంప్రదించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకొని చికిత్స పొందాలి.


*Anal Fissure*:-


మలద్వారం దగ్గర నిలువుగా చీలికను Anal fissure  అంటారు. దీర్ఘకాలికంగా మలబద్ధకం ఉండి, మల విసర్జన సమయంలో ఒత్తిడి ఏర్పడి మలద్వారం వద్ద Fissures ఫిషర్స్‌ ఏర్పడే అవకాశం ఉంది. ఎక్కువ కాలం విరేచనాలు కావటం, pregnency సమయం లో కూడా కొంత మంది స్త్రీలకు Anal Fissure ఏర్పడే అవకాశం ఉంది.


*Anal Fissure లక్షణాలు:*


 మలవిసర్జన సమయం లో నొప్పి రావటం,

కొంతమంది లో ఈనొప్పి కొన్ని గంటలపాటు ఉంటుంది.

రక్తము పడటం

దురద నొప్పి ఉండటం.

చీలిక వద్ద చిన్న పిలకలాగా లేదా చర్మపు మడత లాగా ఉండటం మొదలగు లక్షణాలు వుంటాయి.


*ఆహారము అలవాట్లు:*


*పైల్స్,ఫిషర్, ఫిస్టుల* లతో బాధ పడేవారు

 అతిగా  కారపు వస్తువులు, మసాలా, వేపుళ్ళు, ఊరగాయలు, దుంపకూరలు, పచ్చళ్ళు,  వంటివి తినరాదు.

పులుపు, కారము, మాంసాహారం తగ్గించాలి,  పీచు అధికంగా ఉండే ఆకు  కూరలు, కూరగాయలు, ఎక్కువాగా తీసుకుంటూ ఎక్కువగా నీళ్లు తాగడం ఆరోగ్యకర

సమాధానం ఇవ్వూ

మీ ఇమెయిల్ చిరునామా ప్రచురితమైన కాదు. లు గుర్తించబడతాయి *

చర్మం పై బొల్లి మచ్చలు నివారణ తీసుకోవలిసిన జాగ్రత్త లు ఈ లింక్స్ లో చూడాలి

తెల్లమచ్చలు పోవడానికి సులువైననవీన్ నడిమింటి సలహాలు 
Easy home remedies for whiteheads

శరీరంపై తెల్లని రంగులో కనిపించే మచ్చలను ల్యుకోడెర్మా అంటారు. జన సామాన్యంలో బొల్లి మచ్చలనే తెల్లమచ్చలుగా వ్యవహరిస్తారు. చర్మంపై మెలనిన్ కణాలు తగ్గడం వల్ల బొల్లి వ్యాధి కలుగుతుంది. ఏప్రాంతంలోనైనా చర్మంలో ఉండే ఈ కణాలు తగ్గినప్పుడు అక్కడ తెల్ల మచ్చలు వస్తాయి.

Easy home remedies for whiteheadsచర్మం వెలుపల పొరల్లో ఉండే మెలనోసైట్ కణజాలాలు విడుదల చేసే మెలనిన్ అనే ప్రత్యేక పదార్థం… టైరోసినేజ్ అనే ఎంజైమ్ వల్ల సరైన మోతాదులో విడుదల అవుతుంది. బొల్లి వ్యాధిలో ఈ ఎంజైము అనేక కారణాల వల్ల క్షీణించడం జరుగుతుంది. ఫలితంగా మెలనిన్ విడుదలకు అంతరాయం ఏర్పడి, చర్మం రంగును కోల్పోతుంది.


Easy home remedies for whiteheadsఈ వ్యాధిని గుర్తు పట్టడం కష్టమేమీ కాదు. మొదట్లో చర్మంపైన గులాబీ రంగులో కాని, తెలుపు రంగులో కాని అస్పష్టమైన మచ్చలు కనిపిస్తాయి. ఇవి క్రమంగా లేదా హఠాత్తుగా పూర్తి తెలుపు రంగు మచ్చలుగా మారుతాయి. సామాన్యంగా ఈ మచ్చలపైన దురద ఉండదు. పొట్టు కూడా లేవదు. కాకపోతే కొంతమందిలో మాత్రం ఎండలోకి వెళితే మచ్చలపైన దురద అనిపించవచ్చు. తెల్ల మచ్చలపైన తాకినప్పుడు స్పర్శ తెలుస్తుంది.

Easy home remedies for whiteheadsమోచేతులు, మోకాళ్లు, చంకలు మొదలైన శరీర భాగాల మడతల్లో, అరచేతుల్లో, పెదవులపై వచ్చిన బొల్లి మచ్చలు అంత త్వరగా తగ్గవు. ఇవి పూర్తిగా పోవాలంటే రెండు నుంచి నాలుగేళ్ల సమయం పడుతుంది. ఈ తెల్లటి మచ్చల వల్ల ఎటువంటి శారీరక బాధలు ఉండవు కానీ మానసిక ఆందోళన ఉంటుంది. ఇటువంటి మచ్చలు పోయేందుకు ఈ చక్కగా పనిచేస్తాయి.

Easy home remedies for whiteheads->వేపకాయలు, ఆకులు, పువ్వులు సమానంగా కలిపి మెత్తగా నూరుకోవాలి. దీనిని రోజుకు రెండుసార్లు అరతులం చొప్పున తింటే నలభై రోజుల్లో తెల్లమచ్చలు తగ్గుతాయి.

->పిచ్చి కుసుమ ఆకుల రసాన్ని తులసి ఆకుల రసంతో కలిపి మచ్చలు ఉన్నచోట రాయడం వల్ల క్రమంగా అవి తగ్గుముఖం పడుతాయి.

->తంగేడు చెట్టు పట్టను ఆవ


బొల్లి మచ్చలు నివారణ కు నవీన్ నడిమింటి సలహాలు అవగాహనా కోసం - Vnitiligo (Leucoderma) 

బొల్లి మచ్చలు అంటే ఏమిటి?
బొల్లి (లుకోడెర్మా) మచ్చలు అనేది ఒక జన్యుపరమైన రుగ్మత. ఈ రుగ్మత సంభవించినపుడు చర్మం దాని రంగును కోల్పోయి తెలుపు రంగులోకి మారుతుంది. ఇది అంటువ్యాధి కాదు. బొల్లి శరీరంపై కొన్ని ప్రదేశాలకు మాత్రం పరిమితమై ఉండవచ్చు లేదా శరీరం మొత్తానికి విస్తృతంగా వ్యాపించి కూడా ఉండచ్చు. బొల్లి రుగ్మతలో అరుదైన విశ్వవ్యాప్త రకం ఉంది, దీనిలో మొత్తం శరీరం నుండి సహజమైన చర్మంరంగు (మెలనిన్) అదృశ్యమవుతుంది (బొల్లి రుగ్మత యొక్క తెల్లరంగు సంభవిస్తుంది.) ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాలో బొల్లి 1% -4% మందికి ఈ బొల్లిమచ్చలవ్యాధి సంభవిస్తోంది.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
దీని సంకేతాలు మరియు లక్షణాలు:
https://m.facebook.com/story.php?story_fbid=2455733968024807&id=1536735689924644

చర్మంపై తెల్లని మచ్చలు లేదా చర్మవర్ణ నష్టం

నొప్పి

దురద

నెత్తిమీది జుట్టు రంగును, మరియు కనురెప్ప వెంట్రుకలు, కనుబొమ్మలు మరియు మగాళ్ళలో గడ్డం వంటి ఇతర భాగాలను ఈ బొల్లిమచ్చల రుగ్మత దెబ్బ తీస్తుందని గమనించబడింది. ఇది కళ్ళు మరియు పెదవులు వంటి శరీర భాగాలను కూడా దెబ్బతీస్తుంది.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ఎక్కువగా, ఈ రుగ్మత పుట్టిన తర్వాత వచ్చేదే, కానీ కొన్నిసార్లు ఇది ఒక జన్యు మూలాన్ని కలిగి ఉంటుంది. చర్మం నుండి అలాంటి ప్రతిస్పందనను ప్రేరేపించగల గుర్తించబడని పర్యావరణ కారకాలు ఉన్నాయి. బంధువుల్లోనే బొల్లమచ్చల రోగంతో ఉండేవాళ్ళు 25% -30% వరకూ ఉండే అవకాశాలు ఉన్నాయి మరియు కుటుంబంలోనే సోదరులు లేదా సోదరీమణులు మధ్య బొల్లిమచ్చల రుగ్మత 6% ఉండే అవకాశం ఉంది. ఈ రుగ్మత ఎక్కువగా స్వయంరక్షక వ్యాధులతో (ఆటో ఇమ్యూన్ డిజార్డర్లతో) ఉన్నవాళ్లలో కనిపిస్తుంది, వాళ్ళ నుండి వారి సంతానానికి కూడా ఈ బొల్లమచ్చల వ్యాధి ప్రాప్టించవచ్చు.
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
మీ వైద్యుడు మిమ్మలను భౌతికంగా పరిశీలించి మీ వ్యాధిలక్షణాల గురించి అడగవచ్చు. బొల్లమచ్చల వ్యాధికి సంబంధించి మీ కుటుంబంలో ఎవ్వరికైనా ఉందా లేదా కుటీరంభంలో వ్యాధి గత చరిత్రను వైద్యుడు అడగవచ్చు. ప్రయోగశాల పరీక్షలను ఇలా నిర్వహిస్తారు:

పూర్తి రక్త గణన పరీక్ష

థైరాయిడ్ పరీక్షలు

ఇతర స్వయం ప్రతిరక్షక రుగ్మతల్ని శోధించడానికి యాంటీబాడీ పరీక్షలు

ఫోలేట్ లేదా విటమిన్ B12 పరీక్ష

విటమిన్ D స్థాయిల పరీక్ష

చికిత్స పద్ధతుల్లో కొన్ని మందులున్నాయి, కాంతిచికిత్స ( phototherapy) మరియు శస్త్ర చికిత్సలు ఉన్నాయి. వ్యక్తి చర్మం రంగుతో పాచ్ రంగును పోల్చడానికి మైక్రోపిగ్మెంటేషన్ చేయబడుతుంది. చర్మ రక్షణకుగాను చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా సన్స్క్రీన్లను (క్రీములు) ఉపయోగించడం మంచిది. ఆత్మవిశ్వాసం తగ్గడం వలన కొంతమంది రోగులలో కుంగుబాటు (డిప్రెషన్) ఏర్పడవచ్చు. సరైన సలహా సంప్రదింపులు మరియు వ్యక్తి యొక్క మద్దతు సమూహాలు ఒత్తిడి మరియు నిస్పృహల్నిఅధిగమించడానికి సహాయపడవచ్చు.

బొల్లి మచ్చలు నివారణ కు నవీన్ చెప్పిన కొన్ని మనమందు की दवा - dicines for Vitiligo (Leucoderma) 

బొల్లి మచ్చలు కొన్ని మందులు ఉన్నాయి మీ ఫ్యామిలీ డాక్టర్ సలహాలు మేరకు వాడాలి 
Medicine NamePack Size
 
1.-MelbildMELBILD SOLUTION
2.-Macsorlen XMACSORLEN X TABLET 3.-Alamin SeAlamin Se 410 Mg/100 Mg/290 Mg/130 Mg Infusion
4.-Bjain Psoralea corylifolia Mother Tincture QBjain Psoralea corylifolia Mother Tincture Q143.0Schwabe Psoralea corylifolia MTSchwabe Psoralea corylifolia MT68.0Bjain Psoralea corylifolia DilutionBjain Psoralea corylifolia Dilution 1000 CH175.0KuvadexKuvadex 10 Mg Tablet
5.-MelacylMelacyl Tablet16.0BenoquinBENOQUIN CREAM 20GM
6.-Meladerm (Inga)Meladerm 10 Mg Tablet
7.-MelanMelan 10 Mg Tablet
8.-MelanexMelanex 10 Mg Tablet
9.-MelcylMELCYL 1% LOTION 30ML
10.-MacsoralenMACSORALEN DROPS 15ML
11.-MelanocylMelanocyl 1% Solution
12.-OctamopOctamop 0.75% Lotion
13.-Dsorolen ForteDsorolen Forte 25mg Tablet
14.-Soralen ForteSoralen Forte 25mg Tablet
15.-Trioxen ForteTrioxen Forte Tablet
16.-Neosoralen DragesNeosoralen Drages 5mg Tablet
16.-Sensitex 25mgSensitex 25mg Tablet
     పై అలౌపతి క్రింద ఆయుర్వేదం మందులు అన్ని మీ ఫ్యామిలీ డాక్టర్ మేరకు మాత్రమే వాడాలి 

ధన్యవాదములు🙏 
మీ నవీన్ కుమార్ 
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
 మన  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.ఇంకా సమాచారం కావాలి కావాలి అంటే లింక్స్ లో చూడాలి 
ఈ పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే మా పేజీని👍 లైక్ చేయండి,షేర్ చేయండి....!!!
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

23, జూన్ 2021, బుధవారం

కాలిన గాయాలు కు తీసుకోవాలిసిన జాగ్రత్త లు ఏమిటే మచ్చలు నివారణ కు కోసం లింక్స్ లో చూడాలి


Burns – కాలిన గాయాలు కు తీసుకోవలిసిన జాగ్రత్త లు అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 

 

కాలిన గాయాలు

కాలిన గాయాల వలన ఏర్పడే బాధ శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా మనిషిని కుంగదీస్తుంది. కాలిన గాయాలకు వాటి స్వభావాన్ని బట్టి, గాయం తీవ్రతను బట్టి చికిత్స పొందాల్సి ఉంటుంది.

చర్మం మాత్రమే కాలినట్లయితే గాయం తీవ్రతను ప్రాథమిక స్థాయిగా గుర్తించి చికిత్స గాయం మానడానికి, నొప్పి తగ్గిపోడానికి సంబంధించిన చికిత్స చేస్తారు. అదే చర్మం కాలడంతోపాటు నరాలు కూడా దెబ్బతింటే గాయం తీవ్రతను ద్వితీయ స్థాయిగా గుర్తిస్తారు. ఇటువంటి గాయాలకు జాగ్రత్తగా చికిత్స చేయాల్సి ఉంటుంది. క్షతగాత్రుని 24 గంటల పాటు వైద్యుని పర్యవేక్షణలో ఉంచాల్సిఉంటుంది.

చర్మం, నరాలతో పాటు కండరాలు కూడా కండరాలు దెబ్బతింటే ఇటువంటి గాయం తీవ్రతను మూడో స్థాయిగా గుర్తిస్తారు. ఇటువంటి సమయంలో క్షతగాత్రున్ని ఐసీయులో ఉంచి చికిత్స చేస్తారు. ఈవిధంగా ఉండే క్షతగాత్రుని పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో వైద్యులు ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది.

కాలినగాయాలు, బొబ్బలు మూలంగా చాలా భాధాకరమైన పరిణామాలు కలుగుతాయి. అవి మచ్చలు, అంగవైకల్యము, మానసిక గాయం మొదలగునవి. ఈ ప్రభావాలన్నీ చాలా కాలం ఉండిపోతాయి. కాబట్టి సత్వర సరియైన జాగురూకత/ జాగ్రత్త తో చేసే చికిత్స ఎంతో అవసరం. శరీరం కొన్ని వేడి వస్తువులకు లేదా బలమైన రసాయనాలకు దగ్గరగా వచ్చినప్పుడు కాలినగాయాలవుతాయి.

కాలినప్పుడు నీళ్లు పోయరాదు, బొబ్బలొస్తాయనేది అపోహ. మాత్రమే. కాలేటప్పుడు నీళ్లు పోయడం వల్ల ఆ భాగం చల్లబడి కాలే తీత్రత తగ్గుతుంది. నూనె, ఇతర ఆయింట్‌మెంట్లు వెంటనే పూయడం వల్ల చర్మం గ్రంథులు మూసుకుని వేడి శరీరంలో నిక్షిప్తమవుతాయి. దీంతో ఇంకా ఎక్కువ చర్మం కాలి దెబ్బతినే అవకాశం అధికం. కాలిన తీవ్రతను బట్టి బొబ్బలెక్కుతాయి. అంతే కానీ నీళ్లు పోయడం వల్ల కాదు. నీళ్లు పోయడం వల్ల బొబ్బల తీవ్రత తగ్గుతుంది.

తరచూ కాలిన గాయాలవడానికి కారణాలు:

* వంట పాత్రలు, కేకులు తయారు చేసే ఓవెన్ అరలు, కుక్కర్ల చేతి పిడి
* ఆధునికమైన కరెంట్ పరికరాలు ఉదా : ఇస్త్రీ పెట్టెలు, టీ కాచుకునే పాత్రలు మొదలగునవి.
* ప్రమాదకరంగా గ్యాసుల మంట, కరెంట్ వైర్లు తగిలి, కాలుతున్న ఇనుప తడికెలు
* ప్రమాదకరంగా బట్టలకు అంటుకున్న మంటలు
* బ్లీచ్ / తెలుపు లేక చలవ చేయు బట్టల పొడి, పలుచ చేయని దుర్వాయువులను పొగొట్టే ద్రవాలు
* తీవ్రమైన సూర్యరశ్మి మరియు గాలి
* తాళ్ళ రాపిడి

చాలా వరకు కాలిన గాయాలు ఇంటిలోనే జరుగుతాయి. అందువల్ల వీటికి ఇంటిలోనే చికిత్స చేయాలి. అందునా ఇవి వంట ఇంటిలోనే ఎక్కువగా జరుగుతాయి. వీటిని వంట గదిలోనే అత్యవసర చికిత్స అందించవచ్చు. కానీ తగు జాగ్రత్తలు తీసుకుంటే ఇన్ని ప్రమాదాలు జరుగవలసిన అవసరం లేదనే నొక్కి చెప్పాలి.

సాధారణంగా ఈ ప్రమాదాలు ముసలి వారికి, పసి పిల్లలు ముఖ్యంగా ప్రాకే పిల్లల, అంగవైకల్యం వున్న వారిలో ఎక్కువగా జరిగే ప్రమాదం ఉంటుంది. పసి పిల్లలో, ముసలి వారిలో కలిగే కాలిన గాయాలను తీవ్రంగా పరిగణించాలి.

కాలిన గాయాలయినపుడు కొన్ని చేయగూడని పనులు:

కాలిన గాయాలు శరీరానికి ఏ విధమైన హాని కలిగిస్తాయో చెప్పే ముందు, వైద్య నిపుణుల సాయం అందేలోపు కాలిన గాయాలకు చేయగూడని పనులు కొన్ని క్రింద ఉదాహరించబడ్డాయి.

* కాలిన గాయాం మీద వెన్న, పిండి, వంటసోడా వంటవి అస్సలు పెట్టరాదు/పెట్టకూడదు
* విలేపనము (మలాము), నూనెలు, క్రిమి కీటక నాశిని వంట ద్రవాలు
* కాలిన గాయాల వల్ల వచ్చిన బొబ్బలను గ్రుచ్చకూడదు, లేదా పగుల గొట్ట కూడదు.
* గాయాలను అవసరానికి మించి ముట్టుకొనరాదు.
* కాలిన బట్టలు శరీరానికి అంటుకుపోయి వున్నట్టైతే వాటిని బలవంతంగా తాకరాదు.

ఈ రోజులలో బట్టలు కృత్రిమ నారతో నేసిన/చేసిన బట్టలవే కాబట్టి మంటలకు అవి పూర్తిగా కరిగిపోయి శరీరానికి అంటుకొనిపోతాయి. వీటిని బలవంతంగా లాగడానికి ప్రయత్నిస్తే వాటితో పాటు చర్మం కూడా వూడి వస్తుంది. దీని మూలాన అనవసరంగా క్రిములు శరీరంలోనికి చేరే అవకాశం వుంటుంది. ఎటూ అవి పూర్తిగా కాలినాయి కాబట్టి సూక్ష్మక్రిములు చనిపోయి వుంటాయి. అందుకని అలానే వదిలివేయడంమంచిది.

సాధారణ చికిత్స:

కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో తప్పించి కాలిన గాయాలన్నీంటికీ ఒకే విధమైన చికిత్స వుంటుంది. చాలా వరకూ ఏవో చిన్న కాలిన గాయాలు తప్పితే మిగిలినవన్నీ ప్రమాదకరమైనవే. చాలా నొప్పి, బాధ కొన్ని సందర్భాలలో ఘతము/ షాక్ ను కలిగిస్తాయి. చాలా వరకూ ఈ ప్రమాదాలు అత్యవసర పరిస్థితులు ఉదాహరణకు ఇళ్ళు కాలిపోతున్నప్పుడు, రోడ్డు ప్రమాదాలలో, పెట్రోలు కారడం మూలంగా కలుగుతాయి. కాబట్టి అత్యవసర పరిస్థితిలో వున్న రోగిని ప్రశాంతంగా వుంచాలి. ధైర్యం చెప్తూ చికిత్స ప్రారంభించాలి. ఎందుకంటే జరిగిన ప్రమాదం వల్ల రోగి ముందుగానే భయంతో, ఘాతములో వుంటాడు. రోగితో మృదువుగా ప్రవర్తిస్తూ త్వరిత గతిన చికిత్స ప్రారంభిస్తూ, పద్ధతి ప్రకారం ఏది ముందు, ఏది వెనక చేయాలో చేస్తూ పోవాలి.

ఒక్కసారి చర్మం, కణజాలం కాలిన తరువాత శరీరంలో నుంచి ద్రవాలు చాలా వరకూ నష్టపోతాయి. గాయపడిన కణజాలం వేడిని పట్టి వుంచుతుంది. దీని మూలంగా కణజాలం మరింత దెబ్బతింటుంది. కాబట్టి చికిత్సలో ముఖ్యమైన భాగం ఈ వేడిని తగ్గించడం. ప్రాధమిక చికిత్సలో ఈ ఉష్ణోగ్రతను తగ్గించడం.

తీసుకోవలసిన జాగ్రత్తలు:

* కాలిన గాయాలయిన శరీర భాగాన్ని వెంటనే చల్లటి నీళ్ళలో ముంచాలి. బకీట్ నీళ్ళలో గానీ, బట్టలుతికే టబ్బులో గానీ వంట ఇంటి సింకులో కానీ, కనీసం పంపు క్రింద నీళ్ళలో గానీ కాలిన భాగాన్ని వుంచాలి.
* ఈ విధంగా కనీసం కాలిన భాగాన్ని పదిహేను నిమిషాలు లేక నొప్పి తగ్గే వరకూ వుంచాలి.
* ఒక వేళ కాలిన భాగాన్ని నీళ్ళలో ముంచడం కష్టమయితే (ముఖము) శుభ్రమైన గుడ్డను చల్లని నీటిలో ముంచి కాలిన భాగం పై అద్దాలి. ప్రతిసారి అద్దే ముందు చల్లని నీటిలో ముంచాలి. గాయం మీద రుద్దకూడదు ఈ విధంగా చేయడం మూలంగా కణజాలం నుంచి కొంత వేడి గుంజేయడం జరిగి తద్వారా గాయం ఎర్ర బడడం, నొప్పి. బొబ్బలు రావడం నివారించవచ్చును.

* చేతికి వున్న వుంగరాలు, గాజులు, బూట్లు బిగుతుగా వున్న బట్టలు ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా తీసివేయాలి. ఎందుకంటే తరువాత కలిగే వాపు మూలాన తీయడం కష్టం కావచ్చును.
* చిన్న చిన్న ఉపరితలంలో వున్న గాయాలను పొడిగా, శుభ్రంగా వున్న బట్టతో అద్దాలి. ఆ తరువాత పట్టీలు కప్పాలి.పెద్ద గాయాలు, లోతుగా అయిన గాయాలు నీటిలో నుంచి బయటకు తీసిన తరువాత తేలికగా శుభ్రంగా ఈ మధ్యనే ఉతికిన పీచులు లేని బట్టతో కప్పాలి. (శుభ్రంగా వున్న దిండుగలేబు కాలిన గాయాలు వున్న కాళ్ళకు తొడగడానికి అనువుగా వుంటుంది.)
* వైద్యుడు లేదా ఆంబులెన్స్ కు కబురు చేయాలి.
* ఏదైనా కాలిన గాయం తపాలా బిళ్ళ కన్నా (2.21/2 సెం.మీ) పెద్దదిగా వున్నప్పుడు మీరు చల్లని నీళ్ళతో చికిత్స చేసిన వెంటనే వైద్యులను సంప్రదించాలి.
* కాలిన గాయాలు పెద్దవిగా వున్నప్పుడు రోగిని ఆసుపత్రికి తరలించేటప్పుడు ఒక తువ్వాలులో ఐసు వేసి దానిని గాయంపై ఎక్కువ వొత్తిడి లేకుండా ఉంచాలి.
* కాలిన గాయాల కణజాలాన్ని క్రిమి సంపర్కం నుంచి కాపాడలేక పోతే సూక్ష్మ జీవులు గాయాల పై వృద్ధి చెందుతాయి. ఈ విధంగా గాయాలను కప్పడం మూలాన రోగి ఆదుర్దా తగ్గుతుంది. ఎందుకంటే వారికి గాయాలు కనపడవు కాబట్టి బల్ల మీద కప్పే గుడ్డలు (నైలాను కాకూడదు) శరీరాన్ని కప్పడానికి బాగా పనిచేస్తాయి. గాయాలపై కట్టే బట్ట తేలికగా ఎక్కువ వొత్తిడి లేకుండా కప్పాలి.
* వైద్యుడు లేక ఆంబులెన్స్ వచ్చే వరకూ రోగికి ధైర్యం చెప్తూ ప్రశాంతంగా ఉండేలా చూడాలి. పసి పిల్లలైతే ఎత్తుకుని వూపాలి. అదే సమయంలో కాలిన గాయాలకు వొత్తిడి కలగకుండా చూసుకొవాలి.

ప్రత్యేకమైన చికిత్స అవసరమైన పరిస్థితులు బట్టలకు నిప్పు అంటుకున్నప్పుడు

* బట్టలు ఇంకా మండుతున్నట్టైతే చల్లని నీరు మంటలపై వేసి మంటలు ఆర్పాలి లేదా రోగిని దుప్పటితో కప్పి ( దుప్పటి లేకపోతే కోటు లేదా పెద్ద గుడ్డ ముక్కతో నైనా సరే) గాలి తగలకుండా చూడాలి. కంబళి కూడా పని చేస్తుంది దుప్పటి మీ ముందు భాగంలో వుండే విధంగా నిలబడాలి దీని వల్ల మంటలు మీకు అంటుకోకుండా వుంటాయి.
* మంటలలో కాలుతున్న రోగి భయంతో ఒక గదిలో నుంచి మరొక గదిలోనికి పరిగెత్తుతూ వుండవచ్చు. అటువంటప్పుడు అన్ని చోట్ల మంటలు అంటుకునే ప్రమాదం వుంటుంది. మంటల వేడికి తట్టుకోలేక బయటకు పరిగెత్తుతారు. బయట గాలికి మంటలు ఇంకా ఎక్కువయే అవకాశం వుంటుంది. అందువలన రోగిని కదలకుండా వుండమని ప్రోత్సహించాలి.
* మంటలు ఆర్పిన తరువాత పైన తెలియ చేసిన విధంగా చికిత్స ప్రారంభించాలి.

కంటిలోనికి చిమ్మిన రసాయనాలు:

వీటి వలన కంటికి శాశ్వతమైన హాని కలగడమే కాకుండా చూపు కూడా కోల్పోవచ్చు. కాబట్టి చికిత్స అతి త్వరగతిన మొదలై పోవాలి. ముందుగా రసాయనాన్ని పలుచపరచే పని చూడాలి.

* రోగిని వెల్లకిలా పడుకో బెట్టి బొటనవేలు వుంగరంతో వేళ్ళతో కంటి రెప్పలను వేరు చేసి ముక్కువైపు నుంచి కంటి ముందు భాగం వైపు చల్లని నీరు ఆపకుండా కొద్ది సేపు పోయాలి. దీని మూలంగా రసాయనకం పలచబడుతుంది. రెండో కంటిలో రసాయనం పడకుండా తల కొద్దిగా ప్రక్కకు తిప్పి నీరు పోయాలి.
* కంటి రెప్పలు పదే పదే మూసి తెరవడం వల్ల రసాయనం కంటి లోపలి భాగంలో ఉండి (మడతలలో) పోకుండా బయటకు వచ్చేస్తుంది.
* కంటిని కడిగే ప్రక్రియ కనీసం పది నిమిషాలు చేయాలి. గడియారంలో చూసుకుంటూ చేయాలి. సమయం తగ్గించకూడదు.
* కంటిని కడిగిన తరువాత రెప్పలు మూసి కంటిపై శుభ్రమైన బట్ట పెట్టాలి
* రోగికి ధైర్యం చెప్పి ఆసుపత్రికి తరలించాలి

కరెంట్ తో కాలిన గాయాలు: 

ఈ గాయాలు చిన్నవిగా వున్నా లోతుఎక్కువగా వుంటాయి. ఇవి ముఖ్యంగా కరెంట్ శరీరంలోనికి ప్రవేశించి మరలా బయటకు వెళ్ళి పోయిన ప్రదేశంలో కనబడతాయి.

* అత్యవసర పరిస్థితిలో వున్న రోగికి చికిత్స చేసే ముందు కరెంట్ స్విచ్ బంద్ చేసి ప్లగ్గు తీసి వేయాలి దీని మూలంగా కరెంట్ సరఫరా నిలిచిపోతుంది.
* రోగి నీళ్ళలో పడి వున్నట్టైయితే మీరు దూరంగా వుండండి. తడి కరెంట్ ప్రసరణ చేసే గుణాన్ని శ్రేష్టంగా పెంచుతుంది. దీని మూలంగా రోగిని సంకల కింద చేతులు వేసి లేపకూడదు.
* రోగి శ్వాస ప్రక్రియను గమనించాలి విద్యుచ్ఛక్తి ఛాతీ మరియు గుండె గుండా ప్రసరించి శ్వాసను, గుండెను ఆపివేసి వుండవచ్చు. నొటి ద్వారా శ్వాస నందించడం, గుండె మర్దన వెంటనే మొదలు పెట్టాలి.
* రోగిని అనుకూలంగా పరుండబెట్టి సాధారణ చికిత్స మొదలు పెట్టాలి.

కాలిన గాయాల నుంచి బ్యాక్ టు లైఫ్: 

దీపాలు, బాణాసంచాతో దీపావళి ఆనందంగా వెళ్లిపోయింది. పండగ మిగిల్చిన ఆనందాలను కొందరు మదిలో పదిలంగా దాచుకుంటే, మరికొందరు విషాదాన్ని మూటగట్టుకొని ఉంటారు. బాణాసంచా పేలుడులోనో, ప్రమాదంగా మారిన పరిస్థితుల వల్లనో కాలిన గాయాలతోనో బాధపడుతూ ఉంటారు. మొన్నటి వరకు అందంగా ఉన్న శరీరం అనుకోని ప్రమాదం కారణంగా అందవిహీనంగా మారితే? లేదా ఇతరత్రా అవకారాలు మిమ్మల్ని బాధిస్తూ ఉంటే? ఆవేదన వద్దు… ప్లాస్టిక్ సర్జరీతో పరిష్కారం ఉంది.
అందంగా ఉన్న శరీరం ప్రమాదం కారణంగా అందవిహీనంగా మారితే! ఆ బాధ మాటల్లో చెప్పలేం. శరీరం పూర్వపు స్థితిని పొందాలన్నా, ఉన్నదానికన్నా మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకోవాలన్నా అందుబాటులో ఉన్న చికిత్స ప్లాస్టిక్ సర్జరీ. ఒకప్పుడు సెలబ్రెటీలకు మాత్రమే అందిన ఈ వైద్యం, నేడు సాధారణ ప్రజానీకానికీ చేరువైంది. మొన్నటి దీపావళికి కాలిన శరీరపు గాయాలకే కాదు… కాస్మొటిక్ సమస్యతో మనసును కాల్చే గాయాలకూ ప్లాస్టిక్ సర్జరీ పరిష్కారం చూపిస్తుంది.

ప్లాస్టిక్ సర్జరీ…: 

‘ప్లాస్టిక్’ అనే పదం గ్రీక్ ‘ప్లాస్టికోస్’ నుంచి వచ్చింది. అంటే మలచడం, మౌల్డింగ్ అని అర్థం. అంతే తప్ప ప్లాస్టిక్ మెటీరియల్‌తో తయారుచేస్తారని కాదు. పాస్టిక్ సర్జరీలో ప్రధానంగా రెండు విభాగాలు ఉంటాయి. ఒకటి- కాస్మొటిక్ సర్జరీ (అందం మెరుగుపరచడానికి చేసే సర్జరీ), రెండు (రీ కన్‌స్ట్రక్టివ్ సర్జరీ) అవయవాన్ని కొత్తగా తయారుచేసి సెట్‌చేయడం. పాస్టిక్ సర్జరీ అనగానే టీవీ సీరియల్స్‌లోనూ, సినిమాల్లోనూ చూపించిన విధంగా ఒకరికి బదులుగా మరొకరిలా మార్చడం జరగదు. ప్లాస్టిక్ సర్జరీలో రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ, హ్యాండ్ సర్జరీ, మైక్రోసర్జరీ… అని చాలా రకాలు ఉన్నాయి.

స్కిన్‌గ్రాఫ్ట్…:

శరీరంలోనే అతిపెద్ద అవయవం చర్మం. శరీరభాగాలను కప్పి ఉంచే ఈ చర్మం కనుబొమల దగ్గర సున్నితంగా, అరచేయి, పాదాల్లో గట్టిగా ఉంటుంది. శరీరం మొత్తంలో అధిక ప్రాధాన్యం ఉన్న ఈ చర్మం ఏ కారణం చేతనైనా కాలినా, దెబ్బతగిలి గాయపడి పాడైపోయినా ఆ ప్రాంతంలో దానిని తొలగించి, శరీరంలో ఇతర చోట్ల ఆరోగ్యంగా ఉన్న చర్మాన్ని తీసి అతికిస్తారు. ఈ పద్ధతిని స్కిన్ గ్రాఫ్ట్ అంటారు. గాయం చిన్నదైతే ఫస్ట్ డిగ్రీ సూపర్‌ఫిషియల్, సెకండ్ డిగ్రీ సూపర్ ఫిసియల్ చికిత్స చేస్తారు. అంటే డ్రెస్సింగ్, క్రీములతో గాయం నయం అయ్యేలా చూస్తారు. గాయం పెద్దదై రిస్క్ ఎక్కువ ఉన్నట్లయితే హాస్పిటల్‌లో ఆ వ్యక్తి అడ్మిట్ కావాల్సి ఉంటుంది. రిస్క్‌ను బట్టి చికిత్స ఉంటుంది. కాలిన గాయం లోతుగా ఉంటే డీప్ సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ బర్న్స్‌గా పేర్కొంటారు. స్కిన్ గ్రాఫ్ట్‌కు సాధారణంగా తొడల నుంచి చర్మం తీసి వేస్తుంటారు. అయితే తొడల దగ్గర కూడా చర్మం కాలినప్పుడు మరో చోట నుంచి ఆరోగ్యకరమైన చర్మం తీయాల్సి ఉంటుంది. ఈ చికిత్సలన్నీ అన్ని వసతులు ఉన్న చోట, నిపుణులైన సర్జన్‌తో చేయించుకుంటేనే మంచి ఫలితాలు వస్తాయి.

కాస్మొటిక్ సర్జరీ..: 

అందాన్ని మెరుగుపరుచుకోవడానికి చేసే రైనోప్లాస్టీ(ముక్కును సరిచేయడం), లైపోసక్షన్(ఫ్యాట్‌ను తగ్గించడం), ఫేస్‌లిఫ్ట్ (ముఖ చర్మం ముడతలు రాకుండా చేయడం), బ్ట్రెస్ సర్జరీ(పెద్దగా ఉన్న బ్రెస్ట్‌ను తగ్గించడం, తక్కువగా ఉన్న బ్రెస్ట్‌ను పెంచడం, సాగిన బ్రెస్ట్‌ను సరిచేయడం), పురుషుల్లో పెద్దగా ఉన్న బ్రెస్ట్‌ను (గైనకోమాస్టియా) తగ్గించడం… ఇలా చెప్పుకుంటే శరీరంలో ప్రతి భాగాన్ని సర్జరీ ద్వారా అందంగా మార్చుకోవడానికి చేసేది కాస్మొటిక్ సర్జరీ. లోపాలను సవరించుకోవడానికి, అందాన్ని మెరుగుపరుచుకోవడానికి చేయించుకునే ఈ సర్జరీకి ఒక రోజు మాత్రమే పడుతుంది.

పేలడం వల్ల అయిన గాయాలకు..: 

చేతుల్లోనే బాణాసంచా కాలి గాయాల పాలైన కేసులు ఎక్కువగా హాస్సిటల్స్‌కు వస్తుంటాయి. బాణాసంచా వల్లనో, ప్రమాదాల వల్లనో చేతి ఎముకలు విరగడం, నర్వ్ ఫంక్షన్ దెబ్బతినడం, కదలికలు లేకపోవడం, కండరాలు దెబ్బతినడం, చర్మం పాడైపోవడం… ఇలా అన్నింటిపైన రిస్క్ ఉంటుంది. ఇలాంటప్పుడు వీరికి కాంప్లెక్స్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. అంటే ముందుగా టెండార్ రిపేర్ చేయడం, తర్వాత నర్వ్ రిపేర్ ఆ తర్వాత స్కిన్ గ్రాఫ్ట్.. ఇలా దశలవారీగా చికిత్స చేస్తూ వెళతారు. శరీరం నలభై శాతం కంటే ఎక్కువ కాలినట్టయితే వీరికి ప్రాణాపాయం ఎక్కువ. వీరిని ఐ.సి.యూలో ఉంచి కొన్ని రోజుల పాటు వైటల్స్ స్టెబిలైజ్ అయిన తర్వాత పైన చెప్పిన చికిత్స చేయాలి. ఇలాంటప్పుడు ఇన్ఫెక్షన్ సమస్యలు రాకుండా జాగ్రత్తపడాల్సి ఉంటుంది

ధన్యవాదములు 🙏

మీ నవీన్ నడిమింటి

విశాఖపట్నం

ఫోన్ 9703706660

20, జూన్ 2021, ఆదివారం

చెవుల్లో ఇన్ఫెక్షన్ నివారణ అవగాహనా లింక్స్ లో చూడాలి

చెవుల్లో రింగుమనే మ్రోత అంటే ఏమిటి?

చెవుల్లో రింగుమనే మ్రోత లక్షణాన్నే వైద్యపరంగా “టిన్నిటస్” అని పిలుస్తారు మరియు ఎలాంటి బాహ్య కారణం లేకుండా అసాధారణమైన “రింగు రింగు”మనే ధ్వని లేదా సందడి ధ్వని ఒక చెవి లేదా రెండు చెవుల్లోను వినిపించడం దీని లక్షణం. చెవుల్లో ధ్వని గర్జనలాగా,  క్లిక్-క్లిక్ మనే ధ్వనిలా లేదా హిస్-హిస్ మనే బుసలుకొట్టే ధ్వని వినిపించవచ్చు. ఈ ధ్వని మృదువైనదిగా లేదా బిగ్గరగానూ ఉండవచ్చు. అయినప్పటికీ, టిన్నిటస్ అనేది ఒక వ్యాధి కాదు మరియు చెవుల్లో తమకిలా ఉంటోందని చాలామంది వ్యక్తులు వైద్యులకు నివేదించారు.

ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

చెవుల్లో రింగుమనే మ్రోత లేక టిన్నిటస్ అనేదే ఓ వ్యాధి లక్షణం, ఇది వినికిడి వ్యవస్థలో అసహజతను సూచిస్తుంది.

టిన్నిటస్ (Tinnitus) సాధారణంగా ఒకటి లేదా రెండు చెవుల్లో “రింగు రింగు” మనే ధ్వని  వినబడేదిగా వర్ణించబడింది. టిన్నిటస్ లక్షణం కల్గిన వ్యక్తి ఈ ధ్వనిని ఇంకా కింది విధంగా కూడా వర్ణించవచ్చు:

  • గర్జించే ధ్వనిన (Roaring)
  • బుసలు కొట్టే (హిస్ హిస్ మనే) ధ్వని (Hissing)
  • ఈల ధ్వని (విజ్లింగ్)
  • అస్పష్ట సందడిగా ఉండడం (Vague buzzing)

చెవుల్లో “రింగు రింగు” మనే ఈ ధ్వనిని కొందరు బిగ్గరగా ఉన్నట్లు నివేదించవచ్చు, ఇంకొందరు వ్య క్తులకు ఇది చాలా మందకొడిగా ఉండే ధ్వనిగా అనిపించొచ్చు. అయితే, టిన్నిటస్ లో ధ్వని తప్పనిసరిగా వెలుపలి మూలం నుండి రాదు. ఇది కొన్ని నిమిషాలు లేదా సుదీర్ఘకాలంపాటు చెవుల్లో అనుభవించవచ్చు.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

టిన్నిటస్ వృద్ధుల్లో చాలా సాధారణమైన లక్షణంగా ఉంటుంది, మరియు ఇది పురుషులు మరియు స్త్రీలకు కూడా వస్తుంది. టిన్నిటస్ కు కింద సూచించినటువంటి చాలా కారణాలే ఉండవచ్చు:

  • చెవి సంక్రమణం.
  • సైనస్ ఇన్ఫెక్షన్ (ముక్కు కారడం) .
  • హార్మోన్ల మార్పులు.
  • థైరాయిడ్ అసాధారణతలు.
  • చెవికి గాయం.
  • అలసట.
  • చెవి కాలువ మైనపు నిక్షేపం (ear wax) కారణంగా నిరోధించబడడం.
  • కొన్ని ఔషధాల సేవనంవల్ల

వృద్ధుల్లో టిన్నిటస్ రావడమనేది వినికిడి నష్టానికి మొదటి సంకేతం కావచ్చు.

కర్మాగారాలు మరియు సంగీత కార్యక్రమాల వంటి ధ్వని వాతావరణంలో పనిచేసే వ్యక్తులకు ఈ టిన్నిటస్ లక్షణం స్వల్ప కాలికంగా గాని లేదా శబ్దప్రేరిత వినికిడి నష్టం యొక్క నిరంతర లక్షణంగా కానీ అభివృద్ధి కావచ్చు.

టినిటస్ కుంగుబాటు మరియు ఇతర మానసిక అనారోగ్యాల లక్షణంగా కూడా కనిపిస్తుంటుంది.

టిన్నిటస్ చాలా సాధారణం కావడంతో, స్పష్టమైన కారణమంటూ ఏదీ లేకుండా కూడా  సంభవించవచ్చు.

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

టిన్నిటస్ యొక్క కారణాన్ని నిర్ధారించడానికి లేదా గుర్తించడానికి, వైద్యుడు ఒక వినికిడి పరీక్షను నిర్వహించి, ఎలాంటి ధ్వనిని వింటున్నారన్న దాని గురించి వ్యక్తిని మరింతగా  విచారణ చేయవచ్చు. CT మరియు MRI వంటి స్కానింగ్ మరియు ఇమేజింగ్ పరీక్షలు కూడా గాయం యొక్క ఏవైనా సంకేతాలను గుర్తించడానికి చేయవచ్చు. చెవిలో ఏదైనా విదేశీ శరీరం (foreign body) ఉనికిని  తనిఖీ చేయటానికి చెవి లోపల చూడ్డానికి ఉపయోగించే ఒక పరికరం “ఒటోస్కోపీ” ని వైద్యుడు నిర్ధారణలో ఉపయోగించవచ్చు.

సాధారణంగా, చెవుల్లో రింగు గింగు మనేది దానంతటదే మాయమైపోతుంది, దీనికి ప్రత్యేకమైన చికిత్స అవసరం లేదు. అయితే, ఈ చెవిరుగ్మత లక్షణానికి ఏదైనా నిర్దిష్ట కారణం ఉంటే, చికిత్స అవసరమవుతుంది.

రక్తనాళాల గాయం అయ్యుంటే దాన్ని చికిత్స చేసేందుకు మందులివ్వబడతాయి లేదా ఒత్తిడి సంబంధిత టిన్నిటస్ను కూడా మందులు ఇవ్వబడతాయి. వ్యక్తి యొక్క వినికిడి నష్టానికి హియరింగ్ ఎయిడ్ సాధనాలు ఇవ్వబడవచ్చ



చెవుల్లో రింగుమనే మ్రోత (టిన్నిటస్) కొరకు అల్లోపతి మందులు
Medicine NamePack Size
OtzOtz 200 Mg/500 Mg Tablet
Pik ZPik Z 50 Mg/125 Mg Syrup
DiofloxDioflox 100 Infusion
Mark OMark O 200 Mg Tablet
OxanidOxanid Tablet
Pin OZPin OZ Tablet
DiroxinDiroxin 100 Tablet
MaxofMaxof 200 Mg Tablet
Oxflo ZlOxflo ZL Suspension



టినెటస్‌-చెవిలో హోరు,Tinitus-noise in the Ear


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -టినెటస్‌-చెవిలో హోరు,Tinitus-noise in the Ear- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


-చాలామందికి చెవిలో విపరీతమైన పోరు ఉంటుంది. ఇలా చెవిలో హోరు వినిపిస్తోంటే చాలావరకు శ్రవణ నాడి దెబ్బ తిన్నదని అర్థం చేసుకోవాలి. కర్ణభేరికి రంధ్రం, చెవికి ఎముకలు బిగిసినా, గొలుసు కదిలిపోయినా, మధ్యచెవిలో దీర్ఘకాలం స్రావాలు చేరినా, గట్టిగా తలకు దెబ్బ తగిలిన్ఠా, మెదడులో రక్తనాళాల వ్యాధి లేక కంతులు ఏర్పడినా లేక గువిలితో పూర్తిగా నిండి చెవి మూసుకున్నా చెవిలో హోరు రావచ్చు. కేవలం హోరు మాత్రమే ఉండి వినికిడిలో మార్పు ఉండకపోవచ్చు. కొన్నిసార్లు నరాలు దెబ్బతిని వినికిడి కూడా తగ్గవచ్చు. కాబట్టి ముందుగా హోరుకు సరైన కారణం, నిర్థారణ చేయవలసి ఉంటుంది.

పరీక్షలు
-పూర్తి వివరాలు తీసుకున్నాక చెవిపరీక్ష .
ఆడియోగ్రామ్‌ వంటి వినికిడి పరీక్షలు ,
అవసరమైతే సి.టి.స్కాన్‌, ఎమ్‌.ఆర్‌.ఐ.

చికిత్స:

- వినికిడి లోపం లేకుండా కేవలం హౌరు మాత్రమే ఉంటే మీరు అనుమానాలు భయాలు పెట్టుకోకుండా దానితో జీవించడానికి అలవాటు పడాల్సి ఉంటుంది.

- వినికిడి లోపం కూడా ఉంటే, వినికిడి యంత్రం సహాయపడుతుంది.- ఇది చాలా మటుకు హౌరుని తగ్గిస్తుంది.

- అలాగే లోపలి హౌరు ఇబ్బంది పెట్టకుండా రక రకాల మార్గాలను అనుసరిం చవచ్చు.

- ముందుగా సాధ్యమైనంత వరకూ దానిని పట్టించు కోకూడదు.

- ఆధునికంగా బయటి శబ్దాలు మాత్రమే వినిపిస్తూ లోపలి హౌరును తగ్గించే టినెటస్‌ మాస్కర్లను అవస రాన్ని బట్టి వాడవచ్చును. కాబట్టి నిపుణు లను సంప్రదిస్తే 'టినెటస్‌' హౌరుకి తగిన సలహాలు, చికిత్స పొందవచ్చును.
- తీవ్ర జలుబు, ఇతర వ్యాధులు ఈ టినెటస్‌కు కారణం కాదని నిర్ధారణ చేసుకున్నాక, ముఖ్యంగా వైద్యులు రోగికి మనోధైర్యం యివ్వాలి.

- ఈ లక్షణాల నుంచి దృష్టిని మరల్చుకోవాలి. ఇంకో వ్యాపకంపై దృష్టిని పెట్టుకోవాలి.

ఇంగ్లిష్ మందులు :
Tab . Diziron 1 tab 3 times / day 3-4 days
Tab. vertizac 1 tab 2 time /day 5-7 days
Tab .vertin 1 tab 2 times / day 4-5 day
పై మందులలో ఏదో ఒకటే వాడాలి . దానితో బి.కాంప్లెక్ష్ మాత్రలు వాడాలి
Tab . beplex forte 1 tab daily for 15 to 20 days.


  • ======================================

ధన్యవాదములు 🙏

మీ మీ నవీన్ నడిమింటో

విశాఖపట్నం,

ఫోన్ - 9703706660





అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి