10, సెప్టెంబర్ 2020, గురువారం

భోజనం అయినా వెంటనే మోషన్స్ మరియు గ్యాస్ట్రిక్ సమస్యలు పై అవగాహనా కోసం ఈ లింక్స్ లో చుడండి


చాలా మందికి భోజనం చేచిన వెంటనే మోషన్స్ వత్తునది అనే బాధని కడుపులో దాచుకుంటున్నారా? అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 


బాధని కడుపులో దాచుకుంటున్నారా?

ఈ రోజుల్లో చాలా చిన్న వయసు ఉన్న వారిలో ఏదో ఒక రకమైన జీర్ణసమస్య కనపడుతుండటం చూస్తున్నాం. తిన్న వెంటనే కడుపు ఉబ్బరంగా అనిపించడం, పొట్ట రాయిలా మారడం, పుల్లని తేన్పులు రావడం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రతి ఇంట్లోనూ తమకు మలబద్దకం గ్యాస్‌, గుండెల్లో మంటగా ఉంటోందనో చెప్పడం చాలా సాధారణం. మారిపోయింది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క కుటుంబానికీ ఉపకరించేలా ఆహారం జీర్ణం అయ్యే ప్రక్రియలోనూ, జీర్ణ సమస్యలో ఎదుర్కొనే సాధారణ సమస్యలూ, వాటి పరిష్కారాల గురించి తెలుసుకుందాం...

కడుపులో గ్యాస్‌ సమస్యకు ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో ఇవి కొన్ని... ∙కడుపులో కొద్దిపాటి ఖాళీ కూడా మిగల్చకుండా తినడం ∙తిన్నవెంటనే పడుకోవడం ∙ఆహారంలో కొవ్వు ఎక్కువగా ఉండటం. ∙ఉప్పు, కారం, మసాలాలు అధికంగా ఉండటం. ∙మనం తీసుకున్న ఆహారంలో తగినన్ని పీచుపదార్థాలు ఉండకపోతే... అలాంటప్పుడు యాసిడ్‌ పనిచేసే సమయంలో కడుపు కండరాలకు తగినంత రక్షణ దొరకదు. యాసిడ్‌ నేరుగా కడుపు కండరాలపై పనిచేస్తుండటంతో కడుపులో మంట, గ్యాస్‌ పైకి ఎగజిమ్మడం వంటి సమస్యలు మరింత తీవ్రమవుతాయి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే పలు సూచనాలు పాటించాలి. ఒకేసారి ఎక్కువ ఆహారాన్ని మూడు పూటల్లో కాకుండా చిన్న చిన్న మోతాదుల్లో తినాలి. అలాగే ఊబకాయం ఉన్నవారు బరువు తగ్గించుకోవాలి ప్రయత్నం చేయాలి. పొగతాగడం, మద్యపానం వంటి అలవాట్లు ఉన్నవారు వాటిని మానివేయాలి.రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందర రెండుగంటల పాటు ఏమీ తినకూడదు. ఇలాంటి జాగ్రత్తలు పాటించడం వాళ్ళు గ్యాస్ట్రిక్ సమస్య నివారణకు చేయవచ్చు 

Gas trouble , గ్యాస్ ప్రోబ్లం - నివారణ కు నవీన్ నడిమింటి సూచనలు అవగాహనా కోసం 



పేగుల్లో తయారయ్యే గ్యాస్ ప్రమాదం కలిగించదు. కాని మహా ఇబ్బందని, అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ముఖ్యమైన మీటింగులో ఉన్నప్పుడు గాని, లిఫ్ట్‌లో ఇతరులతో పాటు నిలబడినప్పుడు గాని, మొదటిసారి జీవిత భాగస్వామితో గడిపే ఏకాంత సమయాల్లో గాని గ్యాస్ విడుదల చేయాల్సి వస్తే సంకటస్థితి అంతా ఇంతాకాదు. గ్యాస్‌తో పొట్ట ఉబ్బరించి ఉదరంలో నొప్పిని కలిగిస్తున్నప్పుడు దానిని ఆయుర్వేద పరిభాషలో ‘ఆధ్మానం’ అనే పేరుతో పిలుస్తారు. ఇది బయటకు రావటానికి ప్రయత్నించటంతోనే త్రేన్పులు వస్తుంటాయి. కాగా మలద్వారం నుంచి విడుదలయ్యే గ్యాస్‌ని అపానం (ప్లాటస్) అనే పేరుతో వ్యవహరిస్తారు. ప్రతివారిలోనూ గ్యాస్ తయారవుతూనే ఉంటుంది.

ఆహార , విహారాదుల్లో నియమం తప్పకుండా వుంటే ఆరోగ్యం గా ఉంటాం . ఈ కాలం లో అంతా బిజీబిజీ ... రోజూ ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడక చేరేటంతవరకూ క్షణమన్నా తీరిక లేని పనులతో గడుపుతున్నారు . కొందరికి తిండి కరువైతే మరికొందరికి తినడనికి కాఅవలసినంత ఉన్నా తగిన సమయం ఉండదు . ఈ విదం గా Hurry , Worry , Curry ల కారణం గా జీర్ణశక్తి పాడవుతుంటుంది . గ్యాస్ కడుపులో తయారవుతూ ఉంటుంది .

సాధారణ వ్యక్తుల్లో మామూలు పరిస్థితుల్లో రోజుకు కనీసం 10 సార్లు గ్యాస్ విడుదల చేస్తూ ఉంటారు. కొంతమందిలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో బంధింపబడి తీవ్రస్థాయిలో కడుపునొప్పిని కలిగించే అవకాశం ఉంది. మలబద్ధకం, విరేచనాలు వంటి సమస్యలను కలిగించే కారణావల్ల అదనంగా గ్యాస్ తయారవటమే కాకుండా నొప్పిగా అనిపిస్తుంది. పేగుల్లో తయారయ్యే గ్యాస్‌లో ఆక్సిజన్, నైట్రోజన్, హైడ్రోజన్, కార్బన్ డై ఆక్సైడ్, మిథేన్ వంటి వాయువులు ఉంటాయి.

గ్యాస్ తయారవటం అనేది సహజమైన శారీరక క్రియ. కనుక దానిని అడ్డుకోలేక పోయినప్పటికీ, కొన్ని చిన్న, చిన్న గృహ చికిత్సల ద్వారా ఆహార వ్యవహారాల్లో మార్పులు, చేర్పుల ద్వారా గ్యాస్ సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చు.

లక్షణాలు

గ్యాస్ సమస్య కలిగినవారికి సంకల్పంతోగాని, అసంకల్పితంగా గానీ గ్యాస్ విడుదలవుతుంటుంది. గ్యాస్ వల్ల కడుపునొప్పిగా అనిపిస్తుంది. కడుపులో నొప్పి చాలా తీక్షణంగా, ఉదరకండరాలను పట్టేసినట్లు, ఏదో ప్రమాదకరమైన సమస్య ఉందేమో అన్నంత స్థాయిలో వస్తుంది. గ్యాస్‌వల్ల వచ్చే కడుపునొప్పి ఉదరంలో ఒక భాగంలో కేంద్రీకృతం కాకుండా త్వరిత గతిన మారుతుంటుంది. ఆమ్లాశయంలో కండరాలు ముడిపడినట్లు అనిపించవచ్చు. గ్యాస్‌వల్ల ఒకవేళ ఉదరంలో ఎడమవైపు పైభాగంలో నొప్పి వస్తుంటే గుండెనొప్పిగా భ్రమకలుగుతుంది. అలాగే గ్యాస్‌వల్ల ఒకవేళ ఉదరంలో కుడివైపు పైభాగంలో నొప్పి వస్తుంటే ఎంపెండిసైటిస్‌గా గాని లేదా గాల్‌స్టోన్స్ నొప్పిగా గాని భ్రమకలుగుతుంది. పొట్ట ఉబ్బరింపుగా నిండిపోయినట్లు బిర్రుగా అనిపించడం గ్యాస్ ప్రధాన లక్షణం. అలాగే రోజుల తేడాతో పొట్ట వచ్చినట్లు మళ్లీ అంతలోనే తగ్గిపోయినట్లు కనిపించటం కూడా గ్యాస్ లక్షణమే.

కారణాలు

*మాట్లాడేటప్పుడు గాని, ఆహారాలను మింగేటప్పుడు గాని గాలిని మింగటం; ఆందోళనగా ఉన్నప్పుడుగాని ఉధ్విగ్నంగా ఉన్నప్పుడు గాని గాలిని అసంకల్పితంగా మింగటం

*ఆహారాన్ని నమలకుండా గబగబ మింగటం; చూయింగ్‌గమ్ వంటి వాటిని అదే పనిగా నమలటం; స్ట్రాతో ద్రవహారాలను తాగటం.

*ఆహారంలోని పిండి పదార్థాలు చిన్నపేగులో జీర్ణం కాకపోతే పెద్ద పేగులోని బ్యాక్టీరియా చర్య జరిపి పులిసిపోయేలా చేసి గ్యాస్‌ని విడుదల చేయటం.

*పండ్లు, కాయగూరలు, గింజధాన్యం, బీన్స్, చిక్కుడు, బఠాని తదితర పీచు పదార్థాలూ, ఈసబ్‌గోల్ వంటి తంతుయుత పదార్థాలూ అరగకపోవటం.

*సోడా, బీర్, శీతలపానీయాలు తదితర గాలినిండిన కార్బనేటెడ్ పానీయాలను తీసుకోవటం.

*కొవ్వు పదార్థాలు తినటం కడుపు ఉబ్బరానికి దోహదం చేస్తుంది. జీర్ణాశయం నుంచి ఆహారం త్వరగా పేగుల్లోకి వెళ్లకుండా కొవ్వు అడ్డుకుంటుంది. దీంతో కడుపు నిండుగా అనిపిస్తుంది.

* ఒత్తిడి, ఆందోళన, పొగ తాగటం, జీర్ణకోశంలో ఇన్‌ఫెక్షన్‌, ఇరిటేబుల్‌ బోవెల్‌ సిండ్రోమ్‌ కూడా కడుపు ఉబ్బరానికి కారణమవుతాయి

*ఇతర వ్యాధులు సమాంతరంగా బాధిస్తుండటం (డైవర్టిక్యులైటిస్, క్రాన్స్ వ్యాధి, అల్సరేటివ్ కోలైస్).

*యాంటీ బయాటిక్స్‌ని అతిగా వాడటం (ఇవి మంచిచేసే సాధారణ బ్యాక్టీరియాను సైతం నాశనం చేస్తాయి).

*విరేచనౌషధాలను గాని లేదా మలాన్ని బంధించే ఔషధాలను గాని వాడటం (వీటివల్ల పేగు కదలికలో తేడాలు చోటుచేసుకుంటాయి).

*మలబద్ధకంతో ఇబ్బంది పడుతుండటం (మలం బిరడా వేయటం వల్ల గ్యాస్ కింద నుంచి వెళ్లలేక, పొట్ట ఉబ్బరింపు కలుగుతుంది).
పాలలోని ల్యాక్టోజ్ అనే తీపి పదార్థాన్ని శరీరం సూక్ష్మాంశాలుగా విభజించి జీర్ణించుకోలేకపోవటం (మిల్క్ ఇంటాలరెన్స్).

*గోధుమల్లోని గ్లూటెన్ అనే జిగురు పదార్థాన్ని శరీరం అనుఘటకాలుగా విభజించి విలీనం చేసుకోలేకపోవటం(గ్లూటెన్ ఇంటాలరెన్స్).

*ఆహారానికి కలిపే కృత్రిమ పదార్థాలు పడపోవటం (బబుల్‌గమ్స్, సుగర్ క్యాండీలు వంటి వాటిల్లో కలిపే సార్బిటాల్, మ్యానిటాల్ వంటి పదార్థాలు గిట్టకపోవటం).

ఇవన్నీ గ్యాస్ తయారవడానికి ప్రధాన కారణాలు. వీటిమీద అవగాహన ఉంటే గ్యాస్‌ని నిరోధించుకోవచ్చు.


చికిత్సలు, సూచనలు-ఆహార విధానం

గ్యాస్‌ని కలిగించే ఆహారాలను మానేయాలి. అన్ని ఆహార పదార్థాలూ అందిరోనూ ఒకే మాదిరిగా గ్యాస్‌ని, గ్యాస్ నొప్పినీ కలిగించవు. చాలా మందిలో గ్యాస్ కలిగించే ఆహారాలను అధ్యయనకారులు గుర్తించారు. అవి: చిక్కుళ్లు, ఉల్లిపాయ, క్యాబేజి, క్యాలీఫ్లవర్, యాపల్స్, జల్లించని గోధుమపిండి, కోడిగుడ్డు, శనగపిండి వంటకాలు తదితరాలు.

వేపుడు పదార్థాలను, నూనె పదార్థాలను మానేయాలి. కొవ్వు పదార్థాలు అమ్లాశయంలో వేగంగా కదలవు. దీనితో పొట్టనిండినట్లు అనిపించి ఉబ్బరిస్తుంది. పీచుపదార్థాలను తగ్గించాలి. పీచు పదార్థాలను ఆహారంలో నెమ్మదిగా, అల్పమోతాదులో చేర్చుతూ క్రమంగా పెంచుకుంటూ వెళ్లాలి.

పీచుపదార్థాలను తీసుకునే సమయంలో ఎక్కువగా నీళ్లు తాగాలి. పాలను మానేయాలి. లేదా కనీసం బాగా తగ్గించాలి. పాలకు బదులు అవసరమనుకుంటే పెరుగు వాడాలి. లేదా పాలను వాడటం తప్పదనుకుంటే పాలను అన్నం వంటి ఇతర పదార్థాలతో కలిపి వాడాలి. పుదీనా పచ్చడిగాని, లేదా వేడి వేడి పుదీనా కషాయం గాని తీసుకోవాలి.

పుదీనాలో ఉండే మెంథాల్ (పిప్పర్‌మింట్) జీర్ణావయవాల కండరాలను వదులు చేసి గ్యాస్ సంచితవకుండా చేస్తుంది. అయితే ఒకవేళ ఎసిడిటిగాని, రిఫ్లక్స్ గాని ఉంటే పుదీనాలోని మెంథాల్ ఆ సమస్యలను ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది.

ఎసిడిటీని తగ్గింఛే మందులు వాడుతూ ఉండాలి :
tab. Aceloc RD daily one at morning ,
tab . Gelusul mps or syrup daily 3 times ,
tab. Unienzyme 1 tab 3 times/day ,
sy. Digeples 1 table spoon 3 times daily,

ఇంకా తగ్గగపోతె మంచి స్పెసలి్ష్ట్ డాకటర్ ని సంప్రదించాలి .

జీవన విధానం

ఆహారాన్ని కొద్ది మొత్తాల్లో, ఎక్కువ సార్లు తీసుకోవాలి. బబుల్‌గమ్ నమలటం, గట్టి క్యాండీలను చప్పరించటం, స్ట్రాతో తాగటం మానేయాలి. ఈ చర్యలతో గాలిని ఎక్కువగా మింగే అవకాశం ఉంటుంది. ఆందోళనగా ఉన్నప్పడుగు గాని, గాభరాగా ఉన్నప్పుడు గాని, హడావిడిగా ఉన్నప్పుడు గాని తినవద్దు. ఆహారాన్ని ఎప్పుడూ నింపాదిగా ఉన్నప్పుడు మాత్రమే తినాలి.


హోమియో చికిత్స : by -డాక్టర్‌ పావుశెట్టి శ్రీధర్‌ .

వ్యక్తి శారీరక, మానసిక లక్షణాల ఆధారంగా హోమియో మందులను ఎంపిక చేసి ఇవ్వడం వల్ల వ్యాధి సమూలంగా నివారణ అవుతుంది.

కార్పోవెజ్‌ : గ్యాస్‌ ట్రబుల్‌ ఉన్న వారికి ముందుగా ఆలోచించదగిన మందు కార్బోవెజ్‌. పొట్ట పైభాగం గ్యాస్‌తో ఉబ్బి ఉంటుంది. పొట్ట పైభాగాన నొప్పి, మంట వస్తుంటాయి.ఆహారం తీసుకున్న తరువాత బాధలు ఎక్కువ అవుతాయి. జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలతో తరుచుగా బాధపడే వారికి ఈ మందు ప్రయోజనకారి. వీరికి తేన్పులు ఉపశమనం కలిగిస్తాయి.

చైనా:-కొంతమందిలో పొట్ట మొత్తం ఉబ్బరంగా ఉండి బెలూన్‌లాగా ఉంటుంది. వీరికి తేన్పులు వచ్చినా ఉపశమనం కలుగదు. కాని అపానవాయువుపోతే మాత్రం ఉపశమనం ఉంటుంది. ఈ రోగులు నీరసంగా ఉంటారు. ఇటువంటి లక్షణాలున్న వారు వైద్యుని సంప్రదించి ఈ మందు వాడితే మంచిది.

నక్స్‌వామిక :-మసాలాలు, ఫాస్ట్‌ఫుడ్స్‌, కాఫీలు ఎక్కువగా సేవించడం, శారీరకశ్రమ తక్కువగా ఉండి మానసిక శ్రమ ఎక్కువగా ఉన్న వారు సత్వరవైద్య సలహా పొందాలి. వీరు మానసిక స్థాయిలో కోపం, ఎక్కువ శబ్దాలు, వెలు తురు భరించలేరు. ఇటువంటి లక్షణాలతో పాటుగా గ్యాస్‌ సమస్య తీవ్రంగా ఉన్నవారికి ఈ మందు పనిచేస్తుంది.

అర్జెంటు నైట్రికం : -పొట్టలో నొప్పి ఉండి, తేన్పులు ఎక్కువగా ఉంటాయి. తిన్న తరువాత పొట్టలో నొప్పి ప్రారంభమై బాధకలుగుతుంది. వీరు మానసిక స్థాయిలో తేలికగా ఆందోళనకు గురవుతుంటారు.ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినా, ఎవరైనా వస్తున్నారని తెలిసినా, ఏదైనా పని తలపెట్టినా గందరగోళంలో పడిపోతారు. వీరికి ఈ మందు ఆలోచించదగింది.

పై మందులే కాకుండా లైకోపోడియా, పాస్పరస్‌, నైట్రమ్‌ఫాస్‌, ఎనాకార్డియం. సల్ఫర్‌, ఆర్సినికం అల్బం వంటి మందులను లక్షణ సముదాయాన్ని అనుసరించి డాక్టర్‌ సలహాతో వాడితే మంచి ఫలితముంటుంది.

జాగ్రత్తలు : మసాలాలు, వేపుళ్ళు, అయిల్‌ఫుడ్స్‌, ఫాస్ట్‌ఫుడ్స్‌, ఆల్కహాల్‌, స్మోకింగ్‌ మానివెయ్యాలి.

వేళకు ఆహారం తీసుకుంటూ నీళ్ళు సరిపడినంతగా త్రాగాలి.నిల్వఉంచిన పచ్చళ్ళు తినడం మానివేయాలి.

ముఖ్యంగా మానసిక ఒత్తిడిని నివారించటానికి, ధ్యానం, యోగా నిత్యం చేయాలి.

ప్రతి రోజు విధిగా వ్యాయామం చేయాలి.

పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న తాజా వెజిటెబుల్స్‌ ఎక్కువగా తీసుకోవాలి. టీ, కాఫీలు మానివేయాలి.
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
విశాఖపట్నం 
9703706660
              *సభ్యులకు విజ్ఞప్తి*
************************************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

కామెంట్‌లు లేవు: