గనెరియా అంటే ఏమిటి?
గనెరియా అనేది లైంగిక సంక్రమణ వ్యాధి, ఇది నిస్సిరియా గనెరియా అనే బాక్టీరియా వలన సంభవిస్తుంది. ఈ అంటువ్యాధి ఉన్నవారితో అసురక్షితమైన లైంగిక సంబంధం కలిగి ఉన్నపుడు ఇది సంభవిస్తుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
గనెరియా ఉన్న వ్యక్తులు ఎటువంటి సంకేతాలు మరియు లక్షణాలను చూపించరు , లక్షణాలు ఉంటే, అవి తేలికపాటివిగా ఉంటాయి. మూత్రవిసర్జన సమయంలో నొప్పి మరియు మంటగా ఉంటుంది, అదే గనెరియా యొక్క సాధారణ లక్షణం
పురుషుల్లో ఉండే లక్షణాలు:
- పురుషాంగం నుండి తెల్లని, పసుపు లేదా ఆకుపచ్చ రంగులో స్రావాలు
- వృషణాల నొప్పి లేదా వాపు (ఇది అరుదుగా కనిపిస్తుంది)
మహిళలలో ఉండే సాధారణ లక్షణాలు:
- ఋతు చక్రాల మధ్య సమయంలో యోని నుండి అసాధారణ రక్త స్రావం
- యోని నుండి అధికంగా స్రావాలు రావడం
పురుషులు మరియు స్త్రీలు ఇద్దరిలో కనిపించే సాధారణ లక్షణాలు:
- పుండ్లు పడడం
- రక్తస్రావం లేదా డిచ్ఛార్జ్ (స్రావాలు)
- మలద్వార దురద (Anal itching)
- బాధాకరమైన మలవిసర్జన
ప్రధాన కారణాలు ఏమిటి?
ఈ బ్యాక్టీరియా వ్యాధి సోకిన వ్యక్తుల వీర్యం, వీర్యం ముందు స్రవించే ద్రవాలు మరియు యోని ద్రవాలలో కనిపిస్తుంది (ఉంటుంది), అందువల్ల అది ప్రధానంగా అసురక్షిత యోని, యానల్ లేదా ఓరల్ సెక్స్ ద్వారా వ్యాపిస్తుంది. కలుషిత ద్రవాలను (ఫ్లూయిడ్స్) తాకిన చేతులతో కళ్ళును తాకడం వలన కళ్ళలో కూడా సంక్రమణం (ఇన్ఫెక్షన్) కలుగుతుంది. ఇది ప్రసవ సమయంలో సంక్రమిత తల్లి నుండి శిశువుకి కూడా వ్యాపిస్తుంది/సంక్రమిస్తుంది.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
ముందుగా, వైదులు వివరణాత్మక చరిత్రను తీసుకుంటారు, దాని తరువాత సంపూర్ణ భౌతిక పరీక్ష ఉంటుంది. వీటి ఆధారంగా, వైద్యులు ఈ క్రింది పరీక్షలను ఆదేశిస్తారు:
- ప్రభావిత ప్రదేశం నుండి నమూనాను సేకరించి పరిక్షించడం
- గనెరియా పరీక్ష - సేకరించిన నమూనాల సాగు, నమూనాల మైక్రోస్కోపిక్ పరీక్ష, మరియు న్యూక్లిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ పరీక్ష (NAAT, nucleic acid amplification test)
- పరీక్ష కోసం మూత్రం నమూనాను సేకరించడం
చికిత్స పద్ధతులు ఈ క్రింది విధంగా ఉంటాయి:
- డ్యూయల్ థెరపీ యాంటీబయాటిక్స్, ఇవి ఒక మోతాదుగా నోటి ద్వారా తీసుకునేవి మరియు మరొక మోతాదుగా ఇంట్రామస్కులర్ (intramuscular) ఇంజెక్షన్గా ఇవ్వబడేవి.
- వ్యాధి సంక్రమిత వ్యక్తికి సంబంధించి లైంగిక భాగస్వాములు (రోగ నిర్ధారణకు 60 రోజుల ముందు వరకు) తప్పనిసరి పరీక్షలు మరియు చికిత్స చేయించుకోవాలని సలహా ఇస్తారు.
- గోనేరియాకు చికిత్స తీసుకునే వ్యక్తులకు తదుపరి పరీక్షలు.
- గోనేరియాకు చికిత్స పొందుతున్న వ్యక్తులు క్లామిడియాకు చికిత్సను కూడా అందించాలి.
- చికిత్స ముగిసేంత వరకు సెక్స్ను నివారించాలి (ఒక మోతాదు చికిత్స తర్వాత, సెక్స్కు 7 రోజులు వేచి ఉండాలి
గనెరియా కొరకు మందు
Medicine Name | Pack Size | |
---|---|---|
Blumox Ca | Blumox CA 1.2 Gm Injection | |
Bactoclav | Bactoclav 1000/200 Injection | |
Mega CV | Mega CV 1.2gm Injection | |
Erox Cv | Erox CV 625 Tablet | |
Moxclav | MOXCLAV 91.4MG DROPS 10ML | |
Novamox | Novamox 125 Rediuse Oral Suspension | |
Moxikind CV | Moxikind CV 375 Tablet | |
Pulmoxyl | Pulmoxyl 250 Capsule | |
Clavam | CLAVAM 1GM TABLET | |
Advent | Advent 1.2 gm Injection | |
Augmentin | Augmentin 1000 DUO Tablet | |
Clamp | Clamp 625 Tablet | |
Mox | Mox 250 Mg Capsule | |
Zemox Cl | Zemox CL Injection | |
P Mox Kid | P Mox Kid Tablet | |
Aceclave | Aceclave 250 Mg/125 Mg Tablet | |
Amox Cl | Amox Cl 200 Mg/28.5 Mg Syrup | |
Zoclav | Zoclav Tablet | |
Polymox | Polymox Capsule | |
Acmox | Acmox 125 Dry Syrup | |
Staphymox | Staphymox Tablet | |
Acmox DS | Acmox DS 250 Tablet | |
Amoxyclav | Amoxyclav 375 Tablet | |
Zoxil Cv | Zoxil CV 1000/200 Inje |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి