సారాంశం
వీపునొప్పి లేదా వెన్ను నొప్పి ఆరోగ్య సమస్యలలో సాధారణంగా తరచు ఎదురయ్యే సమస్య. దీని వల్ల అప్పుడపుడు డాక్టరు వద్దకు వెళ్లవలసి వస్తుంటుంది. వీపు నొప్పి కారణంగా తరచు పనికి వెళ్లడానికి ఇబ్బంది ఏర్పడుతుంటుంది. వీపునొప్పి తీవ్రంగా ఉండటమే కాకుండా కొన్ని రోజులపాటు లేదా కొన్ని వారాలపాటు కొనసాగుతుంది. లేదా దీర్ఘకాలిక జబ్బుగా ( 3 నెలలు అంత కంటే ఎక్కువ) పరిణమించవచ్చు. వీపులో నెలకొన్న చోటును అనుసరించి, వీపు నొప్పి మందంగా లేదా తీవ్రంగా ఉండవచ్చు. కొనసాగేదిగా లేదా నిలిపి నిలిపి వచ్చేదిగా లేదా నిలుపుదల లేకుండా వచ్చేదిగా కూడా ఉంటుంది. నొప్పి వచ్చేలా ఉండే చిహ్నాలు లేదా కాళ్లలో , గజ్జలలో తిమ్మరి, స్పర్శరాహిత్యం, గట్టిదనం, పరిమితమైన కదలికలు, లేద మూత్రాశయం కోల్పోవడం లేదా పేగుల నియంత్రణ ఎదురయినప్పుడు వెంటనే వైద్యుని వద్దకు వెళ్లి ఆరోగ్య పరీక్ష జరిపించవలసి ఉంటుంది. వీపు క్రింది భాగం నొప్పికి సాధారణమైన కారణాలు కండరాల ఆకస్మిక చైతన్యం, గాయాలు, ఇన్వెర్టిబ్రాల్ డిస్క్ , హెర్నియా సంబంధిత లేదా పక్కకు తొలిగిన డిస్క్ వంటివి. వెన్నెముక విరగడం, తుంటి నొప్పి, విరగడం లేదా నరము మూలము కుదింపు నొప్పి, వయసు మళ్లిన కారణంగా ఎదురయ్యే కీళ్లనొప్పి, బోలు ఎముకల జబ్బు, ఆటొ ఇమ్యునో జబ్బు, (ఆంకీలూజింగ్ స్పాండిలిటీస్) వెన్నెముక స్టెనోసిస్,, వెన్నెముకలో లోపాలు, మరియు కెన్సర్. తరచుగా మానసిక ఒత్తిడి కూడా వీపు క్రిందిభాగం నొప్పి కలిగిస్తుంది. అయితే అది తరచు నిర్లక్ష్యం చేయబడుతుంది. వీపు క్రిందిభాగంలో నొప్పి కొన్ని సందర్భాలలో వివిధ అవయవాలలో అంటే మూత్రపిండాలు ( ఉదా: నొప్పి వల్ల ఎదురవుతుందని చెప్పబడుతున్నది. రెనాల్ కాల్క్యులస్, ట్యూమర్) గర్భాశయం ( ఉదా: ఫైబ్రాయిడ్, రుతుక్రమం నొప్పి మరియు గర్భం. తీవ్రమైన వీపు నొప్పి వైద్య సమస్యలు లేని సందర్భంలో సాధారణంగా విశ్రాంతితో, మందులతో నయమవుతుంది. ఉన్నపళంగా కదలికలో ఇబ్బంది, ముఖ్యంగా ఎముక విరగడం, ఇంటర్వర్టెబ్రాల్ పక్కకుపోవడం పర్యవసానంగా ఎదురైతే దానికి శస్త్రచికిత్స అవసరమవుతుంది. తర్వాత సంప్రదాయ చికిత్స కల్పిస్తారు. దీర్ఘకాలిక వీపు నొప్పికి దీర్ఘ కాలపు చికిత్స అవసరం. దీనిలో ఔషధాలు సేవించదం, ఫిజియోథెరపీ, మరియు నిర్దుష్టమైన వ్యాయామాలు చేరి ఉంటాయి
వీపు నొప్పి యొక్క లక్షణాలు
వీపులో క్రింది భాగం నొప్పితోపాటుగా తరచుగా మరికొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఇలా ఉంటాయి.:
- కూర్చొన్నప్పుడు, పడుకొన్నప్పుడు, బరువులు ఎత్తినప్పుడు మరియు వంగినప్పుడు నొప్పి మరింత హెచ్చుగా ఉంటుంది.
- వీపునొప్పి కాళ్లు, పిర్రల వరకు వ్యాపించి ఉంటుంది.
- నొప్పి జలదరింపుతో మరియు స్పర్శ కలిగించక కాళ్లలో లేదా గజ్జలలో ఉంటుంది.
- నొప్పి మూత్రాశయం కొల్పోవడం మరియు పేగుల నియంత్రణతో కలుగుతుంది.
- అవయవాలు తీవ్రంగా గట్టిపడటంతో కూర్చొనే, నిలబడే లేదా నడిచే సందర్భంగా నొప్పి కలుగుతుంది..
- నొప్పి వీపు నుండి మూత్రశయం వరకు వ్యాపించి తరచుగా మూత్రవిసర్జనకు దోహదం చేస్తుంది.
- వీపులో నొప్పి తీవ్రమైన పొత్తికడుపు నొప్పికి దారితీసి జ్వరానికి, వమనాలకు దారితీస్తుంది..
- పొత్తికడుపు ఉబ్బరం కొన్ని సందర్భాలలో వీపునొప్పికి దారితీస్తుంది.
- గడ్ద లేదా వాపు వీపునొప్పి కల్పిస్తాయి. అది పొత్తికడుపుపై పడుకొన్నప్పుడు నొప్పి కలిగించి అలసటకు బరువు కోల్పోవడానికి వీలుకల్పిస్తుంది
వీపు నొప్పి యొక్క చికిత్స
వీపునొప్పికి కల్పించే చికిత్స సామాన్యంగా మూడు రకాలుగా వర్గీకరింపబడుతుంది. వీపునొప్పికి నొప్పి రకాన్ని, లక్షణాలను గమనించి డాక్టరు చికిత్సను నిర్ధారిస్తారు.
వైద్యేతర చికిత్స
తీవ్రమైన మరియు అనిర్దిష్ట వెన్ను నొప్పి సాధారణంగా విశ్రంతితో, స్వయం చికిత్సలతో వివారణ పొందగలదు.. వీపునొప్పికి కొన్ని స్వయంచికిత్సలు పేర్కొనబడినాయి
- వేడినీటి కాపుడు మరియు మర్దనం
ఈ ప్రక్రియ రక్త ప్రసారాన్ని పెంచి కండరాల గట్టిదనాన్ని సడలిస్తుంది
- ఫిజియోథెరపీ మరియు ట్రాక్షన్
ఈ విధానం చికిత్స ఫిజియోథెరపిస్టుల నేతృత్వంలో జరుగుతాయి. ఇది నొప్పిని చాలావరకు పూర్తిగా తగ్గిస్తుంది.
- ప్రత్యామ్నాయ థెరపీలు
వాటిలో ఇవి చేరి ఉంటాయి- యోగా, దీనిలో అవయవాలను పొడువుగా లాగే ప్రక్రియ చేరిఉంటుంది మరియు స్థితిగతులు కండరాల గట్టితనాన్ని సరళం చేస్తాయి.
- ఆక్యుపంచర్ సూదులు పొడవటంతో చేరిన ప్రక్రియ, దీనిలో శరీరంలో నిర్దుష్టమైన స్థానాలలో సూదులు పొడిచే ప్రక్రియతో శరీరంలో నొప్పిని తొలగిస్తారు.
- చిరోప్రాక్టిక్ ప్రక్రియలో వెన్నెముకను తారుమారు చేసి వర్టెబ్రాల్ పై ఒత్తిడి జరిపి గట్టిదనాన్ని సడలింపజేస్తారు. వెన్నెముక/ కశేరుకముల కీళ్లలో సరళత్వం కల్పిస్తారు.
- మనసును హాయిగా ఉంచి చికిత్స జరుపుతారు. అవి : ధ్యానం, బయోఫీడ్ బ్యాక్, ప్రవర్తన తీరులో మార్పులతో చికిత్సతో నొప్పి నివారణ జరుపుతారు.
వైద్య చికిత్స
దీర్ఘకాలిక వీపు నొప్పి నివారణ చర్యలలో, నిర్వహణలో ఔషధాలు కీలకపాత్ర వహిస్తాయి. అవి వైద్యేతర చికిత్స విధానం క్రింద నొప్పి తగ్గించడంలో విఫలమైనప్పుడు ఈ చికిత్స కొనసాగిస్తారు. సాధారణంగా సూచించబడే మందులు ఇవి :
- పారాసెటమాల్ లేదా అసెటామినియోఫెన్
ఇది సాధారణంగా వీపునొప్పికి తొలుత వాడే ఔషధం.. దీనితో కొన్ని దుష్ఫలితాలు లేదా సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి.
- నాన్- స్టెరాయ్డల్ ఆంటి- ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (ఎన్ ఎస్ ఏ ఐ డి ఎస్)
ఈ బాధానివారణిలో ఇబుప్రొఫెన్ మరియు నాప్రోక్సెన్ కలిగి ఉంటాయి.. పారాసెటమాల్ నొప్పిని తొలగించడంలో విఫలమైనప్పుడు వీటిని ఉపయోగిస్తారు.
బాధానివారిణులలో సమయోచితమైన క్రీముల, ఆయింట్ మెంట్ల మరియు స్ప్రేల రూపంలో కూడా లభిస్తాయి. అవి నొప్పిస్థాయిని తగ్గిస్తాయి.
- కండరాల సడలింపునకు ఉపయుక్తమైనవి
డాక్టర్లు కండరాల సడలింపునకు పనిచేసే మందులను సూచిస్తారు.. అవి సైక్లోబెంజాప్రైన్ మరియు మీథోకార్బమాల్ రూపంలో లభిస్తాయి. వీటితోపాటు కండరాల గట్టిదనం సడలింపునకు ఎన్ ఎస్ ఏ ఐ డి ఎస్ మందులను ఉపయోగిస్తారు
- మాదకద్రవ్యాల వంటి ఔషధాలు
తీవ్రమైన వీపునొప్పికి ట్రమడాల్ మరియు మార్ఫైన్ వంటి వాటిని ఉపయోగిస్తారు. వాటినికొద్ది పాటి వ్యవధికి మాత్రమే ( 2- 3 వారాలు) సూచిస్తారు. సైడ్ ఎఫెక్ట్ ల కారణంగా ఇవి దీర్ఘకాలిక ఔషధంగా ఉపయోగపడవు. వీటివల్ల మత్తుగా ఉండటం, అజీర్తి. నోరు ఎండుకుపోవటం, శ్వాసక్రియలో జాప్యం, చర్మంపై దురద ఎదురుకావచ్చు.
- యాంటీడిప్రసెంట్స్
దీర్ఘకాలిక వీపునొప్పి సందర్భంగా. ఎక్కువ కాలంగా నొప్పి అనుభవిస్తూ మానసిక క్షోభానికి గురైనవారి విషయంలొ ప్రధానంగా వీటిని ఉపయోగిస్తారు. వీటిలో అమిట్రిప్టైలిన్, డ్యూలోక్సెటిన్, ఇమిప్రామిన్ చేరినవి. సైడ్ ఎఫెక్ట్స్ ( చూపు మందగించడం, బరువు పెరగడం, మందకొడితనం వంటివి) సాధారణం కావడం వల్ల వీటిని ఖచ్చితంగా వైద్యుని సిఫారస్య్ మెరకు మాత్రమే తీసుకొనవలసి ఉంటుంది.
- స్టీరాయిడ్స్
ప్రెడ్నిసోలాన్ వంటి కార్టికోస్టీరాయిడ్స్ కాళ్ల అడుగు భాగంలో నొప్పి తగ్గించడంలో ఫలితం ఇస్తాయి. శరీరంలో మంట, గాయం అయిన చోట వాపు వీపు నొప్పికి కారకం కాగలవు. ఈ మందులు వాటిని తొలగిస్తాయి.
- మూర్చ- నివారణి
బాధానివారిణులు లేదా పెయిన్ కిల్లర్లతో పాటుగా యాంటీ-ఎపిలమెటిక్ మందుల వాడకం నరాల-నొప్పిని తొలగిస్తుందని ఇటీవలి అధ్యయనాలు చూపుతున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక వీపునొప్పికి ఇవి చక్కగా పనిచేస్తాయి కార్బామాజ్ పైన్, గాబాపెంటిన్ మరియు వల్పోరిక్ ఆసిడ్ లు సాధారణంగా ఉపయోగించబడే యాంటీ- సీజర్ ఔషధాలు.. మూర్చనివారిణులు సాధారణంగా తికమకపొందడం, గ్యాస్ట్రిక్ సమస్య తలనొప్పి వంటి సైడ్ ఎఫెక్ట్స్ కల్పిస్తాయి.
శస్త్రచికిత్స
వీపునొప్పిని తగ్గించడంలో శస్త్రచికిత్సేతర వైద్యం పని చేయనప్పుడు వైద్యులు శస్త్రచికిత్సను సూచిస్తారు నరాల నొప్పి రెడియేషన్, కండరాలలో బలహీనత పెరుగుదల వెన్నెముక రూపభ్రంశం పొందడం (స్పైనల్ స్టెనోసిస్ ) ఇంటర్ వర్టిబ్రెల్ డిస్క్ పగలడం, వంటివి మందులతో విజయవంతంగా నయం కానప్పుడు లేదా వైద్యేతర చికిత్సకు లొంగకపోయినప్పుడు శస్త్రచికిత్స తప్పనిసరి కాగలదు. అత్యవసర పరిస్థితులలో కూడా శస్త్రచికిత్స జరుపుతారు. అంటే ఎముకలు విరగడం, వెన్నెముక కాడా ఈక్వెయిన్ ( గుర్రం తోక) రూపం దాల్చడం సందర్భంగా శస్త్ర చికిత్స కొనసాగిస్తారు. అవి వీపునొప్పితోపాటుగా పార్శ్వవాయువుకు దారితీయవచ్చు.
- వెన్నెముక కలయిక వ్యవస్థ క్రింద వెన్నపూస భాగాలను ఒకటిగా కూర్చుతారు. లేదా ఒకతితో మరొకటిని కలుపుతారు. తద్వారా అవి వేర్వేరుగా కాకుండా చర్య తీసుకొంటారు. ఈ ప్రక్రియ వెన్నపూస కీళ్లనొప్పుల విషయంలో సహకరిస్తుంది దీనితో శరీరం కదలిక సందర్భ గా తక్కువ నొప్పి. లేదా నొప్పి లేకుండా చేస్తుంది.
- లామినెక్టమీ అనేది ఒక శస్త్రచికిత్స ప్రక్రియ. దీనిద్వారా డాక్టరు నరంపై ఒత్తిడిని కల్పిస్తున్న వెన్నపూస ఎముక భాగాన్ని లేదా స్నాయువును తొలగిస్తాడు.
- ఫోరామినియోటమీ వెన్నపూసమార్గాన్ని వెడల్పు చేసి వెన్నెముక నుండి నరాల వరకు ద్వారం వద్ద అంతరాన్ని పెంచుతుంది.
- డైసెక్టమీ వ్యవస్థలో , డాక్టరు డిస్కును పూర్తిగా లేదా పాక్షికంగా తొలగిస్తాడు . అది తన నిర్దుష్ట స్థానం నుండి పక్కకు పోవటం లేదా హెర్నియాకు గురి అయిన సందర్భంలో ఈ ప్రక్రియను చేపడుతారు
ప్రతి చర్యలో ఒడిదుడుకులు ఎదురవుతున్నప్పటికీ, మొత్తం మీద ఆశించే ఫలితం నొప్పి నివారణ జరగడం. కదలికలు స్వేచ్ఛగా కొనసాగదం, తక్కువస్థాయిలో మమ్దులు వాడటం, పనుల నిర్వహడ చద్వార హెచ్చు ఉత్పాదకత జరపడం. శస్త్రచికిత్సకు అంగీకరించడానికి ముందుగా డాక్టరుతో మంచిచెడులను కూలంకషంగా చర్చించడం మంచిది.
వీపునొప్పి నిర్వహణలో జీవనసరళి
- వెన్నునొప్పి సిడులను నివారించండి
వీపునొప్పి చాలా హెచ్చుస్థాయిలో ఇబ్బంది కలిగిస్తుంది. వీపునొప్పితో మనుగడ సాగించడం నొప్పి నిర్వహణలో సవాలును ఎదుర్కోవడం వంటిది. ఇంటిలో, కార్యాలయంలో రోజూ చేపట్టే పనులు కొన్ని సమయాలలో వీపునొప్పిని కలిగించి ఉన్ననొప్పి స్థాయిని పెంచుతాయి. ఇంటి పని, ఆఫీసు పనుల సందర్భంగా శరీరం లో మళ్లీమళ్లీ జరిగే కదలికలు , పనులు వెన్నెముక కదలికలు వీపునొప్పిని కల్పిస్తాయి లేదా ఉన్ననొప్పి స్థాయిని మరింత పెంచుతాయి. ఈ కారణంగా ఇంటిలో లేదా కార్యాలయంలో పనులు కొనసాగించే సందర్భంగా నొప్పిని కల్పించే పనులకు దూరంగా ఉంటూ వీపునొప్పిని నివారించాలి. - రోజు పూర్తి చురుకుగా ఉండండి
కదలికలకు దూరంగా, నిశ్చలస్థితిలోని మనుగడతో కూడిన జీవన సరళి కూడా వీపునొప్పికి దోహదం చేస్తుంది. తిని కూర్చోవడం వల్ల ఊబకాయం ఏర్పడుతుంది. తద్వారా వీపునొప్పి కలుగుతుంది. రోజు పూర్తిగా చురుకుగా ఉండండి అలాగే ఒకమోస్తరు స్థాయిలో వ్యాయామం వంటి శరీరం కదలికల పనులు చేపట్టండి. 45 నిమిషాల నదక, ఈత, ఇతర వ్యాయామాలు శరీరాన్ని చక్కగా వంచే ప్రక్రియలు చేపట్టండి. ఇవి వీపు కందరాలను బలపరచడమే కాకుండా బరువును తగ్గిస్తాయి కూడా. - అరోగ్యకరమైన , పోషకాహార ఆహారాన్ని సేవింఛండి
హెచ్చుగా ఖనిజములు మరియు విటమిన్లు హెచ్చుగా కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల , ఆరోగ్యాన్ని పెంచే పోషకాహారాన్ని సేవించడం వల్ల వెన్నెముక బలపడుతుంది. విటమిన్ డి, క్యాల్షియం కలిగిన ఆహార పదార్థాలను సేవించండి. ఈ పోషకాహారాలు మీ ఎముకలను గట్టి పరిస్తాయి, బోలు ఎముకల జబ్బును నివారించి, ఎముకలు విరగడాన్ని అదుపు చేస్తాయి. - ధూమపానం మానండి
ధూమపానం కారణంగా వెన్నెముకకు రక్తప్రసారం తగ్గుతుంది. తద్వారా దగ్గు ఏర్పడి వీపునొప్పిని పెంచుతుంది. - మీ శరీర నిటారుతనాన్ని మెరుగుపరచుకోండి
మీ పాదాలపై శరీరం బరువును సమతౌల్యంగా ఉంచుతూ శరీరం బరువును పాదాలపై సమంగా ఉండేలా చూడండి. శరీరం నిటారుగా ఉండాలంటే వెన్నెముకలో నిటారుతనం ఉండాలి. కూర్చొన్నప్పుడు మరియు నిలబడి ఉన్నప్పుడు కూడా ఈ ప్రక్రియను పాటించాలి. అలాకాకుండా సరికానట్టి శరీరం నిటారుతనం వీపు కండరాలపై ఒత్తిడిని పెంచి దీర్ఘకాలిక వీపునొప్పికి దోహదం చేస్తుంది. హెచ్చు బరువులను ఎత్తేటప్పుడు లేదా మోసేటప్పుడు శరీరాన్ని సవ్యంగా నితారుగా ఉంచడం ఎంతో ముఖ్యం. వీపు కండరాలపై ఒత్తిడి లేకుండా చేయడం కూడా అవసరం
ఆయుర్వేదం లో నొప్పి నివారణకు నవీన్ సలహాలు
ప్రతి రోజూ పది చుక్కలు వెల్లుల్లి రసం పావు గ్లాసు గోరువెచ్చని పాలల్లో కలిపి తీసుకుంటే నడుం నొప్పి తగ్గుతుంది. అలాగే అల్లం రసం, పసుపు కలిపి పాలతో తీసుకుంటే జీర్ణ కోశం బాగుపడి నడుంనొప్పి తగ్గుతుంది. ఆవు నెయ్యి, నువ్వుల నూనె వేడి చేసి నడుముకు మర్దన చేసుకుని వేడి నీళ్ళతో స్నానం చేస్తే నడుం నొప్పి తగ్గుతుంది.
లావుగా ఉన్నవారికి నడుం నొప్పి వుంటే, పావు గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో ఇరవై చుక్కలు నిమ్మ రసం వేసి పరగడుపున ప్రతి రోజు త్రాగుతుంటే, శరీరం తేలికపడి ఉపశమనం కలుగుతుంది. ఒక నిమ్మకాయ కోసి ఒక చెక్కను పల్చటి గుడ్డలో కట్టి, మూకుడులో ఆవు నెయ్యి వేసి కాచి అందులో కట్టిన గుడ్డను మంచి నడుంచుట్టూ కాపు పెడుతుంటే, నడుంనొప్పి తగ్గిపోతుంది.
వీపు నొప్పి కొరకు అలౌపతి మందులు
ప్రతి రోజూ పది చుక్కలు వెల్లుల్లి రసం పావు గ్లాసు గోరువెచ్చని పాలల్లో కలిపి తీసుకుంటే నడుం నొప్పి తగ్గుతుంది. అలాగే అల్లం రసం, పసుపు కలిపి పాలతో తీసుకుంటే జీర్ణ కోశం బాగుపడి నడుంనొప్పి తగ్గుతుంది. ఆవు నెయ్యి, నువ్వుల నూనె వేడి చేసి నడుముకు మర్దన చేసుకుని వేడి నీళ్ళతో స్నానం చేస్తే నడుం నొప్పి తగ్గుతుంది.
ఒక నిమ్మకాయ కోసి ఒక చెక్కను పల్చటి గుడ్డలో కట్టి, మూకుడులో ఆవు నెయ్యి వేసి కాచి అందులో కట్టిన గుడ్డను మంచి నడుంచుట్టూ కాపు పెడుతుంటే, నడుంనొప్పి తగ్గిపోతుంది.
వీపు నొప్పి కొరకు అలౌపతి మందులు
Medicine Name | Pack Size | |
---|---|---|
Dolopar | Dolopar 500/25 Tablet | |
Sumo L | Sumo L Drops | |
Pacimol | Pacimol 1000 Mg Tablet | |
Dolo | Dolo- 100 Drops | |
Brufen | Brufen Active Ointment | |
Combiflam | Combiflam Suspension | |
Zerodol P | Zerodol P Tablet | |
Ibugesic Plus | Ibugesic Plus Oral Suspension | |
Calpol Tablet | Calpol 500 Tablet | |
Samonec Plus | Samonec Plus Tablet | |
Eboo | Eboo Tablet | |
Hifenac P Tablet | Hifenac P Tablet | |
Eboo Plus | Eboo Plus Tablet | |
Ibicox | Ibicox 100 Mg/500 Mg Tablet | |
Serrint P | Serrint P 100 Mg/500 Mg Tablet | |
Eboo Spaz | Eboo Spaz Tablet | |
Ibicox MR | Ibicox MR Tablet | |
Tizapam | Tizapam 400 Mg/2 Mg Tablet | |
Fabrimol | Fabrimol Suspension | |
Maxzen | Maxzen Gel | |
Iconac P | Iconac P 100/500 Tablet | |
Sioxx Plus | Sioxx Plus Tablet | |
Brufen MR | Brufen MR Soft Gelatin Capsule | |
Febrex | Febrex 500 Tablet | |
Inflanac Plus | Inflanac Plus Tablet |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి