బ్రే…వ్! ఏమిటీ త్రేన్పులా? గ్యాసా? కంగారేం లేదు! కడుపు ఉబ్బరం తగ్గించే ఆయుర్వేద మార్గాలు అనేకం బీ… బ్రేవ్!
తరచూ పొట్ట ఆద్మానానికి (కడుపు ఉబ్బరం) గురైతే, శరీరంలో వాతం పెరిగి, వాతోదరం అనే సమస్య మొదలవుతుంది. ఆద్మానంలోని లక్షణాలే వాతోదరంఆద్మానం దశలో జీవన శైలిని మార్చుకుని కొద్ది పాటి ఔషధాలు తీసుకుంటే చాలు సమస్య తొలగిపోతుంది. సమస్య వాతోదరం దాకా వెళ్లినప్పుడు ఇంకెంత మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఆ దశలో కూడా చికిత్సలు తీసుకోకపోతే, ప్లీహోదరం (ప్లీహ సమస్య), యకృతోదరం (కాలేయ సమస్య), జలోదరం (పొట్టలో ద్రవాలు చేరడం), పేగుల్లో రంద్రం ఏర్పడే ఛిద్రోదరం లాంటి సమస్యలు ఏర్పడతాయి.
నిరంతర మానసిక ఒత్తిడి కూడా కడుపు ఉబ్బరానికి కారణం అవుతుంది. ఒత్తిడి వల్ల మౌలికంగా నిద్ర త గ్గిపోతుంది. నిద్రలేమి అజీర్తికి కారణమవుతుంది. పైగా మానసిక ఒత్తిళ్ల వల్ల పేగుల కదలికల వేగం పెరుగుతుంది. దీనివల్ల జీర్ణం కాకముందే ఆహారం పేగుల్లోకి వెళుతుంది. ఇది కూడా కడుపు ఉబ్బరానికి కారణం అవుతుంది.
ఏమీ తినకుండా ఉన్నాసరే…. పొట్టంతా ఏదో బరువేసినట్లు ఉంటుంది. ఏదైనా కాస్త తినేస్తే చాలు… పొట్ట బానలా తయారవుతుంది. పైగా ఎంత తేలిక పదార్థం తిన్నా ఏ మాత్రం జీర్ణం కాకుండా గంటల తరబడి కడుపులో ఉండిపోయినట్లనిపిస్తుంది. పొట్టలో గుడగుడలు, తేన్పులే కాదు ఈ కడుపు ఉబ్బరంతో పదిమెట్లు ఎక్కినా ఆయాసం వచ్చేస్తుంది. కాళ్లు లాగేస్తాయి. గ్యాస్ట్రిక్ ట్రబుల్‌కి సంబంధించిన ఏ మాత్రలు వేసుకున్నా, తాత్కాలికంగా రిలీఫ్ అయితే అనిపిస్తుంది గానీ, రెండు గంటలు గడిస్తే మళ్లీ మామూలే! ఎందుకిలా?
కడుపు ఉబ్బరం అనేది అత్యంత సాధారణ విషయం. మౌలికంగా జీర్ణవ్యవస్థలోని అపసవ్యతే దీనికి కారణం. నోటి నుంచి మలద్వారం దాకా వెళ్లే వాహికే కాకుండా, దానితో సంబంధం ఉన్న జీర్ణావయాలు ప్లీహం, లివర్ వంటి అవయవాల్లో ఏరకమైన వ్యాధి ఉన్నా, బలహీనత ఉన్నా, కడుపు ఉబ్బరం సమస్య వచ్చేస్తుంది. కొంత మందికి చాలా అరుదుగా ఎప్పుడో ఈ సమస్య వచ్చి కొద్ది రోజులు ఉండి దానికదే త గ్గిపోతుంది. అలా ఏ ఆరునెలలకో ఒకసారి అలా వచ్చి తగ్గిపోతే అదేమీ సమస్య కాదు. కానీ, కొందరికి దాదాపు నెలకోసారి వచ్చి ఓ వారం రోజులు ఉండి తగ్గిపోతుంది. ఇలా తాత్కాలికంగానే అయినా, తరుచూ వస్తూ ఉంటే దాన్ని సమస్యగానే భావించాలి.
కడుపు ఉబ్బరంలో రెండు రకాలు
కడుపు ఉబ్బరాన్ని ఆయుర్వేదం ‘ఆద్మాన’, ‘ఉదర వ్యాధి’ అంటూ రెండు భాగాలుగా పేర్కొంటుంది. ఆద్మాన అంటే కడుపులో గ్యాస్ నిండడం, రెండవది ఉదర వ్యాధికరం. అయితే తరచూ ఆద్మానం అవుతూ ఏ చికిత్సా లేక అది దీర్ఘకాలం కొనసాగినప్పుడు అది ఉదర వ్యాధులకు దారి తీస్తుంది. ఆద్మానం రావడానికి కారణం జఠరాగ్ని అంటే జీర్ణశక్తి బలహీనంగా ఉండడమే! జీర్ణక్రియకు ఉపయోగపడే ఆమ్లాలు, ఎంజైములు, పిత్తరసం వంటివన్నీ సరిగ్గా ఉత్పన్నం కాకపోవడం వల్లే ఈ సమస్య మొదలవుతుంది. ఈ కారణంగా జీర్ణశక్తి తగ్గడంతో పాటు, వాత పిత్త కఫాలు అస్తవ్యస్తమవుతాయి. ఆ తర్వాత మలద్వారం దగ్గర, పొట్ట పైభాగాన ఛాతీ భాగంలో గాలి బంధించబడుతుంది. బంధించపడటం అంటే కదలిక సరిగా ఉండదు. కదలికలు సరిగా లేకపోవడంతో తిన్నవేవీ జీర్ణం కాక, లోలోపల కుళ్లిపోయి గ్యాసు నిండిపోతుంది.
ఎందుకిలా?
ఉప్పు, కారం అవసరానికి మించి తినేయడం.
ఉసిరికాయ వంటి వాటిని అవి పండే రుతువులో కాకుండా ఏడాది పొడవునా తీసుకోవడం.
ఫైబర్ పదార్థాలను అతిగా తీసుకోవడం.
మల మూత్రాలు వచ్చినప్పుడు వెంటనే విసర్జనకు వెళ్లకుండా, గంటల తరబడి ఆపుకోవడం
ఏ వ్యాధికైనా ఏళ్ల తరబడి సరియైున చికిత్సలు తీసుకోకపోవడం.
ఏ మాత్రం శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాలు ఈ సమస్యకు దారి తీస్తాయి.
పొట్ట భాగంలోని కండరాల్లో పటుత్వం ఉండాలి. పొట్ట వదులుగా ఉంటే పేగుల్లోని కదలికలు సరిగా ఉండవు. ఫలితంగా, తిన్నది జీర్ణం కాదు. విసర్జన కూడా కాదు. ఇది కూడా ఆద్మానానికి దారి తీస్తుంది. అలా అని వాకింగ్ ఒక్కటి చేస్తే సరిపోదు. రోజుకు ఓ ఐదు నిమిషాల పాటు పొట్టకు సంబంధించిన వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి. కొంత మందికి భోజనం చేసిన తర్వాత 15 నుంచి 30 నిమిషాల దాకా వాకింగ్ చేస్తుంటారు. ఓ 100 అడుగులైతే వేయవచ్చు గానీ, ఎక్కువ సేపు వాకింగ్ చేయకూడదు. ఇది కూడా జీర్ణ సమస్యలకు దారి తీస్తుంది. తిన్నది జీర్ణం కావడానికి రక్తంలోని అత్యధిక భాగం పొట్టలోకి చేరాలి. వాకింగ్ దానికి అడ్డుపడుతుంది. ఇది అజీర్తికి కారణమవుతుంది.
శరీర అవసరానికి మించి, శక్తికి మించి తినడం వల్ల కూడా పూర్తి స్థాయిలో జీర్ణం కాక ఉదర సమస్యలకు కారణం కావచ్చు.
జీవన శైలి విషయంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నా, కొందరిలో జీర్ణక్రియ సరిగా ఉండదు. అంటే జఠరాగ్ని సరిగా ఉండదు. అలాంటి వారు ఆహారంలో జీర్ణశక్తిని పెంచే కొన్ని పదార్థాలు చేర్చుకోవాలి. ముఖ్యంగా పోపులో మిరియాలు వేయడం, అన్నంతో అల్లం చట్నీ తినడం వంటివి చేయాలి.
భోజనం చేసిన వెంటనే గ్లాసుల కొద్దీ నీళ్లు తాగడం సరికాదు కానీ, భోజనం మధ్య మఽధ్యలో కొంచెం కొంచెంగా 100 నుంచి 150 మి. లీటర్ల వరకు నీళ్లు తాగాలి. లేదంటే తిన్నది సరిగా జీర్ణం కాదు.
ఇలాంటి కారణాలు కడుపులో ఆమ్లాలు పెరిగే ఎసిడిటీతో పాటు పొట్ట లోపలి పొర దెబ్బతినే గ్యాస్ట్రైటి్‌సకు కూడా దారితీస్తుంది. ఈ క్రమంలో పేగుల్లోని పొర కూడా దెబ్బతింటుంది. ఇది ఆ యా భాగాలను కంపరానికి గురిచేస్తుంది. దీనివల్ల పేగుల కదలికల్లో అస్తవ్యస్తత ఏర్పడుతుంది.
ఇన్‌ఫెక్షన్ల వల్ల ముఖ్యంగా క్రానిక్ అమీబియాసిస్ ఇన్‌ఫెక్షన్ల వల్ల కూడా ఈ కడుపు ఉబ్బరం సమస్య వచ్చే వీలుంది.
వీటితో పాటు నిరంతర మానసిక ఒత్తిడి కూడా కడుపు ఉబ్బరానికి కారణమవుతుంది. ఒత్తిడి వల్ల మౌలికంగా నిద్ర తగ్గిపోతుంది. నిద్రలేమి అజీర్తికి కారణమవుతుంది. పైగా మానసిక ఒత్తిళ్ల వల్ల పేగుల కదలికల వేగం పెరుగుతుంది. దీనివల్ల జీర్ణం కాకముందే ఆహారం పేగుల్లోకి వెళుతుంది. ఇది కూడా కడుపు ఉబ్బరానికి కారణమవుతుంది.
మలబద్ధకం కారణంగా కొందరు ఏళ్ల తరబడి సుఖ విరేచన ఔషధాలు వాడుతుంటారు. అలాంటి వాటిల్లో సోనాముఖి ఒకటి. ఈ ఆకును ప్రతి ఆరు మాసాలకు ఒకసారి మోతాదు పెంచితే తప్ప పనిచేయదు. అలా పెంచితే ఆ తర్వాత వేరే మందులు ఎన్ని వేసుకున్నా మలబద్ధకం పోదు. దీని వల్ల పేగుల్లోని లోపలి పొర, సూక్ష్మ రక్తనాళాలు దెబ్బ తింటాయి. అప్పుడు విరేచనానికి ఏ మందులు వేసుకున్నా పనిచేయవు.
ఆయుర్వేదంలో చికిత్స
ఆయుర్వేద వైద్య చికిత్స మూడు రకాలుగా ఉంటుంది.
ఒకటి గ్యాస్‌ను తగ్గించేది.
రెండవది జీర్ణశక్తిని పెంచేది.
మూడవది నిత్య విరేచనానికి తోడ్పడేది.
గ్యాస్‌ను తగ్గించేవాటిలో పలు రకాల ఔషధాలు ఉన్నాయి. వాటిల్లో ఇంగ్వాష్టుక చూర్ణం, ఇంగువచాది గుళిక వంటి గ్యాస్‌ను తగ్గిస్తాయి. జీర్ణశక్తిని పెంచడంలో చిత్రక, చిత్రక మూలం వంటి మందులు బాగా తోడ్పడతాయి. నిత్య విరేచనానికి అవిపత్తికర చూర్ణం ఉపయోగపడుతుంది. అలా అని ఏ ఔషధాన్నీ దీర్ఘకాలం వాడకూడదు. ఒకవేళ అలా వాడాల్సి వస్తే ఆయుర్వేద వైద్యుణ్ణి సంప్రతించడం తప్పనిసరి. ఎందుకంటే చాలా సమస్యలకు రోగి శరీర ధర్మాన్ని అనురించి చికిత్స చేయాల్సి ఉంటుంది
మీ నవీన్ నడిమింటి
విశాఖపట్నం
9703706660
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి