సారాంశం
మూర్చ అనునది చాలా కాలం పాటు ఉన్న లేక దీర్ఘ-కాల మెదడు రుగ్మత, అసాధారణ మెదడు చర్య వలన ఏర్పడుతుంది, ఈ చర్య మూర్చలు, అసాధారణ అనుభూతులు మరియు స్పృహ కోల్పోవడం వంటి వాటికి దారితీస్తుంది. మూర్చ అనునది వయస్సు, లింగము, జాతి లేక జాతి నేపధ్యముతో సంబంధము లేకుండా ఎవరి పైన అయినా ప్రభావమును చూపిస్తుంది. మూర్చ యొక్క లక్షణాలు అనునవి ప్రారంభములో స్వల్పముగా ఉంటాయి, నిదానముగా అవయవాల యొక్క హింసాత్మక కుదుపులకు దారితీస్తాయి. తక్కువ-ఆదాయ మరియు మధ్య-అదాయ దేశాలలో 75% ప్రజలు తగినంత చికిత్సను పొందలేరు మరియు వీరు సామాజిక నిందకు గురవుతారు మరియు ప్రంపంచము లోని అనేక ప్రాంతాలలో దీనిపై వివక్ష ఉంది. మూర్చ యొక్క చికిత్స యాంటిపైలెప్టిక్ మందులను కలిగి ఉంటుంది, మరియు 70% మంది ప్రజలు ఈ మందులకు సానుకూలముగా స్పందించారు. మందులు ఉపశమనాన్ని అందివ్వడములో విఫలమయిన సందర్భాలలో, శస్త్ర చికిత్స అనునది మూర్చను నియంత్రించుటకు సహాయం చేస్తుంది. కొంత మంది వ్యక్తులు జీవితకాల చికిత్సను తీసుకోవాలి, వాటితో పాటు ఈ ట్రిగ్గర్ల కారకాలు తొలగించాలి, వాటిలో మెరిసే కాంతులు, పెద్ద శబ్దలు, నిద్ర లేమి మరియు అదనపు ఒత్తిడి అనునవి అత్యంత సాధారణ కారకాల
మూర్ఛలు (ఫిట్స్) అంటే ఏమిటి?
మూర్చ అనునది ఒక సాధారణ నరాల రుగ్మత, ఇది ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తముగా 50 మిలియన్ల కంటే ఎక్కువ మంది జనాభాను ప్రభావితం చేస్తుంది. మధ్య నుండి తక్కువ-ఆదాయము గల ప్రాంతాలలో ఉన్న ప్రజలలో 80% కంటే ఎక్కువ మంది ప్రజలు మూర్చ చేత ప్రభావితం చేయబడుతున్నారు. ఇది ఈ విధముగా వర్గీకరించబడింది మూర్చలు, ఇది మొత్తం శరీరమును లేక శరీరము యొక్క కొంత భాగమును నియంత్రించలేని కుదుపులకు గురిచేస్తుంది, మరియు కొన్నిసార్లు స్పృహ కోల్పోవడం మరియు మూత్ర నాళము పైన నియంత్రణ కోల్పోవడం మరియు విరేచనాలు వంటి లక్షణాలను కలిగిఉంటుంది. మూర్చ అనునది మెదడు కణాలలోని ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ యొక్క అదనపు విడుదల కారణముగా ఏర్పడుతుంది. ఈ ఘటనలు సంభవించే అంతరము ఒక సంవత్సరములో ఒకటి లేదా రెండు సార్ల నుండి ఒక రోజులో అనేక సార్ల వరకూ చోటు చేసుకోవచ్చు.
మూర్ఛలు (ఫిట్స్) యొక్క చికిత్స
మూర్చ యొక్క చికిత్స ప్రధానముగా వీటిని కలిగి ఉంటుంది:
యాంటీ-ఎపిలెప్టిక్ మందులు
యాంటీ-ఎపిలెప్టిక్ మందులు అనునవి సాధారణముగా చికిత్స కొరకు ఎంపిక చేయబడినవి. 70% కేసుల కంటే ఎక్కువైన కేసులలో మూర్చలు లేక వాటి లక్షణాలను నియంత్రించడానికి లేక వాటి నుండి ఉపశమనమును పొందడానికి ఈ మందులు సహాయపడతాయని నివేదికలు చెబుతున్నాయి. మెదడు ద్వారా విడుదలచేయబడిన రసాయనాల మొత్తమును మార్చడము ద్వారా మూర్చ యొక్క తీవ్రతను తగ్గించడానికి ఈ మందులు సహాయపడతాయి. ఈ మందులు మూర్చను నయంచేయడానికి సహాయం చేయనప్పటికీ, ఇవి క్రమముగా తీసుకునే చికిత్స ఎపిసోడ్స్ యొక్క సంఖ్యను తగ్గించడానికి సహాయపడతాయి. ఈ మందులు అనేక రూపాలలో లభిస్తాయి. చికిత్స యొక్క ప్రారంభములో తక్కువ డోసును తరచుగా ఇస్తారు మరియు ఈ డోసును ఎపిసోడ్స్ ముగిసేవరకు క్రమముగా పెంచుతారు. గణనీయమైన మార్పు లేదా మెరుగుదల లేకుంటే డాక్టరు మందులను మార్చవచ్చు. మందుల యొక్క రకము అనునది మూర్చ యొక్క రకము పైన ఆధారపడుతుంది, మరియు ఈ మందులు ఫిజిషియన్ ద్వారా మాత్రమే సూచించబడతాయి. ఒకవేళ వ్యక్తి గనక ఏవైనా ఇతర మందులు తీసుకుంటూ ఉంటే, ఆ విసషయాన్ని వైద్యుడికి తెలియజేయాలి.
ఈ మందుల యొక్క దుష్ప్రభావాలలో ఇవి చేరి ఉంటాయి:
- తలనొప్పులు.
- శక్తి లోపము
- జుట్టు రాలుట లేదా అతికా జుట్టు పెరుగుట.
- చిగుళ్ళలో వాపు
- చర్మం చారికలు.
- ట్రెమోర్లు.
ఒకవేళ అటువంటి దుష్ప్రభావాలు ఏవైనా ఉన్నట్లయితే, ఆ విసషయాన్ని వైద్యుడి దృష్టికి తీసుకురావాలి. అందువల్ల, సూచించబడిన మందులనే ఖచ్చితంగా తీసుకోవడం చాలా మంచిది. మోతాదులో ఎటువంటి మార్పు ఉన్నా, లేదా మందు యొక్క జనరిక్ వెర్షన్ సైతమూ అయినా దాని గురించి డాక్టరుతో మాట్లాడండి. వైద్యుడి అనుమతి లేనిదే మందులు తీసుకోవడం ఆపివేయవద్దు. ప్రవర్తన లేదా భావనలో ఏవైనా మార్పులు ఉన్న పక్షములో, వాటి గురించి తెలియజేయాలి. కాలం గడిచే కొద్దీ, అనేక యాంటీ-ఎపిలెప్టిక్ మందుల వాడకాన్ని ఆపివేయవచ్చు మరియు వ్యక్తి ఎటువంటి లక్షణాలు లేకుండా జీవించవచ్చు.
శస్త్ర చికిత్స
ఒకవేళ మందులు గనక తగినంత ఉపశమనము ఇవ్వకపోతే, లేదా అనేక దుష్ప్రభావాలను గనక కలిగిస్తే, శస్త్రచికిత్స సలహా ఇవ్వబడవచ్చు. ఆపరేషన్ సందర్భంగా మెదడు యొక్క ప్రభావిత ప్రాంతము తొలగించబడుతుంది. శస్త్ర చికిత్స అనునది, మెదడు యొక్క చిన్న ప్రాంతము ప్రభావితమయినప్పుడు మాత్రమే నిర్వహిస్తారు మరియు ఈ ప్రాంతము సాధారణ శరీర చర్యలపైన ఏ విధమైన ప్రభావమును చూపదు, అనగా స్పీచ్(మాట), వినడం, నడక, ఇతరుల మోటార్ యాక్టివిటీ.
జీవనశైలి యాజమాన్యము
మూర్ఛలను అదుపు చేయడం చాలా ముఖ్యము, ఎందుకంటే అవి ప్రమాదకరం కావచ్చు మరియు చిక్కులను సృష్టించవచ్చు.
- మందులను క్రమం తప్పకుండా తీసుకోండి. డాక్టరు గారి అనుమతి లేకుండా ఏ మోతాదునూ వదిలివేయవద్దు లేదా ఆపివేయవద్దు.
- నిర్భందకాలు లేక మూర్చకి కారణమయ్యే ట్రిగ్గర్స్ లను గుర్తించాలి. అధిక సాధారణముగా ఉపయోగించే ట్రిగ్గర్లు ఆల్కహాలు, నిద్రలేమి, ఒత్తిడి, అధిక కాంతి, పెద్ద శబ్దాలు మరియు మరికొన్నింటిని కలిగిఉంటాయి.
- మూర్చ ఎపిసోడ్లకు సంబంధించి ఒక డైరీని నిర్వహించాలి, దాని తీవ్రత మరియు ఎపిసోడ్లు ప్రారంభించక ముందు మీరు చేయుచున్న చర్యల యొక్క వివరాలతో పాటు కాలవ్యవధి కూడా ఇందులో నిర్వహించబడుతుంది.
- కారణమయ్యే అంశాలను ఇలా డీల్ చేయండి:
- త్వరగా నిద్రించడానికి ప్రయత్నించుట.
- తేలిక శ్వాస వ్యాయామాలను నిర్వర్తించుట.
- మద్యపానమును తగ్గించుకొనుట
- ఒకవేళ మూర్చ అనునది తరచుగా వస్తుంటే, డ్రైవింగ్, స్విమ్మింగ్ మరియు వంటచేయడం వంటి చర్యలను తొలగించాలి, ఎందుకనగా ఈ చర్యలు చేస్తున్న సమయములో ఒక వేళ మూర్చ ఏర్పడితే అది ప్రమాదానికి దారితీస్తుంది.
- ఇంటిలో స్మోక్ డిటెక్టర్లను నెలకొల్పండి.
- మృదువైన అంచులు ఉండే ఫర్నిచర్ ని వాడండి.
- స్నానము చేయునప్పుడు డోర్ లాక్ చేసుకోవద్దు.
- మూర్చ వచ్చినప్పుడు మునిగిపోకుండా నివారించడానికి స్నానానికి బదులుగా షవర్లను తీసుకోవాలి.
- ఈత కొట్టడానికి ఒక సహచరుడితో కలిసి వెళ్ళండి, మూర్ఛ వచ్చిన పక్షములో వారు మిమ్మల్ని కాపాడగలుగుతారు.
- బయటి క్రీడలలో పాల్గొనేటప్పుడు హెల్మెట్ ధరించండి
మూర్ఛలు (ఫిట్స్) వైద్య
మూర్ఛలు (ఫిట్స్) కొరకు అలౌపతి మందులు
Medicine Name | Pack Size | |
---|---|---|
Torleva | Torleva DT 250 Tablet | |
Levera | Levera DT 250 Tablet | |
Pregeb M | PREGEB M 150MG TABLET | |
Pregalin | PREGALIN SR 75MG CAPSULE 10S | |
Lamitor | Lamitor DT 100 Tablet | |
Tegrital | Tegrital 100 Tablet | |
Lacosam | Lacosam 100 Tablet | |
Levipil | Levipil Injection | |
Oleptal | Oleptal OD 150 Tablet SR | |
Oxetol | Oxetol Suspension | |
Pregalin M | Pregalin M 150 Capsule | |
Milcy Forte | Milcy Forte Tablet | |
Sycodep | Sycodep 2 /25 Tablet | |
Placidox | Placidox 10 Tablet | |
Engaba | Engaba 150 Mg Tablet | |
Gaba | GABA 100 Capsule | |
Alfagaba | Alfagaba 100 Tablet | |
Levepra | LEVEPRA 250MG TABLET 10S | |
Toframine | Toframine 2 Tablet | |
Valium | Valium 10 Tablet | |
Oxmazetol | Oxmazetol Tablet | |
Ezegalin | Ezegalin 75 Mg Tablet | |
Gabacap | GABACAP 100MG CAPSULE 10S | |
Epibrus | Epibrus 250 Tablet | |
Pentanerv M | Pentanerv M Tablet |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి