27, నవంబర్ 2020, శుక్రవారం

స్త్రీ లలో క్యాల్షియం లోపం ఉంటె ఇవి తప్పక తినాలి .?ఈ లింక్స్ లో చూడాలి


కాల్షియం లోపం అంటే ఏమిటి?

మన శరీరంలో 99 శాతం కాల్షియం దంతాలు మరియు ఎముకల రూపంలో గట్టి కణజాలం వలె నిల్వ చేయబడి ఉంది. కాల్షియమ్ అనేది మన శరీరంలో ఓ కీలక పోషకపదార్థం.  నరాలద్వారా సందేశాలు పంపేటువంటి కీలక శరీరవిధులకు కాల్షియమ్ చాలా అవసరం. ఇంకా, హార్మోన్ల స్రావం, కండరాలు మరియు నరాల సంకోచ,వ్యాకోచాలకు కాల్షియం యొక్క అవసరం ఉంటుంది. మరీ ముఖ్యంగా, అస్థిపంజర పనితీరుకు కాల్షియమ్ మద్దతుగా నిలుస్తుంది.

కాల్షియం లోపాన్నే “హైపోకాల్సీమియా” అని కూడా అంటారు. హైపోకాల్సామియాకు చికిత్స తీసుకోకపోతే “ఓస్టియోపేనియా” అనబడే ఎముకలు సన్నబడిపోయే (ఒస్టోపీనియా) వ్యాధి, పిల్లల్లో బలహీనమైన ఎముకలు (రికెట్స్) మరియు ఎముక సాంద్రత కోల్పోయే వ్యాధి (బోలు ఎముకల వ్యాధి) వంటి తీవ్రమైన సమస్యలను లేవనెత్తుతుంది. కాల్షియం లోపం వ్యాధిలో ఉత్తమాంశం ఏమంటే ఇది ఆహార అలవాట్లను మార్చుకోవడంవల్ల నయమవుతుంది.

దీని సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

ప్రారంభ దశల్లో కాల్షియం లోపం రుగ్మతను గుర్తించడం కష్టం. అయితే, వ్యాధి పరిస్థితి మరింతపురోగతి చెందుతూ ఉంటే కొన్ని వ్యాధిలక్షణాలు గుర్తించబడతాయి.

రుగ్మత ప్రారంభ లక్షణాలు:

  • వేళ్లు, పాదాలు, మరియు కాళ్లలో తిమ్మిరి మరియు జలదరింపు
  • కండరాలలో తిమ్మిరి మరియు సంకోచం లేక ఆకస్మిక కండరాల ఈడ్పు లేక కండరాలు పట్టేయడం (మరింత చదువు: కండరాల సంకోచం చికిత్స)
  • బద్ధకం మరియు తీవ్రమైన అలసట కలగడం

దీర్ఘకాలిక కాల్షియం లోపం అనేక ఇతర శరీర భాగాలను బాధించవచ్చు. రుగ్మత పొడజూపినపుడు కనిపించే వ్యాధి లక్షణాలు:

  • తక్కువ తీవ్రతతో కూడిన బోలు ఎముకల వ్యాధి మరియు బోలు ఎముకల వ్యాధి- ఎముక ఫ్రాక్చర్లు ఏర్పడే స్వభావంతో కూడిన వ్యాధులు
  • దంత సమస్యలు-దంత మరియు ఎనామెల్ హైపోప్లాసియా, మొద్దుబారిన పళ్ళవేరు (tooth root) అభివృద్ధి, మరియు దంతాలు రావడంలో ఆలస్యం.
  • బలహీనమైన మరియు పెళుసుగా ఉండే గోర్లు
  • పొడిబారిన మరియు దురదపెట్టే చర్మం - తామర
  • డిప్రెషన్ అండ్ గందరగోళం
  • ఆకలి లేకపోవడం (మరింత సమాచారం: ఆకలి కోల్పోవడానికి కారణాలు)
  • అసాధారణ గుండె స్పందన (హృదయ లయలు) (మరింత సమాచారం: అరిథ్మియా నివారణ)
  • రక్తం ఆలస్యంగా గడ్డకట్టే వ్యాధి

క్యాల్షియం లోపానికి కారణాలు ఏమిటి?

కాల్షియం కనీస అవసరం ఒక వయోజనుడికి రోజుకు 700 mg మరియు వృద్ధులకు రోజుకు 1200 mg.

కాల్షియం లోపానికి గురయ్యే అధిక  ప్రమాదం ఉన్న జనాభాలు

  • మహిళలు, ముఖ్యంగా ముట్లుడిగిన మహిళలు
  • వృద్ధులు
  • కౌమారప్రాయపు వయస్కులు
  • పాలలో ఉండే లాక్టోస్ అనే పదార్ధం పడని వ్యక్తులు (లాక్టోస్ అసహనం కల్గిన వ్యక్తులు) .

కాల్షియం లోపం యొక్క కొన్ని సాధారణ కారణాలు క్రింది విధంగా ఉన్నాయి:

  • ఆహారం తీసుకోవడం చాలా తక్కువైపోవడం
  • సిలియాక్ వ్యాధి వంటి జీర్ణ రుగ్మతల వల్ల అపశోషణం (malabsorption)
  • పారాథైరాయిడ్ గ్రంథులు స్రవించే హార్మోన్ తక్కువైతే సంభవించు స్థితి (Hypoparathyroidism)
  • మెగ్నీషియం యొక్క హెచ్చు -తక్కువ స్థాయిలు
  • ఫాస్స్ఫేట్‌ యొక్క అధిక స్థాయిలు
  • ఫెనితోయిన్, ఫెనాబార్బిటల్, రిఫాంపిన్, కోర్టికోస్టెరాయిడ్స్ అలాగే కీమోథెరపీ మందులు వంటి మందులు సేవిస్తున్నవ్యక్తులు
  • సెప్టిక్ షాక్ (మరింత సమాచారం: సెప్సిస్ చికిత్స)
  • మూత్రపిండాల (కిడ్నీ) వైఫల్యం
  • పాంక్రియాటైటిస్
  • విటమిన్ D తక్కువ స్థాయిలు

క్యాల్షియం లోపం  రుగ్మతను ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

వైద్యుడు మొదట రోగులను క్లినికల్ ప్రదర్శన మరియు రోగనిర్ధారణ శాస్త్రం ఆధారంగా అంచనా వేస్తాడు. క్లినికల్ లక్షణాలను నిర్ధారించడానికి తదుపరి దశలో రోగాలక్షణ  పరీక్షలైన సీరం కాల్షియంస్థాయిల పరీక్ష, పారాథైరాయిడ్ హార్మోన్, సీరం ఫాస్ఫేట్, మెగ్నీషియం, 25-హైడ్రాక్సీవైటమిన్ D, మరియు 1,25-డైహైడ్రాక్సీ విటమిన్ డి స్థాయిలు పరీక్షించే పరీక్షలు. కాల్షియం-సెన్సింగ్ రిసెప్టర్ కోసం చేసే జన్యుమార్పిడి పరీక్ష చేయించమని డాక్టర్ వ్యక్తి ని అడగొచ్చు. క్యాల్షియం-సెన్సింగ్ రిసెప్టర్ అంటే “జి ప్రోటీన్ సబ్యునిట్ ఆల్ఫా 11”.

కాల్షియం ఫుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవడంవల్ల కాల్షియం లోపం (హైపోకెక్సేమియా) రుగ్మతకు ఓ మంచి చికిత్సగా పని చేయడమే గాక ఈ రుగ్మత అసలు ఆ రుగ్మత రాకుండానే నిరోధిస్తుంది. కాల్షియం పుష్కలంగా ఉండే గొప్ప ఆహారపు వనరులు కొన్ని ఇలా ఉన్నాయి

  • పాలు మరియు ఇతర పాల ఉత్పత్తులు- చీజ్, పెరుగు, “యోగర్ట్” అనబడే పాలు పులియబెట్టి చేసిన పెరుగువంటి పదార్ధం మరియు పనీర్
  • కూరగాయలు- బచ్చలికూర మరియు పాలకూర (spinach), బ్రోకలీ, పప్పుధాన్యాలు, -బీన్స్ మరియు బఠానీలు
  • ధృఢమైన ధాన్యాలు, తృణధాన్యాలు
  • కాల్షియం అధికంగా ఉండే మినరల్ వాటర్
  • సముద్రం నుండి లభించే ఆహారపదార్థాలు (సీఫుడ్), కొవ్వు లేని మాంసాలు (lean meat) మరియు గుడ్లు
  • ఎండిన పండ్లు (నట్స్), విత్తనాలు, సోయా ఉత్పత్తులు- టోఫు అనబడే సోయాపాలతో చేసే పదార్ధం  

వైద్యుడు సూచించిన కాల్షియం సప్లిమెంట్ మందులు కాల్షియం స్థాయిలను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతాయి. .

  • స్వీయ చికిత్సను నివారించండి
  • కాల్షియంను అధిక మోతాదుల్లో తీసుకోకండి, - ఎందుకంటే మోతాదును శరీర బరువును అనుసరించి ఇవ్వడం జరుగుతుంది.
  • హై మోతాదులకి డియోగోక్సిన్ టాక్సిక్టీని కలిగించవచ్చు, కాల్షియం లోపం రాత్రిపూట అభివృద్ధి చెందుతుంది, అందువల్ల తిరిగి రావడానికి సమయం పడుతుంది.
  • కాల్షియం మందులు కొన్ని మందులతో ప్రతిస్పందిస్తాయి  - రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ ను తగ్గించే మందులు, యాంటీబయాటిక్స్ - టెట్రాసైక్లిన్ మరియు ఫ్లూరోక్వినోలోన్లతో కాల్షియం మందులతో సంఘర్షణ చెందుతాయి.

అదనంగా, వ్యక్తిగత పరిస్థితిని బట్టి కాల్షియం సూది మందులు అవసరం కావచ్చు.తీవ్రతను బట్టి, హైపోకాల్సీమియాకు పూర్తిగా చికిత్స చేయడానికి ఒక నెల నుంచి ఆరు నెలల వ్యవధి  పట్టవచ్

క్యాల్షియం లోపం కొరకు అలౌపతి మందులు


Medicine NamePack Size
GemcalGemcal 500 Capsule
CalcirolCalcirol 60000 IU Softgels
RenolenRenolen Eye Drop
Calvista K2CALVISTA K2 TABLET 10S
DexacalDEXACAL TABLET 10S
HarscalHarscal Tablet
NiskalNiskal Tablet
Calcium + Calcitriol TabletCalcium 500 Mg + Calcitriol 0.25 Mg Tablet
Calcitriol + Calcium Carbonate + ZincCalcium Carbonate 500 Mg + Calcitriol 0.25 Mcg + Zinc 7.5 Mg Tablet
OnecalBonecal Tablet
Gemcal DsGemcal DS Soft Gelatin Capsule
GemciumGemcium Capsule
GemfulGemful Capsule
NelcalNelcal Syrup
Calcium + Vitamin D3Calcium + Vitamin D3 250 IU Tablet
Coecoral MaxCoecoral Max Capsul
GemitrolGemitrol NS Nasal Solution
BasolBasol Solution
CoecoralCoecoral Iso Capsule
Gemking D3Gemking D3 Suspension
Dailycal OKDailycal OK Tablet
GemsolineGemsoline Soft Gelatin Capsule
OsifortOsifort Tablet
GencitrolGencitrol Tablet
 


ధన్యవాదములు 🙏

మీ నవీన్ నడిమింటి

విశాఖపట్నం

9703706660


అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుక

కామెంట్‌లు లేవు: