జుట్టు రాలడం అంటే ఏమిటి?
జుట్టు రాలడం అనేది ఒక అప్రీతికరమైన పరిస్థితి దీనిలో ప్రభావిత వ్యక్తి యొక్క నెత్తి మీద (లేదా శరీరమంతా) నుండి జుట్టు రాలిపోవడం మొదలవుతుంది . ప్రతిరోజూ 100 వెంట్రుకలను కోల్పోవడం అనేది చాలా సాధారణమైనది, ఎందుకంటే వాటిని కొత్తగా పెరుగుతున్న వెంట్రుకలు భర్తీ చేస్తాయి. అయితే, కొత్తగా పెరిగే వెంట్రుకల కంటే ఎక్కువగా వెంట్రుకలు రాలుతున్నపుడు సమస్య ఏర్పడుతుంది. ఇది పురుషులలో చాలా తరచుగా సంభవిస్తుంది. జుట్టు నష్టం/రాలడం అధికంగా ఉన్నప్పుడు, అది బట్టతలకి కూడా దారి తీస్తుంది.
దాని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
సాధారణంగా జుట్టు రాలడం అనేది అంతర్లీన వ్యాధిని సూచించే ఒక లక్షణం. జుట్టు రాలడం కొన్ని ఇతర లక్షణాలతో కూడా ముడిపడి ఉంటుంది, వాటిలో కొన్ని ఈ కింది విధంగా ఉంటాయి:
- జుట్టు రాలడం వివిధ తరహాలలో జరుగుతుంది
- పురుష లేదా స్త్రీ- తరహా బట్టతల
- నెత్తి పై పూర్తి బట్టతల యొక్క మచ్చలు/గుర్తులు
- గుత్తులు గుత్తులుగా జుట్టు రాలడం
- పూర్తి శరీర జుట్టు నష్టం
- నెత్తి మీద చర్మం పొరలుగా మారడం మరియు పొడిబారడం
- నెత్తి దురద
- జుట్టు పొడిబారడం మరియు వెంట్రుకల చివర్లు చిట్లిపోవడం
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
జుట్టు రాలడం అనేది చాలా సాధారణం మరియు అనేక కారణాలు దీనితో ముడిపడి ఉంటాయి. కొన్ని సాధారణ కారణాలు:
- వారసత్వ కారణాలు - తల్లిదండ్రులలో జుట్టు రాలడం యొక్క బలమైన చరిత్ర ఉంటే జుట్టు రాలే అవకాశాలు పెరుగుతాయి
- హార్మోన్ల మార్పులు (పురుషులు మరింత సాధారణంగా) కణతలు మరియు నడినెత్తి దగ్గరలో పురుష నమూనా బట్టతలకి దారితీస్తాయి
- ఫంగల్ ఇన్ఫెక్షన్ల వంటి నెత్తి (స్కాల్ప్) ఇన్ఫెక్షన్లు
- మందులు ప్రేరేపించిన (Iatrogenic) - కీమోథెరపీ ఏజెంట్లు, యాంటీడిప్రెస్సివ్ మందులు, మొదలైనవి
- రేడియేషన్ థెరపీ
- ఒత్తిడి- భావోద్వేగ ఒత్తిడి జుట్టు రాలడానికి ప్రధాన కారణం
- పోషకాహార లోపాలు - విటమిన్ E, జింక్, సెలీనియం మొదలైనవాటి లోపం జుట్టు రాలడాన్ని పెంచుతుంది
- జుట్టు నిర్వహణ - తరచుగా జుట్టు రంగులు వేసుకోవడం, జుట్టును తిన్నగా చేసే ఎజెంట్లు (straightening agents) మరియు ఇతర కెమికల్స్ యొక్క వాడకం కూడా జుట్టు రాలే అవకాశాలను పెంచుతాయి
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
సాధారణంగా, పూర్తిస్థాయి ఆరోగ్య చరిత్ర మరియు వైద్య పరీక్షలు జుట్టు నష్టం యొక్క నిర్ధారణను ధ్రువీకరిస్తాయి. అయితే, కొన్ని పరీక్షలు జుట్టు రాలడం యొక్క కారణాన్ని తెలుసుకోవడానికి మరియు చికిత్స యొక్క విధానాన్ని నిర్ణయించడానికి సహాయపడతాయి. అటువంటి పరీక్షలు:
- రక్తంలోని విటమిన్లు మరియు మినరల్స్ స్థాయిల లోపాల తనిఖీ కోసం రక్తం పరీక్షలు
- పుల్ పరీక్ష మరియు లైట్ మైక్రోస్కోపీ (Pull test and light microscopy) - జుట్టు వెంట్రుకలు సున్నితమైన లాగడం/తెంపడం వల్ల అది జుట్టు యొక్క టెన్సయిల్ స్ట్రెంత్ (tensile strength) ను మరియు ఫాలికిల్ అటాచ్మెంట్ (follicle attachment) గురించి తెలుపుతుంది, మైక్రోస్కోపీ వెంట్రుకల యొక్క సాంద్రత (density) తనిఖీ చేస్తుంది
- నెత్తి జీవాణుపరీక్ష (స్కాల్ప్ బయాప్సీ) - అంటువ్యాధుల వంటి కారణాలను గుర్తించడంలో ఇది సహాయపడుతుంది
జుట్టు రాలడం యొక్క చికిత్స పూర్తిగా కారకం మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని సంధర్భాలలో, చికిత్స చేయలేము, కానీ సహాయక చికిత్సలను ఉపయోగించవచ్చు. జుట్టు రాలడం కోసం ఉపయోగించే కొన్ని చికిత్స పద్ధతులు ఈ విధంగా ఉంటాయి
- మందులు - జింక్, సెలీనియం, విటమిన్ ఇ వంటివి ఉండే మల్టీవిటమిన్ మాత్రలు వంటి సప్లీమెంట్లను ఇవ్వడం; మినాక్సిడిల్ (Minoxidil), ఫినాస్టిరైడ్ (Finasteride), హార్మోన్ భర్తీ మందులు మొదలైనవి .
- లేజర్ చికిత్స - స్కాల్ప్ ను లేజర్ కిరణాలకు బహిర్గతం చెయ్యడం వలన అది జుట్టు సాంద్రతను మెరుగుపరుస్తుంది
- ట్రాన్స్ప్లాంట్ సర్జరీ - దట్టమైన వెంట్రుకలు ఉన్న స్కాల్ప్ ప్రదేశం నుంచి చిన్న వెంట్రుకల గుత్తి తీసి మరియు జుట్టు నష్టం ఉన్న ప్రదేశంలి నాటతారు (ట్రాన్స్ప్లాంట్ చేస్తారు)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి