22, నవంబర్ 2020, ఆదివారం

తలలో చుండ్రు నివారణకు ఆయుర్వేదం సలహాలు

#చుండ్రు_పోగొట్టే_పురాతన_ఆయుర్వేదం_నవీన్_నడిమింటి_సలహాలు_అవగాహన_కోసం 
                      చుండ్రు సమస్య ఎంతో మందికి రోజు వారి పెద్ద సమస్యగా ఉంటుంది. తలపై చుండ్రు ఉంటే చిరాకుగా, తల అంతా దురదలుగా విసుగు పుట్టిస్తుంది. ఈ సమస్య గనుకా చెక్ పెట్టక పొతే చిరాకు మాట అలా ఉంచితే ఎంతో ఒత్తుగా, నల్లగా నిగనిగలాడే జుట్టు ఉన్నవారికి జుట్టు రాలిపోయి, జుట్టు అంతా నిర్జీవంగా మారే ప్రమాదం ఉంటుంది. అందుకే చుండ్రుకి సాధ్యమైనంత త్వరగా చెక్ పెట్టేయాలి.

             అయితే చాలా మంది చుండ్రు పోవడానికి మార్కెట్ లో దొరికే రసాయనిక షాంపోలు వాడుతారు.వీటి ప్రభావం వలన చుండ్రు తాత్కాలికంగా పోవచ్చు కానీ మళ్ళీ తిరిగి చేరుతుంది. అంతేకాదు రాసాయనిక మందుల ప్రభావం వలన జుట్టు ఊడిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. అందుకే సహజసిద్దంగా చుండ్రుని పోగొట్టే పద్దతులని తెలుసుకోవడం ఉత్తమం. కానీ చాలా మందికి పూర్వం మన పెద్దలు ఎలాంటి పద్దతులని చుండ్రు పోగొట్టడానికి ఉపయోగించారో తెలియదు. మరి పూర్వీకులు ఎలాంటి పద్దతులని పాటించేవారో ఇప్పుడు చూద్దాం.

          ముఖ్యంగా చుండ్రు పోగొట్టడానికి అందరికి తెలిసిన ఏకైక పద్దతి నిమ్మకాయతో తలపై రుద్దటం కాసేపటి తరువాత తల స్నానం చేయడం. అయితే ఈ ప్రయత్నం మాత్రమే కాకుండా కుంకుడు, శీకాయ లని తీసుకుని రెండిటిని నీళ్ళలో నానబెట్టి వచ్చిన మిశ్రమంతో తలస్నానం చేస్తే తప్పకుండా చుండ్రు సమస్య పోతుంది.

            స్వచమైన కొబ్బరి నూనెలో ఒక చెక్క నిమ్మరసం పిండి. ఆ నూనెని తలపై చర్మానికి బాగా పట్టించి ఒక అరగంట పాటు ఆరనిచ్చి తరువాత కుంకుడు కాయలతో తలంటు పోసుకుంటే చుండ్రు దాదాపు దూరం అయినట్టే.

గసగసాలు చుండ్రుని నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముందుగా గసగసాలు కొన్ని తీసుకుని వాటిని మెత్తటి పేస్టుగా చేసుకుని తల భాగంలో బాగా పట్టించి. ఒక అరగంట పాటు ఆరనివాలి. ఆ తరువాత శీయాక లేదా కుంకుడు మిశ్రమంతో తల స్నానం చేస్తే చుండ్రు రమ్మన్నా రాదు

#చుండ్రు_నివారణ:

కావలసిన పదర్దాలు 

1). కల బంధ రెమ్మలు -32). 

కొబ్బరి నూనె. - 1/4  కే. జి

.తయారు చేయు విధానం: కలబంధ రెమ్మల నుండి గుజ్జును తీసి, కొంచం మిక్స్ చేయాలి.  తరువాత ఒక గిన్నెలో కొబ్బరి నూనె మరియు కల బంధ గుజ్జు సమానంగా తీసుకొని పోయి మీద చిన్న మంటలో ఉంచి కొబ్బరి నూనె బంగారు రంగు లో వచెంత వరకు మెల్లిగా కలుపుతూ ఉండాలి.  కొబ్బరి నూనె బంగారు రంగు లో వచ్చిన తరువాత పోయి ఆపేసి, కొబ్బరి నూనె చల్ల బడినాక, ఒక సీస లో బద్ర పరుచు కోవాలి.

#ఉపయోగాలు:

1. చుండ్రు నివారణ.
2. జుట్టు రాలడం దగ్గుతుంది.
3. తెల్ల జుట్టు రాకుండా చేస్తుంది.
చుండ్రు నివారణకు మరి కొన్ని చిట్కాలు:
1.  మెంతులను రాత్రంత నానబెట్టి , వాటిని రుబ్బి పెరుగు తో కలిపి తలకు పట్టించి శీకాయి తోటి స్నానం చేయాలి.  ఇలా వారానికి 3 సార్లు చేయాలి.

2.  సొంటి కొమ్మును ఎండలో ఎండపెట్టి , దాన్ని మిక్సిలో పట్టి ,  వస్త్రదాలితం చేసి ,  ఆ పొడిని చుండ్రు ఉన్న చోట నెమ్మదిగా మర్దన చేయాలి. ఇలా వారానికి 2 సార్లు చేయాలి. చుండ్రు భాద నుండి విముక్తి లభిస్తుంది.
జుట్టు రాలుటను తగ్గించే ఆయుర్వేద పద్దతులు
విటమిన్ 'E' ఆయిల్, బాదం వంటి వాటితో స్కాల్ప్ పై మసాజ్ చేయండి.  

ఆయుర్వేద వైద్యంలో మీరు తినే ఆహార పదార్థాలు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి.

మిల్క్, నట్స్, హోల్ గ్రైన్స్ వంటి వాటిని తినండి.
తినే ఆహరం, ధ్యానం, అరోమాథెరపీ, ఆయిల్ మసాజ్ మరియు ఆయుర్వేద ఔషదాలు వంటి అన్ని కూడా జుట్టు రాలుటను తగ్గించే ఆయుర్వేద వైద్య శాస్త్రంలోకి వస్తాయి. మంచి ఫలితాలను పొందుటకు గానూ సంపూర్ణ విధానాలను అనుసరించాలి.

#ఆయిల్_మసాజ్

స్కాల్ప్ ను ఆయిల్ లతో మసాజ్ చేయటం వలన జుట్టు మరియు స్కాల్ప్ కు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. రోజు కేవలం 5 నిమిషాల పాటూ మసాజ్ చేయటం వలన జట్టు రాలటం చాలా వరకు నియంత్రించబడుతుంది.

వెంట్రుకల మొదల్లకు బలం చేకూర్చటానికి గానూ విటమిన్ 'E' గల ఆయిల్ తో స్కాల్ప్ కు మాసాజ్ చేయండి.

కొబ్బరి మరియు బాద నూనెలు శక్తి వంతంగా జుట్టు రాలటాన్ని తగ్గిస్తాయి. దీనితో పాటుగా, పొడి మరియు పొలుసులుగా రాలే స్కాల్ప్ ను కూడా తగ్గిస్తాయి.

జుట్టు పలుచబడటాన్ని తగ్గించుటకు, హెర్బల్ సీరంతో స్కాల్ప్ ను మసాజ్ చేయండి. ఈ హెర్బల్ సీరాన్ని కనీసం వారానికి 3 ఆర్లు వాడటం వలన జుట్టు మొదల్లకు కావలసిన పోషకాలు అందించబండతాయి.

జుట్టు రాలటాన్ని తగ్గించే మరొక ఆయుర్వేదిక్ ఆయిల్- బ్రింగరాజ్ ఆయిల్. ఈ నూనెను నేరుగా మీ స్కాల్ప్ మరియు జుట్టుపై పోసి మసాజ్ చేసి కనీసం ఒక రాత్రి వరకు అలాగే ఉంచండి. తరువాత ఉదయాన శుభ్రమైన నీటితో కడిగి వేయండి.
ఆయుర్వేద చికిత్సలో తినే ఆహారాలు కూడా కీలకమే

జింక్, విటమిన్ 'C', విటమిన్ 'B' కాంప్లెక్స్, సల్ఫర్ వంటి శరీరానికి అవరమయ్యే పోషకాలను అధికంగా కలిగి ఉండే ఫాటీ ఆసిడ్ లను ఎక్కువగా తీసుకోండి. ఇవి వెంట్రుకల మొదల్లకు బలాన్ని చేకూరుస్తాయి.

మొలకెత్తే విత్తనాలు, పాలు, బటర్, నట్స్, సోయా బీన్స్ మరియు గ్రైన్స్ వంటివి జుట్టు రాలటాన్ని తగ్గిస్తాయి.

ఆరోగ్యకర మరియు బలమైనన్ వెంట్రుకల కోసం కలబంద రసం అవసరమని చెప్పవచ్చు. 3 నెలలకు రెండు సార్లు కలబంద రసాన్ని తాగటం చాలా మంచిది.

జుట్టు రాలుటను తగ్గించే శక్తివంతమైన ఔషదంగా యోఘర్ట్ ను పేర్కొనవచ్చు. రోజు యోఘర్ట్ తీసుకోవటం వలన జుట్టు రాలటం తగ్గుటను మీరు గమనించవచ్చు.

పండ్లు, కూరగాయలు, పచ్చని ఆకుకురాలను మీ ఆహార ప్రణాళికలో కలుపుకోండి. వీటిలో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది కావున జుట్టు రాలటం తగ్గుతుంది.

మెగ్నీషియం, కాల్షియం, నువ్వులు వంటివి జుట్టు రాలటాన్ని తగ్గిస్తాయి.
జుట్టు రాలటాన్ని తగ్గించే ఇతర ఆయుర్వేద ఔషదాలు

#ఆయుర్వేద_ఔషదాలు_జుట్టు_పెరుగుదలను     
           ప్రోత్సహించటమే కాకుండా, జుట్టు రాలుటను తగ్గిస్తాయి. రోజ్మేరీ, స్టింగింగ్ నేటిల్, బిర్చి మరియు హర్సేటల్ వంటివి ఉపయోగపడే ఇతర ఆయుర్వేద ఔషదాలు అని చెప్పవచ్చు. వీటిని నేరుగా స్కాల్ప్ కు అప్లై చేయటం వలన జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది.

లికోరైస్ కూడా జుట్టు రాలుటకు వ్యతిరేఖంగా పని చేసే ఔషదంగా చెప్పవచ్చు. పడుకోటానికి ముందు లికోరైస్ సారాన్ని స్కాల్ప్ పై మసాజ్ చేయండి.

మార్ష్మల్లౌ మరియు బర్డాక్ టీ జుట్టుకి మంచివి అని చెప్పవచ్చు.

మినపప్పు, బ్లాక్ బీన్స్ మరియు మెంతులను కలిపి ఒక పేస్ట్ ల చేయండి. ఈ మిశ్రమం ఒకే విధంగా అయ్యే వరకు వేడి చేయండి. ఈ మూడు మిశ్రమాలను పూర్తిగా కలిసే వరకు గ్రైండ్ చేయండి. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ కి అప్లై చేసి, 30 నిమిషాల తరువాత కడిగి వేయండి. ఈ పద్దతిని వారంలో రెండు లేదా మూడు సార్లు అనుసరించి మార్పులను గమనిచండ
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి 
విశాఖపట్నం 
9703706660
*సభ్యులకు సూచన*
*************
సమయాభావం వలన వ్యక్తిగతంగా సమాధానాలు ఎవరికీ ఇవ్వడం సాధ్యపడదు. మీ సమస్యకు సరిపడా పరిష్కారాలకొరకు, మీ అవగాహనకొరకు మేము పెడుతున్న సంబంధిత సమాచారంతో కూడిన సవివరమైన పోస్టులు చదవవలసినదిగా ప్రార్థన..

కామెంట్‌లు లేవు: