స్త్రీలలో బహిష్టు సమయంలో వచ్చే పొత్తి కడుపు నొప్పిని ఈ సులభమైన నవీన్ ఆయుర్వేదం సలహాలు 

స్త్రీలలో బహిష్టు సమయంలో వచ్చే పొట్టి కడుపు నొప్పికి సులభమైన వంటింటి చిట్కాలు
 

నొప్పి తగ్గడానికి వాళ్లు చేయని ప్రయత్నం ఉండదు. చాలా సందర్భాలలో ఆ నొప్పిని భరించలేక పెయిన్‌ కిల్లర్స్‌ను కూడా వాడుతుంటారు. ఇలా ఇష్టం వచ్చినట్టు పెయిన్‌కిల్లర్స్‌ వాడటం మంచిది కాదు. అందుకే కొన్ని వంటింటి టిప్స్‌ ద్వారా బహిష్టు నొప్ప

నెలసరి సమయంలో కడుపునొప్పిని తగ్గించే సులభమైన నవీన్ ఆయుర్వేదం సలహాలు 

  • హార్మోనుల సమతుల్యతను కాపాడటానికి పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి. మొలకెత్తిన విత్తనాలు, పాలు, గ్రుడ్లు, పండ్లు, కాయగూరలు మొదలైనవి ఎక్కువగా తీసుకోవాలి.
  • అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గటానికి ప్రయత్నించాలి.
  • నిత్యం, యోగా ప్రాణాయామం చేయాలి. మానసిక ఒత్తిడిని నివారించటానికి ధ్యానం చేయాలి.
  • నొప్పి తీవ్రత, రక్తస్రావం ఎక్కువగా ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి సలహా తీసుకోవాలి.
  • ఇటువంటివారు రెగ్యులర్‌గా స్పయినల్‌, పెల్విక్‌ ఎక్సర్‌సైజ్‌ చేస్తూ వుంటే నొప్పి అంతగా అనిపించదు. నొప్పి వచ్చేవారు ఆ రోజుల్లో పిండి పదార్థం ఎక్కువ తీసుకోకూడదు.
  • నొప్పి తగ్గడానికి ‘పాన్‌ స్టాన్‌-500’క్యాప్సూల్స్‌ లేదా ‘మెప్టాల్‌ స్పాస్‌’ బిళ్ళలు తడవకి ఒకటి చొప్పున రోజుకి మూడుసార్లు వేసుకోవాలి.యాభై శాతం స్త్రీలు బహిష్టుస్రావం కనబడినప్పుడు కడుపునొప్పితో బాధపడతారు. అయితే నొప్పి కొందరికి ఎక్కువ అనిపించవచ్చు. మరికొందరికి తక్కువ అనిపించవచ్చు. 10 శాతం మందికి కడుపునొప్పి ఎక్కువ వుండి మందు వాడితే తప్ప రిలీఫ్‌ రాదు. తక్కినవారికి కడుపునొప్పి వచ్చినా భరించే స్థితిలో వుంటుంది. ఒకటి-రెండు రోజుల్లో తగ్గిపోతుంది.
  • అశోకాదివటి, పుష్యానురాగ చూర్ణము, అష్టాక్షరీ గుళికలలో ఏదైనా వాడవచ్చు. అశోక చెట్టు వేళ్ళ కషాయము లేక మేడి చెట్టు వేళ్ళ కషాయము లేదా దానిమ్మ చెట్టు వేళ్ళ కషాయము ఏదైనా వాడవచ్చును. అంతేకాదు… నొప్పి వస్తున్న ప్రాంతములో వేడి నీటితో ఒక గంటపాటు కాపడము పెట్టాలి. వేడి పానీయములను తీసుకోరాదు.
  • ఈ టైములో పొగలు కక్కే టీ తాగితే ఎంతో మంచిది. వేడి టీ తాగడం వల్ల కండరాల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ఇలాంటి సమయాల్లో అల్లం, పిప్పర్‌మెంట్‌, లావెండర్‌, గ్రీన్‌ టీ, లెబన్‌గ్రాస్‌ వంటి హెర్బల్‌ టీలు తాగితే మంచిది. హెర్బల్‌ టీలు తాగడం వల్ల అలసట పోతుంది. నొప్పి కూడా తగ్గుతుంది.
  • బహిష్టు సమయంలో నీరు ఎంత తాగితే అంత మంచిది. ఈ టైములో కనీసం ఆరు నుంచి ఏడు గ్లాసుల నీరు తప్పనిసరిగా తాగాలి. ఇలా చేయడం వల్ల శరీర ఆరోగ్యం బాగా ఉంటుంది. అందుకే నెలసరి వచ్చే వారం రోజుల ముందు నుంచి ఆడవాళ్లు నీటిని ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. నొప్పి, కండరాలు ఒత్తుకుపోవడం లాంటి బాధలు తలెత్తవు.
  • బహిష్టు సమయాల్లో వచ్చే నొప్పులు, తిమ్మిర్లపై అల్లం బాగా పనిచేస్తుంది. అల్లం వాడకం వల్ల ప్రిమెనుసు్ట్రవల్‌ సిండ్రోమ్‌ కారణంగా వచ్చే అలసట కూడా పోతుంది. అన్నింటికన్నా మరో ముఖ్యమైన విషయమేమిటంటే కొంతమందికి బహిష్టులు సరిగా రావు. ఇలాంటి వారికి ఇది మందులా పనిచేస్తుంది. క్రమం తప్పకుండా బహిష్టులు వచ్చేలా చేస్తుంది. అందుకే ఈ టైములో చిన్న అల్లంముక్కను తీసుకుని దాన్ని మెత్తగా చేసి నీళ్లల్లో వేసి ఐదు నిమిషాల సేపు ఉడకనివ్వాలి. తర్వాత ఆ నీళ్లను వడగొట్టి అందులో కాస్తంత తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. ఈ టీని బహిష్టు సమయంలో రోజుకు మూడుసార్లు తాగితే బహిష్టు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • గర్భాశయం కండరాలపై హాట్‌ వాటర్‌ బ్యాగుతో మెల్లగా ఒత్తితే ఆ వేడికి కండరాల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందుకోసం హీట్‌ ప్యాడ్స్‌ని కూడా వాడొచ్చు.
  • మనం తినే డైట్‌లో కూడా కొన్ని మార్పు చేర్పులు చేస్తే బహిష్టు నొప్పులు తగ్గుతాయి. ముఖ్యంగా కాఫీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే, కాఫీ తాగడం వల్ల రక్తనాళాలు ముడుచుకుపోతాయి. దీని ప్రభావం గర్భాయం రక్తనాళాలపై పడే అవకాశం ఉంది. దాంతో అక్కడి రక్తనాళాలు బిగుసుకుపోతాయి. కాఫీ తాగలేకుండా ఉండలేమనే ఆడవాళ్లు బహిష్టులు రావడానికి ఒక వారం ముందర నుంచి కాఫీ తాగడం మానేస్తే మంచిది. ఆ తర్వాత ఫలితం మీరే గమనించండి.
  • ఎక్కువ ఉప్పు ఉన్న ఫ్యాటీ ఫుడ్స్‌ కూడా ఈ టైములో తినకూడదు. అలా చేస్తే పీరియడ్స్‌ నొప్పి ఎక్కువయ్యే అవకాశం ఉంది. బహిష్టు సమయంలో అరటిపళ్లు తింటే మంచిది. వీటిల్లో పొటాషియం బాగా ఉంటుంది. అంతేకాదు ఈ పండు జీర్ణక్రియ సరిగా జరిగేట్టు చేస్తుంది. అరటిపళ్లే కాకుండా ఐరన్‌ ఎక్కువగా ఉండే కాయధాన్యాలు, పాలకూర, చిక్కుళ్లు వంటివి కూడా మీరు తీసుకునే డైట్‌లో ఉండేట్టు జాగ్రత్తలు తీసుకోవాలి.
  • ఇవే కాకుండా దాల్చిన చెక్కతో చేసిన కొన్ని రెసిపీలు ఉన్నాయి. వాటిని ఈ టైములో తీసుకుంటే బహిష్టు నొప్పులు, బాధల నుంచి బయటపడొచ్చు.
  • దాల్చినచెక్క యాంటి- క్లాటింగ్‌గా పనిచేస్తుంది. అంతేకాదు అందులో యాంటి-ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్‌ కూడా పుష్కలంగా ఉన్నాయి. అందుకే బహిష్టి నొప్పుల నుంచి ఆడవాళ్లకు ఇది ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. అంతేకాదు దాల్చినచెక్కలో పీచుపదార్థాలు కూడా బాగా ఉంటాయి. వీటితోపాటు కాల్షియం, ఐరన్‌, మ్యాంగనీసులు ఉన్నాయి. దాల్చిన చెక్కతో చేసిన టీ బహిష్టు సమయంలో తాగితే ఎంతో మంచిది. వేడి నీళ్లల్లో పావు స్పూను దాల్చినచెక్క పొడి వేసి బాగా కలపాలి. ఐదునిమిషాలు తర్వాత అందులో కొద్దిగా తేనె వేసి కలిపి తాగితే ఎంతో రిలీఫ్‌ వస్తుంది. నెలసరి మొదలవడానికి రెండురోజుల ముందర నుంచి దాల్చినచెక్క టీని రెండు లేదా మూడు కప్పులు తప్పనిసరిగా తాగాలి. ఇలా చేయడం వల్ల బహిష్టు బాధలు తలెత్తవు. అలాగే ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో అరచెంచా దాల్చినచెక్క పొడి, ఒక టేబుల్‌స్పూను తే నె వేసి బాగా కలిపి పీరియడ్స్‌ మొదటి రోజున మూడుసార్లు తాగితే బహిష్టు నొప్పులు తగ్గుతాయి.