జుట్టు రాలుటను తగ్గించే ఆయుర్వేద పద్దతులు నవీన్ నడిమింటి సలహాలు     జుట్టు రాలుట సమస్యలు –నివారణ మార్గాల

 పురుషుల కైనా, స్త్రీల కైనా అందాన్ని ఇనుమడింప జేసేవి వెంట్రుకలే. ఒకప్పుడు మనదేశములో కేశసంపదకుకొదవలేదు.     స్త్రీలు  పొడవైనజుట్టుతో , పురుషులు  ఉంగరాల,నొక్కుల, జులపాలతో అందంగా కనపడేవారు. బట్టతల గలవారు 1%   కంటే  తక్కువ వుండేవారు. కాని ఇప్పుడు యువకులలోనే 30% పైగా బట్టతలవారు కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఉన్నత విద్యావంతులు,సాఫ్ట్ వేర్ రంగం లో వారికి జుట్టు ఊడిపోయే సమస్య ఎక్కువగా కన్పిస్తున్నది.

 జుట్టు రాలుట  (హేర్ ఫాలింగ్ ) కు ప్రధాన కారణాలు :

 .1. మానసిక ఒత్తిడి, చిన్న విషయానికి ఎక్కువ ఆలోచించడం.   2. వేళకు నిద్రపోక పోవడం    

3. సమతుల పోష కాహారం లోపించడం.

4. వాతావరణ కాలుష్యం.    

 5. రసాయనాలు (షాంపులు,హేర్ డై ) ఎక్కువ వాడడం.

6. చీటికి మాటికి యాంటీ బయోటిక్స్  ఎక్కువ తీసుకోవడం  7. జబ్బు చేసి బలహీన పడినప్పుడు  ఎక్కువ జుట్టు రాలుతుంది

   8 త్వరగా సన్నపడాలని అతిగాచేసే ఎక్సర్ సైజులు, డైటింగ్ లు

 9. ఎనీమియా (ఐరన్ లోపం ), B12 విటమిన్ లోపించడం, జింక్ లోపించడం.

10. టైఫాయిడ్ వల్ల,    

11 యాంటీ క్యాన్సర్ మందులు వాడటం,రేడియో తెరఫీ వల్ల.

12. ప్రొజెస్టిరాన్, టెస్టో స్టిరాన్  హార్మోన్స్ లోపించడం లేదా ఎక్కువ కావడం.

  13. వంశ పారంపర్యంగా బట్ట తల రావడం.

 వంశపారంపర్యంగా, సహజంగా  వచ్చిన బట్టతల మళ్ళీ మొలవదు. ఇన్ఫెక్షన్, జబ్బులవల్ల పోషకాహార లోపం వల్ల,

 ఏర్పడిన బట్టతలకు చికిత్స చేస్తే చాలావరకు  జుట్టు వస్తుంది.

 జుట్టు రాలకుండా ఆపడానికి, తిరిగి వెంట్రుకలు మొలవడానికి  మార్గాలు:

  అల్లోపతీ వైద్యం: బట్టతల  ఏర్పడినచోట  HAIREX solution(Minoxidil) or HEBALDsolution(Minoxidil)

పై మందులలో ఏదో ఒకటి ఉదయం ఒక చుక్క (1 ml),సాయంత్రం ఒక చుక్క మందును వేసి వేలితో మర్దన చేయాలి.

    అలా కనీసం నాలుగు నెలలు రాయాలి. 4 నెలలతర్వాత వెంట్రుకలు మొలవడం మొదలవుతాయి. మొలిచిన తర్వాత     కూడా రోజు రెండు పూటలు  పై మందు రాయాలి.

  ఆయుర్వేదం, ప్రకృతి వైద్యం   

1.నల్లమందు,లిల్లీపూరసాన్నిసారాయిలోకలిపితైలముగావాడితేజుట్టురాలదు. క్రీ. పూ 400 లో హిప్పో క్రేట్స్ ఈ విధానం కనుగొన్నాడు.

 2. కలబంద లోని తెల్లని గుజ్జును తీసి, కొబ్బరి నూనె లో మరిగించి, ఆ తైలాన్ని రోజు రాసిమర్దన చేస్తుంటే జుట్టు రాలదు .

3. కట్టెలు, దుంగలపై తేమకు పెరిగే ఒక రకమైన పుట్టకొక్కులు(శిలీంద్రం ) ను తెచ్చి ఎండబెట్టి, కాల్చి ఆ బూడిదను     కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెలో కలిపి బట్టతలకు రాస్తుంటే  ఒకటి రెండు నెలలలో  నూగులా' వెంట్రుకలు మొలుస్తాయి. తర్వాత దట్టంగా పెరుగుతాయి. ఇది చాలా ఉత్తమ చికిత్స.

4.  ఒక ఉల్లిపాయను కచ్చాపచ్చా దంచి ఒక కప్పు  రమ్ లో వేసి 24 గంటల తర్వాత దానిని గుడ్డలోవేసి వడకట్టి(గట్టిగా పిండి ),ఆ రసాన్ని ఒక సీసాలో భద్రపరచుకొని రోజూ తలకు రాస్తుంటే వెంట్రుకలు రాలవు. జుట్టు పెరుగుతుంది. ప్రపంచ సుందరి, ఈజిప్సియన్  రాణి క్లియోపాట్ర  ఈ విధానం అవలంభించేదట.

5.ముల్లంగిరసం ,ఉల్లిపాయలరసం కలిపి రాసి,మర్దన చేస్తుంటే జుట్టు పెరుగును.

6. జింక్ ఎక్కువగా ఉండే గుమ్మడి గింజలు, బీన్స్, నల్లనువ్వులు, లాంటివి ఆహారంగా తీసుకొంటే జుట్టు పెరుగును.

7. B12 విటమిన్, ఫోలిక్ యాసిడ్, జుట్టు రాలుటను నివారించును.

కొసమెరుపు B.P ని తగ్గించడానికి వాడే ట్యాబ్లెట్స్ లో వెంట్రుకలు పెరగడానికి దోహదపడే ఒక రకమైన ఔషధం (సైడ్ఎఫెక్ట్ గా ) ఉంది. అందుకనే వారికి జుట్టు బాగా పెరుగుతున్నదట.  

గమనిక: వయస్సు పైబడినవారికి ,ముసలి వారికి పై చికిత్సా విధానాలు సత్ఫలితాలనివ్వవు. వారు మంచి పోషకాహారం తీసుకొంటుంటే కొంతవరకు జుట్టు రాలుటను నివారించ వచ్చు.


  • విటమిన్ 'E' ఆయిల్, బాదం వంటి వాటితో స్కాల్ప్ పై మసాజ్ చేయండి.  
  • ఆయుర్వేద వైద్యంలో మీరు తినే ఆహార పదార్థాలు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి.
  • మిల్క్, నట్స్, హోల్ గ్రైన్స్ వంటి వాటిని తినండి.
తినే ఆహరం, ధ్యానం, అరోమాథెరపీ, ఆయిల్ మసాజ్ మరియు ఆయుర్వేద ఔషదాలు వంటి అన్ని కూడా జుట్టు రాలుటను తగ్గించే ఆయుర్వేద వైద్య శాస్త్రంలోకి వస్తాయి. మంచి ఫలితాలను పొందుటకు గానూ సంపూర్ణ విధానాలను అనుసరించాలి.





ఆయిల్ మసాజ్

  • స్కాల్ప్ ను ఆయిల్ లతో మసాజ్ చేయటం వలన జుట్టు మరియు స్కాల్ప్ కు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. రోజు కేవలం 5 నిమిషాల పాటూ మసాజ్ చేయటం వలన జట్టు రాలటం చాలా వరకు నియంత్రించబడుతుంది.

  • వెంట్రుకల మొదల్లకు బలం చేకూర్చటానికి గానూ విటమిన్ 'E' గల ఆయిల్ తో స్కాల్ప్ కు మాసాజ్ చేయండి.

  • కొబ్బరి మరియు బాద నూనెలు శక్తి వంతంగా జుట్టు రాలటాన్ని తగ్గిస్తాయి. దీనితో పాటుగా, పొడి మరియు పొలుసులుగా రాలే స్కాల్ప్ ను కూడా తగ్గిస్తాయి.

  • జుట్టు పలుచబడటాన్ని తగ్గించుటకు, హెర్బల్ సీరంతో స్కాల్ప్ ను మసాజ్ చేయండి. ఈ హెర్బల్ సీరాన్ని కనీసం వారానికి 3 ఆర్లు వాడటం వలన జుట్టు మొదల్లకు కావలసిన పోషకాలు అందించబండతాయి.

  • జుట్టు రాలటాన్ని తగ్గించే మరొక ఆయుర్వేదిక్ ఆయిల్- బ్రింగరాజ్ ఆయిల్. ఈ నూనెను నేరుగా మీ స్కాల్ప్ మరియు జుట్టుపై పోసి మసాజ్ చేసి కనీసం ఒక రాత్రి వరకు అలాగే ఉంచండి. తరువాత ఉదయాన శుభ్రమైన నీటితో కడిగి వేయండి.
ఆయుర్వేద చికిత్సలో తినే ఆహారాలు కూడా కీలకమే

  • జింక్, విటమిన్ 'C', విటమిన్ 'B' కాంప్లెక్స్, సల్ఫర్ వంటి శరీరానికి అవరమయ్యే పోషకాలను అధికంగా కలిగి ఉండే ఫాటీ ఆసిడ్ లను ఎక్కువగా తీసుకోండి. ఇవి వెంట్రుకల మొదల్లకు బలాన్ని చేకూరుస్తాయి.

  • మొలకెత్తే విత్తనాలు, పాలు, బటర్, నట్స్, సోయా బీన్స్ మరియు గ్రైన్స్ వంటివి జుట్టు రాలటాన్ని తగ్గిస్తాయి.

  • ఆరోగ్యకర మరియు బలమైనన్ వెంట్రుకల కోసం కలబంద రసం అవసరమని చెప్పవచ్చు. 3 నెలలకు రెండు సార్లు కలబంద రసాన్ని తాగటం చాలా మంచిది.

  • జుట్టు రాలుటను తగ్గించే శక్తివంతమైన ఔషదంగా యోఘర్ట్ ను పేర్కొనవచ్చు. రోజు యోఘర్ట్ తీసుకోవటం వలన జుట్టు రాలటం తగ్గుటను మీరు గమనించవచ్చు.

  • పండ్లు, కూరగాయలు, పచ్చని ఆకుకురాలను మీ ఆహార ప్రణాళికలో కలుపుకోండి. వీటిలో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది కావున జుట్టు రాలటం తగ్గుతుంది.

  • మెగ్నీషియం, కాల్షియం, నువ్వులు వంటివి జుట్టు రాలటాన్ని తగ్గిస్తాయి.
జుట్టు రాలటాన్ని తగ్గించే ఇతర ఆయుర్వేద ఔషదాలు

  • ఆయుర్వేద ఔషదాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించటమే కాకుండా, జుట్టు రాలుటను తగ్గిస్తాయి. రోజ్మేరీ, స్టింగింగ్ నేటిల్, బిర్చి మరియు హర్సేటల్ వంటివి ఉపయోగపడే ఇతర ఆయుర్వేద ఔషదాలు అని చెప్పవచ్చు. వీటిని నేరుగా స్కాల్ప్ కు అప్లై చేయటం వలన జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది.

  • లికోరైస్ కూడా జుట్టు రాలుటకు వ్యతిరేఖంగా పని చేసే ఔషదంగా చెప్పవచ్చు. పడుకోటానికి ముందు లికోరైస్ సారాన్ని స్కాల్ప్ పై మసాజ్ చేయండి.

  • మార్ష్మల్లౌ మరియు బర్డాక్ టీ జుట్టుకి మంచివి అని చెప్పవచ్చు.

  • మినపప్పు, బ్లాక్ బీన్స్ మరియు మెంతులను కలిపి ఒక పేస్ట్ ల చేయండి. ఈ మిశ్రమం ఒకే విధంగా అయ్యే వరకు వేడి చేయండి. ఈ మూడు మిశ్రమాలను పూర్తిగా కలిసే వరకు గ్రైండ్ చేయండి. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ కి అప్లై చేసి, 30 నిమిషాల తరువాత కడిగి వేయండి. ఈ పద్దతిని వారంలో రెండు లేదా మూడు సార్లు అనుసరించి మార్పులను 
  • గమనించగలరు 
  • ధన్యవాదములు 🙏
  • మీ నవీన్ నడిమింటి 
  • విశాఖపట్నం 
  • 919703706660