పాదాలు వాచుకోవడాన్ని పాదాల వాపు అని కూడా పిలుస్తారు. అది ఎక్కువ ద్రవం లేదా నీరు పేరుకుపోవడానికి సంకేతం. పాదాలు, చీలిమండలలో నొప్పి లేనట్టి వాపు సాధారణ సమస్య. ఇది ప్రధానంగా వయసు మళ్లిన వారిలో మరియు గర్భిణులలో కనిపిస్తుంది. వాపు దానికి అది ఒక వ్యాధి కాదు. అయితే అది వ్యాధి కారకానికి ముఖ్యమైనట్టి సంకేతం లేదా సూచన కావచ్చు. వాపునకు దారితీస్తున్న జబ్బు ఆధారంగా మరికొన్ని జబ్బులు కనిపించవచ్చు సంపూర్ణ బ్లడ్ కౌంట్, కాలేయం, కిడ్నీ పనితీరు, ఎక్స్ రే వంటి ఇమేజింగ్ పరిశీలనల .ద్వారా , లేబరేటరీ జబ్బు నిర్ధారణ పరీక్షల ఫలితాల ద్వారా జబ్బు నిర్ధారణ జరుగుతుంది. ఇట్టి వాపునకు వ్యాయామం, బరువు తగ్గించుకోవడం , పెచ్చుపెరిగే జబ్బులకు మందులు , ఆహారంలో మార్పులు మరికొన్నింటి ద్వారా చికిత్స నిర్వహిస్తార
పాదాల వాపు యొక్క లక్షణాలు
వాపు పాదమునకు గానీ లేదా చీలమండ ప్రాంతానికి గాని సంబంధించి నొప్పి లేకుండా ఉండి కాలముతో పాటు నొప్పి పెరిగితే , చర్మం రంగు మరియు చర్మం నిర్మాణంలో మార్పు రావచ్చు. జబ్బుఇతర లక్షణాలు చర్మం ఉష్ణోగ్రత పెరగడం, తాకినప్పుడు వేడి స్పర్శ కలగడం, పుండు ఏర్పడటం మరియు చీము ఉత్సర్గం వంటివి.
- చర్మాన్ని వేలుతో క్రిందికి నొక్కినప్పుడు గుంట లేదా మాంద్యం ఏర్పడుతుంది, తర్వాత వేలును తీసినప్పుడు గుంటమూతబడి చర్మం వాపుతో కూడిన యధాస్థితికి వస్తుంది.
- షూ మరియు సాక్స్ తీసిన తర్వాత పాదాల చర్మంపై కనిపించే చిన్న గుంటలు ( మాంద్యానికి గురైనట్టి ప్రాంతాలు) వాపునకు ముఖ్యమైన సంకేతం
- గుంటలు నల్లగా ఉండి వాటి చుట్టూ గల చర్మం సాధారణ చర్మం రంగు కంటే లేతగా ఉంటుంది.
పాదాల వాపు యొక్క చికిత్స
చికిత్స
తేలిక అయిన లేదా చిన్నస్థాయి వాపు (ఎడెమా) దానికదే వాసి కాగలదు, మీరు మీ వాపునకు గురైన పాదాన్నిగుండె స్థాయికంటె హెచ్చు ఎత్తుకు ఎత్తగలిగితే నయం కాగలదు. పాదాలలో వాపు ఆరోగ్య సమస్యల కారణంగా కానట్లయితే దానికి మీ డాక్టరు సలహాతో సరళమైన జీవన సరళి మార్పులతో దానికి చికిత్స కల్పించవచ్చు, అయితే వాపు ఏదయినా ఆరోగ్యానికి సంబంధించిన సమస్య కారణంగా ఏర్పడితే, చికిత్సకు జబ్బు పూర్తి వివరాలు, సంబంధిత పరిశోధనలు, ఉపయోగిస్తున్న మందులు అలాగే వాటితోపాటు జీవన విధానంలో మార్పుల పరిశీలన అవరరమవుతుంది.
- ఎక్కువ సమయం నిలబడిన కారణంగా వాపు ఏర్పడినప్పుడు దానిని విశ్రాతి తీసుకోవడం ద్వారా లేదా పాదాలను ఎత్తులో ఉంచడం ద్వారా నయం చేసుకోవచ్చు. పడుకొన్నప్పుడు మీ కాళ్లను తలదిండుపై గుండె కంటె ఎక్కువ ఎత్తులో ఉండే విధంగా ఉంచుకోండి..
- వాపు వేడి వాతావరణం కారణంగా ఏర్పడితే మీరు దానిని సులభంగా నివారించవచ్చు, దానికోసం వేడి వాతావరణానికి దూరంగ ఉండండి. మీ పాదాలను చల్లగా ఉంచుకోంది, దీనికై 15-20 నిమిషాలపాటు మీ పాదాలను చల్లని నీటిలో ఉంచండి.
- పాదాల వాపు గుండె జబ్బుల కారణంగా ఏర్పడితే, లేదా ద్రవం నిలవడం వల్ల జరిగితే, మీ డాక్టరు ఉప్పు వాడకాన్ని నియంత్రిఛమని సలహా ఇవ్వవచ్చు.(తక్కువ ఉప్పుతో ఆహారం) మరియు ఎక్కువగా నీరు త్రాగమని సూచించవచ్చు.
- మీ శరీరపు బరువు ఎక్కువ కావడం వల్ల కూడా పాదాల వాపు కావచ్చు. ఈ సందర్భంగా మీ డాక్టరు తగిన ఆహారాన్ని తీసుకోమని, వ్యాయామం చేయమని చెప్పవచ్చు. ఇవి శరీరపు బరువును తగ్గిస్తాయి.
- కంప్రెషన్ స్టాకింగులు అరుదుగా ప్రయోజనం కల్పిస్తాయి. తీవ్రమైన వాపు కలిగినవారు సాధారణంగా వాటిని సహించలేరు.
- గర్భం కారణంగా వాపు ఏర్పడితే, ఎలాంటి చికిత్స అవసరం ఉండదు. అయితే తీవ్రమైన వాపును నిర్లక్ష్యం చేయకూడదు. అది ఎక్లాంసియా (మూర్చ) కారణంగా ప్రబలి ఉండవచ్చు.
- వాపు ఉన్న చోట వీలయిన వెంటనే ఐసును 15- 20 నిమిషాలపాటు ఉంచండి. తర్వాత ఈ ప్రక్రియను మూడు నాలుగు గంటలకు ఒకమారు కొనసాగించంది.. ఈ చర్య తాత్కాలిక ఉపశమనం కలిగిస్తుంది.
- వాపు తీవ్రంగా ఉంటే ఔషధాలతో చికిత్స జరపవలసి ఉంటుంది. . మీ డాక్టరు మీకు మందులు సూచిస్తారు. అవి వాపు తగ్గించడానికి శరీరం లోని అదనపు నీటిని తొలగించడానికి సహాయపడే డైయీరెటిక్స్ వంటివి. అది రక్తప్రసరణ గుండెపోటు వల్ల జరిగి ఉండవచ్చు.
- తీవ్రమైన గాయాల సందర్భంగా డాక్టరు బలవంతంగా తోయడం, శస్త్రచికిత్స మరియు ప్రక్రియలు మరియు హెచ్చు నొప్పి నివారణకై విశ్రాంతి సూచించవచ్చు
- నొప్పితో కూడిన వాపు సందర్భంగా మీ డాక్టరు నొప్పి నివారణ మాత్రలను సూచించవచ్చు. అవి పారసెటమాల్ మరియు ఇబుప్రొఫెన్ వంటివి. తర్వాత విశ్రాంతి సూచించవచ్చు
- హెచ్చు మోతాదులో నీరు త్రాగడం కూడా సహకరిస్తుంది
- రక్తం స్థాయి తక్కువ మరియు వేధించే గుండె జబ్బులకు (హెచ్చుస్థాయి రక్తపోటు, హై కొలస్ట్రాల్ వంటివి) మీ డాక్టరు ఔషధాలు సూచించవచ్చు. తక్కువ ప్రోటీన్ ఆహారం, క్యాల్షియం మరియు విటమిన్ డి పోషకాంశాలు, ఆరోగ్యకరమైన జీవన సరళిని కూడా సూచించవచ్చు
- వాపు ఔషధాల కారణంగా ఏర్పడినపుడు మీ డాక్టరు మందుల స్థాయిని తగ్గించవచ్చు లేదా మందులను నిలుపవచ్చు
జీవన సరళి/ విధానం నిర్వహణ
దైనందిన జీవితంలో కొన్ని మార్పులు అవసరం కావచ్చు
- వ్యాయామం
వ్యాయామం హెచ్చు రక్తప్రసారానికి వీలు కల్పిస్తుంది మరియు శోషరస ప్రవాహాన్ని మెరుగు పరుస్తుంది దీనితో మీ డాక్టరు లేదా ఫిట్ నెస్ నిపుణుని సలహాతో కనీసం రోజుకు ఒక వ్యాయామం చేయడం ప్రారంభించండి వాకింగ్ లేదా జాగింగ్ వంటి ఏదైనా ఒక వ్యాయామాన్ని క్రమం తప్పకుండా చేయండి - ఎత్తులో ఉంచడం
పాదాలను ఎత్తులో ఉంచడం ప్రక్రియ సిరలలో పీడనాన్ని తగ్గించి సిరల వడపోతను తగ్గిస్తుంది. ఇది రక్తప్రసారాన్ని పెంచుతుంది - స్థాయిల వారీ వెలుపలి పీడనం
స్థాయిల వారీ వెలుపలి పీడనం కేశనాళిక వడపోతను తొలగించి, సిరల వ్యవస్థలో ద్రవాన్నిసరిగా ఉంచుతుంది. - శోషరస మర్దనం
శోషరస మర్దనం శోషరస మార్గాన్ని సరిపరచి సవ్యంగా ప్రవహించడానికి రక్తప్రసారాన్ని మెరుగు పరచడానికి సహకరిస్తుంది
పాదాల వాపు అంటే ఏమిటి?
పాదాలలో వాపు అనగా పాదాలలో ద్రవం పేరుకుపోవడం. పాదం, చీలమండ మరియు కాలు వాపు గురించి చెప్పడానికి నొప్పి కలిగిన చోట వాటిని వేలితో నొక్కినప్పుడు గుంట పడుతుంది.
పాదాల వాపు చాలా సాధారణమైన జబ్బు. మీరు ఎక్కువ సమయం నిలబడి ఉంటే లేదా ఎక్కువ దూరం నడిస్తే జబ్బుకు చికిత్స అవసరం లేదు. అయితే, వాపు ఎక్కువ కాలం ఉండి, ఇతర లక్షణాలతో కలిసి కనిపిస్తే, అంటే శ్వాసక్రియకు ఇబ్బంది, నొప్పి లేదా అల్సర్లు కనిపిస్తే అవి జబ్బు తీవ్రరూపంలో ఉన్నదనడానికి సంకేతం.
మీ పాదాలలో ఒకటిగానీ లేదా రెండు కూడా గానీ వాచుకొంటే అది అసౌకర్యానికి, నొప్పికి, దైనందిన కార్యకలాపాలు జరపడానికి ఇబ్బంది కలిగిస్తుంది. మీరు గర్భంతో ఉన్నట్లయితే పాదాలు సహజంగా వాపునకు గురవుతాయి. ఎందుకంటే గర్భిణీ స్త్రీ శరీరంలో సాధారణ స్త్రీ కంటే హెచ్చుగా నీరు నిల్వ ఉంటుంది. కొన్ని సందర్భాలలో మీరు ఎక్కువ సమయం నిలబడి ఉంటే, రోజు చివరన నొప్పి ఎక్కువగా అనిపిస్తుంది. అది తల్లికి, లేద శిశువుకు తీవ్రమైన సమస్య కానప్పటికీ తల్లికి అసౌకర్యంగా ఉంటుంది.
పాదాలలో వాపును కేశనాళిక వడపోతలో పెరుగుదలకు పోల్చవచ్చు. ఇది రక్తకేశనాళికలలోని ద్రవాన్ని వెలుపలకు పంపివేస్తుంది: శోషరస పారుదలలో తగ్గుదల మీ శరీరంలో శోషరస ప్రవాహాన్ని అడ్దుకొంటుంది. లేదా ఈ రెండు కూడా జరగవచ్చు. పాదాలలో వాపునకు పెక్కు జబ్బులు కారణమయినప్పటికీ, మీ డాక్టరుచే వివిధ కారణాలకు వివరమైన పరిశోధనతో సముచితమైన జబ్బు నిర్ధారణ అవసరం . వాపునకు నిర్ధారపూర్వకమైన కారణం లేనపుడు సాధారణంగా చికిత్స అవసరం ఉండదు. అయితే వాపునకు నిర్ధారిత కారణం ఉన్న రోగులలో, పాదాల వాపు కొన్ని ఔషధాల కారణంగా వచ్చినట్లు తెలిస్తే, సముచితమైన చికిత్స అవసరమవుతుంది.. దీనివల్ల పాదాల వాపు మందుల కారణంగా ప్రబలి ఉంటే లేదా రోగలక్షణం నిర్ధారణ అయితే డాక్టరును సంప్రతించడం అవసరం
పాదాల వాపు కొరకు అలౌపతి మందులు
పాదాల వాపు ఈ అలౌపతి మందులు అన్ని మీ ఫ్యామిలీ డాక్టర్ సలహాలు మేరకు వాడాలి మీ ఏజ్ బట్టి మెడిసన్ డోస్ ఇత్తారు
Medicine Name | Pack Siz | |
---|---|---|
Telsartan H | Telsartan H 40 Tablet | |
Telma H | Telma H Tablet | |
Co Diovan | Co Diovan 160 Mg/25 Mg Tablet | |
Tazloc Trio | Tazloc Trio 40 Tablet | |
Hopace H | Hopace H 2.5 Capsule | |
Lasix | LASIX 150MG INJECTION 15ML | |
Polycap | Polycap Capsule | |
Frumide | Frumide Tablet | |
Misart H | MISART H 40/12.5MG TABLET 10S | |
Frumil | Frumil 40 Mg/5 Mg Tablet | |
Missile H | Missile H 40 Mg/12.5 Mg Tablet | |
Cosart H | Cosart H Tablet | |
Amifru | Amifru Plus Tablet | |
Ngsart CH | Ngsart CH 40 Tablet | |
Lanxes H | Lanxes H Tablet | |
Exna K | Exna-K Tablet | |
Ngsart H | Ngsart H Tablet | |
Lara H | Lara H Tablet | |
Omen Trio | Omen Trio 20/12.5 Tablet | |
Bisocar Ht | Bisocar Ht 2.5 Mg/6.25 Mg Tablet | |
Ozotel H | Ozotel H Tablet | |
Lorsave H | Lorsave H Tablet | |
Concor Plus | Concor Plus Tablet | |
Relmisart H | Relmisart H Tablet |
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి