25, నవంబర్ 2020, బుధవారం

మొలలు సమస్య ఉన్న వాళ్ళు కు తీసుకోవాలిసిన జాగ్రత్త లు అవగాహన ఈ లింక్స్ లో చుడండి

మొలలు సమస్య ఉన్న వాళ్ళు కు నవీన్ నడిమింటి ఆయుర్వేదం సలహాలు  (Piles)

                 మొలలు (Piles)
               మలబద్ధకం వలన వస్తుంది.
 
1. ఆసనం వద్ద కొంతమందికి ఎండుమొలలు వస్తాయి.
2. కొంతమందికి రక్తం స్రవించే మొలలు వస్తాయి.

       ఈ వ్యాధిగ్రస్తులు కూర్చోలేరు, కొంత మందికి   ఈ      మొలలు బయటకు ఉంటాయి,          కొంతమందికి లోపలి వుంటాయి.రెండవ రకం లోపల వుంటాయి. ఇవి చాలా ప్రమాదకరం/
 
        పెద్ద కుంకుడు కాయల పై బెరడు    100 gr
 
          కుంకుడు పెచ్చులను కల్వంలో వేసి కొద్దిగా నీళ్ళు కలుపుతూ మెత్తగా గుజ్జుగా నూరాలి.తీసి పళ్ళెంలో పెట్టుకొని శనగ గింజలంత మాత్రలు కట్టి, బాగా విస్తారంగా గాలి తగిలే చోట ఆరబెట్టాలి.నాలుగైదు రోజులలో 
గట్టిగా రాళ్ళ లాగా అవుతాయి.
 
           ఎండు మొలలతో బాధ పడేవాళ్ళు మాత్రలను మజ్జిగతో వాడాలి.. రక్త మొలల వాళ్ళు మంచి నీటితో 
వాడాలి.
 
         ఎక్కువ సేపు ప్రయాణించే వాళ్లకు,మాంసం , మసాలాలు ఎక్కువగా వాడే వాళ్లకు,రాత్రి ఆలస్యంగా 
భోంచేసే వాళ్లకు,ఎప్పుడు -ఎక్కువ సేపు కుర్చీలలో కూర్చునే వాళ్లకు ఈ వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశం వున్నది.
 
          పూటకు ఒక మాత్ర చొప్పున మూడు పూటలా ఆహారానికి అరగంట ముందు వేసుకోవాలి.
 
         మూత్రాన్ని ఎడమ చేతిలో పోసుకొని ఆ మూత్రంతోనే మొలలను కడుగుతూ వుంటే 40 రోజులలో తగ్గి పోతాయి.
 
       అర్శమొల్ల నివారణకు భరద్వాజ లేహ్యము    
 
  కరక్కాయ పై బెరడు పొడి        ------ 30 gr
  తాని కాయల పై బెరడు పొడి    ------ 30 gr
 ఉసిరి కాయల పై బెరడు పొడి  ------- 30 gr
   నువ్వుల నూనె          ------- 30 gr
           తేనె                ------- 180 gr
 
          అన్నింటిని  ఒక్కొక్కటిగా కల్వంలో వేసి మెత్తగా నూరాలి.తడి తగలని సీసాలో భద్ర పరచాలి.
 
                        పెద్దలకు         --------- 10 gr 
                        పిల్లలకు         ---------  5 gr
 
         ఉదయం, రాత్రి ఆహారానికి గంట ముందు నోట్లో వేసుకొని చప్పరించాలి.
 
ఉపయోగాలు:--  ఉదరంలో పేరుకుపోయిన మలినాలు బహిష్కరింప బడతాయి.ఆకలిని కలుగ జేస్తుంది.వాత ,పిత్త , కఫ సమస్యలు నివారించ బడతాయి.అన్ని సమతౌల్యము చేయ బడతాయి. అర్శ మొలలు తొలగించ బడతాయి.అత్యుష్ణము,అతి చల్లదనము తొలగింప బడతాయి.
 
                               పెరిగిన, గుచ్చుకుంటున్న మొలలు --నివారణ                     
 
                     లేపనము (Ointment)
 
                     ఆముదము          ------- 100 gr    (ఆముదము = ఆసాంతము ముదమును కలిగించునది)
                     తేనె మైనము        -------   50 gr
                     ముద్ద కర్పూరము  ------    10 gr
 
       ఒక చిన్న పాత్రలో ఆముదాన్ని పోసి  దానిలో తేనెమైనాన్ని వేసి స్టవ్ మీద పెట్టి మైనం కరిగే వరకు చిన్న మంట మీద వేడి చేసి వడపోయ్యాలి దీనిలో మెత్తగా నూరిన కర్పూరం పొడిని కలపాలి. ఫ్యాను కింద పెడితే కొంత సేపటికి చల్లారి గడ్డ కడుతుంది .Ointment  తయారవుతుంది సీసాలో భద్ర పరచాలి. ఇది ఎంత కాలమైనా నిల్వ వుంటుంది.
 
      మొలలు బయటకు వచ్చి వుంటే వాటికి నేరుగా పూయవచ్చు లేదా దూదికి పూసి అంటించవచ్చు.
లోపలి మొలలైతే వేలితో మందును ఆసనం లోపల పూయాలి.

                      మొలలు --నివారణ                                                              
                  సుగంధ పాల వేర్లు    ---- 50 gr
                  నీళ్ళు                     ---- పావు లీటరు

    సుగంధ పాల వేర్లను కడిగి చితగ్గొట్టి నీళ్ళలోవేసి మూత పెట్టి రాత్రంతా నాననివ్వాలి. ఉదయం స్టవ్ మీద పెట్టి 50 గ్రాముల కషాయం మిగిలేవరకు కాచాలి.

         సుగంధ పాల వేర్ల రసం     ---- 50 gr
                  ఉల్లిపాయల రసం   ---- 30 gr
                  కొబ్బరి నూనె         --- 20 gr

     ఈ మూడింటిని ఒక గ్లాసులో పోసి అన్ని కలిసేట్లు బాగా కలపాలి. దీనిని పెద్దలు రెండు, మూడు భాగాలుగా చేసి రోజుకు రెండు మూడు సార్లుగా తాగాలి. పిల్లలు వయసునుబట్టి రెండు స్పూన్లు లేక మూడు టీ స్పూన్ల మందును వాడాలి.

     ఇది రక్తం కారే మొలలను నివారిస్తుంది.  ఈ వ్యాదివలన శరీరంలో ఏ భాగము నుండి రక్తం కారుతున్నా దీనిని వాడవచ్చు.

     గుదస్నానం:-- గుడ్డను చల్లటి నీటిలో తడిపి వెయ్యాలి. మట్టి పట్టి గోచీ లాగా పెట్టుకోవాలి.
     ఉదరంలో అగ్ని మాంద్యం, అజీర్ణం మొదలైన వాటి వలన వస్తుంది. దీని వలన రక్తము, మాంసము, కొవ్వు పాడవుతాయి. దీని వలన గుదమునకు రెండు వైపులా అధిక మాంస భాగాలు (అర్శ మొలలు) ఏర్పడతాయి.

     గుప్పెడు శుభ్రం చేసిన నువ్వులను ఉదయాన్నే బాగా నమిలి తిని ఒక గ్లాసు చల్లటి నీళ్ళు తాగాలి.దీనివలన క్రమేపి తగ్గి పోతాయి.

    కరక్కాయ పెచ్చులను కొద్దిగా నెయ్యి వేసి వేయించి దంచి పొడి చేసి పెట్టుకొని దానిలో బెల్లం వేసి దంచి నిల్వ చేసుకోవాలి.  ఆహారానికి ముందు పది గ్రాముల ముద్దను నమిలి మింగాలి.

ఉత్తరేణి ఆకుల పొడి                 ---- 50 gr
ఉత్తరేణి గింజల పొడి                 ---- 50 gr
             కలకండ                    ---- 50 gr

      అన్నింటిని కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి.
      అర టీ స్పూను పొడిని మజ్జిగలో కలుపుకొని తాగుతూ వుంటే మొలల ద్వారా కారే రక్తం ఆగి పోతుంది.

పసుపు
దోరగా వేయించిన వాము పొడి

      రెండింటిని సమానంగా కలిపి తగినంత నీళ్ళు కలిపి నూరి దానిని మొలలపై అంటించి గోచి పెట్టుకోవాలి.
పైవిధంగా ఒక రోజు, మట్టి పట్టి ఒక రోజు వేసుకుంటే మొలలు తగ్గి పోతాయి.

       రక్త  మొలల నివారణకు అతిబల యోగం

      అతిబల ఆకు (తుత్తిరి బెండ ఆకు) ఇగుళ్ళు తెచ్చి సన్నగా తరిగి ఒక కల్లు ఉప్పు వేసి నీళ్ళు చల్లి ఉడకబెట్టాలి. బాణలిలో ఒక స్పూను ఆముదం వేసి ఉడికిన ఆకును దానిలో వేసి చిటికెడు మిరప్పొడి చల్లాలి. ఇది కొంచం వగరుగా వుంటుంది. దీనిని రెండు పూటలా పరగడుపున తినాలి. ఇది తిని నీళ్ళు తాగి ఒక అరటి పండు తినాలి. ఈ విధంగా మూడు రోజులు చేయాలి

పత్త్యం:-- మందు తిన్న మూడు రోజులు, ఇంకొక మూడు రోజులు (పై పద్యం )వుండాలి  మాసాహారం తినకూడదు.

కారం, పులుపు తగ్గించి తినాలి. చలువ చేసే పదార్ధాలను ఎక్కువగా వాడుకోవాలి.

    ఇది రక్తం, చీము పడే వాళ్లకు మాత్రమే 

     ఆముదపు చెట్టు యొక్క లేత చిగుళ్ళు తాజాగా తెచ్చి ఒక కర్పూరం బిళ్ళ వేసి నూరి ముద్దను బిళ్ళగా చేసి మొలల మీద అంటించాలి. ఊడిపోకుండా గోచి పెట్టుకోవాలి.  20 రోజులు వాడితే క్రమేపి తగ్గుతుంది.
     కాని అన్నింటికన్నా ముఖ్యంగా మలబద్ధకం నివారించబడాలి.

 
        ఈ వ్యాధి మాంసాహారం ఎక్కువగా తినే వాళ్లకు,పీచు పదార్ధాలు తక్కువగా తినే వాళ్లకు
వస్తుంది.  దీనిని.అర్శస్సు  అంటారు.
లక్షణాలు;-- మలద్వారం వద్ద మంటగా వుండడం, మలవిసర్జన సమయంలో నొప్పి, రక్తం పడడం జరుగుతుంది.
ఆహారం:--
     పుల్ల కందను చింత పండు పులుసులో నానబెట్టి రెండవ రోజు తినాలి. దీని వలన రక్తం స్రవించడం తగ్గుతుంది
 
రాత్రి పూట రెండు స్పూన్ల త్రిఫల చూర్ణం నీటిలో కలుపుకొని తాగుతూ వుటే మా,అం మెత్త బడుతుంది.
 
    ముద్దబంతి పూలను   నూరి రసం తీసి రాత్రి పూట పెరుగులో కలుపుకొని తాగాలి.
 
   పీచు పదార్ధాలు ఎక్కువగా వున్న ఆహార పదార్ధాలను ఎక్కువగా తినాలి, మొలకెత్తిన గింజలను తినాలి.
   మాంసాహారాన్ని దాదాపుగా తగ్గించాలి. నీళ్ళు ఎక్కువగా తాగుతూ వుండాలి.

                      రక్త మొలలు --- నివారణ                                           
 
సుగంధ పాల వేర్ల కషాయం               --- 50 gr
                    కొబ్బరి నూనె            --- 30 gr
                    పెద్ద ఉల్లి గడ్డ            ---  1
                          చక్కెర               --- 1, 2 స్పూన్లు
                            నీళ్ళు              --- ఒక గ్లాసు
 
    ఒక గిన్నెలో నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి  వాటిలో సుగంధపాల వేళ్ళను వేసి పావు  భాగానికి వచ్చేంతవరకు మరిగించాలి. వడకట్టాలి. ఎర్రని కషాయం వస్తుంది. దీనిని తప్పక చల్లార్చాలి. వేడిగా తాగకూడదు. దానిని ఒక గ్లాసులో పోసుకోవాలి. దానిలో కొబ్బెరనూనే, ఉల్లిగడ్డ రసం, చక్కెర కలపాలి. దీనిని ఆహారానికి గంటముందు ఉదయం, సాయంత్రం సేవించాలి.
 
    ఇది అతి వేడిని, పైత్యాన్ని తగ్గిస్తుంది.
 
     మధుమేహం వున్నవాళ్ళు చక్కెర లేకుండా తాగవచ్చు.
 
ఒకటి, రెండు రోజులలో రక్త మొలల సమస్య తగ్గిపోతుంది.
     కారం, పులుపు, అరగని పదార్ధాలు, ఊరగాయలు తినకూడదు. సులభంగా జీర్ణమయ్యే పదార్ధాలను తినాలి.


బంతి ఆకులు                            ----- 20 gr
వేప ఆకులు                              ----- 50 gr
నల్ల ఉప్పు పొడి                         ----- 30 gr
చిన్న కరక్కాయల పొడి              ----- 50 gr
 
        అన్నింటిని కల్వంలో వేసి మెత్తగా నూరి రేగు పందంతా గోలీలు చేసి నీడలో ఆరబెట్టాలి. బాగా ఎండిన తరువాత గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.
 
        ప్రతి రోజు ఒక గోలి చొప్పున వాడాలి.

           దానిమ్మ చెట్టు బెరడు తెచ్చి కడిగిఒక కప్పు  నీళ్ళలో వేసి కషాయం కాచి వడకట్టి  దానిలో అర టీ స్పూను          
శొంటి పొడిని కలిపి తాగాలి. .

  Anus  వద్ద ఒత్తిడి పెరగడం వలన ఇవి బయటకు వస్తాయి.
కారణాలు ;--  మలబద్దకము ముఖ్య  కారణం.  తరచుగా విరేచనాలు కావడం వలన,  గర్భిణి స్త్రీలలో సరైన పద్ధతిలో డెలివరి  కాక పోవడం వలన కూడా ఏర్పడతాయి.

      " మజ్జిగ  100 రోగాలను తగ్గిస్తుంది",    మొలల వ్యాధిలో మజ్జిగ దివ్యమైన ఔషధం

        కరక్కాయ పెచ్చులను నేతిలో వేయించి దంచి పొడి చేసుకొని నిల్వ చేసుకోవాలి.  ఈ పొడిని మజ్జిగలో గానిగోరువెచ్చని నీటిలో గాని  కలిపి తీసుకుంటూ వుంటే తగ్గుతుంది.

       కంద గడ్డ చాలా మంచిది. దీనిని కూరగా గాని,  లేహ్యం లాగా గాని వాడుకోవచ్చు.

      ఫైల్స్  వున్న  ప్రాంతంలో కొబ్బరి నూనె గాని, ఆముడంగాని పూస్తూ వుండాలి.


     మలబద్ధకం వలన ఎక్కువగా ముక్కడం, రోజులో ఎక్కువసేపు కూర్చోవడం  వంటి కారణాల వలన వస్తుంది. 
ఇది అంటువ్యాధి కాదు. వచ్చిన తరువాత పోవడం  చాలా కష్టం. ఆహారపు జాగ్రత్తలు పాటిస్తే కొంత వరకు మందులు పని చేస్తాయి.
 
      ఎకువగా ప్రయాణం చేయడం, కర్మాగారాల్లో పని చేయడం, వేడి చేసే వస్తువులు తిడం వలన వలన అసలు తగ్గవు

1. కరక్కాయ పెచ్చులు
    బెల్లం

    శుద్ధి చేసిన గోమూత్రం లేదా గోఅర్కములో కరక్కాయ పెచ్చులను ఒక రోజంతా నానబెట్టాలి.  తీసి ఆ పెచ్చులకు సమానంగా బెల్లాన్ని కలిపి కల్వంలో వేసి నూరి బటాణి గింజలంత మాత్రలు కట్టాలి.

    పూటకు ఒక్క మాత్ర చొప్పున  మూడు పూటలా ఆహారానికి  గంట ముందు తీసుకోవాలి.

2. వాము పొడి                   ---- ఒక టీ స్పూను
    మజ్జిగ                         ---- ఒక గ్లాసు  ( పెరుగుతో  వాడితే సమస్య పెరుగుతుంది ).
    సైంధవ లవణం              ---- రెండు చిటికెలు

          అన్నింటిని కలుపుకుని ఆహారానికి తరువాత తీసుకోవాలి.

సూచన :--  రెండు పద్ధతులను పాటించాలి.

                     రక్త మొలలు --నివారణ                    

     అసలు కారణం మలబద్ధకం. ఎక్కువగా ముక్కడం వలన దాని తాలుకు ఒత్తిడి వలన మొలలు ఏర్పడతాయిఅవి చిట్లినపుడు రక్తస్రావం జరుగుతుంది.  విరేచనం తరువాత కూడా రక్త స్రావం జరుగుతుంది. నీరసంగా వుండి చర్మం ఎండిపోయి, పొడిబారినట్లుగా వుంటుంది. కీళ్లలో నొప్పులు వుంటాయి. క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా వున్నాయి.

      పిత్తప్రకోపము, రక్తప్రకోపము కలిగించే ఆహారాన్ని సేవించరాదు. ఉదాహరణకు  కారం, క్షార పదార్ధాలుమసాలా పదార్ధాలు, మద్యపానం, ఎండలో ఎక్కువగా తిరగడం, వేడి ఎక్కువగా వున్నచోట వుండడం మొదలినవిముఖ్య కారణాలు.

     కమ్మ గగ్గెర లేదా రుద్రజడ లేదా సబ్జా  ( అసిమం బాసిలికం )

     ఒక గుప్పెడు సబ్జా ఆకులను మెత్తగా, ముద్దగా నూరాలి. దానిలో పావు భాగం పసుపు కలిపి మరలా నూరాలి. ఈ ముద్దను మొలలపై కడితే నాలుగైదు రోజులలో రక్త స్రావం ఆగిపోతుంది.

     కొడిశపాల బెరడు లేదా విత్తనాలను ముద్దగా నూరి రెండు స్పూన్ల వెన్న కలిపి మూడు పూటలా నాలుగైదురోజులు కడుపులోకి వాడితే తీవ్ర సమస్య కూడా నివారింప బడుతుంది. .
               
           మొలల ద్వారా రక్తం,  చీము  పోతుంటే
     
       తిత్తిరి బెండ ( అతిబల ) చిగుళ్ళను  తెచ్చి సన్నగా తరిగి  రెండు ఉప్పు రాళ్ళను వేసి  కొద్దిగా నీళ్ళు కలిపి ఉడికించాలి.    బాణలిలో  ఒక స్పూను ఆముదం వేసి   కాగానిచ్చి దానిలో ఉడికించిన ఆకును వేయాలి. చిటికెడు మిరప్పొడి చల్లాలి   

       ఇది కొంచం వగరుగా వుంటుంది. దీనిని తిని నీళ్ళు తాగి ఒక అరటి పండు తినాలి.  ఈ విధంగా ఉదయం, సాయంత్రం  పరగడుపున  తీసుకోవాలి.  ఈ విధంగా మూడు రోజులు రెండు పూటలా వాడాలి.  
       మందు వాడిన మూడు రోజులు, మరొక మూడు రోజులు  అనగా ఆరు రోజులు పత్యం  వుండాలి.
        ఆరు రోజులు ఎలాంటి మాంసాహారం తినకూడదు.  కారం,  పులుపు తగ్గించి వాడాలి.  చలువ చేసే పదార్ధాలను ఎక్కువగా వాడుకోవాలి.
        మొలల ద్వారా రక్తం  చీము  పడే వాళ్ళు మాత్రమే దీనిని వాడాలి.

                అర్శ మొలలు -- నివారణ 

          మల  ద్వారము లోని  రక్త నాళాలు ఉబ్బి  రక్తపు గడ్డలు అడ్డుగా ఏర్పడతాయి.  దీనినే మొలలు అంటారు.
 
లక్షణాలు :-- మొలలు లోపలి వైపు వున్నపుడు  పైన దురద,  మల ద్వారం వద్ద వాపు,  కొంచం ద్రవం వచ్చినట్లువుండడం వంటి లక్షణాలు వుంటాయి. 

కారణాలు :--ముఖ్యంగా  మలవిసర్జన  సమయం లో బలవంతంగా ముక్కడం వలన  మొలలు వస్తాయి.
 
  కొంత మంది ఏదో లోపల మిగిలి ఉన్నట్లుగా భావించి  ఎక్కువసేపు కూర్చోవడంజరుగుతుంది.      
కొంతమందికి గర్బ్భ ధారణ  సమయంలో  మొలలు ఏర్పడి అలాగే  వుంది పోతాయి.  అనైతిక పద్ధతుల ద్వారా శృంగారం జరపడం మొదలైన కారణాల వలన మొలలు ఏర్పడతాయి.

1.   5 గ్రాముల నువ్వులను ముద్దగా నూరి మొలల  మీద ప్రయోగించాలి.  ఇది వాపును,  నొప్పిని తగ్గిస్తుంది.

2.   నువ్వులు             --- అర టీ స్పూను
      వెన్న                   --- తగినంత
 
            రెండింటిని కలిపి నూరి కడుపులోకి  తీసుకోవాలి. తప్పక నివారింప బడతాయి.

3.   మారేడు  పండు గుజ్జు                --- 5 gr
       పంచదార                              ---10 gr
       మిరియాల గింజలు                ---  3
       యాలకుల పొడి                     ---  3 gr
 
             అన్నింటిని దంచి మజ్జిగలో కలిపి ప్రతి రోజు  తీసుకుంటే  40 రోజులలో తగ్గిపోతుంది. 

        మొలల నుండి  రక్తస్రావం -- నివారణ


             ఉత్తరేణి గింజల పొడి     ---అర టీ స్పూను
                         మజ్జిగ          --- ఒక గ్లాసు
                        కలకండ         --- ఒక టీ స్పూను

             అన్నింటిని కలిపి తాగితే  వారం రోజుల్లో మొలలనుండి స్రవించే రక్తం ఆగిపోతుంది.

             ఆముదపు  ఆకు        --- ఒకటి
             కర్పూరం బిళ్ళలు      --- రెండు

              రెండింటిని కలిపి నూరి ఆసనం మొలల మీద పెట్టి గోచి పెట్టుకుంటే ఎండి రాలిపోతాయి.

                                    ఆసనం  పుండ్లు --నివారణకు శక్తి భస్మం                   
  
                    కొబ్బరి పీచు     --- ను చిన్న ముక్కలుగా కత్తిరించి స్టవ్ మీద పెట్టి కాల్చి బూడిద
    చెయ్యాలి. తరువాత గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.

                    పూటకు  పావు టీ స్పూను పొడిని అర గ్లాసు మజ్జిగలో కలుపుకుని తాగాలి.
    ఈ విధంగా  రోజుకు  రెండు సార్లు చేయాలి.

                    దీని వలన ఆసనం వద్ద వచ్చే పుండ్లు,  గడ్డలు నివారించబడతాయి.

                    శరీరంలో ఎంత వేడి వున్నా తగ్గి పోతుంది.

       వేసవిలో వచ్చే మొలలు-- నివారణ               

   1. సుగంధపాల వేర్ల పొడి          --- 50 gr
                   వట్టి వేర్ల పొడి         --- 50 gr

      రెండింటిని కలిపి సీసాలో భద్రపరచాలి.

      ఒక టీ స్పూను పొడిని రెండు గ్లాసుల నీటిలో వేసి కాచి ఒక గ్లాసుకు రానిచ్చి కలకండ కలుపుకొని తాగాలి.

    2. కరక్కాయ పొడి
             బెల్లం

    రెండింటిని కలిపి నూరి శనగ గింజలంత మాత్రలు చేసుకోవాలి.  ఉదయం + మధ్యాహ్నం +రాత్రి
నీటితో సేవించాలి.   ( 2 + 2 + 2)

    3. మారేడు పండు గుజ్జు చూర్ణం     --- 100 gr
       యాలకుల గింజల చూర్ణం         ---   10 gr

    రెండింటిని కలిపి నిల్వ చేసుకోవాలి.

    పావు టీ స్పూను పొడిని నీటిలో కలిపి తాగాలి.

                    PILES              

నల్లేరు ముక్కలు              --- పది  ( గుజ్జు )
మిరియాలు                     --- పది

     రెండింటిని కలిపి నూరి మూడు మాత్రలు తయారు చేసుకోవాలి .  ఉదయం, సాయంత్రం ,
మరుసటి రోజు ఉదయం వేసుకోవాలి.  మరుసటి రోజు  మళ్ళీ చేసుకోవాలి.
    
     నల్లేరు పచ్చడి తింటే కూడా తగ్గుతుంది.

     నల్లేరును సజ్జ రొట్టేలో కలిపి తింటే ఊపిరితిత్తుల లోని గడ్డ
ల రూపంలోని కఫం కరిగి పడిపోతుంది

నాగకేసరాల పొడి
పటికబెల్లం

      రెండింటిని సమాన భాగాలుగా తీసుకొని  కలిపి నిల్వ చేసుకోవాలి.

      పూటకు అర టీ స్పూను చొప్పున రోజుకు రెండు పూటలా వాడాలి. ఈ చూర్ణాన్ని తియ్యటి
పెరుగులో కలిపి ఆహారానికి ముందు తింటే అన్ని రకాల ( బాహ్య, అంతర) మొలలు నివారింప
బడతాయి.   ఈ విధంగా  40 రోజులు వాడాలి.

సూచనలు :-- ద్రాక్ష రసం, దా పొడి నిమ్మ రసం, బార్లీ, ఎక్కువగా వాడుకోవాలి.


ఆవునెయ్యి                         --- 20 gr
మెత్తటి  రసాంజనం  పొడి        --- 10 gr

    ఈ మోతాదు ప్రకారం కలిపి నిల్వ చేసుకోవచ్చు .
    రాత్రి పూట మొల్ల మీద పోసి గోచి పెట్టుకొని పడుకోవాలి . దీంతో ఎంత పొడవుగా వున్న మరియు ఎంత
సమస్యగా వున్న మొలలైనా రాలిపోతాయి
     
        రక్త మొలలు  --- నివారణ 

 ఎర్రని దానిమ్మ ఇగుళ్ళు                      --- 5 gr
పటికబెల్లం                                         --- 5 gr
కరక్కాయ పొడి                                   --- 5 gr
వెన్న                                                --- 5 gr

         అన్నింటిని కలిపి ముద్దగా చేయాలి . ఉదయం , సాయంత్రం ఉసిరికాయ అంత ముద్దను తింటూ వుంటే
మొలల ద్వారా పడే రక్తం పడడం ఆగిపోతుంది .

సూచన :---  ఆహారం లో  కారం , ఉప్పు , పులుపు తగ్గించాలి . మాంసాహారం తినకూడదు . అన్నం లో ఎక్కువగా పాలు
లేదా పల్చని మజ్జిగ  పెసరపప్పు  వాడుకోవాలి .  ద్రాక్ష రసం , తీపి దానిమ్మ రసం తాగుతూ వుండాలి .

పల్చని గుడ్డను తడిపి , పిండి గోచీ పెట్టుకోవాలి . దాని పై మందమైన పొడి గుడ్డను కప్పాలి . ఈ  విధంగా రోజుకు రెండు ,
మూడు సార్లు చేయాలి

2  . ఉత్తరేణి రసం లో చక్కర కలుపుకొని తాగితే కూడా తగ్గుతుంది .

3 . ధనియాల కషాయాన్ని మూడు పూటలా    పూటకు  ఒక కప్పు చొప్పున  తాగుతూ వుండాలి .

           తాటి చెట్టు మీద పాకుతున్న లేదా మొలిచిన నల్లేరు విషం తో సమానం కావున దానిని సేకరించ రాదు .

నల్లేరు గుజ్జు                --- 50 gr
మిరియాల పొడి           --- 25 gr

        రెండింటిని  కల్వంలో వేసి మెత్తగా నూరి శనగ గింజలంత  మాత్రలు చేసుకోవాలి .

        పూటకు ఒక మాత్ర చొప్పున  రోజుకు రెండు మాత్రలు వాడాలి

                           చిట్కా  

కరక్కాయ పొడి
పాతబెల్లం

          కలిపి బుగ్గన పెట్టుకొని చప్పరిస్తూ ర

మొలలు వ్యాధి ఉన్నవారు పాటించవలసిన జాగ్రత్తలు…


* పాతబియ్యం , పాతగోధుమలు వాడవలెను.

* బార్లీ , సగ్గుబియ్యం జావ వాడవలెను.

* బీరకాయ, పొట్లకాయ కూరలు తినవలెను .

* పెసరపప్పు తినవలెను . కందిపప్పు , మినపపప్పు తినవద్దు.

* కోడి మాంసం , గుడ్డు నిషిద్దం . ఎప్పుడైనా ఒకసారి మేకమాంసం అతి తక్కువ మోతాదులో మసాలా చాలా తక్కువ మోతాదులో కలిపి తీసుకొవచ్చు.

* పాతపచ్చళ్ళు పూర్తిగా నిషిద్దం.

* ఎక్కువసేపు ప్రయాణాలు చేయరాదు .

* పళ్ల రసాలు తీసుకోవచ్చు . ముఖ్యంగా యాపిల్ రసం తీసుకోవలెను .

* కఠినంగా ఉండే చెక్క కుర్చీల పైన ఎక్కువసేపు కూర్చోరాదు. స్పాంజితో చేసినవి కూడా వాడకూడదు . బూరుగు దూది లేదా పత్తితో చేసినవి వాడవలెను.

* పెరుగుతోటకూర, మెంతికూర, పాలకూర, గంగపాయల కూర , చక్రవర్తికూర వంటి ఆకుకూరల తరుచుగా తీసికొనవలెను.

* మలబద్దకం లేకుండా చూసుకొనవలెను. సుఖవిరేచనం అయ్యేలా చూసుకోవాలి .

* ఆవునెయ్యి , ఆవుమజ్జిగ, ఆవుపాలు వాడుకుంటే మంచిది .

* శరీరానికి వేడిచేసే పదార్థాలు తీసుకోరాదు . వీలయినంత ఎక్కువ మజ్జిగ తీసికొనవలెను.

* కొత్తబియ్యం, కొత్తగోధుమలు వాడరాదు.

* కొత్తచింతపండు , కొత్తబెల్లం నిషిద్దం.

* నువ్వులు , ఆవాలు , నువ్వు చెక్క వాడరాదు.

* ఆహారంలో నూనె తగ్గించి వాడుకొనవలెను.

* కొడి చేప , రొయ్యలు వాడరాదు.

* చద్దన్నం, చల్లబడినవి , మెత్తపడిన ఆహారాన్ని తినకూడదు.

* వంకాయ , గోంగూర, సొరకాయ, బచ్చలి ఎట్టి పరిస్థితుల్లోనూ మొలల సమస్య ఉన్నవారు తీస

1. కందను కూరగా వండుకుని తింటూ వుంటే 5,6 రోజుల్లో మొలల బాధ నివారణ అవుతుంది
2. బప్పాయి పండ్లు తరుచుగా తింటూ వుంటే మూలవ్యాధులు శాంతిస్తాయ్.
3. వేప పండ్లను రోజూ 5,6 తింటూ వుంటే వేపపండ్లు వచ్చే రుతువు పూర్తయ్యేసరికి మొలలు తగ్గిపోతయ్.
4. నీరుల్లి(ఉల్లిగడ్డల) పాయలను ముక్కలుగా తరిగి నేతితో దోరగా వేయించి ఆ ముక్కల మేద తగినంత పంచదార చల్లి రెండు పూటలా తింటూ వుంటే రక్తం పడే మొలలు తగ్గుతయ్.
5. రోజూ రెండు పూటలా భోజనం చేసిన తరువాత 10 గ్రాములు కరక్కాయ పొడిని పుల్లటి మజ్జిగలో కలుపుకుని తాగుతూ వుంటే మూల వ్యాధి పిలకలు వూడిపడిపోతయ్.
6. మూలవ్యాధి కలవారు ఎక్కువగా జామకాయలను తింటూ వుంటే మొలలలు బాధ శాంతిస్తుంది.

ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
విశాఖపట్నం
9703706660
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

కామెంట్‌లు లేవు: