10, నవంబర్ 2020, మంగళవారం

చలి కాలం లో కోవిద్ రాకుండా మరియు ఒక్కసారి కోవిద్ వచ్చిన వాళ్ళకి రెండవ సారి కోవిద్ అపోహలు పై అవగాహన కోసం నవీన్ నడిమింటి సలహాలు

ఓసారి కరోనా వచ్చాక మళ్లీ వస్తుందా ? వస్తే ఎలా ఉంటుంది ? అవగాహన కోసం నవీన్ నడిమింటి సలహాలు 

. మన దేశంలోనూ కరోనా వ్యాక్సిన్ ఇంకా ట్రయల్స్ దశలోనే ఉంది. అయితే ఆ లోపు జనాన్ని మరో భయం పట్టి పీడిస్తోంది. ఓసారి కరోనా వైరస్ సోకిన వారికి మరోసారి అది సోకే అవకాశాలు ఉంటాయా ? తాజాగా బయటపడుతున్న ఇలాంటి కేసులను చూస్తే ఇది నిజమే అనిపించక మానదు. అయితే ఇలా రెండోసారి సోకే అవకాశాలు ఎప్పుడెప్పుడు ఉంటాయి, అలా సోకిన వారి పరిస్ధితి ఎలా ఉంటుందన్న దానిపై అమెరికాకు చెందిన డజను మంది వైద్య నిపుణుల బృందం తాజాగా నిర్వహించిన పరిశోధన ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి.


కరోనా మళ్లీ వస్తుందా ?

ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకిన తర్వాత చికిత్స తీసుకుని నయం చేసుకుంటాడు. అయితే మరోసారి అదే వ్యక్తికి కరోనా వస్తుందా అనే అనుమానాలు ఇప్పుడు పెరుగుతున్నాయి. మన దేశంలో కరోనా వైరస్ చికిత్సా విధానం కూడా ఇంకా అభివృద్ధి చెందకపోవడం, ఎప్పుడో మలేరియాకు వాడిన హైడ్రాక్సీ క్లోరోక్విన్ వంటి మాత్రలపైనే ఇంకా ఆధాపడుతున్న పరిస్ధితుల్లో ఓసారి కరోనా తగ్గాక మళ్లీ సోకదన్న గ్యారంటీ లేదని ఇట్టే తెలిసిపోతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వందల కొద్దీ రోగులకు కరోనా రెండోసారి కూడా వస్తున్న సందర్భాలు తాజాగా చూస్తూనే ఉన్నాం. అయితే అది ఎప్పుడు, ఎవరికి, ఎలా అన్న దానిపైనే ఉత్కంఠ నెలకొంది.

రెండోసారి కరోనా ఎలా రావొచ్చు ?

ఓసారి కరోనా సోకిన వ్యక్తికి ,తగ్గిన తర్వాత మరోసారి కరోనా వస్తే ఎప్పుడొస్తుంది, ఎలా వస్తుంది, వస్తే ఎలా ఉంటుందన్న అంశాలపై అమెరికాలోని హార్వార్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కు చెందిన డజను మంది డాక్టర్ల బృందం తాజాగా నిర్వహించిన పరిశోధనల్లో ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి. కరోనా ఓసారి సంక్రమించిన తర్వాత నయమై మరోసారి సోకే అవకాశాలు అందరికీ ఉండవు. కేవలం కొన్ని బలహీనమైన పరిస్ధితుల్లో మాత్రమే కరోనా ప్రభావం రోగిలో పైకి నయమైనట్లు కనిపించినా ఆ తర్వాత మళ్లీ ప్రభావం చూపడం మొదలుపెడుతుందని డాక్టర్లు తేల్చారు.


వారాలు, నెలల గ్యాప్ తర్వాతే...

కరోనా వైరస్ ఓసారి వచ్చి నయమయ్యాక తిరిగి అదే రోగికి వైరస్ వచ్చే సందర్భాలు తిరిగి కొన్ని వారాలు, నెలల తర్వాత మాత్రమే ఉంటాయని హార్వర్డ్ వైద్య బృందం తేల్చింది. అంత కంటే తక్కువ సమయంలో మాత్రం వైరస్ తిరగబెట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని వారు నిర్ధారించారు. ఓసారి వైరస్ సోకిన తర్వాత రోగి శరీరంలో రోగనిరోధకాలు అభివృద్ధి చెందుతాయని, వాటి ప్రభావం రోగి శరీర తత్వాన్ని బట్టి కొన్ని వారాలు లేదా నెలల పాటు ఉంటుందని, అంత వరకూ మరోసారి వైరస్ సోకదని తేల్చారు. అంతే కాదు ఈ సమయంలో మరే ఇతర చిన్నా చితకా వైరస్ లు కూడా సోకకుండా కూడా ఇవి అడ్డుకట్ట వేస్తాయని నిర్ధారించారు.


అలా ఎప్పటివరకూ వస్తూనే ఉండొచ్చు ?

మరోవైపు ఇలా ఓసారి కరోనా వైరస్ సోకిన తర్వాత ప్రస్తుతం వాడుతున్న మందులతో తగ్గిపోయి మళ్లీ కొన్ని వారాలు, నెలల తర్వాత తిరగబెట్టే అవకాశాలు లేకపోలేదని హార్వార్డ్ నిపుణుల బృందం తెలిపింది. అయితే ఇలా ఎన్నిసార్లు రిపీట్ అయ్యే అవకాశాలు ఉండొచ్చంటే హెర్డ్ ఇమ్యూనిటీ అభివృద్ధి చెందే వరకూ తప్పదని డాక్టర్లు చెబుతున్నారు. ఇలా వీటిని ఎదుర్కొనే హెర్డ్ ఇమ్యూనిటీ ఎప్పుడు మనుషుల్లో అభివృద్ధి చెందే అవకాశం ఉందని అడిగితే మాత్రం వైరస్ కు వ్యాక్సిన్ లభిస్తే తప్ప ఇది సాధ్యం కాదని తేల్చి చెబుతున్నారు. దీంతో అంతిమంగా కరోనా వ్యాక్సిన్ కోసం ఎన్నాళ్లైనా వేచి చూడక తప్పదనే సంకేతాలన

చలి కరోనా.. జాగ్రత్త!

.అసలే కరోనా కాలం. ఆపై చలికాలం. ఇదే ఇప్పుడు గుబులు పుట్టిస్తోంది. మామూలుగానే చలికాలంలో శ్వాసకోశ జబ్బులకు కారణమయ్యే వైరస్‌లు విజృంభిస్తుంటాయి. కొవిడ్‌-19 కారక సార్స్‌ కోవ్‌2 కూడా శ్వాసకోశ వైరసే. అందుకే    మరింత జాగ్రత్త అవసరం.

లికాలంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీంతో వైరస్‌లు ఎక్కువసేపు జీవించి ఉంటాయి. పైగా చలికాలంలో ఎక్కువసేపు ఇంట్లోనే ఉండిపోతుంటాం. దీంతో ఒకరి నుంచి మరొకరికి వైరస్‌లు అంటుకునే అవకాశం ఎక్కువవుతుంది. చల్లటి, పొడి గాలితో రోగనిరోధకశక్తీ తగ్గుముఖం పడుతుంది. మరోవైపు- చలికాలంలో మంచు కురుస్తుంది. ఇలాంటి వాతావరణంలో దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్లు దూరాలకు విస్తరించకుండా అక్కడే ఎక్కువసేపు ఉండిపోతుంటాయి. చలికాలంలో కాలుష్యం కూడా ఎక్కువే. చలికి శ్వాస మార్గాలు సంకోచిస్తాయి. దీంతో గాలి లోపలికి వెళ్లటం తగ్గుతుంది. ఇది ఆయాసానికి దారితీస్తుంది. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇలాంటివన్నీ మరింత కలవరం కలిగిస్తున్నాయి. నిజానికి ఒకప్పటితో పోలిస్తే కరోనా వైరస్‌ తీవ్రత ఇప్పుడు తగ్గింది. చలికాలంలో కేసుల సంఖ్య పెరిగినా అంత ఉద్ధృతంగా ఉండకపోవచ్చు. అయినా కూడా ఎవరి జాగ్రత్తలో వారుండటం మంచిది. నిర్లక్ష్యం అసలే పనికిరాదు. ఇప్పటికే ఆస్థమా, సీవోపీడీతో బాధపడుతున్నవారు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే మధుమేహులు, ఊబకాయులు, గర్భిణులు, క్యాన్సర్‌ బాధితులు, గుండెజబ్బులు గలవారు, కిడ్నీ వైఫల్యం బాధితులు, అవయవ మార్పిడి చేయించుకున్నవారు కూడా అప్రమత్తంగా ఉండాలి. వీరికి కరోనా సోకే ముప్పు ఎక్కువ. తీవ్రత కూడా ఎక్కువే. అందువల్ల ఆయా జబ్బులను కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవాలి. ఆస్థమా, సీవోపీడీ బాధితులు క్రమం తప్పకుండా ఇన్‌హేలర్లు వాడుకోవాలి. మందులు పూర్తిగా అయిపోకముందే కొని తెచ్చికోవాలి. జనం ఎక్కువగా గుమిగూడి ఉండే ప్రదేశాలకు వెళ్లకపోవటమే మంచిది. తప్పనిసరై ప్రయాణాలు చేయాల్సి వస్తే వెంట మందులు విధిగా తీసుకెళ్లాలి. జబ్బులతో బాధపడేవారే కాదు.. 50 ఏళ్లు పైబడ్డవారంతా డాక్టర్‌ సలహా మేరకు ఫ్లూ టీకా తీసుకోవాలి. 60 ఏళ్లు పైబడినవారు, రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు ఇంటికే పరిమితం కావటం ఉత్తమం. న్యుమోనియా టీకా తీసుకోకపోతే వెంటనే

ధన్యవాదములు 🙏

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660

కామెంట్‌లు లేవు: