శోభి మచ్చలు-చర్మం పైన తెల్ల మచ్చలు నివారణకు నవీన్ నడిమింటి సలహాలు అవగాహన కోసం (vitiligo)
కావాల్సిన వస్తువులు:
1.తులసి ఆకులు -20
2.మంచి పసుపు -1 స్పూన్
తయారు చేయు విధానం:
తులసి ఆకులు, మంచి పసుపును-కొంచం నీరు తీసుకొని మెత్తగా నూరండి.
ఉపయోగించాల్సిన విధానం:
స్నానానికి గంట ముందు ఆయా మచ్చల పై రుద్దండి. అది ఎండి పోయే వరకు ఉంచి స్నానం చేయండి . అలా 21 రోజులు చేయండి. ఫలితం మీకే తెలుస్తుంది
గోళ్ళ మీద తెల్ల మచ్చలు పోవాలి అంటే నవీన్ సలహాలు !
తల వెంట్రుకల నుంచి కాలి గోళ్ళ వరకూ అన్నీ మన ఆరోగ్యం ఎలా ఉందనే విషయంపై మనకు ఎప్పటికప్పుడు సంకేతాలు ఇస్తూనే ఉంటాయి. మనమే వాటిని అంతగా పట్టించుకోము. ఈ సంకేతాలను మనం సకాలంలో గుర్తిస్తే ఆరోగ్యాన్ని తొందరగా చక్కదిద్దుకోవచ్చు. ఇలాంటి సంకేతాల్లో ఒకటి చేతి గోళ్ళ మీద వచ్చే మచ్చలు. మన చేతి గోళ్ళ మీద రకరకాల మచ్చలు వస్తుంటాయి. ఇవి ఎప్పుడు వస్తాయో?, ఎందుకు వస్తాయో? ఇవి రావడం వల్ల వచ్చే నష్టాలేమిటో మనలో చాలామందికి తెలియదు. ఇందులో ఎక్కువగా కనిపించేవి తెల్లమచ్చలే. ఇవి కనిపిస్తే ఈసారి అశ్రద్ద చేయకండి. ఎందుకంటే ఇవి మీ శరీరంలో తీవ్రమైన అనారోగ్యాలకు సంకేతాలు. అవును…జింక్ లోపం ఉన్నా, ప్రోటీన్ లోపం ఉన్నా కూడా మీ చేతి గోళ్ళ మీద ఈ తెల్ల మచ్చలు ఏర్పడతాయి. మీ నరాల వ్యవస్థలో ఉన్న అసాధారణ స్థితికి సంకేతం ఈ తెల్లమచ్చలు. తీవ్రమైన మానసిక ఒత్తిడి ఉన్నా ఈ తెల్ల మచ్చలు ఏర్పడతాయి. ఏదైనా తీవ్రమైన జబ్బుకి హెచ్చరిక సంకేతమూ కావచ్చు ఈ తెల్ల మచ్చలు. గోళ్ళమీద తెల్లమచ్చలు ఎందుకు వస్తాయనడానికి ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. నిజానికి ఇవన్నీ నమ్మేవేమీ కాదు. ఒక్కోసారి గోళ్ళకు దెబ్బ తగలడం వల్ల కూడా ఈ మచ్చలు రావచ్చు. విటమిన్లు, ఖనిజాల లోపం వల్ల కూడా ఇలా జరగవచ్చు. ఇంకేదైనా ఇన్ఫెక్షన్‌కూ సంకేతం కావచ్చు. కాల్షియం లోపం ఉన్నా లేదా ఎక్కువగా మయోనైజ్ (గుడ్డు, నిమ్మరసం కలిపి చేసే ఒక రకమైన సాస్) తినడం వల్ల ఈ మచ్చలు వస్తాయంటారు. కానీ, గోళ్ళ రంగులు, ఎసిటోన్, నెయిల్ హార్డనర్‌లు వంటి కొన్ని రకాల ఉత్పత్తుల కారణంగా వచ్చే అలర్జీ ఇది. కృత్రిమంగా ఏర్పరచుకున్న గోళ్ళు లేదా గోళ్ళ రంగులు తొలగించిన తర్వాత ఈ మచ్చలు తొలగిపోయాయంటే అవి ఖచ్చితంగా అలర్జీ వల్ల వచ్చినవే. ఇలాంటప్పుడు తప్పనిసరిగా డాక్టరుని సంప్రదించాల్సిందే. తెల్ల మచ్చలు లేదా తెల్లగీతలు బాగా కనిపించాయంటే అవి జింక్ లోపం వల్ల వచ్చినవే. ఇలాంటప్పుడు జింక్ అధికంగా ఉండే బీన్స్, పెరుగు, పాలకూర లాంటివి అధికంగా తీసుకోవాలి. ఒక్కచోట కాకుండా మొత్తం గోరంతా తెల్లమచ్చలు కనిపిస్తే అది ప్రోటీన్ లోపం. ఇవి ఎక్కువగా గోరు లోపలి నుంచి ప్రభావం చూపిస్తాయి. గోరు బయట అంతగా కనిపించవు. ఈ తెల్లమచ్చలు ఎక్కువకాలం పోకుండా అలాగే ఉన్నాయా? అయితే ఇవి తీవ్రమైన అనారోగ్యాలకు సంకేతాలు. ఇలాంటప్పుడు కాలయాపన చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇవి హెపటైటిస్, సిర్రోసిస్, మూత్రపిండాల వైఫల్యం లేదా ఎనీమియా వీటిలో దేనికైనా ఈ తెల్లమచ్చలు సంకేతం కావచ్చు.
రెండు తరాల ముందువరకు మనవాళ్ళు తొంభై ఏళ్ళ వరకూ బట్టతల లేకుండా , జుట్టు నేరవకుండా , కంటిచూపు దెబ్బతినకుండా , నడుం వంగకుండా , పళ్ళు వూడకుండా ఏ కార్పొరేటు హాస్పిటళ్ళు లేనప్పుడు ఎలా ఉన్నారు ? ఇంత వైద్య సదుపాయం వుండి కుడా ఇప్పటి తరం అందుకు వ్యతిరేకంగా ఎందుకు ఇలా వున్నారో ఎప్పుడైనా ఆలోచించామా ?
ముఖముపై ఉన్న నల్లమంగు, ఎర్ర మంగు మచ్చలకు ఆయుర్వేదం నవీన్ సలహాలు :
ముఖము పై మచ్చలు , spots on the Face
ముఖము మీద తెల్లని మచ్చలకు ఖచ్చితమైన కారణము తెలియదు కాని సున్నిత చర్మము గలవారికి ఇది సహజము .
- విటమిన్క్ష్ ' ఎ ' లోపమువల్ల ,
- సూర్యుని కిరణాలు లోని అతినీలలోహిత కిరణాల ఎలర్జీ వలన ,
- బొల్లి అనే చర్మవ్యాధి వలన ,
- పిటిరియాసిస్ అల్బా అనే ప్రక్రియ వల్లా ................................... తెల్లని మచ్చలు కలుగవచ్చును.
మచ్చలు పలురకాలు - నల్లమచ్చలు, తెల్లమచ్చలు, గోధుమరంగులో వున్నసోభి మచ్చలు ముఖ్యమైనవి. పుట్టుకతో వచ్చిన కొన్ని రంగు మచ్చలను పుట్టుమచ్చలు అంటాము - ఇవి చాలా తక్కువగా ముఖముపై ఉంటాయి.
కారణాలు
* 1. వయసు కురుపులు (మొటిమలు)
* 2. మశూచి ( smallpox & chickenpox)
* 3. నల్లసోభి (melanin pigmentation)
* 4. బొల్లి మచ్చలు (Vitiligo)
* 5. కాలిన మచ్చలు (Burn scars)
* 6. గంట్లు (cuts
* 7. గాయాలు (wounds) మొదలగునవి( etc.)
* 8. కాన్సర్ (Cancer)
ముఖముపై మచ్చలున్నంత మాత్రాన శరీర-ఆరోగ్యానికి నష్టము లేకపోయినా అందముగా లేమేమోనన్న మానషిక బాధ ఉంటుంది. వైద్య నిర్వచనములో ఇది కూడా ఒక రుగ్మత కిందే లెక్క. -- తీసికోవలసిన జాగ్రత్తలు, ట్రీట్మెంటు కారణాన్ని బట్టి ఉంటుంది. ఆయా కారణాలు చూడండి
చికిత్స :
- పడ్కునే సమయం లో తెల్ల మచ్చలపై ' హైడ్రో కార్టిసన్ ' 1% ఉండే క్రీము రాయండి ,
- పగటి వేళ " ఎం.పి.ఎఫ్-30 " సన్ స్క్రీన్ ప్రతి మూదు గంటలకు ఒకసారి రాయండి .
- విటమిం ' ఎ ' ఎక్కువ ఉన్న ఆకుకూరలు , క్యారెట్ , పాలు , గ్రుడ్లు , ఆహారముతో తీసుకోవాలి .
ధన్యవాదములు
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి