చలి తగ్గినా దగ్గు,జలుబు వదలవా?నివారణకు నవీన్ నడిమింటి సలహాలు అవగాహన కోసం
సీజన్‌తో నిమిత్తం లేని జబ్బులొస్తున్న విపరీత కాలమిది. లేకపోతే చలికాలంలో వచ్చే దగ్గు, జలుబు.. ఎండా కాలంలో పట్టుకోవడమేమిటి? విచిత్రంగా లేదూ? ఇప్పుడు మెల్లగా చలిపోయి ఎండ పెరుగుతున్న వాతావరణంలో.. ఎంతో మందిని పట్టిపీడిస్తున్న శ్వాసకోశ సమస్యల గురించి వివరిస్తున్నారు మన నవీన్
దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలకు ప్రధానంగా వైరస్‌లు, వ్యాధి నిరోధకశక్తి సన్నగిల్లటం, కాలుష్యం, వాతావరణ మార్పులే కారణాలు. యాంటీబయాటిక్స్ వాడటం, దుమ్ము, ధూళి, చల్లదనాలకు దూరంగా ఉండటం, పోషకాహారం తీసుకుని రోగ నిరోధకశక్తిని పెంచుకోవటం చేస్తే సమస్యలు తగ్గుముఖం పడతాయి. కానీ శ్వాసకోశ సమస్యలకు వాతావరణ మార్పులు కూడా తోడైతే ఇన్‌ఫెక్షన్‌ను అదుపు చేయటం కొంత కష్టం. ఇప్పుడు ఇలాంటి ఇన్‌ఫెక్షన్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీనికితోడు ఓ పక్క పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతుంటే, మరోపక్క రాత్రుళ్లు గణనీయంగా పడిపోతున్నాయి. మరిముఖ్యంగా తెలంగాణ జిల్లాల్లో రాత్రి చలి, పగలు వేడితో చిత్రమైన వాతావరణం ఉంటోంది. ఇలాంటి మార్పుల వల్ల ముక్కులోని లైనింగ్స్ పొడిబారి వైర్‌సలకు నివాసయోగ్యాలుగా మారుతున్నాయని వైద్యులంటున్నారు. ఈ సమస్యకు చలికాలంలో అప్పర్ రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్లకు కారణమయ్యే రైనో, పారా ఇన్‌ఫ్లుయెంజా వైర్‌సలకు ఇతర బ్యాక్టీరియాలు తోడవుతున్నాయి. ప్రత్యేకంగా వేసవి వాతావరణంలో ‘ఎంటిరోవైరస్’ అనే ఓ సరికొత్త వైరస్ విజృంభిస్తోంది. ఇది చికిత్సకు లొంగని వైరస్. ఈ సమస్యలకు కాలుష్యం కూడా తోడవుతోంది. పల్లెలతో పోలిస్తే సిటీల్లో గాలి నాణ్యత గణనీయంగా తగ్గిపోతోంది. ప్రపంచంలోని అత్యంత కాలుష్యభరిత 20 పట్టణాల్లో 13 మన దేశంలోనే ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వెల్లడించింది. ఇలా కాలుష్యం, రోగనిరోధకశక్తి సన్నగిల్లటం, డ్రగ్ రెసిస్టెన్స్‌లాంటి కారణాలు కలగలిసి సమస్యను మరింత జటిలం చేస్తున్నాయి. చలికాలంలో ఇబ్బందిపెట్టే వైర్‌సలు ఉప్పెనలా వేధించి తగ్గిపోతే వేసవి ప్రారంభంలో దాడిచేసే వైర్‌సలు ఒంట్లోనే దాక్కుని పదే పదే తిరగబెడుతూ ఎక్కువకాలంపాటు వేధిస్తాయి.
శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా పిల్లలు, పెద్దల్నే వేధిస్తాయి. ఐదేళ్లకంటే చిన్న పిల్లలు, 60-65 ఏళ్ల వయసు పెద్దలే ఎక్కువగా ఈ ఇన్‌ఫెక్షన్ల బారిన పతుం టారు. చిన్నపిల్లల్లో రోగనిరోధక శక్తి బలంగా ఉండకపోవటం, పెద్దల్లో వ్యాధినిరోధక శక్తి క్షీణించటంతోపాటు మధుమేహంలాంటి వ్యాధుల మూలంగా ఇన్‌ఫెక్షన్లు తేలికగా దాడి చేస్తాయి. వీళ్లకు చలికాలంలో అప్పర్ రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్‌తో సమస్య మొదలవుతుంది. ఇది క్రమంగా కింద కు పాకి, చివరికి ఊపిరితిత్తుల్లోకి చేరి న్యుమోనియాగా మారుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ఇన్‌ఫెక్షన్ ఊపిరితిత్తుల్లోకి పాకకముందే మెరుగైన చికిత్స అందించాలి. తగిన జాగ్రత్తలు పాటిస్తూ సెకండరీ ఇన్‌ఫెక్షన్లతోపాటు ఇతర దీర్ఘకాల వ్యాధుల్ని అదుపులో ఉంచుకోవాలి.
జలుబు, దగ్గులాంటి రుగ్మతలకు సాధారణంగా సొంత వైద్యం చేసుకుంటూ ఉంటాం. లేదంటే మెడికల్ షాప్‌కి వెళ్లి మందులు కొని వాడేస్తూ ఉంటాం. బాక్టీరియల్, వైరల్.. వీటిలో ఏ రకమైన ఇన్‌ఫెక్షనో తెలియకుండానే మందుల్ని వేసేసుకుంటాం. ఒకవేళ వైద్యులు సూచించిన యాంటీబయాటిక్స్ అయినా ఇన్‌ఫెక్షన్ కాస్త కంట్రోల్ కాగానే పూర్తి కోర్సు వాడకుండా మానేస్తూ ఉంటాం. ఇలా ఓవర్ ది కౌంటర్ మందులు వాడటం, పూర్తి మోతాదు వాడకపోవటం వల్ల మైక్రోఆర్గానిజమ్స్ మందులకు లొంగినట్టే లొంగి మరో కొత్త రూపంలో ఇతరులకు వ్యాపిస్తుంది. ఇలా సూక్ష్మజీవులు మందులకు స్పందించనంత సామర్థ్యా న్ని పెంచుకుంటూ చివరికి చికిత్సకూ లొంగనంత మొండి గా తయారవుతున్నాయి. అమెరికాలో యాంటీబయాటిక్స్ వాడకం సంవత్సరానికి 7 బిలియన్లు, చైనాలో 10 బిలియన్లే ఉంటే మన దేశం 13 బిలియన్లకు చేరిపోయింది. ఈ దుస్థితి నుంచి గట్టెక్కడానికి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాంటీ మైక్రోబియిల్ సర్వే చేపట్టింది. కానీ ఇలాంటి సర్వేల కంటే సొంతంగా కాకుండా, వైద్యులు సూచించిన మందుల్ని, సూచించినంతకాలం వాడేలా నియమాలు పాటించటం అలవాటు చేసుకోవాలి.
- జలుబు
- ముక్కు నుంచి నీరు కారటం
- తలనొప్పి, తుమ్ములు
- గొంతు నొప్పి
- ముక్కు దిబ్బెడ
- జ్వరం
- శ్వాసకోశ సమస్యలు కొందరినే ఎక్కువగా, అత్యంత తేలికగా దాడి చేస్తాయి. వాళ్లెవరంటే?
- ఐదేళ్ల కంటే చిన్న పిల్లలు
- 60 - 65 ఏళ్ల మధ్య వయస్కులు
- రోగులు (షుగర్, హైపరటెన్షన్, కొరొనరీ హార్ట్ డిసీజెస్, మెదడు, ఊపిరితిత్తుల రుగ్మతలు కలిగిన వాళ్లు)
వైరల్ ఇన్‌ఫెక్షన్‌కు సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ తోడైనప్పుడు వచ్చే రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్ మరింత మొండిగా తయారవుతుంది. వైరల్ ఇన్‌ఫెక్షన్‌గా ఉన్నప్పుడు అది ఎగువ శ్వాసనాళానికే పరిమితమౌతుంది. ఆ వైర్‌సకు బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ కూడా తోడైతే అది దిగువ శ్వాసనాళానికి పాకి అక్కడి నుంచి ఊపిరితిత్తులకు చేరుతుంది. ఇది కొంత ప్రమాదకరమైన స్థితి. ఈ దశలో పై లక్షణాలతోపాటు జ్వరం, దగు,్గ ఊపిరి పీల్చుకోవటంలో ఇబ్బంది కూడా ఉంటుంది.
వేసవిలో విడవకుండా వేధించే దగ్గు, జలుబులకు ఈ వైరసే కారణం. దగ్గు, తుమ్ముల ద్వారా వ్యాపించే ఈ వైరస్ చాలా రోజులు బాధిస్తోంది. అలాగని విపరీతమైన లక్షణాలూ బయటపడవు. తెరలుగా వేధించే దగ్గు, శ్లేష్మం రూపంలో అడపాదడపా కనిపిస్తూ అంతర్గతంగా వ్యాధి ముదిరి శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌కు దారితీసేలా చేస్తుంది.
ఇన్‌ఫెక్షన్లకు కారణం
ఇన్‌ఫెక్షన్లలో రకాలు
- ఇన్‌ఫ్లూయెంజా వైరస్
- పారా ఇన్‌ఫ్లూయెంజా వైరస్
- స్టెఫలోకోకల్ బ్యాక్టీరియా
- ఎడినోవైరస్
- న్యూమోకోకస్
- రైనోవైరస్
ఇన్‌ఫెక్షన్లలో రకాలు
అప్పర్ రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్: ముక్కు, గొంతు, స్వర పేటికలు ఇన్‌వాల్వ్ అవుతాయి.
ఇన్‌ఫెక్షన్ రకాలు...
- టాన్సిలైటిస్
- ఫారింగ్జైటిస్
- లారింగైటిస్
- సైనసైటిస్
- ఒటైటిస్ మీడియా
లోయర్ రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్: శ్వాసనాళం, శ్వాసకోశాలు, ఊపిరితిత్తులు ఇన్‌వాల్వ్ అయి ఉంటాయి.
ఇన్‌ఫెక్షన్ రకాలు..
ఎంతకాలంలోగా వైద్యుల్ని కలవాలి?- బ్రాంఖైటిస్
- న్యుమోనియా
జలుబు, దగ్గుల గురించి వైద్యులను కలిసేవాళ్లు చాలా అరుదు. మందులు వాడితే వారం రోజుల్లో వాడకపోతే ఏడు రోజుల్లో తగ్గిపోతుందని జలుబు మీదో తమాషా జోకుంది. అయితే ఇదే సూత్రం అన్ని సమయాల్లో పనికిరాదు. వేసవి వచ్చినా వదలని శ్వాసకోశ సమస్యలకు వైద్యుల్ని తప్పకుండా సంప్రదించాలి. జలుబు మూడు అంతకంటే ఎక్కువ రోజులపాటు తగ్గకుండా వేధిస్తూ ఉంటే కచ్చితంగా డాక్టర్‌ని కలవాలి.
- చెస్ట్ ఎక్స్‌రే (దీంతో న్యుమోనియా తీవ్రత తెలుస్తుంది)
- నాసల్ స్వాబ్ (వైరస్ రకం తెలుస్తుంది)
- థ్రోట్ స్వాబ్ (ఇన్‌ఫెక్షన్ వ్యాపించిన తీరు తెలుస్తుంది)
- కల్చర్ (వైరస్ రకం తెలుస్తుంది)
వ్యాధి వ్యాప్తి, తీవ్రతలను బట్టి వైద్యులు చికిత్సను ఎంచుకుంటారు. స్వల్ప ఇన్‌ఫెక్షన్లకు 5 రోజులపాటు మందులు సూచిస్తారు. అప్పటికీ ఇన్‌ఫెక్షన్ అదుపులోకి రాకపోతే ఇతరత్రా పరీక్షలు చేసి వైరస్ కౌంట్, తత్వం, తీవ్రత, ఇన్‌ఫెక్షన్ పరిణామాలను బట్టి మరింత సమర్థమైన చికిత్సను అందిస్తారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
- శారీరక విశ్రాంతి తీసుకోవాలి.
- చల్లని పదార్ధాలకు దూరంగా ఉండాలి.
- చల్లని వాతావరణంలో నుంచి హఠాత్తుగా వేడి వాతావరణంలోకి వెళ్లకూడదు.
- కాలుష్యానికి గురికాకుండా మాస్క్‌లు, స్కార్ఫ్‌లు వాడాలి.
- తుమ్మినప్పుడు, దగ్గేటప్పుడు కర్చీఫ్ అడ్డం పెట్టుకోవాలి.
- చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
- వేడి పదార్థాలే తీసుకోవాలి.
- వీలైనంత ఎక్కువగా గోరువెచ్చని నీళ్లు తాగాలి.
- ఉపశమనం కోసం వేడి నీటి ఆవిరి పట్టొచ్చు.
కఫం తగ్గాలంటే..
శరీరంలోని అంతర్భాగాల పొరల్లో ఊరే ద్రవం ఒక్కోసారి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది క్రిమి సంబంధిత సమస్యలకు లోనైనప్పుడు ఆ ద్రవం గట్టిగా, జిగటగా మారుతుంది. దీనివల్ల కఫ సంబంధితమైన సమస్యలు తలెత్తుతాయి. ఈ కఫం ముఖ్యంగా, శ్వాసకోశాల్లోనూ, శ్వాస వాహికల్లోనూ, ముక్కుల్లోనూ పేరుకుని, నోటిద్వారా, ముక్కు ద్వారా, కఫ రూపంలో బయటికి వస్తుంది. ఈ స్థితిలో ఒంట్లో వికారంగానూ, చికాకుగానూ ఉంటుంది. ఎప్పుడూ జ్వరం వచ్చినట్లుగా ఉంటుంది. కఫం తగ్గితే గానీ, ఈ సమస్యలు పోవు. అందుకే ఈ కింద చెప్పినట్లు చేయండి.
జు పిప్పళ్లు, మిరియాలు, శొంఠి ఈ మూడింటిలో ఏదో చూర్ణాన్ని సంచదార నీటితో కలిపి రాత్రిపూట తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.
- వెల్లుల్లి పాయలోని నాలుగు రేకులను గుజ్జుగా తయారు చేసుకుని ప్రతి ఆరుగంటలకు ఒకసారి తీసుకుంటే కఫ సమస్యలు తొలగిపోతాయి.
- ఒక్కోసారి కఫం గొంతులో గరగరలాడుతూ ఊపిరాడటం కష్టమవుతుంది దగ్గు కూడా వస్తుంది. ఇలాంటి స్థితిలో...
- మూడు మారేడు ఆకుల చొప్పున ఉదయం, సాయంత్రం నమిలిమింగాలి. ఇలా కనీసం నెలరోజులైనా చేస్తే ఎంతో మేలు కలుగుతుంది.
- ఒక ఔన్స్ క్యాబేజీ రసాన్ని పూటకోసారి తాగితే ఎంతో ఉపశమనం లభిస్తుంది. ముల్లంగి రసాన్ని కూడా ఇలాగే తీసుకోవచ్చు. కప్పు వేడినీటిలో కొంత తేనె కలిపి తాగినా ఉపశమనం లభిస్తుంది.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
విశాఖపట్నం
9703706660
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి