23, నవంబర్ 2020, సోమవారం

యోగ ఆసనాలు వల్ల ఉపయోగం ఏమిటే నడుము నొప్పి కు ఆయుర్వేదం సలహాలు ఈ లింక్స్ లో చూడాలి

ప్రస్తుతం చాలా మంది నడుము నొప్పితో బాధ పడుతున్నారు . స్త్రీలలో నెలసరి ఋతుక్రమములో సమస్యలు వున్నప్పుడు , white discharge ఎక్కువగా వున్నప్పుడు , నడుము నొప్పి వుంటుంది . పురుషులలో అధిక శ్రమ చేసినపుడు , సరైన రీతిలో కూర్చోక పోవడము , లేచినపుడు , వాయు ప్రకోపం చెందినపుడు , రాత్రి సరిగా నిద్ర పోవునపుడు , నడుము నొప్పి ( Back Pain ) వస్తుంది .

గృహ చికిత్సలు : --

1. ప్రాతః కాలములో అక్రోటులను తినడం వలన నడుము నొప్పులు తగ్గిపోతాయి .

2 . టర్పెంట్ ఆయిల్ తో నొప్పి ఉన్నచోట మర్ధన చెయ్యండి , నొప్పులు తగ్గిపోతాయి .

3 . సొంఠి + ఆవాల నూనె ( Mustard oil ) లో వేసి వేడి చెయ్యండి .నొప్పి వున్న చోట మాలిష్ చెయ్యండి .

4 . సొంఠి + కరక్కాయ + తిప్ప తీగ , ఈ మూడు పొడులను సమ పాళ్ళలో కలపండి. చూర్ణం త్రాగండి .
( 1/2 చూర్ణం ని ఉదయం , సాయంకాలము తీసుకొనండి )

5 . వేప ఆకుల పేస్ట్ + తుమ్మ బంకలను కలిపి , నొప్పి వున్న చోట లేపనంగా పూయండి . నొప్పి తగ్గిపోతుంది .

6 . ఆముదం ఆకులపైన , ( ఒక ప్రక్క ఆవాల నూనగను పూసి , ఆకులను వేడి చేసి , నొప్పి వున్న చోట ఆకులను పెట్టీ కట్టండి , నొప్పులన్నియు తగ్గి పోవును .
( Best and Effective Method for Pain ).

7 . 10 గ్రాముల తెల్ల జీలకర్ర + 10 గ్రాముల  నల్ల  జీలకర్రలను కొద్దిగా స్వదెశి ఆవు నెయ్యిలో వేయించి , పొడిగా చెయ్యండి .
ఈ పొడిలో + కొద్దిగా ఇంగువ + కొద్దిగా + సైంధవ లవణంలను కలిపి చూర్ణంగా తయారు చెయ్యండి .
1/2 spoon చూర్ణం + తేనెను కలిపి తీసుకొనవలెను .

8 . 100  గ్రాముల కరక్కాయ + 100 గ్రాముల వాము + 25 గ్రాముల సొంఠిని కలిపి పొడి ( చూర్ణం ) గా చేయండి .
1 spoon చూర్ణం +  1 గ్లాసు వేడి నీళ్ళలో కలిపి , ఉదయం , సాయంత్రం త్రాగండి .

9 . ఉసరి కాయ పొడి + సొంఠి + బెల్లంలను 250 గ్రాముల నీళ్ళలో మరిగించి , వడపోసి త్రాగండి .
( ప్రతి రోజు 3 లేక 4 సార్లు త్రాగండి ).

10 . పిప్పిళ్ళ చెట్టు బెరడును కషాయంగా చేసుకొని త్రాగండి .

11 . 10 గ్రాముల సొంఠి + 20 గ్రాముల అశ్వగంధి చూర్ణం + 30 గ్రాముల కలకండలను కలిపి పొడిగా చెయ్యండి .
( 1 spoon చూర్ణం + 1 గ్లాసు వేడి నీళ్ళలో కలిపి , ఉదయం , సాయంత్రం త్రాగండి .

12. 1/2 spoon తుమ్మ బంక పొడి + 1 గ్లాసు నీళ్ళలో కలిపి త్రాగండి .

13 .  కర్పూరం + ఆవాల నూనెలో కలిపి , ఎండలో పెట్ట వలెను. నూనె వేడిగ అయిన తర్వాత నొప్పి వున్న చోట నూనెతో మర్ధన చేయవలెను .

14 . ప్రతి రోజు నియమంగా యోగాసనాలు వేయండి .
( యోగ గురువు ద్వార నేర్చుకొని ఆసనాలు వేయండి ).

   పై వాటిలో ఏదో ఒకటి ఆచరించండి , *ఆరోగ్యాన్ని పొందండి*

ధన్యవాదములు 🙏

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660


*సభ్యులకు విజ్ఞప్తి*

******************

ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.


కామెంట్‌లు లేవు: