8, నవంబర్ 2020, ఆదివారం

అధిక బరువు తగ్గాలి అంటే నవీన్ డైట్ ప్లాన్ ఈ లింక్స్ లో చూడాలి


Best healthy diet chart for wait loss i


  • అధిక బరువు తో బాధ పడుతున్నారా. అయితే ఈ డైట్ పాటించండి. 


ఆరోగ్యకర మరియు ఫిట్'గా ఉండే శరీరం కోసం భౌతిక కార్యకలాపాలు తప్పని సరి ముఖ్యంగా వ్యాయామాలు. ప్రతి రోజు వ్యాయామం చేయటం వలన ఫిట్'గా మరియు ఆరోగ్యకరంగా ఉంటారు. మీరు అధిక బరువు ఉన్నారా! అయితే బరువు తగ్గుటకు వ్యాయామాలు మరియు సరైన ఆహార పట్టిక అవసరం

బరువు తగ్గుటకు తయారుచేసుకున్న ప్రణాళికలో ఆరోగ్యకర ఆహారాలు మాత్రమే ఉండాలి. ఈ పట్టిక రోజు మీరు ఎన్ని క్యాలోరీలను తీసుకోవాలి అని తెలుపుతుంది. కావున బరువు తగ్గుటకు తయారు చేసుకునే ఆహార పట్టిక కు అనుగుణంగా ఆహార సేకరణను తీసుకుంటూ, ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోండి


  • బరువు తగ్గడానికి పాటించవలసిన నియమాలు.


బరువు తగ్గుటకు పట్టిక రూపొందించుకోవటం వలన రోజు మీరు ఎన్ని క్యాలోరీలు తీసుకుంటున్నారు, ఎంత సమయం పాటూ వ్యాయమాలకు కేటాయిస్తున్నారు అనే విషయాల పైన పూర్తి అవగాహన వస్తుంది. అంతేకాకుండా, ఇంకా పట్టికలో ఏమేం కలపాలి, తొలగించాలి అనే వాటి పైన పూర్తి అవగాహన పొందే అవకాశం ఉంది. బరువు తగ్గుటకు కావాల్సిన పట్టిక మార్కెట్ లేదా ఇంటర్ నెట్ లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీరు మందులను వాడుతున్నను, మీకు తగిన పట్టిక అందుబాటులో ఉన్నాయి
సులభంగా బరువు తగ్గించే ఆహర పట్టిక

ఇక్కడ మీ కోసం బరువు తగ్గుటకు సాధారణంగా అందరు వాడే ఆహర పట్టిక గురించి తెలుపబడింది. ఈ పట్టికలో మీకు నచ్చిన మార్పులు చేయవచ్చు మరియు ఇతర ఆరోగ్యకర ఆహారాలు అయినట్టి ఫైబర్ కలిగిన ఆహారాలు, తక్కువ ఫాట్ మరియు క్యాలోరీలను అందించే ఆహారాలను కలుపుకోవచ్చు. ఇలా మంచి పట్టికను రూపొందించుకొని, పాటించటం వలన మీ లక్ష్యాన్ని సులభంగా అధిరోహించ గలరు

  • తెల్లవారు జామున

బరువు తగ్గించుకొనుట రోజు ఉదయాన వ్యాయామాలతో మీ రోజును ప్రారంభించండి. ఈ వ్యాయామాల వలన క్యాలోరీలు ఖర్చు అవటమే కాకుండా, రోజంతా చైతన్యవంతంగా ఉంటారు

వ్యాయామాల అనంతరం, తక్కువ ఫ్యాట్ కలిగి ఉన్న పాలతో చేసిన టీ లేదా కాఫీ తాగండి. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉన్న బిస్కెట్లు కూడా తినవచ్చు


అంతేకాకుండా, మీ రోజును చిన్న గిన్నె నిండా ఉన్న తృనధాన్యాల సేకరణతో కూడా ప్రారంభించవచ్చు.

ఆకలిని అణచుకోవటం వలన బరువు తగ్గరు అని గుర్తుపెట్టుకోండి. తగిన విరామాలను ఇస్తూ, ఆరోగ్యకర ఆహారాలను తినడం మంచిది. మధ్యాన్న సమయంలో ఆకలి వేసే సమయానికి ముందు ఆపిల్ లేదా నారింజ పండు వంటి తాజా పండ్లను తీసుకోండి. వారంలో ఈ సమయంలో తీసుకునే పండ్లు, వివిధ రకాల పండ్లను చేర్చండి ఫలితంగా మీ శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు మీకు అందించబడతాయి.

  •  మధ్యాన్న భోజనం.

మధ్యాన్న సమయంలో తీసుకునే ఆహారంలో ఆరోగ్యకరమైనదిగా ఉండాలి. తక్కువ ఫ్యాట్ మరియు క్యాలోరీలను తక్కువ అందించే ఆహారాలను తీసుకోండి. మధ్యాన్న భోజనానికి 20 నిమిషాల ముందు నీటిని తాగండి. ఫలితంగా మీ ఆకలిని తగ్గించటమే కాకుండా, అధిక ఆహార సేకరణ నియంత్రించవచ్చు.

  • సాయంత్రం.

సాయంత్రం సమయంలో ఒక కప్పు టీ తో పాటు ఆరోగ్యకరమైన స్నాక్స్'లను తినండి. అంతేకాకుండా ఈ సమయంలో ఎక్కువ శాతం చక్కెర ద్రావణాలు లేదా సోడా వంటివి తాగే అవకాశం ఉంది. వీటి వలన శరీరానికి అధిక మొత్తంలో క్యాలోరీలు అందించబడతాయి.

  • రాత్రి భోజనం 

రాత్రి భోజనానికి 15 నిమిషాల ముందు నీటిని తాగండి.
కానీ రాత్రి సమయంలో తక్కువ ఆహారాన్ని మరియు పోషకాలను అందించే, ఆరోగ్యకర ఆహరాన్ని తీసుకోండి. వివిధ రకాల ఆహారాలను, తక్కువ క్యాలోరీలను అందించే వాటిని రాత్రి భోజనం తీసుకోండి.

  • రాత్రి భోజనం తరువాత 

ఈ సమయంలో తాజా ఆపిల్ లేదా పొప్పడి పండు ముక్కలను తినండి. ఇలా రోజు తాజా పండ్లు స్నాక్స్ ను తినడం వలన మీ ఆరోగ్యం పెంపొందించబడుతుంది.

ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
విశాఖపట్నం 
9703706660

*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

కామెంట్‌లు లేవు: