16, నవంబర్ 2020, సోమవారం

కాళ్లు, చేతులు మంటలు తగ్గాలంటే ఆయుర్వేదం నవీన్ సలహాలు .. అవగాహన కోసం రెమెడీ...ఈ లింక్స్ లో చూడాలి

అరికాళ్ళలో మంటలను తగ్గించుకోవడం ఎలా? పూర్తి వివరాలు తెలుసుకోండి.అరికాళ్ళ మంటలు సమస్య అనేది అనేక వ్యాధుల లక్షణాలలో దీనిని ఒకటిగా చెప్పుకోవచ్చు అనేక రకాల కారణాల వలన ఈ సమస్యను ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్నారు వైద్య భాషలో దీనిని న్యూరోపతి లేదా పారేస్తే సియా అని అంటారు దీనివలన అరికాళ్ళలో వేడిగా, సూదులు గుచ్చినట్లుగా మరియు మంటలుగా ఉండటం వల్ల చాలా బాధ పడుతూ ఉంటారు సాధారణంగా ఈ పాదాల మంటలు అనేది పాదాలకు సక్రమంగా రక్తప్రసరణ జరగకపోవడం వలన ఏర్పడతాయి ముఖ్యంగా కాళ్లల్లో దెబ్బతిన్న నరాల వలన ఇంకా వయసు పైబడుతున్న కొద్దీ నరాల బలహీనత వల్ల ఈ అరికాళ్ళ సమస్య సమస్యలు ఏర్పడతాయి ఇంకా కొన్ని చెడు అలవాట్ల వలన కొన్ని ప్రమాదకరమైన జబ్బుల వలన కూడా ఈ అరికాళ్ళ సమస్యలు ఏర్పడతాయి ఇంకా మధుమేహం కలిగిన వృద్ధులలో ఎక్కువ సమయం నిలబడి ఉండే ఉద్యోగులలో నరాల రుగ్మతలు ఉన్న వారిలో లో ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఇంకా కాళ్లల్లో పగుళ్ళు ఏర్పడటం వల్ల అరికాళ్ళ చర్మం పొరలుగా ఊడి పోవడం వలన కూడా ఈ సమస్యలు తలెత్తుతాయి.

  1. credit: third party image reference
  2. ఈ అరికాళ్ళ సమస్యలను పూర్తిగా నివారించడం ఆ వ్యాధులకు తగిన చికిత్స తీసుకోవడం వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది అయితే కొన్ని సూచనలు పాటించడం వల్ల అరికాళ్ళసమస్యల నుంచి కొంతమేరకు ఉపశమనం పొందవచ్చును ముందుగా సరియైన వ్యాయామం ప్రతిరోజు చేయవలెను అలాగే కొంత దూరము ప్రతిరోజు నడవవలెను దీనివల్ల రక్త ప్రసరణ జరిగి కొంతమేరకు ఉపశమనం కలుగుతుంది అలాగే మల్లెల ఆకులను మెత్తగా గ్రైండ్ చేసుకొని అందులో కొద్దిగా లైట్ గా వాటర్ కలిపి ఈ మిశ్రమాన్ని అరికాళ్ళ మంటలు తిమ్మిర్లు ఉన్నచోట లేపనంగా రాయ వలెను అలాగే కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు తీసుకొని అందులో కొద్దిగా పసుపు కలిపి ఈ మిశ్రమాన్ని అరికాళ్ళ మీద రాసిన ఉపశమనం కలుగు తుంది అలాగే గోరువెచ్చటి కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ లేదా అల్లం రసం ఈ మూడింటిలో ఏది అరికాళ్ళ మీద రాసిన త్వరితగతిన ఉపశమనం కలుగుతుంది అలాగే విటమిన్ B3 పుష్కలంగా ఉండే గుడ్డు పచ్చసొన పాలు బఠానీలు చిక్కుల్లో మొలకెత్తే విత్తనాలు వంటి పోషక విలువలు అధికంగా ఉండే వాటిని తీసుకోవడంం ద్వారా ఈ పాదాల సమస్యలను తగ్గించుకోవచ్చు ఈ విటమిన్ b3 అనేది నరాలకు బలాన్ని చేకూర్చి రక్త పీడనం వల్ల నరాల సమస్యలను నిరోధిస్తుంది అంతేగాక ఎక్కువగా ప్రోటీన్లు కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని అనగా చేపలు ఆకుకూరలు పాల ఉత్పత్తులు నట్స్ వంటిి పోషక విలువలున్న్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా అరికాళ్ళ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.credit: third party image reference
  3. గోరువెచ్చని నీటిలో అరికాళ్ళ నుంచితే అరికాళ్ళ మంటలు నుంచి ఉపశమనం పొందవచ్చును అలాగే ఈ గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలిపిన పాదాల నొప్పులు కూడా తగ్గిపోతాయి ప్రతి దినము వ్యాయామాలు మసాజ్ వాకింగ్ జాగింగ్ పరిగెత్తడం వంటివి ప్రతిదినము చేయటం వలన కూడా కాళ్ల మంటలు తగ్గిపోతాయి అలాగే పాదరక్షలు లేకుండా గడ్డి ఇసుక మీద నడవడం వల్ల పాదాల్లో రక్తప్రసరణ పెరుగుతుంది కానీ గట్టిగా ఉన్న నేల మీద వాకింగ్ అనేది చేయరాదు ఎందుకంటే దీనివల్ల నొప్పి మంటలు మరింత పెరుగుతాయి వయసు పైబడుతున్న కొద్దీ నరాల బలహీనత మూత్రపిండాల సమస్యలు వలన రక్తహీనత డయాబెటిస్ విటమిన్ బి 12 విటమిన్ బి 1 పాలక్ యాసిడ్ వంటివి వంటివి పాదాల్లో మంటలు రావడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు అల్లాన్ని మెత్తగా పేస్ట్ గా చేసి అరికాళ్ళ మంటలు ఉన్న చోట అప్లై చేయడం వల్ల అరికాళ్ళ మంటల తగ్గటంతోపాటు అరికాళ్ళ చర్మపు పొరలు ఊడటం తగ్గిపోతుంది అలాగే మునగ చెట్టు బెరడు గంధంగా తీసి అరికాళ్ళ పై మూడు పూటలా అప్లై చేయడం వలన అరికాళ్ళ సమస్యలు తగ్గుతాయి అలాగే మందార ఆకుల రసాన్ని కూడా అరికాళ్ళ పై అప్లై చేయడం వలన మంటలు తగ్గిపోతాయి అలాగే మర్రి చెట్టు బెరడు పై కారే పాలను తీసుకొని మూడు పూటలా కాళ్లపై రాయడం వల్ల కూడా ఉపశమనం ఉంటుంది అలాగే ఒక పెద్ద గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో ఐస్ గడ్డలు వేసి ఒక 10 నిమిషాలు కాళ్ళ నుంచి నా అరికాళ్ళ మంటలు తగ్గడంతోపాటు వాపు కూడా తగ్గిపోతుంది అలాగే వేడి ఆముదమును పాదాలకు అప్లై చేయడం వల్ల కూడా ఈ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది కనుక పై పద్ధతులను అనుసరించి మన అరికాళ్ళ సమస్యలు తగ్గించుకొని

 చేతులు మంటలు :
10 గ్రాముల ఆవునెయ్యిలో 5 గ్రాముల మిరియాలు చితగ్గొట్టీవేసి, మరగకాయాలి.చల్లారిన తరువాత ఆ నేయితో మర్ధనా చేస్తూ ఆ నేతినే అన్నంలో కలుపుకొని తింటూ వుంటే మంటలు తగ్గిపోతయ్

అధిక వేడి తగ్గటానికి:

దోరగా వేయించిన ధనియాలపొడి, దోరగా వేయించిన జీలకర్ర పొడి, దోరగా వేయించిన సోంపు పొడి కలిపి ఒక సీసాలో పెట్టుకుని  నీళ్ళలో ఈ పొడిని, సరిపోయేంత పటికబెల్లం, కొన్ని ఎండు ఉసిరి ముక్కలు వేసి వుంచి రోజంతా ఆ నీరు తాగుతూ వుంటే అధిక వేడి తగ్గుతుంది.

లేదా

సబ్జా గింజలు అర చెంచా, అర గ్లాసు నీళ్ళలో వేసి,10 నిముషాల తరువాత అందులో పటిక బెల్లం వేసుకుని తాగితే
15 నిముషాల్లో వేడి దిగిపోతుంది.

కామెంట్‌లు లేవు: