*మూత్ర విసర్జనలో బాధ(సిస్త్టెటిస్) ఉన్న వాళ్ళు తీసుకోవాలిసిన జాగ్రత్తలు అవగాహనా కోసం నవీన్ నడిమింటి --*
మూత్రవ్యవస్థలో ప్రధానంగా మూడు భాగాలుంటాయి.
1. మూత్రపిండాలు. ఇవి రక్తాన్ని వడగట్టి మూత్రాన్ని ఉత్పత్తి చేస్తాయి.
2. మూత్రకోశం. మూత్రపిండాల్లో తయారైన మూత్రం.. విసర్జనకు ముందు దీనిలో నిల్వ ఉంటుంది. 3. మూత్రమార్గం. దీని ద్వారా మూత్రం బయటకు విసర్జితమవుతుంది. వీటిలో మూత్రకోశం ఇన్ఫెక్షన్‌కు గురవటాన్ని 'సిస్త్టెటిస్' అంటారు.
ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు ఎన్ని సార్లు మూత్ర విసర్జన చేయాలో తెలుసా..?
మనం తిన్న ఆహారాన్ని, తాగిన ద్రవాలను కలిపి మూత్రపిండాలు వడపోయగా వచ్చే వ్యర్థ ద్రవాన్ని మూత్రమంటారని మనందరికీ తెలుసు. మూత్ర విసర్జన చేయడమంటే వ్యర్థాలను బయటికి పంపడమే. ఈ క్రమంలో రోజూ కొందరు అధికంగా, మరికొందరు తక్కువగా మూత్రానికి వెళ్తారు. అందుకు రక రకాల కారణాలు ఉన్నాయి.
ఆరోగ్యవంతమైన వ్యక్తులు 4 నుంచి 7 సార్లు మూత్ర విసర్జన చేయాలట. 4 సార్ల కన్నా తక్కువగా మాత్రం మూత్ర విసర్జన చేయకూడదు. లేదంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగని ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేసినా ఎలాంటి హానీ లేదు. ఆల్కహాల్, కాఫీ, టీ వంటివి తాగినప్పుడు, మూత్రాశయం ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారు, డయాబెటిస్ ఉన్నవారు, నీటిని అధికంగా తాగేవారు సహజంగానే 7 సార్ల కన్నా ఎక్కువగానే మూత్ర విసర్జన చేస్తారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు 7 సార్ల కన్నా ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తే దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. అది సహజమే. అయితే కేవలం 2 లీటర్ల నీటిని మాత్రమే తాగుతున్నా రోజుకు 11 సార్ల కన్నా ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తే అప్పుడు ఆ పరిస్థితిని అనారోగ్య స్థితిగా అనుమానించాలి. వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.
*👉🏿మూత్రం గురించిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.*
1. మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోకూడదు. దీని వల్ల మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు, కిడ్నీ స్టోన్స్ వస్తాయి.
2. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి మూత్రం పసుపు-తెలుపు కలగలిపిన రంగులో ఉంటుంది.
3. కొన్ని రకాల ఆహార పదార్థాలను తిన్నప్పుడు, ద్రవాలను తాగినప్పుడు మూత్రం రంగు మారుతుంది. అంతే కాదు కొన్ని సందర్భాల్లో వాసన కూడా వస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తిన్నప్పుడు మూత్రం రంగు ఎలా ఉన్నా, ఎలాంటి వాసన వచ్చినా భయం లేదు. అదే జంక్ ఫుడ్ వంటివి తిన్నప్పుడు మూత్రం రంగు మారడం, దుర్వాసన రావడం వస్తే అనుమానించాలి.
4. మూత్రం తీయని వాసన వస్తుంటే వారికి డయాబెటిస్ ఉందని తెలుసుకోవాలి.
5. మూత్రంలో దాదాపు 95 శాతం వరకు నీరే ఉంటుంది. మిగిలినది వ్యర్థ పదార్థమే.
6. సాధారణంగా ఆరోగ్యవంతమైన వ్యక్తి మూత్ర విసర్జన వ్యవధి 7 సెకండ్ల వరకు ఉంటుంది. అయితే ఇది వయస్సు పెరిగే కొద్దీ తగ్గుతూ వస్తుంది.
7. వయస్సు మీద పడిన కొద్దీ మూత్ర విసర్జనకు తరచూ వెళ్లాల్సి వస్తుంటుంది.
పురుషులకన్నా స్త్రీలు తేలికగా ఈ రుగ్మత బారినపడుతుంటారు. దీనికి ప్రధానంగా మూడు కారణాలున్నాయి. పురుషులకన్నా స్త్రీలలో మూత్రమార్గం పొడవు చాలా తక్కువ. గర్భధారణ సమయంలో పిండం తల మూలంగా ఇది సాగి ఉండడం రెండవ కారణం. స్త్రీలలో మూత్రమార్గం.. మలవిసర్జన ద్వారానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ కారణాల మూలంగా ఈ-కోలై క్రిములు మూత్రకోశంలో చోటుచేసుకుని తరచుగా సిస్త్టెటిస్‌కు గురికావడం జరుగుతుంది.
మూత్రకోశంలో చోటు చేసుకున్న ఇన్ఫ్‌క్షన్ పైన ఉన్న మూత్రపిండాలకు కూడా సోకటం చాలా తీవ్రమైన వ్యాధి. పెద్దపెట్టున జ్వరం, చలి, నిస్త్రాణ చోటుచేసుకుంటాయి. మూత్రాశయం ఇన్ఫెక్షన్‌కు గురైనప్పుడు మాటిమాటికీ మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావటం, విసర్జన సమయంలో మంట, తెలియకుండానే మూత్రంపడిపోతుండటం వంటి లక్షణాలు అధికంగా కనబడుతుంటాయి. అయితే కొన్నిసార్లు అత్యుత్సాహంగా రతి సల్పిన కేసుల్లో కూడా మూత్రకోశం ఇన్ఫెక్షన్‌కు గురికావచ్చు. నూతన దంపతులు ఈ బాధకు తరచూ గురికావడం జరుగుతుంది. దీనినే ''హనీమూన్ సిస్త్టెటిస్'' అంటారు.
*👉🏿Treatment :నాకు తిలిసిన కొన్ని మందులు &సలహాలు*
1.-నీరు ఎక్కువగా త్రాగాలి,రోజులు కు 4 లెటర్స్
2.-Tab . Urispas 1 tab 3 time /day for 7-10 days,
3.-Tab . Mahacef plus 1 tab 2 times /day for 7-10 days.
4.-Liq. Alakaline citrate .. 10 ml mixed with 100 ml of water 3time/day
5.-Tab . Supradyn 1 tab daily for 10-15 days .
Rest for 7-10 days .
Avoid sexual activities for 10 days.
Avoid spicy &junk food
7.-మద్యం పూర్తి దూరం లో ఉండలి
*ఆయుర్వేదం లో గ్యాస్ట్రిక్ పెయిన్ మంట నీకు తగ్గాలి అంటే*
సూతశేఖర రస అనుంటుంది ఆయుర్వేదిక్ మెడికల్ షాప్ lo. అది రెండు మాత్రలు వేస్కుని ఒక స్పూన్ అల్లం రసం +ఒక స్పూన్ తేనే కలుపుకుని తాగండి
ధన్యవాదములు 🙏
నవీన్ నడిమింటి
విశాఖపట్నం
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
మన గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.ఇంకా సమాచారం కావాలి కావాలి అంటే లింక్స్ లో చూడాలి
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి