పురుషుల్లో వృషణాలపై ఏర్పడే కంతులు అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు ,Testicular Tumours
telugu doctor September 09, 2014
పురుషుల్లో వృషణాలపై ఏర్పడే కంతులు,Testicular Tumours- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
-పురుషులకు మాత్రమే పరిమితమైన సమస్య - వృషణాలపై కంతులు ఏర్పడటం. వృషణాలపై ఏర్పడే కంతులు కేన్సర్ కానివి కావచ్చు.లేదా కేన్సర్ కంతులైనా కావచ్చు. వృషణాలపై కంతులు ఏ వయస్సు వారికైనా వచ్చే అవకాశాలున్నప్పటికీ, సాధారణంగా ఐదేళ్లలోపు చిన్నారుల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి. లేదా యుక్తవయస్సులోకి త్వరగా అడు గిడిన మగపిల్లల్లో కనిపిస్తాయి.వృషణాలపై ఏర్పడే ఈ కంతుల్లో అత్యధిక శాతం కేన్సర్ కాని కంతులే ఉంటాయి.
ఇవి ఒకచోటినుంచి మరొక చోటకు వ్యాప్తి చెందవు. అయినప్పటికీ, వీటిని శస్త్ర చికిత్స ద్వారా తొలగించాల్సి ఉంటుంది. కేన్సర్‌కు చెందిన కంతులు వృషణాలపై ఏర్పడితే అవి అక్కడినుంచి మరొక చోటికి వ్యాప్తి చెందవచ్చు.సాధారణంగా ఊపిరితిత్తులు, కాలేయం, లింఫ్ నోడ్స్, కేంద్ర నాడీ మండల వ్యవస్థలకు ఈ కేన్సర్ కంతులు వ్యాప్తి చెందుతాయి.
కారణాలు
మగపిల్లల్లో వృషణాలపై కంతులు ఎందుకు ఏర్పడతాయనే విషయమై ఇప్పటికీ స్పష్టమైన సమాచారం ఏదీలేదు. అయినా, ఇవి జెర్మ్ సెల్స్‌నుంచి ఏర్పడుతాయని భావిస్తున్నారు. గర్భస్థ పిండంలో ఎదిగే కణాలు ఈ జెర్మ్ సెల్స్. ఇవి పిండంతోపాటు అభివృద్ధి చెందుతూ పురుష, స్త్రీ జననావయవ వ్యవస్థగా రూపు దిద్దుకుంటాయి. జెర్మ్ సెల్స్ పిండంలో ఒక మధ్యస్థ రేఖన నుసరించి పెరుగుతూ, గర్భస్థ పిండం శిశువు స్త్రీ అయితే కటి వలయంలో అండాశయ కణాలుగానూ, శిశువు పురుషుడైతే, వృషణ కణాలుగానూ మారుతాయి.కేంద్ర నాడీ మండల వ్యవస్థ, మూత్ర, జన నావయవ వ్యవస్థల పనితీరు సక్రమంగా లేకపోవడం వంటి అనేక అంశాలు జెర్మ్ సెల్స్ కంతులుగా మారడానికి దోహదం చేస్తాయి.
లక్షణాలు
వృషణాల్లో వాపు, గట్టి దనం, వృషణాల రూపం, పరిమాణం మొదలైన వాటిలో అసాధారణతలు, వృష ణాల్లో నొప్పి మొదలైన లక్షణాలు ఉంటాయి. అయితే ఈ రకమైన లక్షణాలు ఇతర వ్యాధుల్లో కూడా కనిపించే అవకాశాలు న్నందున తప్పనిసరిగా వైద్య సహాయం పొందాల్సి ఉంటుంది.
-నిర్దారణ
సాధారణంగా వృషణాలపై ఏర్పడే కంతులను మొట్ట మొదటగా గుర్తించేది తల్లిదండ్రులే. తమ బిడ్డకు వృషణాలపై వాపు కనిపించగానే వారు వైద్యసహాయం పొందాలి. హెర్నియా, ఎపిడిడిమస్‌కు సోకే ఇన్‌ఫెక్షన్ వంటి సమస్యలు కూడా ఈ లక్షణాలను ప్రతిబింబించే అవకాశాలున్నందున తమ బిడ్డను శిశు వైద్య నిపుణులకు చూపించి, తగిన సహాయం పొందాలి. రోగి ఆరోగ్య, అనారోగ్య అంశాలు, భౌతిక పరీక్ష మొదలైన వాటితో వైద్యులు ఈ సమస్యను అనుమానించి, నిర్ధారణ నిమిత్తం కొన్ని పరీక్షలు చేయిస్తారు.
అల్ట్రాసౌండ్ : అల్ట్రాసౌండ్ పరీక్ష చేయడం ద్వారా వృషణాల్లో ఉన్న కంతి ఏ రకమైనదనే విషయాన్ని నిర్ధారించవచ్చు. అవసరమైతే మరిన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అత్యధిక తరచుదనం కలిగిన ధ్వని తరంగాలను వృషణాల్లోకి ప్రసరింపజేసి, కంప్యూటర్ మానిటర్‌పై వృషణాల్లోని రక్తనాళాలు, కణ జాలాలు మొదలైన వాటిని క్షణ్ణంగా పరీక్షిం చడానికి అల్ట్రాసౌండ్ పరీక్ష ఉపకరిస్తుంది.
సి.టి.స్కాన్ : ఎక్స్‌రేలు, కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానాలను మేళవించి చేసే పరీక్ష ఇది. దీనిలో వృషణాలను మరింత క్షుణ్ణంగా పరీక్షించడానికి అవకాశం ఉంటుంది. భూసమాంతరంగానూ, నిలువుగానూ వృషణాల్లో కొద్ది కొద్ది భాగాలను ముక్కలుగా (స్లయిస్) పరీక్షిస్తారు. దీని ద్వారా ఎముకలు, కండరాలు, కొవ్వు తదితర భాగాలను పరిశీలించడానికి అవకాశం ఉంటుంది.
ఎం.ఆర్.ఐ. : దీనిలో పెద్ద పెద్ద అయస్కాం తాలను, రేడియో ఫ్రీక్వెన్సీలను ఉపయోగిస్తూ పరీక్షిస్తారు.
బయాప్సి : కంతినుంచి చిన్న ముక్కను సేకరించి మైక్రోస్కోప్ కింద పరీక్షిస్తారు. దీని ద్వారా ఆ కంతి కేన్సర్‌కు చెందినదా? కాదా? అనే విషయాన్ని నిర్ధారించుకోవచ్చు.
సి.బి.సి. : ఈ పరీక్షను కంప్లీట్ బ్లడ్ కౌంట్ అంటారు. దీనిలో రక్త కణాల పరిమాణం, సంఖ్య, అవి పరిణతి చెందినవా? కాదా? అనే అంశాలను పరిశీలిస్తారు.
ఇతర పరీక్షలు : అవసరానుగుణంగా బ్లడ్ కెమిస్ట్రీ, కాలేయ, మూత్రపిండాల పని తీరు పరీక్షలు, జన్యు పరీక్షలు నిర్వహిస్తారు.
చికిత్స
చికిత్స సమస్య తీవ్రతనుబట్టి, బాధితుడి వయస్సు, ఇతర అనారోగ్య సమస్యలు మొదలైన అంశాలనుబట్టి ఆధారపడి ఉంటుంది. అలాగే, రోగి ఏ రకమైన మందులను తీసుకోగలుగుతాడు, ఎలాంటి ప్రక్రియలు ఉపయోగిస్తే రోగికి ఇతరత్రా బాధలు ఉండవనే అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని చికిత్స చేయాల్సి ఉంటుంది.వృషణాలపై ఏర్పడిన కంతులు కేన్సర్‌కు చెందినవైనా, కేన్సర్ కాని కంతులైనా వాటిని శస్త్ర చికిత్స ద్వారా తొలగించాల్సి ఉంటుంది. దీనిలో కంతిని, దానితోపాటు ఆ కంతి సోకినవైపు ఉండే వృషణాన్ని తొలగిస్తారు. ఈ చికిత్సను ఆర్కియెక్టమీ అంటారు.
ఒకవేళ వృషణంపై ఏర్పడిన కంతి కేన్సర్ రకమైనదైతే, దానిని తొలగించిన తరువాత కీమోథెరపీ ఇవ్వవలసి ఉంటుంది. కీమోథెరపీలో కేన్సర్ కణజాలం పెరగకుండా చేసే మందులను ఇస్తారు. కంతులు కుంచించుకుపోయేలా చేసేవి, కేన్సర్ కణాలు నశింపజేయడానికి ఉపకరించేవి అయిన అనేక రకాల ఔషధాలు కీమోథెరపీలో ఉపయోగిస్తారు.
కీమోథెరపీ విధానం
ఈ ప్రక్రియలో ఔషధాన్ని మాత్రలుగా నోటి ద్వారా తీసుకోవడానికి ఇస్తారు. లేదా ఇంజక్షన్ రూపంలో కండరాల్లోనుంచి కాని, నేరుగా రక్తనాళంలోకి (సిరల్లోకి - ఇంట్రావీనస్ లేదా ఐవి) కాని ఇస్తారు. ఔషధాన్ని నేరుగా వెన్నుపాము ద్వారా ఇవ్వడాన్ని ఇంట్రాథెకల్లీ అంటారు.ఇవేకాకుండా, కేన్సర్ కణాలను నాశనం చేయడానికి అత్యధిక శక్తి కలిగిన ఎక్స్‌రేలను (రేడియేషన్)ను ఇస్తారు. ఈ ప్రక్రియను రేడియేషన్ థెరపీ అంటారు. చికిత్స తరువాత కూడా రోగిని కొంతకాలంపాటు వైద్యుల పర్యవేక్షణ ఉంచాలి
ధన్యవాదములు
మీ నవీన్ నడిమింటి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి