18, జనవరి 2020, శనివారం

కీళ్ల నొప్పులు వచ్చినప్పుడు తీసుకోవాలిసిన జాగ్రత్తలు


కీళ్ళనొప్పులు - జాగ్రత్తలు అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 



కీళ్ళ నొప్పులంటే వృద్ధాప్యంలో వచ్చేవి మాత్ర మే కావు. 6 నుంచి 60 ఏళ్ళ పైబడి కూడా ఏ వయస్సులోని వారికైనా ఈ నొప్పులు వచ్చే అవకాశం ఉంది. యుక్తవయస్సులో వారికి ఈ నొప్పులు వచ్చినా ఆశ్చర్యపోనవసరం

(1) రుమటాయిడ్ ఆర్థరైటీస్
(2) ఆస్టియో ఆర్థరైటీస్
(3) గౌట్


రుమటాయిడ్ ఆర్థిరైటిస్: మోకాళ్ళు, మోచేతులు, చీలమండలు, కాలి వేళ్ళు, మణికట్టు, భుజాలు, నడుము, వెన్నుముక భాగాలు వాపుతో కూడిన నొప్పితో బాధిస్తూ ఉంటాయి. ఈ సమస్యతో మగవారి కంటే ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యాధితో బాధపడుతున్నప్పుడు జ్వరం రావటం, వ్యక్తి కదల్లేకపోవటం సంభవిస్తుంది. కీళ్ళ ప్రాంతంలో ‘నాడ్యుల్స్ అనబడే బొడిపెల వంటి ఎముకల ఉబ్బెత్తులు ఏర్పడి ఉంటాయి. ఈ ముఖ్య లక్షణం ఆధారంగా కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్‌గా గుర్తించాలి. ఈ వ్యాధి శరీరం లోని అన్నిరకాల కీళ్ళకు సంభవించవించే అవకాశాలు ఉన్నాయ.

ఆస్టియో ఆర్థిరైటీస్: సాధారణంగా ఎక్కువ శాతం మందిలో వచ్చే కీళ్ళనొప్పి ఈ రకానికి చెందినదేఉంటుంది. బాగా బరువును మోసే కాళ్ళు ఈ వ్యాధికి ఎక్కువగా గురికావటం జరుగుతుంటుంది. ముఖ్యంగా మోకాళ్ళు ఈ వ్యాధికి గురై నొప్పి, వాపును కలిగి ఉండి కదలటం కష్టంగా మారుతుంది. స్థూలకాయం ఉన్నవారిలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండగా కూర్చోవడం కదలటం, ఇబ్బందిగా మారుతుంది.

గౌట్: గౌడ్ వ్యాధి మొదట కాలి బొటన వేలుతో మొదలై తరువాత మోకాళ్ళు, భుజము, మోచేయి, మణికట్టు, వేళ్ళ కణుపులు నొప్పికి గురై బాధిస్తుంది. ఈ వ్యాధి సోకినప్పుడు కీళ్ళు కదిలించటం కష్టంగా ఉంటుంది. ఈ వ్యాధి రక్తంలో యూరిక్ ఆసిడ్ స్థాయి పెగడం వలన సంభవించే అవకాశాలు ఉంటాయ..

కీళ్ళనొప్పులు వచ్చేందుకు వందకు పైగా కారణాలున్నాయి. వృద్ధ్దాప్యం కారణంగా క్షీణించిన కీళ్ళ వల్ల సాధారణంగా వృద్ధులు కీళ్ళనొప్పులకు గురవుతుంటారు. యుక్తవయస్సులో ఉన్నవారు మాత్రం ఇన్‌ఫ్లమేటరీ లేదా ఇన్‌ఫెక్టివ్‌ వ్యాధులకు గురవుతుంటారు. కొన్ని సందర్భాల్లో వృద్ధులు కూడా ఈ వ్యా దులకు లోనవుతుంటారు. దెబ్బల కారణంగా కూడా ఈ నొప్పులు వచ్చే అవకాశం ఉంది. ఒక్కోసారి శరీరానికి కావలసినంత కాల్షియం తక్కువైనా మనకి కీళ్లనొప్పులు వస్తుంటాయి. వయసుతో సంబం దం లేకుండా ఈ రోజుల్లో చిన్నవారి నుంచి పెద్దవాళ్ల వరకూ ఈ కీళ్లనొప్పుల సమస్యలు అధికంగా ఉంటున్నాయి. కీళ్ళనొప్పులు వచ్చేందుకు దారి తీసిన పరిస్థితులను బట్టి చికిత్స ఉంటుంది.


క్షీణత కారణంగా వచ్చే వ్యాధులు సాధారణంగా బరువును మోసే కీళ్ళు మోకాళ్ళు (ఆస్టియోఆర్థరిటిస్‌) లాంటి వాటిని ప్రభావితం చేస్తాయి. ఇన్‌ఫ్లమేటరీ జాయింట్‌ డిసీజెస్‌ (రుమటాయిడ్‌ అర్థరిటిస్‌) చిన్న చిన్న జాయింట్లు చేతిభాగం, మణికట్టు కీళ్ళను ప్రభావితం చేస్తాయి. కొన్ని సందర్భాల్లో మాత్రం మోకాళ్ళు, మోచేతుల కీళ్ళు కూడా ఈ తరహా వ్యాధులకు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది.

వెన్ను దిగువ భాగంలో నొప్పి రెండు రకాలు. కూర్చొనే భంగిమ సరిగా ఉండకపోవడం, దీర్ఘకాలం పాటు డ్రైవింగ్‌ చేయడం, వెనుక భాగంలో బాగా స్ట్రెయిన్‌కు గురి కావడం, ఎక్కువ సమయం కూర్చుని పనిచేయడం, ఎక్కువ బరువులు మోయడం లాంటి వాటి కారణంగా వచ్చే మెకానికల్‌ నొప్పులు ఒకరకమైతే, యాంకిలాజింగ్‌ స్పాండిలైటిస్‌ లాంటి వాటి కారణంగా వచ్చే ఇన్‌ఫ్లమేటరీ నొప్పులు రెండో రకం. ఈ రెండో రకం తీవ్రమైన సమస్య. సాధారణంగా ఇది పిరుదుల నొప్పితో కూడా ముడిపడిఉంటుంది. దీనికి సత్వర చికిత్స తీసుకోవడం మంచిది. మొదటి రకం (మెకానికల్‌) సమస్యలను మందులతో, ఫిజియోథెరపీతో పరిష్కరించుకునే అవకాశం ఉంది. నొప్పి ఏ రకమైందో పరీక్షల అనంతరమే రుమటాలిజిస్ట్‌ నిర్ణయించగలుగుతారు.

ఈ నొప్పులు వచ్చే ముందు.. కొన్ని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. కీళ్ళు ఉన్న ప్రాంతంలో కందిపోయినట్లుగా కనిపించడం, వాచినట్లుగా ఉండి, వేడిగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే, ఈ నొప్పులతో బాధపడే వారు నీరసం, తలనొప్పి, ఆకలి లేకపోవడం, జ్వరంలాంటి లక్షణాలతో బాధపడుతుంటారు.ఈ సమస్య మహిళల్లో చాలా సాధరణ సమస్యగా మారింది. వయస్సు పెరిగే కొద్ది మహిళల్లో కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాపులు అధికం అవుతుంటాయి. అయితే దీన్ని నుండి బయటపడటం ఎలా ?.చికిత్స ఏంటి అని చర్చించుకుంటుంటాం. ఈ సమస్య నివారంచండ తెలుసుకోడం పెద్ద కష్టమైన పనేం కాదు.?అయితే ఇటువంటి సమస్య ఎదుర్కోకుండా ముందు జాగ్రత్త తీసుకోవడం వల్ల వచ్చి తర్వాత నయం చేసుకోవడం కంటే సులభం. చాలా వరకూ ఈ సమస్య క్యాల్షియం లోపం వల్ల ఏర్పడుతుంది. కానీ క్యాల్షియం ఒక్కదాన్ని పొందడం వల్ల కీళ్ళ నొప్పులు కీళ్ళ వాపులను నయం చేసుకోలేం.  కొన్ని సందర్భాలో ఒబేసిటి(ఊబకాయం)లేదా ఎక్కువగా వ్యాయామం చేయడం వల్ల కూడా బోన్ హెల్త్ కు చాలా చెడు ప్రభావం చూపెడుతుంది. సాధారణంగా మహిళల్లో మోనాపాజ్ దశకు చేరుకొన్న తర్వాత ఇటుంటి సమస్యను ఎదుర్కోవల్సి వస్తుంది . కాబట్టి పోస్ట్ మోనోపాజ్ చేరుకొనే ముందే బోన్ హెల్త్ గురించి తెలుసుకొన్నట్లైతే, ఈ సమస్యను సులభం నివారించుకోవచ్చు. ఈ సమస్య నివారణకు సహజంగా పాటించే ఒక మంచి మార్గం మన శరీరం ఫిట్ గా మరియు యాక్టివ్ గా ఉండేట్లు చూసుకోవడమే. అందుకు కొన్ని విలువైన పద్దతులు మీకోసం....

ఒబేసిటి(ఊబకాయం): ఒబేసిటి (ఊబకాయ) కీళ్ళనొప్పలు/కీళ్ళ వాపులకు బెస్ట్ ఫ్రెండ్ వంటిది. కాబట్టి మీ బరువును కనుక కంట్రోల్ చేసుకొన్నట్లైతే , మీ ఎముకలు ఎక్కువ ఒత్తిడికి గురికాకుండా ఉంటాయి. క్యాల్షియం రిచ్ ఫుడ్స్ తప్పక తీసుకోవాలి: ఆస్టియోపొరెసిస్(కీళ్ళనొప్పులు,వాపుల)కు కారణం కాల్షియం లోపమే. మహిళల్లు వారి శరీరంలో క్యాల్షియం చాలా సులభం కోల్పోతుంటాయి. కాబట్టి మహిళలు అధిక క్యాల్షియం ఉండేటటువంటి ఆహారాలు పాలు, డైరీ ప్రొడక్ట్స్, ఆకు కూరలు, బ్రొకోలీ, సీఫుడ్స్,మొదలగునవి డైలీ డైయట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి. శారీరక నొప్పులు ఎటువంటివైన నెగ్లెక్ట్ చేయకండి: ముఖ్యంగా జాయింట్ పెయిన్స్ ఓస్టియోపొరొసిస్ కు దారితీస్తుంది. కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాపులు ఉన్నట్లైతే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి. బోన్ టెస్ట్ చేయించకోడం ఉత్తమం. 
లేదు.సాధారణంగా కీళ్ళకు సంబంధించిన వ్యాధులను ఆర్థరైటీస్ అంటారు.ఆర్థరైటిస్ అనగా – కీళ్ళలో వాపుతో పాటు నొప్పి అధికంగా ఉండి కదలలేక పోవుట. ఆర్థిరైటిస్ చాలా రకాలున్నాయి. వయసును బట్టి, కారణాలను బట్టి శరీరములోని వివిధ ప్రాంతాలు ఆర్థరైటిస్‌కు గురికావడం జరుగుతుంది.

క్ర్యాష్ డైయట్: క్ర్యాష్ డైయట్ తీసుకొనే ఆహారంలో సమయాన్ని పాటించకపోవడం. ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా తినడం. క్ర్యాష్ డైటింగ్ వల్ల మీ శరీర బరువు అతి త్వరగా తగ్గవచ్చు లేదా పెరగవచ్చు. దాంతో ఉన్నఫలంగా శరీరంలోని క్యాల్షియం నిల్వలు, కొన్నిన్యూట్రీషియంట్స్ తగ్గిపోతాయి. కాబట్టి ప్రతి రోజూ టైమ్ టు టైమ్ మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. రెగ్యులర్ వ్యాయామం: ప్రతిరోజూ వ్యాయామం చేసినట్టైతే మీ ఎముకలు ఫ్లెక్సిబుల్ గా మారుతాయి. ఏదైనా సరే ధీర్ఘకాలం పాటు చేస్తేనే మంచి ఫలితాలను పొందవచ్చు. అదేవిధంగా ఎముకలు బలాన్ని పొందుతాయి. క్యాల్షియం సప్లిమెంట్: మోనోపాజ్ దశ చేరుకోగానే, మన శరీరంలో ఎముకల బలానికి సహాయపడే ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గిముఖం పడుతుంది. కాబట్టి క్యాల్షియం సప్లిమెంట్స్ ను తీసుకోవడం మొదలు పెట్టండి. సన్ బాత్: విటమిన్ డి సహాయం లేకుండా మీ శరీరంలో క్యాల్షియం ఉత్పత్తి కాదు. విటమిన్ డి పొందాలంటే సన్ లైట్ మన శరీరం మీద పడేలా చూసుకోవాలి. కాబట్టి ప్రతి రోజూ ఉదయం వచ్చేసూర్యరశ్మిలో కొద్దిసేపు గడపడం వల్ల మీ శరీరానికి విటమిన్ డి అందుతుంది. ఈ చిన్న చిన్న చిట్కాలను పాటించినట్లైతే ఓస్టియోపొరొసిస్ ను సులభంగా నేచురల్ పద్దతిలో నివారించుకోవచ్చు.

జాగ్రత్తలు
* ఆల్కహాలు, స్మోకింగ్ మానివేయాలి.
*కీళ్ళనొప్పులు అధికంగా ఉన్నప్పుడు బరువులు ఎత్తకూడదు.
*స్థూలకాయం ఉన్నవారు బరువు తగ్గుటకు ప్రయత్నించాలి.
*కాల్షియం ఉన్న పోషక ఆహారం తీసుకోవాలి. (పాలు, గుడ్లు, పెరుగు వంటివి).
*ఒకేచోట ఎక్కువసేపు కూర్చోవటం నివారించాలి.
*వ్యాయామం, నడక, సైక్లింగ్ వలన కీళ్ళ నొప్పులు అధికమవుతున్నట్లు అనిపించినా కూడా వ్యాయామం ప్రతిరోజు కొద్దిసేపు చేయుటకు ప్రయత్నించాలి.
*అతిగా పెయిన్ కిల్లర్స్ వాడొద్దు

తాత్కాలిక ఉపశమనానికి వంటింటి వైద్య చిట్కాలు


1. నొప్పులున్నచోట యూకలిప్టస్ ఆయిల్ పూసి వేడినీళ్ళతో తాపడం పెట్టాలి. లేకుంటే మెత్తటి తువ్వాలు వేడినీళ్ళల్లో ముంచి బాగాపిండిన తర్వాత ఆ వేడి తువ్వాలును నొప్పులున్న చోట పెట్టాలి.

2. సహజంగా కీళ్ళ నొప్పి ఉదయం పూట అధికంగా ఉంటుంది. దీనికి ప్రతిరోజు రాత్రిపూట పడుకునే ముందు నొప్పి ఉన్నచోట ఆయింట్ మెంట్ పూయాలి.

3. తేలిక పాటి వ్యాయామం, సైక్లింగ్, ఈత, నడక కూడా నొప్పులు నివారించడంలో సహకరిస్తాయి.

4. క్రింద కూర్చునేటప్పుడు కాస్త జాగ్రత్తగా కూర్చోవాలి.

5. అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గేమార్గం ఆలోచించాలి.

6. విటమిన్ సి కి సంబంధించిన పండ్లు అధికంగా తీసుకోవాలి..జామపండు, కమలాపండు మొదలైనవి.

7. ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్, పాలు, ఉర్లగడ్డలు వాడకూడదు.

8. కాస్త ఉప్పుకలిపిన నీటిలో చింతాకులు ఉడికించి నొప్పులున్నచోట ఆనీటిని పోయాలి.

9. వారానికి ఒకసారి ఉపవాసం ఉండటం మంచిది. క్యారెట్‌జ్యూస్, క్యాబేజ్‌సూప్ తీసుకుంటే నొప్పులు తగ్గుతాయి.

10.  నువ్వుల నూనె మరియు నిమ్మరసము సమభాగములుగా కలిపి కీళ్ళపై మర్దన చేసినచో కీళ్లవాతం తగ్గి క్రమంగా నొప్పులు తగ్గిపోవును.

11. వావిలి వేరు చూర్ణము ఒక గ్రాము, రెండు గ్రాముల నువ్వుల నూనెలో కలిపి రోజుకు రెండు సార్లు తిన్నచో కీళ్ళవాతము, నడుము నొప్పి కూడా తగ్గును.

12. కీళ్ళ మీద ఆవనూనెను ప్రతిరోజూ రెండు పూటలా మర్దన చేసినట్టయితే కొంతమేరకు ఉపశమనం కలిగిస్తుంది. అలాగే, సైంధవ లవణం ఒక స్పూను, దానిమ్మ చిగుళ్ళు కొంచెం కలిపి నూరి, శనగగింజంత మాత్రలుగా చేసుకుని ఒక మాత్ర చొప్పున మూడు పూటలా తీసుకుంటే కీళ్ళ వ్యాధులు తగ్గిపోతాయని నాటు వైద్యులు చెపుతున్నారు.

13. మిరియాలు ఒక స్పూను, విషముష్టి గింజలు ఒక స్పూను ఈ రెండింటినీ అల్లం రసంలో మూడు రోజుల పాటు నాన బెట్టి, ఆ తర్వాత మెత్తగా మర్దన చేసి చిన్న చిన్న కంది గింజలంత మాత్రలు చేసుకుని ప్రతిరోజూ రెండు పూటలా ఒక మాత్ర చొప్పున వేసుకుంటే అనేక రకాల కీళ్ళ వ్యాధులు తగ్గిపోతాయి

14. ఉల్లిపాయ, ఆవాలు సమ భాగాలుగా తీసుకుని బాగా నూరి నొప్పిగా ఉన్న కీళ్ళమీద మర్దన చేసుకుంటే వెంటనే నొప్పులు తగ్గుతాయి

15. నువ్వుల నూనె ఒక కప్పు, నాలుగు వెల్లుల్లిపాయ రేకులను చిన్న ముక్కలుగా చేసి నూనెలో వేసి బాగా మరగకాచి, చల్లార్చి ఆ నూనెను వడగట్టి కీళ్ళ నొప్పులున్న చోట మర్దన చేస్తే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.ఇలా మర్దన చేయడం వల్ల కొందరికి కీళ్ళ నొప్పులు తగ్గకుండా నొక్కడం వల్ల ఇంకా బాధ పెరుగుతుంది. ఇటువంటి వారు నూనెను రాసుకుని కాపడం పెడితే చాలు. కీళ్ళు స్వాధీనంలోకి వచ్చాక మర్దన చేసుకోవచ్చు

16. జీల్లేడు వేరు చూర్ణాన్ని వేప నూనెలో బాగా కలిపి మర్దన చేసుకున్నట్లయితే కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయి.
17.తమలపాకును రుబ్బుకుని కీళ్లవాతం, మోకాళ్ల నొప్పులకు పూతలా వేసుకుంటే.. నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

హోమియో చికిత్స
కీళ్ళ నొప్పులకు హోమియో వైద్యంలో చక్కని చికిత్స కలదు. వ్యాధి తొలి దశలోనే ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించటం వలన మంచి ఫలితాలు ఉంటాయి.
రుస్‌టాక్స్: కూర్చుంటే బాధలు ఎక్కువ ఉండి, కదలిక వలన ఉపశమనం కలుగును.

బ్రయోనియా: ఏ మాత్రం కదిలిన బాధ ఉండును. వీరికి అమిత దాహం కలిగి ఉండును. వీటితోపాటు మలబద్దకం, జిగురు పొరలు పొడి ఆరిపోతాయి.

ఏపిస్: కాళ్ళు, చేతులు నీరుపట్టి నొక్కతే గుంటలు పడతాయి. కీళ్ళు వాపును కలిగి ఉండి నొప్పి ఉంటుంది. వీరికి చల్లని వాతావరణం, చన్నీటి స్నానం హాయిగా ఉంటాయి. ఇలాంటి వారికి ఈ ఔషధం అలోచించదగినది.

ఆర్పినికం ఆల్బం: నొప్పులు అధికంగా ఉండి, జ్వరం, వాపు, దాహం ఎక్కువగా ఉంటుంది. వీరు మానసికంగా విచారం, దిగులు అపరాధ భావనతో కూడిన ఆందోళన, వ్యాధి తగ్గదని నిరాశను కలిగి ఉన్నవారికి ఈ మందు ఆలోచించదగినది.

లెడంపాల్: కీళ్ళు వాచి నొప్పి పెట్టి ఉంటాయి. నొప్పులు పాదాల్లో, మడమల్లో ప్రారంభమై క్రమంగా పైకి పాకుట ఈ మందులోని ముఖ్యలక్షణం.

మెర్క్‌సాల్: గనేరియా, సిఫిలిస్‌ల్ని అణగదొక్కడం వల్ల ఆర్థిరైటీస్ వస్తే ఇది వాడాలి.

(ఇలా లక్షణ సముదాయమును బట్టి హోమియో మందులను డాక్టర్ సలహా మేరకు మాత్రమే వాడుకుంటే కీళ్ళ నొప్పుల నుండి విముక్తి పొందవచ్చును.)


కామెంట్‌లు లేవు: