6, జనవరి 2020, సోమవారం

యూరిన్ క్లియర్ గా ఉండి.యూరిన్ ఆపుకోలేక నొప్పిగా ఉంది లక్షణం.నవీన్ నడిమింటి సలహాలు


మూత్రాశయ సంక్రమణం (సిస్టిటిస్) వ్యాధి అనేది పిల్లలు మరియు పెద్దలను ఒకేలా బాధించే మూత్ర మార్గ సంక్రమణం. మూత్రనాళంలోనే ఈ వ్యాధిబాధిత ప్రాంతాలేవంటే మూత్రపిండాలు (పైలోనెఫ్రిటిస్) మరియు మూత్రమార్గం. (urethritis). పురుషులు కంటే మూత్రపిండాల సంక్రమణకు మహిళలు ఎక్కువగా గురవుతుంటారు. మూత్రవిసర్జన సమయంలో తరచుగా మంట (బర్నింగ్) తరచూ మూత్ర విసర్జనాలు ఈ మూత్రపిండ సంక్రమణ వ్యాధి యొక్క అత్యంత సాధారణ లక్షణాలు. దీనికి చికిత్స చేయనిపక్షంలో  మూత్రపిండాలకు మరియు మూత్రమార్గానికి కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ మూత్రాశయ సంక్రమణ వ్యాధిని వదిలించుకోవడానికి మరియు వ్యాధి లక్షణాల ఉపశమనానికి యాంటీబయాటిక్స్ని సూచిస్తారు.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి? 

మూత్రాశయ సంక్రమణ వ్యాధికి సంబంధించిన లక్షణాలు తరచుగా అధికమైన బాధ, యిబ్బందితో కూడుకుని ఉన్నవై ఉంటాయి. వీటితొ పాటు:

  • మూత్రవిసర్జన చేసేటప్పుడు నొప్పి లేదా మంట సంభవిస్తుంది. (మరింత సమాచారం: నొప్పితో కూడిన మూత్రవిసర్జన కారణాలు)  
  • మూత్రవిసర్జనకు పోయి వచ్చిన వెంటనే తిరిగి మూత్రవిసర్జనకు పోవాలనిపిస్తుంది, ఇది తరచూ జరుగుతూ ఉంటుంది. ఇలా రోజంతా మరియు రాత్రి అంతటా బాధించవచ్చు.
  • మూత్రవిసర్జనకు పోవాలనిపించినపుడు మూత్రాన్ని కొద్దిసేపు కూడా ఆపుకోలేక పోయే అసమర్థత
  • మూత్రం రంగులో మార్పు- మేఘావృతంరంగు, ముదురు రంగు, మొ.
  • తీవ్రమైన సంక్రమణ విషయంలో మూత్రంలో రక్తం
  • మూత్రం ఘాటైన దుర్వాసన
  • సాధారణ బలహీనతతో పొత్తి కడుపు నొప్పి
  • అధిక-స్థాయి సంక్రమణకు సంబంధించి చలితో కూడిన జ్వ

దీని ప్రధాన కారణాలు ఏమిటి? 

చాలా సందర్భాలలో మూత్ర నాళాల అంటువ్యాధులు లేదా మూత్రాశయం అంటువ్యాధులు ఇ. కోలి అని పిలువబడే ఒక రకం బాక్టీరియా వలన సంభవిస్తుంది .

మూత్రాశయ సంక్రమణ ప్రమాదాన్ని పెంచే కారకాలు కూడా ఉన్నాయి

  • మూత్రాశయంలో ఎక్కువకాలం పాటు ఉంచబడిన కాథెటర్ వల్ల  
  • లైంగిక సంపర్కం, ముట్లుడగడం (మెనోపాజ్), గర్భనిరోధకం యొక్క అవరోధ పద్ధతులు (డయాఫ్రాగమ్), గర్భం మొదలైనవి. ఈ కారణాలవల్ల సాధారణంగా మహిళలలో మూత్రాశయం సంక్రమించే అవకాశం ఉంది. మహిళల్లో మూత్రనాళం యొక్క తక్కువ పొడవు మరియు పాయువుకు సమీపంలో మూత్రాశయ ప్రారంభ స్థానం కారణంగా మూత్రాశయ వ్యాధులకు మహిళలు ఎక్కువగా గురవుతూ ఉంటారు.
  • చక్కెరవ్యాధి (డయాబెటిస్)
  • విస్తరించిన ప్రోస్టేట్ గ్రంధి
  • ముసలితనం, మరియు ఎక్కువకాలంపాటు కదలలేని స్థితితో కూడిన దీర్ఘకాలిక అనారోగ్యం
  • మూత్ర మార్గానికి సంబంధించిన శస్త్ర చికిత్స లేక ఇతర చికిత్సా పద్దతులు

దీన్ని ఎలా నిర్ధారించేది మరియు దీనికి చికిత్స ఏంటి?

వైద్యులు వ్యాధి లక్షణాలు మరియు శారీరక పరీక్షల ఆధారంగా మూత్రాశయం సంక్రమణను నిర్ధారిస్తారు. రోగ నిర్ధారణ నిర్ధారణలో సహాయపడే పరీక్షలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

మూత్ర విశ్లేషణ

  • డిప్-స్టిక్ పరీక్షను మూత్రంలో పెరిగిన ఆమ్లత్వాన్ని సంక్రమణ సమయంలో గుర్తించడానికి ఉపయోగిస్తారు. ఇది మూత్రంలో సంక్రమణను గుర్తించటానికి చాలా తక్కువ ధర కల్గిన పరీక్ష.
  • నైట్రైట్స్ (Nitrites) మరియు ల్యూకోసైట్ ఎస్టేరేజ్ పరీక్షలు సంక్రమణ సమయంలో మూత్రంలో తెల్ల రక్త కణాల ఉనికిని గుర్తించడానికి చేయబడతాయి.
  • ప్రయోగశాలలో కృత్రిమ మాధ్యమంలో మూత్రం నమూనాలో సంక్రమణనికి -కారణమయ్యే బాక్టీరియా పెరుగుదలను అంచనా వేయడానికి “మూత్ర సంస్కృతి” (urine culture) పరీక్ష జరుగుతుంది.

ఇమేజింగ్ స్టడీస్ పరీక్షలు

అధిక-స్థాయి మరియు పునరావృత అంటువ్యాధులు, లేదా ప్రామాణిక చికిత్సకు స్పందించని మూత్రాశయపు అంటురోగాల సందర్భాలలో అనేక ఇతర పరిశోధనలు జరుగుతాయి.ఆ ఇతర పరిశోధనలు ఏవంటే:

  • మూత్రాశయాంతర్దర్శిని (Cystoscopy)
  • అల్ట్రాసౌండ్
  • ఎక్స్-రే (X- రే) ఇమేజింగ్
  • ఇంట్రావెనస్ పైలెగోగ్రామ్ (IVP)
  • కంప్యూటెడ్ టోమోగ్రఫీ స్కాన్ (CT స్కాన్)
  • అయస్కాంత ప్రతిధ్వని ఇమేజింగ్ (Magnetic resonance imaging (MRI))
  • చురుకుదనం అధ్యయనాలు (Urodynamic studies)

మూత్రాశయ సంక్రమణ యొక్క చికిత్స అనారోగ్యంతో బాధపడుతున్న రోగిని వ్యాధి లక్షణాల నుండి సంరక్షించి ఉపశమనాన్ని కల్గించడానికి. చికిత్స వ్యాధిని  నిర్మూలించడానికి ఉద్దేశించబడింది.

యాంటిబయాటిక్స్

  • మూత్రాశయ సంక్రమణ వ్యాధి సాధారణంగా పెద్దలకైతే 5 రోజుల్లో మరియు 2 నుండి 3 రోజుల్లో పిల్లలకు యాంటీబయాటిక్ కోర్సు ఇవ్వడంతో నయమవుతుంది.
  • యాంటీబయాటిక్స్ మందుల్ని దీర్ఘకాలంపాటు సేవించడంవల్ల మూత్రాశయ సంక్రమణం యొక్క పునరావృతాన్ని ఆలస్యం (could be delayed) చేయవచ్చు.
  • తీవ్ర అంటువ్యాధుల విషయంలో ఇంట్రావీనస్ యాంటిబయోటిక్స్ మందులు ఇవ్వబడతాయి.

ఇతర మందులు

  • యూరిన్ ఆల్కలీసర్లు (Urine alkalisers) మందులు మూత్రం యొక్క ఆమ్లతను తగ్గిస్తాయి మరియు మంటను కూడా తగ్గిస్తాయి.

స్వీయ రక్షణ Self-care

  • ద్రవాహారాలను పుష్కలంగా త్రాగాలి: తరచు మూత్రవిసర్జన ద్వారా ఈ మూత్రాశయ సంక్రమణను తొలగించుకోవడానికి ద్రవాహారాలను పుష్కలంగా త్రాగాలి.
  • మూత్ర నాళాల సంక్రమణ సమయంలో ఇబ్యుప్రొఫెన్ లేదా ఆస్పిరిన్ వంటి NSAIDs (నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్) తీసుకోవడం మానుకోండి .
  • క్రాన్బెర్రీ జ్యూస్ మూత్రాశయ వ్యాధుల పునరావృత నివారణకు సహాయపడుతుంది.

కడుపు నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి వేడినీటి కాపడాలు  సహాయపడతాయి.కొన్ని మందులు 


Medicine NamePack Size
Blumox CaBLUMOX CA 1.2GM INJECTION 20ML
BactoclavBACTOCLAV 1.2MG INJECTION
Mega CvMEGA CV 1.2GM INJECTION
Erox CvEROX CV 625MG TABLET
Moxclav 625 Mg TabletMOX CLAV DS 457MG TABLET 10S
NovamoxNOVAMOX SYRUP
Moxikind CvMOXIKIND CV 375MG TABLET
PulmoxylPulmoxyl 250 Mg Tablet Dt
ClavamCLAVAM 1GM TABLET 10S
AdventADVENT DROPS
AugmentinAUGMENTIN 500/100MG INJECTION 10ML
ClampCLAMP 30ML SYRUP
MoxCIPMOX 500MG CAPSULE
Zemox ClZemox Cl 1000 Mg/200 Mg Injection
P Mox KidP Mox Kid 125 Mg/125 Mg Tablet
AceclaveAceclave 250 Mg/125 Mg Tablet
Amox ClAmox Cl 200 Mg/28.5 Mg Syrup
ZoclavZoclav 500 Mg/125 Mg Tablet
PolymoxPolymox 250 Mg/250 Mg Capsule
AcmoxAcmox 125 Mg Dry Syrup
StaphymoxStaphymox 250 Mg/250 Mg Tablet
Acmox DsAcmox Ds 250 Mg Tablet
AmoxyclavAMOXYCLAV 228.5MG DRY SYRUP 30ML
Zoxil CvZoxil Cv 1000 Mg/200 Mg Injection

                       ధన్యవాదములు 
                    మీ నవీన్ నడిమింటి 

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల నవీన్ గారిని  సలహా తీసుకోవాలి.




కామెంట్‌లు లేవు: