18, జనవరి 2020, శనివారం

సైకాలజీ డిప్రెషన్ నుండి పరిష్కారం మార్గం

హయ్ ఫ్రెండ్స్ ఏలా ఉన్నరు ఈ  రోజు నుంచి డిఫ్రెషన్ మానిసిక ఫ్యామిలీ గొడవలు  నుంచి ఎలా బయటకు రావాలి  ! నా తెలిసిన సలహాలు  కౌన్సిలింగ్!

         ఈ స్పీడు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమ మనుగడ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయ త్నంలో ఎంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఉరుకులు, పరుగులతో మరబొమ్మల్లా బతికే మనుషులకు వచ్చే అనేకరకమున మానసిక జబ్బుల్లో ఈ డిఫ్రెషన్‌ ఒకటి.

👉సైకలాజికల్ డిసార్డర్స్ చాల విచిత్రంగా ఉంటాయి...
అది ఒక సైకలాజికల్ ప్రాబ్లెమ్ అని కూడా తెలీకుండానే మనలో కొని సమయాలలో కనబడుతుంటది.
మీ అవగాహనా కోసం అందులో మేజర్ సైకలాజికల్ ప్రాబ్లెమ్స్ 
1. అతిగా అనుమాన పడటం, అనవసర విషయం గురించి అతిగా ఆలోచించడం.
2. చేసిన పనే పలుమార్లు చేస్తూ ఉండడం(చేతులు కడగటం, గ్యాస్ ఆఫ్ చేశామా లేదా చూడడటం, చెప్పిన విషయాన్ని చెబుతూనే ఉండటం మొ:)
3. ఎవరో నన్ను ఏదో చేస్తారు అనుకోవటం, ఎవరు ఏది మాట్లాడుకుంటున్నా అది నా గురించే అనుకోవటం, పేపర్లలో కానీ సినిమాలలో కానీ చూపించే సన్నివేశాలు నా గురించే అని మదన పడటం, ఫోన్లలో మాట్లాడుకుంటున్నా వారిని చూసి వీరు నాగురించి మాట్లాడుతున్నారనుకోవటం, రోడ్ మీద వెళ్తుంటే ఎవడైనా తనను ఏదో చేయడానికి వస్తున్నాడు అనుకోవటం.
4. ఎవరో నాతో మాట్లాడుతున్నారు అని బ్రాంతి పడుతుండడం, చిన్నసమస్య వస్తే ఈ సమస్య దానివలెనే వచ్చింది అని సంబంధం లేని వాటిగురించి ఆలోచిస్తుండటం, దేవతలు నాతో మాట్లాడుతున్నారు అని చెప్పడం మొ :
5. కారణం లేకుండానే కొన్నిటి పట్ల భయాన్నిపెంపొందించుకోవటం.
6. సంబంధం లేకుండానే కోపడటం, ఆవేశం తో ఉగిపోవటం, అనుకున్నది జరక్కపోతే వినాశన వక్తిత్వంతో ప్రవర్తించడం...
7.చీటికీ మాటికీ చచ్చిపోతాననడం, ఆశించినది దక్కిన్చుకోవటానికి బెదిరించడం.
ముఖ్యమైన మానసిక సమస్యల గురించి తెలియచేసా, ఇంకేమైనా ఉంటె తెలియచేయండి...
      
కౌంటర్ డిప్రెషన్
````````````
సైకాలజీలో కొన్ని విషయాలను లోతుగా పరిశీలిస్తే కొన్ని విషయాలు వింతగా అనిపిస్తాయి. సాధారణంగా డిప్రెషన్ కి గురయిన వారు సైకాలజిస్ట్ సహాయంతో దానినుండి బయటపడతారు. అయితే వీళ్ళను డీల్ చేసే సైకాలజిస్ట్/కౌన్సెలర్/థెరపిస్ట్ లకు కొన్ని సార్లు వింతయినా పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. డిప్రెషన్ కి గురయిన వ్యక్తులతో గడిపి, గడిపి, వాళ్ళు చెప్పే విషయాలను ఎంపతీ తో వినటం వల్ల కొన్ని సార్లు క్లయింట్ కి ఉన్న డిప్రెషన్ సైకాలజిస్ట్ కి ట్రాన్స్ఫర్ అయ్యే ప్రమాదం ఉంటుంది. దీని పట్ల సైకాలజిస్టులు చాల అప్రమత్తంగా ఉండాలి.

కాన్సెలింగ్ అంటేనే శ్రద్దగా వినటం. క్లయింట్ చెప్పే అనేక విషయాలను సైకాలజిస్ట్ శ్రద్దగా, ఎంపతీ తో వినవలసి ఉంటుంది. అలా వినే సమయంలో సైకాలజిస్ట్ తనకు తెలియకుండా క్లయింట్ మానసిక స్థిలోకి జారుకుంటారు. ఏపంతీ తో వినటం వల్ల ఈ విధంగా జరుగుతుంది. ఎంపతీ లేనట్లయితే కౌన్సెలర్ క్లయింట్ ప్రాబ్లెమ్ ని సరిగ్గా అర్థం చేసుకోవటం జరగదు. ఈ విధంగా రోజుల తరబడి డిప్రెషన్ కి లోనయిన క్లయింట్స్ ని వినటం వల్ల సైకాలజిస్ట్ కూడా డిప్రెషన్ కి లోనయ్యే అవకాశాలు ఉంటాయి.

చాల సందర్భాలలో నేను కూడా ఇటువంటి అనుభవం పొందాను. కొన్ని కేసులు డీల్ చేసేటపుడు క్లయింట్స్ తమ బాధలు పంచుకుంటున్నపుడు నేను వారిలో మానసికంగా కలసి పోయిన సందర్భాలు చాల ఉన్నాయి. ఆ రోజు రాత్రి నిద్ర పట్టక ఇబ్బంది పడటం జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో సాధారణంగా సైకాలజిస్ట్ కొంత గ్యాప్ తీసుకోవటం, లేదా మరి సైకాలజిస్ట్ ని సంప్రదించడం ద్వారా తన డిప్రెషన్ నుండి బయట పడి తిరిగి విధులకు హాజరుకావటం జరుగుతుంది. చరిత్రలో చాల మంది ఫేమస్ నవీన్ నడిమింటి  సైకాలజిస్ట్ లు ఆత్మహత్యలకు పాల్పడిన సందర్భాలు ఉన్నాయి చెప్పారు 

👉డిప్రెషన్ లక్షణాలు
విపరీతమయిన చిరాకు, నిర్ణయాలు తీసుకోలేక పోవటం, జీవితం మీద విరక్తి రావటం, మనుషుల పట్ల అనుమానాలు పెంచుకోవటం, సెల్ఫ్ ఎస్టీమ్ ని కోల్పోవటం వంటి మానసిక మయినవే కాకుండా నిద్ర పట్టక పోవటం, సరిగా ఆహరం తీసుకోలేక పోవటం, శరీర భాగాలలో విపరీతమయిన నొప్పిని ఫీలవటం, స్త్రీలలో రుతుక్రమంలో మార్పులు రావటం, పురుషులలో సెక్స్ పట్ల ఆసక్తి (LIBIDO) కోల్పోవటం వంటి శారీరక లక్షణాలను గమనించవచ్చు.

👉బయటపడే మార్గాలు :
కౌన్సిలింగ్ తో పాటుగా ఇతర మార్గాల ద్వారా కూడా డిప్రెషన్ నుండి బయట పడవచ్చు. తానూ ఉంటున్న ప్రాంతం నుండి మరో ప్రాంతం కు వెళ్ళటం, టూర్స్ వెళ్ళటం, యోగ, వ్యాయామం వంటివి అలవర్చుకోవటం. పెయింటింగ్, డాన్స్, సింగింగ్ వంటి సృజనాత్మక మయిన కళల ను అభ్యసించడం ద్వారా కూడా డిప్రెషన్ నుండి బయట పడ వచ్చు

👉మీ లో  ఒత్తిడి  పోవాలంటే  ?

                     ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు ---stress in humans- మనుషులలో ఒత్తిడి -- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

                     కాలంతోపాటు మానవజీవితంలో ఎన్నో మార్పులు సంభవిస్తున్నాయి. కొత్త కొత్త విషయాలు ఆవిష్క రింపబడుతూ ఎన్నో జబ్బులకి పరిష్కారం అందించ బడుతున్నా రకరకాల రోగాలు మనుషుల పాలిట శత్రువుల వుతున్నాయి. బి.పి, షుగర్‌, గుండెపోటు లాంటివి మనిషిని నిర్వీర్యం చేస్తున్నాయి. కాలంలో వచ్చే మార్పుల్లో ఇప్పుడు వేగం ఒకటి. ఈ స్పీడు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమ మనుగడ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయ త్నంలో ఎంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఉరుకులు, పరుగులతో మరబొమ్మల్లా బతికే మనుషులకు వచ్చే అనేకరకమున మానసిక జబ్బుల్లో  డిఫ్రెషన్‌ ఒకటి.

ధన్యవాదములు 🙏🏻
మీ నవీన్ నడిమింటి
   *9703706660*
మా హెల్త్ లింక్ పేజీ మీకు చాలా సలహాలు వుంది లింక్ చూడండి ధన్యవాదములు 
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

కామెంట్‌లు లేవు: