17, జనవరి 2020, శుక్రవారం

బ్రెయిన్ ట్యూమౌర్ వచ్చినప్పుడు తీసుకోవాలి లిసిన జాగ్రత్తలు

బ్రెయిన్ ట్యూమర్ నివారణ జాగ్రత్తలు నవీన్ నడిమింటి సలహాలు  - Brain Tumour in 

మెదడు వాపు అనేది మెదడులోని కణాల యొక్క అసాధారణ పెరుగుదల. ఈ గడ్డలు హాని చేయనివిగా (నిరపాయమైన) లేదా కాన్సర్  కారకమైనవి కావచ్చు (ప్రాణాంతక). మెదదులోనే ఏర్పడే గడ్డలను ప్రాధమిక మెదడు వాపు అంటారు. మరోపక్క, ఉపరి  మెదడు వాపు లేదా మెటాస్టాటిక్ మెదడు వాపు అనేవి ఇతర శరీర భాగాల్లో కాన్సర్ ద్వారా ఏర్పడి మెదడు వరకు చేరేవి. మెదడు వాపు వ్యాధి లక్షణాలు కణితి పరిమాణము, కణితి పెరిగే వేగము మరియు కణితి ఉన్న ప్రదేశం వంటి వాటి మీద ఆధారపడతాయి. కొన్ని త్వరిత మరియు సాధారణమైన మెదడు వాపు లక్షణాల్లో మారుతూ ఉండే తలనొప్పి తీరు, తరచూ మరియు తీవ్రంగా వచ్చే తలనొప్పులు, మాట్లాడుటలో ఇబ్బందులు మరియు సమతౌల్యతలో ఇబ్బందులు వంటివి కూడా ఉంటాయి. మెదడు వాపు చికిత్స మెదడు వాపు రకమే కాకుండా కణితి యొక్క పరిమాణము మరియు అది ఉన్న ప్రదేశం మీద ఆధారపడి ఉంటుం

బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏమిటి? - What is Brain Tumour 

మెదడు వాపు అనేది మెదడు యొక్క కణాల అనియంత్రిత పెరుగుదల ద్వారా ఏర్పడే సమూహం లేదా వృద్ధి. ఈ మెదడు కణాల అనియంత్రిత పెరుగుదలకుగల ఖచ్చితమైన కారణం ఇప్పటికీ స్పష్టముగా తెలీదు. అయితే, ప్రతి 20 లో ఒక కణితి ఆ వ్యక్తికి మెదడు వాపు రావడానికి  ఎక్కువ అవకాశం ఉండే జన్యుపరమైన  వారసత్వం ద్వారా రావచ్చని అనుకుంటున్నారు.

మెదడులో ఈ కణితులు ఉండే ప్రదేశం, అవి ఏర్పడినటువంటి కణాల రకం మరియు అవి ఎంత త్వరగా పెరిగి విస్తరిస్తున్నాయివంటివాటి ఆధారంగా 130కి పైగా వివిధమైన మెదడు మరియు వెన్నుకు సంబంధించిన కణితులను వేరు చేసి పేర్లు ఇవ్వబడ్డాయి. ప్రాణాంతక మరియు క్యాన్సరుతో కూడుకున్న మెదదు వాపు కణితులు చాలా అరుదు (పెద్దవారిలో అన్ని కాన్సర్లలో దాదాపు 2 శాతం చాలా మెదడు వాపు కణితులు తక్కువ మనుగడ రేటు కలిగి ఉండి, ఇతర క్యాన్సర్లతో పోలిస్తే ఎక్కువ జీవిత సంవత్సరాల సంఖ్యా నష్టాన్ని కలిగి ఉంటాయి. కానీ ఖచ్చితంగా మెదడు వాపు అంటే ఏమిటి, అవి ఎలా ఏర్పడతాయి? మరియు అవి ఎలా చికిత్స చేయబడతాయి? మెదదు వాపు గురించి తెలుసుకోవడానికి మరింత చదవండి.

బ్రెయిన్ ట్యూమర్ యొక్క లక్షణాలు - Symptoms of Brain Tumour in Telugu

మెదదు వాపు లక్షణాలు కణితి యొక్క రకం మరియు ఉండే ప్రదేశాన్ని బట్టి మారుతూ ఉంటాయి. మెదడులోని  వివిధ భాగాలు వివిధ శారీరక ప్రక్రియలకు కారణం కనుక, కణితి చేత ప్రభావితం అయిన ప్రదేశం తదనుగుణంగా లక్షణాలను చూపుతుంది. మెదడు వాపు యొక్క కొన్ని సాధారణ లక్షణాలు ఇక్కడున్నాయి:

  • తలనొప్పులు
    మెదడు వాపు రోగులలో 20 శాతం మందికి పైగా తలనొప్పి ప్రారంభంలో వచ్చే లక్షణం. మెదడు వాపు వ్యక్తుల్లో ఉండే తలనొప్పులు అసాధారణంగా ఉండి, ఉదయాన్నే మరింత ఎక్కువగా ఉండి, వాంతులు మరియు దగ్గు లేదా భంగిమ మార్పువంటి వాటి వల్ల మెదడులోని పీడనం అధికమవచ్చును.
     
  • మూర్చ
    మెదడు వాపు ఉన్న కొంత మంది వ్యక్తుల్లో, మూర్ఛ మొట్టమొదటి లక్షణం కావచ్చు . మెదడులోని అసాధారణమైన విద్యుత్ కార్యకలాపాల వల్ల మూర్ఛ వస్తుంది. మెదడు వాపు ఉన్న వ్యక్తిలో, మూర్ఛ అనేది ఆకస్మిక అపస్మారక స్థితిలనో  , శారీరక విధులు పట్టు కోల్పోవడం వల్లనో  లేదా కొద్ది సమయం ఊపిరి ఆడకపోడం వల్ల చర్మం నీలం రంగులోకి మారడం వల్లనో  మూర్ఛ రావచ్చును.
  • మతిమరుపు
    మెదడు వాపు వలన రోగి యొక్క జ్ఞాపకశక్తికి సమస్యలు రావచ్చును. రేడియేషన్ లేదా శస్త్రచికిత్స వంటివి కూడా జ్ఞాపకశక్తి సమస్యలకు దారి తీయవచ్చు. మతిమరుపు, మెదడు వాపు రోగుల్లో జ్ఞాపకశక్తి సమస్యలను మరింత అధ్వానం చేయవచ్చు. రోగి యొక్క దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి కంటే స్వల్పకాలిక జ్ఞాపకశక్తి (డయల్ చేసేటప్పుడు ఫోన్ నెంబర్ మర్చిపోవడం వంటివి) మరింత ప్రభావితం అవుతుంది. ( ఇంకా చదవండి: జ్ఞాపకశక్తి తగ్గుటకు గల కారణాలు
  • కృంగుబాటు
    మెదడు వాపు రోగుల్లో నలుగురిలో ఒకరికి కృంగుబాటు రుగ్మతలు ఉన్నాయని పరిశోధకులు సూచిస్తున్నారు.  కృంగుబాటు సాధారణంగా రోగులు మరియు వారు ఇష్టపడేవాళ్ళలో కూడా చూస్తాము. సరదాగా ఉండే విషయాల్లో ఆసక్తి లేకపోవడం, నిద్రలేమి, తగ్గిపోయిన శక్తి స్థాయిలు , పనికిరాను అన్న భావనలు, సందర్భంతో సంబంధం లేకుండా బాధ కలగడం మరియు ఆత్మాహత్యా భావనాలవంటి లక్షణాలు గమనించవచ్చు మరియు ఇవి మతిమరుపును సూచిస్తాయి.
     
  • వ్యక్తిత్వ మార్పులు మరియు  మూడ్ స్వింగ్స్
    మెదడు వాపు వలన  వ్యక్తి యొక్క వ్యక్తిత్వంలో మార్పులు రావచ్చును ఒకప్పుడు ప్రేరేపితంగా హుషారుగా ఉన్న వ్యక్తి నిర్బంధించినట్టుగా నిష్క్రియాత్మకంగా అవ్వచ్చు. ఒక వ్యక్తి ఆలోచించే మరియు ప్రవర్తించే తీరును మెదడు వాపు కణితి ప్రభావితం చేయగలదు. మరియు, కెమోథెరపీ, రేడియేషన్ వంటి చికిత్సలు మెదడు పనితీరుకు మరింత అంతరాయం కలిగిస్తాయి. మూడ్ స్వింగ్స్ అనేవి ఎప్పుడు వస్తాయో చెప్పలేము , ఆకస్మికం మరియు మెదడు వాపు రోగుల్లో సాధారణంగా చూస్తాము.
     
  • జ్ఞాన సంబంధిత ప్రక్రియలు
    మెదడు వాపు రోగుల్లో, ఏకాగ్రత మరియు ధ్యాస, వ్యక్తీకరణ మరియు భాష, తెలివి తేటలు తగ్గడం వంటి మార్పులు  చూస్తాము. మెదడు యొక్క వివిధ లోబ్స్, టెంపోరల్, పెరిటల్ మరియు ఫ్రంటల్ లోబ్స్ లో ఏర్పడిన కణితులు వ్యక్తి యొక్క ప్రవర్తనను ప్రభావితం చేయగలవు.
     
  • సంబంధిత లక్షణాలు
    సంబంధిత లక్షణాలు లేదా స్థానీకరించిన లక్షణాలు అనగా మెదడులోని ఏదో ఒక భాగం మాత్రమే ప్రభావితం కావడం. ఈ లక్షణాలు కణితి ఉన్న ప్రదేశాన్ని కనుగొనడానికి తోడ్పడతాయి. డబల్ విజన్, చికాకుగా ఉండటం, నీరసం, చిమచిమలాడుట లేదా తిమ్మిరిగా ఉండటం వంటివి కొన్ని సంబంధిత లక్షణాల ఉదాహరణలు ఈ లక్షణాలు కణితి మరియు మెదడులోని దాని స్థానం కారణంగా స్పష్టంగా ఉంటాయి. 
  • సామూహిక ప్రభావం
    పుర్రె యొక్క బిగువైన స్థలంలో కణితి పెరుగుదల కారణంగా, కణితి దాని చుట్టూ ఉన్న ఆరోగ్యకరమైన కణజాలంపై ఒత్తిడిని ప్రారంభిస్తుంది, దీని ఫలితంగా ఏర్పడేదే  సామూహిక ప్రభావం. కణితికి సమీపంలో ద్రవం ఏర్పడటం వలన, మెదడులోని ఒత్తిడి పెరుగుతుంది. సామూహిక ప్రభావం యొక్క లక్షణాలలో ప్రవర్తన మార్పులు, మగత, వాంతులు, మరియు తలనొప్పి కూడా ఉంటాయి.

బ్రెయిన్ ట్యూమర్ యొక్క చికిత్స - Treatment of Brain Tumour

మెదడు వాపు యొక్క చికిత్స కణితి స్థానం, పరిమాణం మరియు కణితి యొక్క పెరుగుదల, రోగి యొక్క మొత్తం ఆరోగ్య స్థితి మరియు అతని / ఆమె చికిత్సా ప్రాధాన్యతల వంటి పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఈ క్రిందివి మెదడు వాపు చికిత్సకు అందుబాటులో ఉన్న కొన్ని చికిత్సా  పద్ధతులు:

  • శస్త్రచికిత్స
    మెదడు కణితి యొక్క స్థానం శస్త్రచికిత్సకు అందుబాటులో ఉన్నట్లయితే, వైద్యుడు కణితిని వీలైనంతగా తొలగిస్తాడు. కొన్నిసార్లు కణితులు చిన్నవిగా మరియు ఇతర మెదడు కణజాలాల నుండి వేరు చేయడానికి సులభంగా ఉంటాయి; అందువలన, శస్త్రచికిత్స ద్వారా తొలగించడానికి సులభంగా ఉంటుంది. కణితి ఎంతవరకు తొలగించబడిందో అన్నదాన్ని బట్టి మెదడు కణితి యొక్క లక్షణాలను తగ్గించడానికి శస్త్రచికిత్స తోడ్పడుతుంది. చెవులకు కలుపబడిన కణితి యొక్క శస్త్రచికిత్స తర్వాత రక్తస్రావం లేదా సంక్రమణ లేదా వినికిడి సమస్యల వంటి ఇతర ప్రమాదాలు ఉండవచ్చు. 
  • ధార్మిక చికిత్స
    X రే కిరణాలు లేదా ప్రోటాన్ల వంటి అధిక శక్తి కిరణాలు కణితి కణాలను చంపడానికి రేడియో ధార్మిక చికిత్సగా ఉపయోగిస్తారు. ఇది మెదడు కణితికి బాహ్య కిరణ వికిరణం అందించడానికి రోగి శరీరం వెలుపల ఒక యంత్రం  ఉంచడం గానీ లేదా రోగి శరీరం లోపల కణితి ఉన్న స్థానం పక్కన గానీ పెట్టి నిర్వహిస్తారు (బ్రాకీథెరపీ). ప్రోటోన్ థెరపీ, ఇది రేడియోధార్మికతలో కొత్తది , ఇది కణితులు మెదడు యొక్క సున్నితమైన ప్రదేశాలకు సమీపంలో ఉన్నప్పుడు రేడియోధార్మికతకు సంబంధించిన దుష్ప్రభావాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. హోల్ బ్రెయిన్ వికిరణం శరీరం యొక్క ఇతర భాగాల నుండి వ్యాపించిన క్యాన్సర్ చికిత్సకు ఉపయోగిస్తారు. క్యాన్సర్ వలన అనేక మెదడు కణితులు ఏర్పడినప్పుడు కూడా దీన్ని ఉపయోగిస్తారు. రేడియోధార్మికత సమయంలో లేదా చికిత్స తరువాత వెంటనే వచ్చే దుష్ప్రభావాలు రోగి తీసుకున్న రేడియేషన్ మోతాదు మరియు రకం మీద ఆధారపడి ఉంటుంది. 
  • రేడియోసర్జరీ
    రేడియోసర్జరీ పద్ధతిలో ఒక చిన్న ప్రాంతంలో కణితి కణాలను చంపడానికి బహుళ రేడియేషన్ కిరణాలను ఉపయోగిస్తారు. గామా నైఫ్ లేదా లీనియర్ యాక్సిలరేటర్ అనేది మెదడు కణితుల రేడియోసర్జరీలో ఉపయోగించే అనేక రకాలైన సాంకేతిక పరిజ్ఞానాల్లో ఒకటి. ఈ శస్త్రచికిత్స సాధారణంగా ఒక రోజు చికిత్స, మరియు చాలా మంది రోగులు అదే రోజు ఇంటికి వెళ్లిపోతారు.
  • కీమోథెరపీ
    కీమోథెరపీ అనేది  కణితి కణాలను చంపే నోటి మాత్రలు లేదా సూది మందులను ఉపయోగించే ఒక క్యాన్సర్ చికిత్స. మెదడు కణితి యొక్క రకాన్ని మరియు దశపై ఆధారపడి, కీమోథెరపీని చికిత్స ఎంపికగా సిఫార్సు చేయవచ్చు. మెదడు కణితుల కీమోథెరపీలో ఎక్కువగా ఉపయోగించే మందుగా టెమోజోలోమైడ్ ను ఉపయోగిస్తారు, ఇది ఒక మాత్రగా ఇవ్వబడుతుంది. కణితి వల్ల గానీ  లేదా ఏవైనా కొనసాగుతున్న చికిత్స వల్ల కలిగే వాపును తగ్గించటానికి వాడే మెదడు వాపు ముందుగా కార్టికోస్టెరాయిడ్స్ ను ఉపయోగిస్తారు. మందులు మరియు దుష్ప్రభావాలు కెమోథెరపీ కోసం ఉపయోగించే మందుల మోతాదు మరియు రకంపై ఆధారపడి ఉంటాయి.
  • టార్గెట్డ్ డ్రగ్ థెరపీ
    ఈ చికిత్స క్యాన్సర్ కణాలలో గుర్తించిన నిర్దిష్ట అసాధారణతలపై దృష్టి పెడుతుంది. ఈ చికిత్సలో ఉపయోగించే డ్రగ్స్ క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకుని వాటిని చంపేస్తాయి. వివిధ రకాల ఔషధ సరఫరా వ్యవస్థలు విచారణలో ఉన్నాయి మరియు అభివృద్ధి చేయబడుతున్నాయి.

బ్రెయిన్ ట్యూమర్ కొరకు మందులు

బ్రెయిన్ ట్యూమర్ కు నివారణ కు కొన్ని మందులు మీ ఫ్యామిలీ డాక్టర్ సలహా మేరకు మందులు తీసుకోవాలి 

Medicine NamePack Size
EvertorEvertor 10 Mg Tablet
Dexoren SDexoren S Eye/Ear Drops
GliotemGliotem 100 Mg Capsule
GliozolamideGliozolamide 100 Mg Tablet
GliozGLIOZ 250MG CAPSULE
Low DexLow Dex Eye/Ear Drop
NublastNublast 100 Mg Capsule
TemcadTemcad 100 Mg Capsule
TemcureTemcure 100 Mg Tablet
TemodalTemodal 100 Mg Capsule
TemokemTemokem 100 Mg Injection
DexacortDexacort Eye Drop
TemonatTemonat 100 Mg Capsule
Dexacort (Klar Sheen)Dexacort (Klar Sheen) 0.1% Eye Drop
4 Quin Dx4 Quin Dx Eye Drop
TemosideTemoside 100 Mg Capsule
SolodexSolodex 0.1% Eye/Ear Drops
Apdrops DmApdrops Dm 0.5% W/V/1% W/V Eye Drop
Tariflox DTariflox D Eye Drop
GlistromaGlistroma 100 Mg Capsule
Lupidexa CLupidexa C Eye Drop
Dexcin MDexcin M Eye Drop
ImozideImozide 100 Mg Capsule.
Ocugate DxOcugate Dx Ey


మా గురించి

  • ధన్యవాదములు 
  • మీ నవీన్ నడిమింటి 

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.


కామెంట్‌లు లేవు: