యోగ జీవనశైలి - జీవితకాలం..తలనొప్పి నివారణ కు నవీన్ నడిమింటి సలహాలు
మన ప్రాచీన భారతీయ వైద్యశాస్త్రాలు* మనలోని దేహాధారుడ్యాన్ని, ఆరోగ్యసంపదల గుణగణాలని నిర్ణయుంచే ప్రధాన మూలధాతువులగా ‘థ్రిదోషాలు’ అయిన వాత, పిత్త, కఫాలు అని గుర్తించాయి. ఈ ప్రధాన మూలధాతువులలో కలిగే అసమానతలే అనారోగ్యాలకి మూలకారణాలుగా గుర్తించింది.
వీటి మధ్య సమతుల్యతల సాధనకి ‘యొగ షట్ క్రియ’**లని మనకి వారసత్వ సంపదగా అందజేసింది. అవి జలనేతి, కపాలభాతి, బస్తి, నౌళి, ధౌతి, మరియు త్రాటక క్రియలు. ఇవి యోగ థెరఫీలో థ్రిదోష నివారిణిగా ప్రధాన భుమికని పోషిస్తాయి.
వస్త్రధౌతి: ముందుగా రెండు లీటర్ల గోరు వెచ్చని సాల్టువాటర్ త్రాగాలి. తరువాయి త్రాగిన సాల్టువాటర్’ని వాంతి చేసుకోవాలి. తదుపరి నూలువస్త్రంతో ఆన్నవాహికని పరిశుభ్రపరుచుకోవాలి. ధౌతి క్రియలోని మెళుకువలను నేర్చుకొవడానికి మొదటిసారి యోగాచార్యుల సన్నిధీలో ప్రాక్టీస్ చేయండి. ఇది మెటాబాలిజాన్ని పెంపొందిస్తుంది. రోగనిరొధక వ్యవస్థ ఉత్తేజిత మౌతుంది. రక్తంలో చక్కెర నిల్వలని సాధరణా స్థాయికి తీసుక రావడానికి ఉపకరిస్తుంది.
బస్తి లెక శంఖప్రక్షాళన: అన్నవాహిక, జీర్ణకోశ వ్యవస్థ, చిన్న, పేద్ద ప్రెవుల వ్యవస్థ, మరియు కోలన్ వ్యవస్థలను శుద్ది చేస్తుంది. ఈ క్రియలో 6 నుంచి 7 లీటర్ల గోరు వెచ్హన్ని సాల్టు వాటర్ త్రాగవలసి ఉంటుంది. ఆచార్యుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించండి. రక్త శుద్దికి, మొండి చర్మ వ్యాదుల నివారణకి, మానశిక సమతుల్యతలని సమర్థవంతంగా సాధిస్తుంది.
త్రాటక: ఆరొగ్యవంతమైన కనుదోయికి, కంటిచూపుకి ఆచరించదగిన క్రియ. ఇరవై రకాలా కండ్ల వ్యాదులని దూరంగా ఉంచుతుంది. పిల్లలలో ఙాపకశక్తి, ఎకాగ్రతలను పెంపొదించుకొవడానికి సహయకారి అవుతుంది. మెడిటేషన్ వెంట ఆచరింప దగిన క్రియ. నిడ్రలేమిని నివారిస్తుంది, డిప్రెషన్ని, అలెర్జిలని, యాంక్జైటిలని దూరం చేయడానికి సహయకారి.
నౌలి: జీర్నకోశ వ్యవస్థని సమర్థవంతంగా ఉంచాడానికి, జీర్ణక్రియని మెరుగుపరచడానికి, పాంక్రియాస్ ని ఉత్తెజపరచడం ద్వార సుగర్ ని కంట్రోలులో వుంచడానికి, పొత్తికడుపు కండరాలు ఆరోగ్యవంతంగా ఉంచడానికి ఈ క్రియ చక్కటి సహయకారి.
మీలో థ్రిదోషాలా సమతుల్యతను, అంతర్ శుద్ది సాధించడానికి యోగక్రియలు ఐన జలనేతి, కపాలభాతి, ధౌతి, నౌలి, త్రాటక, మరియు బస్తీలను యోగ నిపుణల పర్యవేక్షణలో మాత్రమే ఆచరించండి.
ఈ క్రియలని సాధన చేసే ముందుగా అవసరమైతే మీ డాక్టర్నిసంప్రదించండి.
ఆరోగ్యకర శారీరక వ్యవస్థ, మానశిక వ్యవస్థ లను అనుభవించడానికి యోగథెరఫి ఓ అముల్య అభరణం!
ఇది మీకు జీవితాకాలా గ్యారంటీని ఎటువంటి షరతులు లేకుండా వర్తింపచేస్తుంది!!
వీటీని అనుభవించడానికి మనసా, వాచ, కర్మేణా మనం సంసిద్దులు కావాలి!!!
*ధన్యవాదములు
మీ నవీన్ నడిమింటి
No comments:
Post a Comment