హర్సిటిజం అనేది మహిళల్లో జుట్టు అధికంగా (అవాంఛిత రోమాలు)పెరిగేలా చేసే ఒక సాధారణ సమస్య. ఇది అన్ని వయసుల మహిళలలోను సంభవించవచ్చు మరియు ఇది సాంఘిక, మానసిక మరియు ఆత్మాభిమాన సమస్యలను కలిగించవచ్చు.
ఈ పరిస్థితి చాలా సాధారణం మరియు ప్రపంచవ్యాప్తంగా 5-10 శాతం మందిని ప్రభావితం చేస్తుంది.
దీని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
రజస్వల/యుక్తవయస్సు రావడం అనేది హర్సిటిజంను ప్రేరేపించవచ్చు. మహిళల్లో పురుషుల వలే అవాంఛిత జుట్టు పెరగడం దీని ముఖ్య లక్షణం. అంతేకాకుండా, నెత్తి మీద మాదిరిగా జుట్టు ఈ క్రింది అవయవాల మీద కూడా పెరుగడం జరుగుతుంది:
- పై పెదవి
- చెంపలు
- గెడ్డం
- చనుమొనల చుట్టూ
- ఉదరం యొక్క దిగువ భాగంలో
హర్సిటిజంలో సాధారణంగా కనిపించే ఇతర లక్షణాలు:
- చర్మం జిడ్డుగా మారడం
- నుదురు మీద బట్టతల
- మొటిమలు
- సరిలేని ఋతు చక్రాలు
- మందమైన స్వరం
- యోనిలో మార్పులు
- సంతానలేమి (ఇన్ఫెర్టిలిటీ)
అయితే, తీవ్ర సందర్భాల్లో, జుట్టు పెరుగుదల వెనక భాగాల మీద, ఛాతీ మధ్య ప్రాంతంలో మరియు పొత్తికడుపు మొత్తం లేదా పై భాగంలో కూడా సంభవిస్తుంది.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
మహిళల్లో అధిక ఆండ్రోజెన్ (androgen) స్థాయిలు హర్సిటిజంకు ప్రధాన కారణం. అది కాకుండా:
- పాలిసిస్టిక్ అండాశయ సిండ్రోమ్ (PCOS) మరియు ఊబకాయం
- మోనోపాజ్ (రుతువిరతి) మరియు దాని సంబంధిత హార్మోన్ అసమతుల్యతలు
- మందులు
- అడ్రినల్ హైపర్ప్లాసియా
- కుషింగ్ సిండ్రోమ్
- థైరాయిడ్ పనిచేయకపోవడం
- చాలా అరుదైన సందర్భాల్లో, ఆండ్రోజెన్- స్రవించే కణితులు (androgen-secreting tumours) హర్సిటిజంను కలిగించవచ్చు
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
ఆరోగ్య చరిత్రను తెలుసుకోవడం మరియు ఒక శారీరక పరీక్షతో పాటు అండాలు యొక్క స్థితిని పరిశీలించడానికి అల్ట్రాసౌండ్ స్కాన్ హర్సిటిజానికి గల కారణాన్ని నిర్ధారించడానికి మొదటి చర్యలు. రోగ నిర్ధారణను ధృవీకరించేందుకు ఆండ్రోజెన్ స్థాయిల పరీక్ష ఆదేశించబడవచ్చు.
జుట్టు పెరుగుదల మధ్యస్థంగా ఉన్న మహిళలు పరిస్థితిని నిర్వహించేందుకు కాస్మెటిక్ పద్ధతులను (cosmetic methods) ఉపయోగించవచ్చు. అందులో ఇవి ఉంటాయి:
- బ్లీచింగ్ (Bleaching)
- షేవింగ్ (Shaving)
- వెక్సింగ్ (Waxing)
- ప్లకింగ్ (plucking)
- ఎల్ట్రోలిసిస్ (Electrolysis)
- డీపీలేటోరీ (రోమ నిర్మూలన) ఏజెంట్లు (Depilatory agents)
- లేజర్ చికిత్స
ప్లకింగ్ (పీకడం) అనేది హర్సిటిజం యొక్క స్వల్పకాలిక నిర్వహణ కోసం మరియు అవాంఛిత రోమాలను తొలగించడంలో దీర్ఘకాలిక నిర్వహణ కోసం లేజర్ చికిత్స ఒక ప్రభావిత పద్ధతి.
ఈస్ట్రోజెన్ మరియు ప్రోజెస్టీన్ (progestin) గర్భనిరోధక మాత్రలు ఆండ్రోజెన్ హార్మోన్ల ప్రభావాన్ని తగ్గిస్తాయి మరియు పరిస్థితి యొక్క పురోగతిని నెమ్మదిస్తాయి.
వైద్య నిపుణులు మధ్యస్థ లేదా తీవ్రమైన కేసులకు చికిత్స చేయడానికి యాంటీ-యాండ్రోజెన్లు ఉపయోగించవచ్చు. ఇతర ఎంపికలు:
- ఎఫ్లోర్నితైన్ క్రీమ్ (Eflornithine cream)
- సైప్రోటెరోన్ అసిటేట్ (Cyproterone acetate)
- ఫ్లూటమైడ్ (Flutamide)
- ఫీనస్ట్రయిడ్ (Finasteride
హర్సిటిజం(అవాంఛిత రోమాలు )తగ్గడానికి కు మందులు
హర్సిటిజం నివారణ మందులు మీ ఫ్యామిలీ డాక్టర్ సలహా మేరకు వాడాలి ఎందుకు కు అంటే మీ చర్మం కు ఏ మందులు పని చేతున్నది తెలుసుకొని మందులు వేసుకోవాలి
Medicine Name | Pack Size | |
---|---|---|
Elyn 35 | ELYN 35MG TABLET 28S | |
Frulac | Frulac Sachet | |
Aldoloc | Aldoloc 20 Mg/50 Mg Tablet | |
Aldostix | Aldostix 20 Mg/50 Mg Tablet | |
Fruselac | Fruselac Tablet | |
Frusis | Frusis 20 Mg/50 Mg Tablet | . |
Lactomide (S.V. Biovac) | Lactomide Tablet | |
Lasilactone | Lasilactone 50 Tablet | |
Urecton Plus | Urecton Plus 20 Mg/50 Mg Tablet | |
Amifru S | Amifru S 20 Mg/50 Mg Tablet | . |
Aquamide | Aquamide 20 Mg/50 Mg Tablet | |
Lactomide | Lactomide 20 Mg/50 Mg Tablet | . |
Minilactone | Minilactone Tablet | . |
Spiromide | Spiromide Tablet | |
Metolactone | Metolactone 2.5 Mg/50 Mg Tablet | |
Vitator SP | VITATOR SP TABLET | |
Eflocare | EFLOCARE CREAM 10GM | . |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి